ప్రియాతి ప్రియమైన సరసు
నేనంటే నీకు ఎందుకంత అలుసు
నువ్వడిగితే తినిపించలేదనా చేపల పులుసు
నువ్వు ఎంత తిట్టినా నీ వెంటే పడుతుంది నా మనసు
నీ చుట్టూ తిరిగి తిరిగి తరిగిపోయింది నా ముఖ వర్చస్సు
అందుకనే చేరాను అమీర్ పేట్ లో అనూసు
స్టైల్ గా ఉండాలి అని కొంటున్నాను రోజు కొక డ్రెస్సు
ఇన్ని బాధలను తట్టుకోలేకపోతోంది నా మనస్సు
మా అన్నకు చెప్తే పీకాడు పెద్ద క్లాసు
నేనంటే నీకు ఇష్టమని నాకు తెలుసు
కావాలంటే గుండెను కొలవటానికి తెచ్చుకో ఒక త్రాసు
నువ్వు కాదంటే పట్టుకుంటాను వైను గ్లాస్సు
అవునంటే అవుతాము మనము లవ్వర్సు
ఇంట్లోవాళ్ళని ఒప్పించి అవుదాము లైఫ్ పార్ట్ నర్స్
పెళ్లి అవగానే ఎగిరిపోదాము యుఅస్స్ (US )
చూసి వద్దాము Texas
నీ జవాబు కోసం కుక్కలా ఉంటాను ఎదురు చూస్తూ
అంతేగాని నా జీవితంతో ఆడుకోకు బోమ్మాబొరుసు ....
Dec 27, 2010
Dec 14, 2010
పెళ్ళిచూపులు-1
మొన్న ఈ మధ్యన పెళ్ళిచూపులకు వెళ్ళాను నేను..హవ్వ పెళ్ళయిన మీకు పెళ్లి చూపులేంటి అని అంటారా???నాకు కాదండి,మా అన్నయ్యకు. వెళ్ళాను నేను కూడా..మరి ఆడపడచు కదా ఉండాలి కదా నేను.సరే అనుకున్న మంచి టైం కు వెళ్ళాం వాళ్ల ఇంటికి ..ఇక్కడ విచిత్రం ఏమంటే పెళ్ళికూతురు ఒక అరగంట ముందు చేరింది వాళ్ల ఇంటికి మా కంటే..తనది సాఫ్ట్వేర్ కంపెనీ లో జాబు మరి..hytech సిటీ నుండి dilsukhnagar కు వచ్చేటప్పటికి బస్సు లో నే గంటన్నర పట్టింది ఏం చేస్తుంది మరి..శెలవలు లేవు ట..ఇంక పాపం రెడీ అయ్యే సమయం లేక అలాగే అంటే చుడిదార్ లోనే (అంటే జనరల్ గా చీర కట్టుకుంటారు గా.) వచ్చేసింది మా ముందు కు..పైగా ఇప్పటి fashion ప్రకారం pony tail ..మరి పూలు పెట్టె ప్లేస్ ఏది..చిన్న chain ..చక్కగా సింపుల్ గా మా మధ్యకు వచ్చేసింది..హయిగా అందరం కబుర్లు చెప్పుకున్నాం...పైగా అక్కడ ఉన్న వారిలో ఎక్కువ మండి software engineers నే సో ఇంక జాబు గురించి,,salarys గురించే నడిచాయి ఎక్కువ కబుర్లు...ఏమైనా అడగండి అమ్మాయిని అని అంటారు వాళ్ల అమ్మగారు వాళ్ళు...ఏమడుగుతాం కొత్తగా...ఇదివరకు అంటే నీ పేరు,వంట వొచ్చా,పాటలు వచ్చా అని అడిగేవారు..ఇప్పుడు నీ పేరు ఏంటి,ఏ ఉద్యోగం, అలా అడిగామనుకోండి...ఏ biodata చూడలేదా అని అంటారేమో అని భయం,,వంట సంగతి అంటారా..సరే పెళ్లి అయ్యి ఇన్నేళ్ళయిన మనకు చక్కగా వచ్చా వాళ్ళకు రావటానికి...అయిన ఏముంది ఎవరి ఆఫీసుల్లో వాళ్ళు తినటం...రాత్రి కు ఏదో టిఫిన్ నో ఏదో లాగించేయటం నే గా ఇప్పుడు .పాటలు అంటే ఇప్పుడా కార్యక్రమం ఎందుకులే రోజు టీవీ లలో చూసి చూసి బోర్ కొట్టేసింది అని అనిపిస్తుంది..ఏమడగాలో కూడా అర్ధం కాలేదు..అయిన ఏదో అడిగాం మధ్య మధ్యలోతలా ఒకటి .
సరే ఇలోగా రానే వచ్చాయి మనం ఎదురుచూసే ఫలహారాలు..మరి ఘనం గా ఉండాలి కదా అని పాపం జీడిపప్పు తో చేసిన హాట్..స్వీట్..పెట్టారు..చుస్తే తినాలి అనిపిస్తుంది..కాని హై కాలోరీ...వదిలేస్తే బాగోదు..అలా అని అదేపని గా తింటే బాగోదు...ముందు నుయ్యి వెనక గొయ్యి అలా ఉంటుంది ఆ పరిస్థితి...కబుర్లు చెప్తూ అప్పుడప్పుడు ఒక రెండు పలుకులు అలా నోట్లో వేసుకొని...తిని తిన్నట్టు గా తిన్నాం...కాసేపు అలా గదిలో కెళ్ళి మాట్లాడుకోండి బాబు.మా అమ్మాయి కి కాస్త సిగ్గు ఇక్కడ మాట్లాడాలి అంటే అన్నది వాళ్ల అమ్మగారు,,,అస్సలే బిడియస్తుడు పాపం మా అన్నయ్య.,.సరే మొహమాటానికి అని వెళ్లి కాసేపు మాట్లాడాడు...వీళ్ళ మధ్య ఎస్కార్ట్ లా నేను ఉంటాను అని మాకు ధైర్యాన్ని ఇస్తూ మా బుడతడు మామా నేను వస్తా అని ఫాలో అయ్యాడు వాళ్ళని...మేము ఉన్న చోటనుండి ఆ dilsukhnagar వెళ్ళాలి అంటే గంటన్నర పట్టింది అది కూడా కార్ లో...మరి తిరిగి వెళ్ళాలి అంటే అంతే టైం అవుతుంది కదా...అందుకని వెళ్ళిన అరగంట కే జైహింద్ చెప్పి మళ్ళి బయటపడ్డాం..నాకు ఈ పెళ్ళిచూపులు చుస్తే ఏదో వీకెండ్ లో చుట్టాలింటికి వెళ్లి వచ్చినట్టుంది తప్ప పెళ్ళిచూపులు లా లేదు..ఇప్పుడు tradition అలాగే ఉంది లెండి,,అమ్మాయి కు కూడా మరి భయం గా లేకుండా casual గా ఇలా ఉంటేనే బాగుంటుంది అని అనిపించింది...ఇంటి కి వచ్చాక మా పెళ్ళిచూపులు ఎలా జరిగి నాయి అని గుర్తుతెచ్చుకున్నం నేను మా వారు..అదొక పెద్ద హిస్టరీ ...నెక్స్ట్ పోస్ట్ లో చెబుతా..చాలా traditional గా funny గా జరిగింది మా పెళ్ళిచూపులు..

Dec 13, 2010
నిన్న-నేడు-రేపు
పాతకాలం లో పెళ్లి అయిన ఆడవారు గుమ్మం దాటి బయటకు రాకుండా,,ఎవర అయిన మగవారు వస్తే తలుపు చాటున ఉండే సమాధానాలు ఇచ్చేవారు,,పాపం అప్పుడు అంత స్వతంత్రం లేదు గా ...
బామ్మ లు ,తాతమ్మలు ను చూసి చూసి బోనులో వేసిన పిల్లి మాదిరి గా తిరగబడింది నేడు,,కొంచెం తెలివితేటలూ ముదిరాయి కదా,,అంటే కొంతమంది కి మంచి గానే ఉన్నాయి కానీ కొంతమంది మరీ domination అయ్యారు కదా..సో ముదిరాయి అని అనక తప్పట్లేదు..కొంచెం తేడా వచ్చినా చక్కగా నిర్మొహమాటం గా తమ తడాకా చూపిస్తున్నారు.
ఇంక ఇప్పుడే ఇలా ఉంటే మున్ముందు అస్సలు ఎలా ఉంటారూ అని భయం వేస్తోంది కదా...ఏముంది నడుం వంచి మరీ పని చేయించుకుంటారేమో...

ఏం చేస్తాం మరి..మనకు స్వతహాగా ఇలాంటి కాలం రావాలి అని అనిపించక పోయినా ప్రస్తుత పరిస్థితులలో చూస్తే మగవారు ఆడదాన్ని హింసించటం,చులకన చేసి చూడటం ఇలాంటివి చేస్తుంటే ఇలాంటి కాలం వస్తే బాగుండు అని అనిపిస్తూ ఉంటుంది....
Dec 8, 2010
Dec 7, 2010
బాల విన్యాసం
చూసారా ఈ వీడియొ ..మా ఇంటి ముందు చేసారు ఈ డాన్సు ..అందుకే వీడియొ తీయగలిగాను.ఆ చిన్న పాప ఆ తాడు మీద గా కర్ర పట్టుకుని ఎంతసేపు నడిచిందో అటు ఇటు...మొత్తం వీడియొ తీయటానికి కుదరలేదు,,అందుకే కొంచెమే తీయగలిగాను..ఎన్నాళ్ళ శ్రమ నో పాపం ఆ అమ్మాయి ది ,,నడిచే అంత సేపు ఎక్కడ పడుతుందో అని టెన్షన్ అనిపించింది నాకు ,,, అంతా అయిపోయాక కిందకు వచ్చి పళ్ళెం లో డబ్బులు అడుక్కుంది..పోనిలే అని మూడు రూపాయలు వేయించా మా బాబు చేత.పక్కనే ఉండి చుస్తున్న ఆయన ఎందుకు బాబు అమ్మాయి జీవితం తో అలా అడుకుంటున్నావ్.నువ్వు ఏదైనా పని చేసుకోవచ్చు కదా అని అన్నారు..నిజమే కదా అని అనిపించింది నాకు..దానికి ఆ పాప తండ్రి ఏమన్నాడంటే.."ఇదే circus లో చేస్తే చూడటానికి 50 /- ఇచ్చి మరీ చూసి చప్పట్లు కొడతారు..ఇంత సేపు చూసారు కనీసం ఒక్కల్లన్నా పిల్ల బాగా చేసింది అని ఒక్క రూపాయన్న ఇచ్చారా...ఎదుటి వాడికి చెప్పమంటే ఎన్నైనా చెపుతారు అని నసుక్కుంటూ వెళ్ళిపోయాడు",కబుర్లు/సలహాలు బాగానే చెపుతారు మనవాళ్ళు కాని సహాయం చేయటం లో మాత్రం వెనకడుగు వేస్తారు..అమ్మాయిని అలా చేయించటం తప్పే నిజం గా కాని ఏదో తప్పక చేయించాడు వాళ్ల నాన్న,,,అమ్మాయి బాగా చేసినందుకైన ఏదో తలా ఒక రూపాయి ఇచ్చుంటే బాగుండేది అనిపించింది..
Nov 23, 2010
శ్రీవారి పూజ
కార్తీక మాసం అందునా శివ భక్తుడు మా వారు అందుకని భక్తీ గా ఎక్కువసేపు పూజ చేసుకుందాం అని ఈ మధ్యనే మొదలు పెట్టారు.దానికోసం పెందలాడే 6 .౩౦ కల్లా నిద్ర లేచి స్నానం చేసి ధావళి కట్టుకుని మరీ పూజ కు ఉపక్రమిస్తారు.6 .౩౦ ఐతే పెందలాడే ఏమిటి నా మొహం అంటారా..మరే మా వారికీ అదే పొద్దు పొద్దున్న మరీ.ఆయన రెడీ అయ్యి వచ్చేటప్పటికే నేను పూజ చేసేసుకుని ఆయన పూజ కు సిద్ధం చేసేస్తా.ఆయన మొదలుపెట్టి పెట్టగానే మా పనిమనిషి వస్తుంది.డమ డమ సౌండ్ చేసుకుంటూ గిన్నెలు విసిరేసుకుంటూ పనిచేస్తుంది.ఉండబట్టలేక నిన్ననే చెప్పారు కాస్త చిన్నగా తోమమ్మ పూజ చేసుకుంటున్నాను అని.అదే నా చేతి నుండి పొరపాటున గిన్నె జారి పడిందా అంతే కాస్త చూసుకుని చెయ్యి పని,,ఎందుకంత హడావుడి అని...అంతే గా మరీ. నేనేమో ఇంటి మనిషిని.ఇంటి మనిషి కి పనిమనిషి కి కొద్దిగా తేడా ఉంటుంది కదా ..ఇంటిమనిషి ఎన్ని అన్నా పట్టిచ్చుకోదు అదే పనిమనిషిని గట్టిగ గదిమితే రెండో రోజే మానేస్తుంది. అందుకని ఎంతో తెలివిగా మసలుకుంటారు పాపం మా వారు.అక్కడికి ఈ సౌండ్స్ భరించలేక తలుపు దగ్గరగా వేసే ఉంచుతాను..కరెక్ట్ గా అదే టైం లో మోగుతుంది నా cooker whistle...ఏమి చేస్తాం మరీ box తయారు చేయాలి గా...మళ్ళి లేట్ కాకూడదు,ఉడుకు ఉడుకు గా ఉండకుదు..మా cooker wistle దెబ్బకు మా పక్క పోర్షన్ వాళ్ళు కూడా లేస్తారు...అంత పెద్దగ చాలా సేపు వస్తుంది కుయ్య్యో మనుకుంటూ,,,,రోజు ఉండేదేగా అని ఒక సారి నా వైపు లూక్కేసి మళ్ళి పూజ లో మునుగుతారు .ఆ పూజ కూడా చిన్నగా చేసుకోకుండా పెద్ద పెద్దగ మంత్రాలు చదువుతారు...ఆ సౌండ్ కు నిద్రపోతున్న మా వాడు ఉలిక్కిపడి లేచి వస్తాడు ఆరున్నొక్క రాగం తీసుకుంటూ..కాసేపు సముదాయించి బుజ్జగించితే హే పాప కావాలి అనుకుంటూ తన డిమాండ్స్ చెప్తాడు.అదేలెండి మగధీర లో హే పాప పాట పెట్టాలి వాడికి సుప్రభాతం లాగా.మరి రోజు మొదలు అయింది అంటే వాడికి ఆ పాట,లేదా rhymes నో ఉండాల్సిందే..మా వారు కూడా తను డిగ్రీ చదివే వయసులో వాళ్ల నాన్నగారు పూజ చేసుకుంటుంటే ఈయన చిరంజీవి పాటలు పెట్టుకుని డాన్సులు చేసేవాళ్ళు ట ..అలాగే ఇప్పుడు మా వాడు రాంచరణ్ పాటలు వింటూ ఎంజాయ్ చేస్తున్నాడు వాళ్ల నాన్న గారి లాగా..సరే ఈ పాటలు ఈ గోలల మధ్య లో ఫోన్లు,,వెళ్లి కాల్ ఆన్సర్ చేసే వరకు మోగుతూనే ఉంటుంది ట్రింగ్ ట్రింగ్ మనుకుంటూ ,ఈ లోగ టైం 7 .౩౦ అవనే అవుతుంది,,మళ్ళి లేచి హడావుడి గా రెడీ అయ్యి బయలుదేరాలిగా ఆఫీసులకు,,అందుకే తెల్లవారు ఝాముననే లేచి పూజ చేసుకోండి అని చెప్తా నేను,ప్రశాంత వాతావరణం లో చేసుకుంటే మనసు లగ్నం అవుతంది దేవుడి మీద..ఈ రణగొణ ధ్వని లో ఏమి ఉంటుంది..చికాకు తప్ప,,,,ఇంక రేపటి నుండి ఎవరు లేవకముందే పొద్దున్నే లేచి పూజ చేసుకుంటా, మీ గోల లేకుండా ఉంటుంది అని నసుగుతూ వెళ్ళిపోతారు ఆఫీసు కు...మరీ ఆ పొద్దు ఎప్పుడు వస్తుందా అని గత వారం రోజులు గా ఎదురు చూస్తూనే ఉన్నాను.
Nov 21, 2010
బ్లాగు భోజనం
కాసేపు తీరిక దొరికింది కదా అని బ్లాగులు చూస్తుంటే ఏ బ్లాగులో చూసినా వంటలేనాయే,,,అస్సలే కార్తీక పౌర్ణమి ఉపవాసం ఉందాం అని అనుకున్నాను.ఆ వంటలు చూస్తుంటే నాకు మనసు లయ తప్పుతోంది.ఉపవాసం లేకుండా పోనీ సగం పూట ఉన్నాం కదా అని సర్దిపెట్టుకుని ఆరగించేద్దమా అంటే అన్నీ ఆయిల్ ఫూడ్స్.పుణ్యం సంగతి దేవుడు ఎరుగు కాస్త అన్నా బరువు తగ్గాలి అని గట్టిగ ఉపవాసం చేస్తున్నా కదా సరే నీరసం రాకుండా ఉంటుంది అని ఒక చిన్న వంటకం చేద్దాం అని నేను కూడా నిర్ణయించుకున్నాను.వనాభోజనం లో ఉపవాసం అనుకోండి కాసేపు...
ఈ వంటకం నేను టీవీ లో చూసాను..అది కూడా ఇవ్వాలే..సరే చేద్దాం
oats 1 కప్
పెరుగు 1 cup
కొత్తిమీర,
కరేపాకు,
నిమ్మ కాయ-1
కాసిన్ని నీళ్ళు;
విధానము:
ముందు గా ఒక గిన్నెలో కాసిని నీళ్ళు పోసి మరిగినాక ఈ oats వేసి మూతపెట్టి మూడు నిముషాలు ఉంచాలి.
oats తొందరగా ఉడుకిపోతాయి..బాగా దగ్గర పడ్డాక స్టవ్ ఆపేయాలి.
ఒక బౌల్ లో పెరుగు వేసి దానిలో కొద్దిగా తరిగిన కొత్తిమీర,కరేపాకు,కొద్దిగా సన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసి బాగా కలపాలి.
ఆ తరువాత ఒక నిమ్మ చెక్కను పిండాలి.
ఈ ఉడికిన oats చల్లారాక పెరుగును కలపాలి.
బాగా కలిపినాక serve చేస్తే చల్ల చల్లగా పెరుగు ను తింటుంటే ఆత్మారాముడు కాస్త శాంతిస్తాడు ...
taste చూసానండి ఈ వంటకం నేను. బాగానే ఉంది..పాలల్లో వేసుకుని తినే కంటే ఈ విధం గా తింటే బాగుంది.
మీరు కూడా ట్రై చేసి చూడండీ ఇది evening పిల్లలకు పెట్టటానికి బాగుంటుంది snack లాగా..
ఈ వంటకం నేను టీవీ లో చూసాను..అది కూడా ఇవ్వాలే..సరే చేద్దాం
పేరు;దహీ oats .
కావలసిన పదార్ధాలు:oats 1 కప్
పెరుగు 1 cup
కొత్తిమీర,
కరేపాకు,
నిమ్మ కాయ-1
కాసిన్ని నీళ్ళు;
విధానము:
ముందు గా ఒక గిన్నెలో కాసిని నీళ్ళు పోసి మరిగినాక ఈ oats వేసి మూతపెట్టి మూడు నిముషాలు ఉంచాలి.
oats తొందరగా ఉడుకిపోతాయి..బాగా దగ్గర పడ్డాక స్టవ్ ఆపేయాలి.
ఒక బౌల్ లో పెరుగు వేసి దానిలో కొద్దిగా తరిగిన కొత్తిమీర,కరేపాకు,కొద్దిగా సన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసి బాగా కలపాలి.
ఆ తరువాత ఒక నిమ్మ చెక్కను పిండాలి.
ఈ ఉడికిన oats చల్లారాక పెరుగును కలపాలి.
బాగా కలిపినాక serve చేస్తే చల్ల చల్లగా పెరుగు ను తింటుంటే ఆత్మారాముడు కాస్త శాంతిస్తాడు ...
taste చూసానండి ఈ వంటకం నేను. బాగానే ఉంది..పాలల్లో వేసుకుని తినే కంటే ఈ విధం గా తింటే బాగుంది.
మీరు కూడా ట్రై చేసి చూడండీ ఇది evening పిల్లలకు పెట్టటానికి బాగుంటుంది snack లాగా..
Nov 15, 2010
ఉపవాసము
ఈ కార్తీక మాసం వచ్చిందంటే చాలు జనాలు పిచ్చి భక్తి తో ఉపవాసాలు చేస్తారు.నేను చేస్తాను అనుకోండి కానీ ఏదో కార్తీక సోమవారం రోజు చేస్తా..వారం లో మిగత రోజులు తింటాం కాబట్టి పర్వాలేదు అంత ఏమి ఇబ్బంది అనిపించదు.పైగా కాస్త మన వయస్సు బట్టి ఓపిక బట్టి చేయాలి.అలాకాకుండా పుణ్యం వస్తుంది అని వారం లో నాలుగు రోజులు ఉపవాసం చేస్తే ఎలాగు.ఎవరు చేస్తారు అలాగా అంటారా..ఎందుకు ఉండరు..మా ఇంట్లో నే ఉన్నారు.మా అమ్మగారు మొన్న కార్తీక సోమవారం ఉపవాసం,మర్నాడు నాగులచవితి కదా ఆ రోజు కూడా ఉపవాసం..సరే తరువాత గురువారం బాబా కి ఇష్టమైన రోజు కదా ప్రతి వారం ఉంటుంది ఏ నెల అయినా కూడా,,సరే తర్వాత శనివారం కోటి శనివారాలు ట కదా ఆ రోజు..ఆ రోజు ఉపవాసం...సో దాదాపు వారం అంతా ఉపవాసమే..ఇంతలో మళ్ళి సోమవారం వచ్చేసింది...ఉపవాసం అంటే మొత్తం గా కడుపు మాడ్చుకోవాలి అని ఏ శాస్త్రము,సైన్సు చెప్పదు..ఒక పూట లంఖణం చేస్తే అన్నీ parts active అవుతాయి అని ఏదో పదిహేనురోజుల కో నెల కో ఒక రోజు చేయమంటారు.ఆ రోజు solid food , అన్నం అలాంటిది తినకుండా liquids తీసుకోవచ్చు అంటారు..ఉపవాసం అని మనం ఆ రోజు నాలుగు అయిదు సార్లు కాఫీ లు ,టీలు తాగుతాం..చక్కగా పాలు,మజ్జిగ ,కొబ్బరినీళ్ళు తాగితే కాస్త నయం..మంచినీళ్ళు ఏదో ఒకటో రెండో గ్లాసులు తాగుతాం రోజు మొత్తం మీద.అస్సలు ఇక్కడే దెబ్బ పడ్తుంది...నీళ్ళు సరిపడా తాగకపోతే urine infections వచ్చేస్తాయి..చాలా రోజులు వరుసగా food లేకపోతె బాడీ లో షుగర్ లెవెల్స్ పడిపోతాయి...నీరసం మీద మగత నిద్ర వచ్చేస్తుంది.ఇదే జరిగింది మా అమ్మగారికి కూడా.నీరసం మీద తలనొప్పి వచ్చేసి తల తిరుగుతున్నట్టు ఉండి నాలుగు గంటలకు పడుకున్న ఆవిడ మర్నాడు ఏడు గంటలకు నిద్ర లేచింది...అంత మగత గా,,తల తిరగటం, అలాంటివి వచ్చేస్తాయి..ఏముంటుంది లే ఒక పూట తినకపోతే అని మనకు అనిపిస్తుంది...కానీ ఆ affect ఆ రోజు కి ఏమి తెలియదు..ఒక రోజు తర్వాత తెలుస్తుంది...అందుకనే ఉపవాసం చేస్తున్న వాళ్ళు అందరూ ఏదో వారం లో ఒక రోజు చేయండి అంతే..ఎక్కువ రోజులు ఉపవాసం చేస్తే ఎక్కువ పుణ్యం వస్తుంది అనే statistics లేవు గా ఎక్కడ...ముందు మన ఆరోగ్యం బాగుంటే ఎన్నయినా పుణ్యకార్యాలు చేసుకోవచ్చు..లేదంటే మొదటి కే మోసం వస్తుంది....
Nov 14, 2010
Nov 7, 2010
పెళ్లిగోల
ఈ మధ్య ఒక వివాహ పరిచయ వేదిక దగ్గరకు వెళ్ళాను మా అన్నయ్య వి పెళ్లి సంబంధాల కోసం. అది ఒక గుడి లో ఏర్పాటు చేసారు.నేను వెళ్ళేటప్పటికే మొదలు అయింది.ఒకచోట అందరూ గుమిగూడి ఉన్నారు.ఎవరయినా పడిపోయారేమో అనుకుని వెళ్ళాను.తీరా చుస్తే వాళ్ల అందరూ ఉన్న గుంపు మధ్యలో కొన్నిఫైళ్లు ఉన్నాయి అవి అమ్మాయి ల ఫోటోలు,biodata ల ఫైళ్లు.వాటికోసం మగపిల్లల తాలూకు వాళ్ళు గుమిగూడారు.అంతమంది మధ్యలో మనం వెళ్లి విజయవంతం గా ఫైలు తెసుకురాలేము లే అని ఆ ప్రయత్నం మానుకున్నాను.సరే ఆల్రెడీ చూస్తున్న వాళ్ల పక్కనే కూర్చొని కాసేపు మనం కూడా ఆ ఫైల్ చూడొచ్చు అనుకుని ఒకావిడ ను అడిగాను.ఇద్దరం చూద్దాం అండి అని..దానికి ఆమె ఒక వింత లుక్ ఇచ్చింది నా వైపు.అస్సలే గంట నుండి కుస్తీ పట్టి నేను తెచ్చుకుంటే,ఇప్పుడొచ్చి మా సంబంధాలు గద్ద లా తన్నుకు పోతావా అన్నట్టు.నాకు టైం పడుతుంది మీరు వేరే ఫైల్ తెచ్చుకోండి అని నిర్మొహమాటం గా చెప్పింది.ఆహ అమ్మాయిల పెళ్లి ఫైల్ లకు డాలర్ రేట్ కంటే ఫాస్ట్ గా craze పెరిగిపోయింది అనుకున్నాను.ముందు రిజిస్ట్రేషన్ చేసుకోండి, మీరు వెళ్లి వచ్చేలోగా నా ఈ ఫైల్ అయిపోతుంది అప్పుడు ఇస్తాను అన్నది నెమ్మదిగా .కొత్తగా వచ్చినవాళ్ళు regestration చేసుకోవాలి ట.సరేలే అని line వంక చుస్తే నేను TCS జాబు కోసం కూడా అంత పెద్ద line లో ఉండలేదేమో.కానీ తప్పదు కదా.నుంచుని ఒక అరగంట గడిచాక రిజిస్ట్రేషన్ complete చేశా.ఆహ ఆ వేదిక నడుపుతున్నది ఆడవారే.యాభయ్యేల్లు పై పడినవారే.టైం పాస్ కోసం ఇలాగ చేస్తున్నారు సంఘ సేవ.కాసేపు అక్కడ ఉన్న ఫైళ్లు తిరగేసి మంచి సంబంధాలు రాసుకున్నా .ఇంతలో ఒకళ్ళు ఇద్దరు వచ్చారు నా దగ్గరకు అబ్బాయి కావాలా అండి ,అమ్మాయా అని.అదేంటి ఇలా అడుగుతున్నారు అనుకున్నాను.. మీరు అమ్మాయి కోసం చూస్తున్నారా,అబ్బాయి కోసం చూస్తున్నారా అని వివరించింది..ఓహ్ ఇలాగ మనమే వచ్చినవాళ్ళను అడిగితె ఇంకొన్ని తెలుస్తాయి కాబోలు అనుకుని నేను కూడా ఉన్న వాళ్ల అందరి దగ్గరికి ఆ చాయ్,చాయ్ అని అరిచినట్టు అమ్మాయి కోసం చూస్తున్నా మండి అంటూ అందరిని అడిగా.సగం పైగా అందరూ నా లాంటి వాళ్ళే,,అదేలెండి అమ్మాయి కోసం చుస్తున్నవాళ్ళే.పాపం అక్కడికొచ్చిన తల్లిదండ్రులను చుస్తే అబ్బాయి పెళ్లి కు ఎంత టెన్షన్ పడుతున్నారో అనిపించింది.ఉద్యోగం అక్కర్లేదు,ఏ చదువు అయినా పర్లేదు,ఏ రంగు అయినా పర్లేదు....average గా ఉండే ఏ అమ్మాయి అయినా పర్లేదు...అస్సలు చివరకు అమ్మాయి అయితే చాలు అన్నట్టు అయింది పరిస్థితి.మా ఇళ్ళల్లో నేను వినగా ఏ అమ్మాయి కు ఇలాగ వేదిక లకు వెళ్లి సంబంధాలు చూసింది లేదు,,చేద్దాం అనుకోగానే ఒకటి రెండు చూసి చేసేసారు,ఇప్పుడు అబ్బాయిల పెళ్ళిళ్ళు అంటే చెప్పులే కాదు...జేబులు వాటికి తోడు క్రెడిట్/డెబిట్ కార్డ్ లు కూడా కరిగిపోతున్నాయి,,ఏం చేస్తాం..కాలం మారింది గా..
Nov 4, 2010
దీపావళి పూజ
మూడేళ్ళ క్రితం హాస్టల్ లో ఉండి ఉద్యోగానికి వెళ్ళే రోజుల్లో దీపావళి రోజు కూడా ఆఫీసు కు వెళ్ళాల్సి వచ్చింది నేను.జస్ట్ one hour నే వచ్చివెల్లండి అని మా బాస్ ఆర్డర్.some errors ఉన్నాయి so immediate గా corrections చేయాలి అని...ఇంక వెళ్లక తప్పింది కాదు.గుడికి వెళ్లి వెళ్దాం అనుకుంటే కుదరలేదు..సరే అని ఆఫీసు కు వెళ్లి మెయిల్స్ చెక్ చేసుకుంటే DIWALI గ్రీటింగ్స్ వచ్చాయి మా ఫ్రెండ్స్ నుండి,,అందులో ఒకటి virtual లక్ష్మి పూజ..ఏదో ఒకటి లే virtual పూజ నే మనసులో నిజం పూజ లాగా ఫీల్ అయ్యి సౌండ్ mute చేసి చేసుకున్నాను..టెక్నికల్ పూజ భలే thrill గా అనిపించింది..అలాంటివి softwares కూడా ఉంటాయి ట.అంతకుముందు నేను ఎప్పుడు చూడలేదు..తర్వాత పంపించింది మా ఫ్రెండ్ గణేష్ virtual పూజ..సిస్టం ఆన్ చేయగానే virtual పూజ చేసి నా పని స్టార్ట్ చేసుకునేదాన్ని.same మళ్ళి ఆ గ్రీటింగ్ పంపింది ఈ దీవాలి కు కూడా..but ఇప్పుడు అంత అవసరం లేదనుకోండి...ఎక్కడున్నా సరే ముక్కోటి దేవుళ్ళని లాక్కొచ్చి మరీ కూర్చోపెట్టి నా స్త్రోత్రాలు వినిపిస్తున్నా గా..
మెయిల్ చుస్తే నాకు ౩ ఏళ్ళ క్రితం విషయం గుర్తువచ్చి ఇలా షేర్ చేస్తున్నా మీతో.
లక్ష్మి పూజ
ఈ లింక్ పైన క్లిక్ చేయండి..ఓపెన్ అయినాక ప్లే పైన క్లిక్ చేయండి..పూజ starts..(Light తో blink అయ్యేవాటిని click చేయండి)
click on flowers.
click on agarubatti
click on deepas
దీపావళి శుభాకాంక్షలు అందరికీ...
HAVE A SWEET AND SAFE DIWALI..

Nov 1, 2010
చదువు కొంటున్నాము
ఈ మధ్యనే మా బాబు ను playschool లో వేసాము.కాస్త స్కూల్ అలవాటు అవుతుంది అని అనేకంటే వాడి గొడవ ఇంట్లో భరించలేక వేశాము అంటే బాగుంటుందేమో.కాసేపన్నా ఉపిరి పీల్చుకోవచ్చు అనిపించి వేశాము.వాడిని రెడీ చేసి bag రెడీ చేసి స్కూల్ లో దింపి ఇంటికి వచ్చి అమ్మయ్య అనుకునేటప్పటికి ౩ hours అయిపోతాయి..మళ్ళి పరుగున వెళ్లి తెచ్చుకోవటం.saturday కూడా ఉంటే అలసిపోతారు అని saturday ,sunday శెలవలు.ఈ మాత్రం దానికి అప్పుడే ఎందుకు స్కూల్ అని మా ఇంట్లో పెద్దవాళ్ళంతా గోల.ఈ ౩ గంటలు భరించినందుకు స్కూల్ ఫి 22 ,000 ఈ narsury కు.నా ఇంజనీరింగ్ మొత్తం అయిపొయింది ఆ డబ్బుతో,,అదే నాకు కట్టిన పెద్ద మొత్తం నా చదువు కు నా జీవితం లో.అలా అని చేర్చకుండా ఉరుకోలేము గా.పాజిటివ్ attitude ,సెల్ఫ్ కాన్ఫిడెన్సు అలాంటివి నేర్పిస్తారు ట వాళ్ళు,.నా మొహం మనకే గట్టిగ తెలియదు ఆ పదాలు ఏమిటో వీళ్ళకేమి తెలుస్తుంది.అన్నట్టు ఈ మధ్య parents మీటింగ్ కూడా పెట్టారు.పెట్టి వీళ్ళకు gradings ఇచ్చారు.మా వాడికి ఏదో B గ్రేడ్ ఇచ్చారనుకోండి. పాపం చేరి వారమే కదా వాళ్ళకు analyze చేయడానికి టైం సరిపోలేదు ట..అందులో ఉన్న columns ఏమిటంటే sharing ,సెల్ఫ్ confidence ,respect to others ,talking ,running ,jumping ,eating ,behaviour ,cleanness etc ..ఇవి అన్నీ observe చేసి చైల్డ్ లో gradings ఇచ్చారు.మా వాడికి jumping ,running లో A + గ్రేడ్,follwing teacher అనే item లో occassionally following అని C గ్రేడ్ ఇచ్చారు.వాళ్ల టీచర్ చెప్పింది మీ వాడు ఇంకా ఫాలో అవ్వాలి teacher ను..మీరు ఇంగ్లీష్ లోనే మాట్లాడండి ఇంట్లో కూడా అని. ఎందుకంటే ఆ టీచర్ కు తెలుగు అస్సలు రాదు.ఇంగ్లీష్ లో come here అని పిలుస్తుంటుంది ..ఇంకా మొత్తం తెలుగు పదాలే రాలేదు మా వాడికి. ఇంక ఆ ఇంగ్లీష్ ఏమి అర్ధం అవుతుంది..నన్ను కాదు అన్నట్టు బిక్క మొహం వేసి ఉంటాడు.చేరగానే అన్నీ ఎలా వచ్చేస్తాయి అనుకుంటారో.ఈ మాత్రం స్కూల్ మానకుండా,ఏడవకుండా వెళ్తున్నాడు అంటే గ్రేట్,ఈడ్చుకుని తెసుకు వెళ్ళాల్సిన అవసరం లేదు మా వాడిని,హయిగా స్కూల్ లోనే ఆడుకోవచ్చు అని వాడి ఆనందం. ,అన్నీ రకాలు గాను డెవలప్ అయినాయి స్కూల్స్.
Oct 10, 2010
నా మొదటి సినిమా
హా హా..నా మొదటి సినిమా అంటే ఇప్పటిదాకా అస్సలు సినిమాలే చూడలేదు అనుకుంటున్నారా?? కాదండి..మా బాబు పుట్టినప్పటినుండి సినిమాలు బంద్ చేసాము..ఈ మూడేళ్ళ తర్వాత మొట్టమొదటి సినిమా ఇవ్వాళ చూసాను theatre లో..మా బాబు కు ఇదే మొదటి సినిమా..ఇవ్వాళ 10 -10 -10 కదా..ఏదైనా కొత్తగా గుర్తు ఉండేటట్టు చేద్దాం అనుకున్నాము.ను మహేష్ బాబు కు పిచ్చ ఫాన్స్ లెండి,మా వాడికి మొదటి సినిమా మహేష్ బాబు దే చూపించాలి అనుకున్నా,అనుకున్నది జరిగింది ,పాపం మహేష్ బాబు మా వాడి కోసమే మూడేళ్ళు ఆగి సినిమా తీసినట్టున్నాడు,ఎంతో ఉత్సాహం గా సినిమా కు వెళ్తే మా వాడు నాకు చూపించాడు సినిమా.కాసేపు నోటికి పని పెడితే నస ఆపుతాడు అని popcorn కొని పెట్టా.ఆ ప్యాకెట్ అయిపోయే వరకు బానే ఉంది..తర్వాత మళ్ళి మొదలు..అక్కడ..50 పెట్టి సినిమా కు వెళ్తే డోర్ keeper దగ్గర కుర్చుని సినిమా చూడాల్సి వచ్చింది.ofcourse నేను ఒక్కదాన్నే కాదనుకోండి .పాపం నాలాంటి తల్లులు,కొంతమంది తండ్రులు కూడా same.గోడకు అనుకుని అందరం line లో మెట్ల మీద నుంచుని సినిమా చూసాము.చిన్నప్పుడు స్కూల్ లో మా టీచర్ హోం వర్క్ చేయని వాళ్ళను గోడకు అనుకుని line లో ఒకళ్ళ వెనకాల ఒకళ్ళని నున్చోపెట్టేది..అలా నుంచొని క్లాసు వినేవాళ్ళం.అలా punishment లాగా అనిపించింది ఇవ్వాళ నాకు.
ఈ లోగ ఇంటర్వెల్.మళ్ళి చిప్స్ ప్యాకెట్.icecream .సరే ఇంటర్వెల్ నుండి మళ్ళి సగం సినిమా బాగానే చూసాము.తెచ్చిన తినుబండారాలు అయిపోయాక మళ్ళి మొదలు.మళ్ళి మెట్ల మీదే..ఆ విధం గా మొత్తానికి మొదటి సినిమా దాదాపు ఆనందం గా,కాస్త విసుగుగా బాగానే గడిచింది.కాకపోతే సినిమా టికెట్ కంటే మా వాడికి timepass snacks రేట్ నే ఎక్కువ అయింది..
నేను ఒకసారి ఆహ్మేదాబాద్ వెళ్ళినప్పుడు అక్కడ open theatre లో సినిమా చూసాను,open theatre అంటే జస్ట్ ఒక పార్క్ లాంటి open place లో బిగ్ స్క్రీన్ మీద మూవీ వస్తుంది,మనం మన కార్ లో కూర్చొని చూడొచ్చు,లేదా చక్కగా lan లో చాప వేసుకుని లేదా పడుకుని చూడొచ్చు,పిల్లలు చక్కగా ఆడుకుంటూ ఉంటారు .మనం హయిగా సినిమా చూడొచ్చు.మనకు theatre లాగానే కావాలి అనుకుంటే ఇక్కడ లాగా బాల్కనీ ఉంటుంది,అక్కడ చైర్స్ లో కూర్చొని సినిమా చూడొచ్చు.మాములు theatre కు దీనికి తేడా ఏంటి అంటే ఇది డబల్ ది fare ఉంది,,nearlly 150 అనుకుంటా టికెట్..ఇక్కడ కూడా అలాంటి theatres వస్తే బాగుండు అనిపించినిది నాకు..ఫుల్ చీకటి ఉంటుంది కదా theatres లో ఆ చీకటి కు భయపడి పిల్లలు ఏడుపు.మనకేమో అయ్యో సినిమా పోతోందే అనిపిస్తుంది,,అందుకే చక్కగా ఓపెన్ theatre సిస్టం వస్తే బాగుంటుంది. మా లాంటి పిడుగుల బాధితులు ఆనందిస్తారు.

Oct 1, 2010
Sep 5, 2010
టీచర్స్ డే
నిదురించే ఆత్మలను మేలుకోలిపెవాడు,సోమరిపోతును చురుగ్గా తయారు చేసేవాడు,
తెలుసుకోవాలన్న ఆతురత గల వ్యక్తులను ప్రోత్సహించేవాడు,
చంచల మనస్తత్వం గల వ్యక్తిని అంచెలంచలు గా మార్చేవాడు అధ్యాపకుడు.
తెలుసుకోవడం లో ఉన్న ఆనందాన్ని నలుగురికి తెలియజేసేవాడు,
తన విధ్యార్ధులతో తన విద్యా ధనాన్ని పంచుకునేవాడు,భావి జీవితం లో ఉత్సాహపు వెలుగును పంచే వెలుగు దీపాలను వెలిగించేవాడే అధ్యాపకుడు అవుతాడు.
నేను వేసిన ఈ చిత్రం మా drawing మాస్టారు కు అంకితం..చిన్నప్పుడు నేను వేసిన బొమ్మలను చూసి నన్ను ప్రోత్సహించిన మాస్టరుకు గుర్తు గా ఈ చిత్రం వేసాను .
తల్లిదండ్రులు మనకు జన్మ నిస్తే గురువులు జీవితాన్ని ఇస్తారు.అలాంటి మంచి జీవితాన్ని నాకు ఇచ్చిన అందరి గురువులకు ధన్యవాదాలు.
విద్య ను పంచే అందరు గురువులకు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు.

Aug 31, 2010
రిటైరమెంట్
ఇవ్వాళ మా నాన్నగారు ఉపాధ్యాయ ఉద్యోగం నుండి రిటైర్ అవ్వబోతున్నారు,,అదేంటి మరి ఇంత తీరిగ్గా బ్లాగు రాస్తున్నారు అనుకుంటున్నారా? అస్సలే ఆయన బాధ లో ఉన్నారు,అప్పుడే నన్ను ఈ ప్రభుత్వం ముసలి వాడిని చేసేసింది.ఇప్పటిదాకా కుర్రాడినే అనుకుని నా పనులు నేను చేసుకుని పిల్లల్లో పిల్లాడిలాగ కాలక్షేపం చేస్తుంటే నీకు వయసు అయింది హయిగా రెస్ట్ తీసుకో అని పంపేస్తోంది అని మదన పడుతున్నారు.అయినా కొన్ని కారణాల వలన కుదరలేదు అనుకోండి వెళ్ళటం.అప్పుడే retirement age వచ్చేసిందా అని అనిపిస్తోంది మాకు.పాత సినిమాలలో చూపించినట్టు ఒపికలు నశించి,వయసు మళ్ళి,ఇంట్లో బాధలు,పెళ్ళిళ్ళు కావలసిన పిల్లలు,జాబులు రాని కొడుకులు..కష్టాలన్నీ retirement టైం లో నే ఉన్నాయి అన్నట్టు ఉండేది అప్పటి దృశ్యాలు .అదృష్టవసాత్తు అలాంటి బాధలు మాకు లేవు. దాదాపు ఈ రోజులలో ఎవ్వరికి లేవు అనే అనుకుంటున్నాను.ఇప్పటి దాక ఒక విధమయిన జీవితానికి అలవాటు పడి ఇంక ఇప్పుడు ఇంకొక రకమయిన జీవితానికి అలవాటు పడాలి అంటే కొద్దిగా కష్టమే.తర్వాత తర్వాత అలవాటు పడిపోతారు లెండి వాళ్ళే ఏమి చేస్తారు ఇంక.మా నాన్నగారి తో పాటు మా బంధువులు(మామగారు లు) కూడా ఇద్దరు ఇవ్వాళే రిటైర్ అవుతున్నారు.పెద్దవాళ్ళు అవుతున్నారు తల్లిదండ్రులు కొంచెం బాధ్యతలు తగ్గించి మనం వాళ్ళని,వాళ్ళు చేస్తున్న పనులలో బాధ్యతలను పంచుకోవాలి అని గుర్తుచేయటం కోసమేనేమో ఈ retirement అని అనిపిస్తుంది నాకు .ఇప్పటిదాకా మా కోసం నిరంతరం గా కష్టపడి,వాళ్ల కోసెం ఏమి సమయం వెచ్చించకుండా కష్టపడ్డారు కాబట్టి రిటైర్ అయినతర్వాత వాల్లక్కు నచ్చినట్టు మంచి గా కాలక్షేపం చేయాలనీ,ఆయురారోగ్యాలు ప్రసాదించాలని,గుండెల నిండుగా మనశ్శాంతిని ఇవ్వాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను..
Aug 28, 2010
ప్రాణం ఖరీదు
రాత్రి పదకొండు గంటలకు కాలింగ్ బెల్ మోతకు వెళ్లి తలుపు తీసింది రమణి.ఎదురుగ మత్తులో జోగి ,వంటి నిండా కట్ల తో ఉన్న కొడుకు నిఖిల్ ను చూసి నిశ్చేష్టురాలు అయింది రమణి."ఏమి లేదు ఆంటీ. ఇవ్వాళ birthday కదా అని రెండు పెగ్గులు ఎక్కువ వేసాడు,,ఫ్రెండ్స్ తో బెట్ కట్టి byke రేస్ లో participate చేసాడు,బాలన్సు తప్పి పడిపోయాడు,మరేమి పర్వాలేదు అన్నారు డాక్టర్స్ అని చెప్పి నిఖిల్ ను సోఫా లో కూర్చోపెట్టి వాళ్ల పని అయిపోయిన్దనిపించి వెళ్ళిపోయారు ఫ్రెండ్స్.లేక లేక పుట్టిన ఒక్క కానోక్క కొడుకు ను ఈ స్తితి లో చూసి తల్లడిల్లిపోయింది రమణి."అర్ధరాత్రి పూట ఎందుకురా ఆ పందాలు అవి..ఎన్ని సార్లు చెప్పాలి పబ్బు లకు క్లబ్బులకు వెళ్లొద్దు తాగి రావద్దు అని,,తొందరగా ఇంటికి వచ్చి హాయ్ గా మాతో ఉండక ఎందుకురా ఫ్రెండ్స్ అంటూ తిరుగుతావు,,ఏదో చిన్న దెబ్బలు కాబట్టి సరిపోయింది,నీకేమన్నా అయితే మేమేమయి పోవాలి రా" అంటూ ఏడుపు లంఘిన్చుకుంది తల్లి.అస్సలే మత్తులో తూగుతూ దెబ్బలతో కొంచెం చికాకు గా ఉన్న నిఖిల్ కు అమ్మ ఏడుపులు చికాకు ను రెట్టింపు చేసాయి,"ఛి ఛి అందుకే నేను ఇంటికి రాను ఎప్పుడు చూడు ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు. చిన్నప్పుడు చదువు చదువు అని.ఏదో ఆ ఇంజనీరింగ్ అయిన్దనిపించాక ఉద్యోగం ఉద్యోగం అని సతాయించారు..ఏదో నా అదృష్టం బాగుంది మంచి జాబు వచ్చింది.నా జీతం నాకు పాకెట్ మనీ కు సరిపోతుంది,,ఇప్పుడు కూడా నన్ను ప్రశాంతం గా నా పని నన్ను చేసుకోనీయరా,ఎంజాయ్ చేస్తే తప్పేంటి.ఏమంత కాని పని చేసానని" అని విసుకుగా తన గదిలోకి వెళ్ళిపోయాడు నిఖిల్.
ఆ రాత్రంతా రమణి,గోపాల్ లకు కంటి మీద కునుకు పట్టలేదు..కొడుకు ఇలా చేయి దాటిపోతున్నాడు అని మనసులో బాధ పడసాగారు,ఒక్క కానోక్క కొడుకు అని చిన్నప్పటినుండి గారాబం గా పెంచారు.అడిగింది కాదనకుండా ఇచ్చారు.ఎంతో మంచి పోసిషన్ లో ఉండాలి తమ కొడుకు అని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.స్వతహాగా తెలివిగల వాడే నిఖిల్.ఇంజనీరింగ్ వరకు బాగానే ఉన్నాడు.ఇంజనీరింగ్ అయిపొయింది వెంటనే మంచి కంపెనీ లో ఉద్యోగం వచ్చింది అప్పటినుండి ఫ్రెండ్ సర్కిల్ పెరిగింది,సొంత సంపాదన.పాతికవేల జీతం..ఒక్కసారి గా అలాంటి జీవితం,జీతం అందేటప్పటికి ఒక్కొక్క వ్యసనము అలవాటు అయింది.పబ్బులు క్లబ్బులు వెళ్ళటం అలవాటు అయింది.లేట్ నైట్ పార్టీస్ మొదలు అయ్యాయి.దీనికి తోడు byke racelu అంటూ కొత్తగా మొదలు పెట్టాడు.వద్దని ఎన్ని సార్లు చెప్పినా అమ్మ నాన్న ల మాట చెవిన పడలేదు నిఖిల్ కు.చూద్దాం కాలమే సమాధానం చెబుతుంది అని సర్ది చెప్పుకున్నారు రమణి,గోపాల్ దంపతులు.
ఒక వారం గడిచింది.గాయం కాస్త పాత పడింది.మళ్లీ byke రేస్ అని పందెం మొదలుపెట్టాడు.ఎంతో ఫాస్ట్ గా దుసుకుపోతుండగా సడన్ గా ముందు ఉన్న కిరణ్ బండి స్కిడ్ అయ్యి పల్టీలు కొడుతూ వెల్లకిలా పడ్డాడు.బండి వచ్చి అమాంతం మీద ఒరిగిపోయింది.ఒక్కసారి గా అందరూ భయ పడ్డారు జరిగినదానిని చూసి,,వెంటనే హుటాహుటిన హాస్పిటల్ కు తీసుకు వెళ్లి చికిత్స స్టార్ట్ చేయించారు.ఏదో ప్రాధమిక చికిత్స చేసి చిన్న చిన్న దెబ్బలకు కట్టు కట్టారు డాక్టర్స్.కానీ వెన్నుముక కు బలమయిన గాయం తగలటం వలన ఇంక పైకి లేవలేడని డాక్టర్స్ తేల్చి చెప్పేశారు.ఒక్కసారి గా ఫ్రెండ్స్ అందరూ ఉలిక్కి పడ్డారు.అప్పటి దాక తమతో ఉత్సాహం గా చిందులేసిన తమ స్నేహితుడు ఇంక అస్సలు లేచి నిలవలేడని విని తట్టుకోలేకపోయారు.ఇది అంతా నావలన నే కదా. అనవసరం గా నేనే పోటిపడదాం అని వాడిని రెచ్చకోట్టానే అని గుండెలవిసేలా రోదించాడు నిఖిల్.ఇంతలో వార్త తెలిసి కిరణ్ వాళ్ల parents హాస్పిటల్ కు చేరుకొని మంచం లో ఉన్న తమ కొడుకును చూసి మూర్చపోయారు.తమకు ఎంతో చేదోడుగా ఉంటాడు అని ఎంతో కష్టపడి ఉన్నదానిలోనే దాచి చదివించి చేతి కి అందివచ్చే టైం కు తమ కొడుకు ఇలా మంచానికి అతుక్కుపోవటం చూసి తట్టుకోలేకపోయారు.
ఒక నెల తర్వాత తన జీతం తెసుకుని ఆఫీసు నుండి నేరుగా కిరణ్ వాళ్ల ఇంటికి వెళ్ళాడు నిఖిల్.మంచం లో ఉన్న తన ఫ్రెండ్ ను చూసి తట్టుకోలేకపోయాడు నిఖిల్.తన జీతం లో సగం మొత్తం ఒక పదిహేను వేలును కిరణ్ తండ్రి కి ఇచ్చాడు."సారీ అంకుల్.వీడిని ఇలా చూస్తుంటే చాలా బాధగా ఉంది.ఇదంతా నా వల్లనే జరిగింది అనిపిస్తోంది నాకు.నేను అనవసరం గా వీడిని పురికొల్పకపోతే వీడు byke రేస్ లో పాల్గొనేవాడే కాదు.మా అమ్మా వాళ్ళు ఎంత చెప్పినా మొండిగా వినలేదు నేను.ఈ శిక్ష ఏదో నాకే వేసుంటే బాగుండేది ఆ దేవుడు.అన్యాయం గా నా ఫ్రెండ్ బలి అయిపోయాడు.నా మూలం గా వాడి ఉద్యోగం పోయింది.మీరు ఇబ్బందులలో ఉంటారు అని నా జీతం లో సగం వాడికి ఇద్దాం అనుకుంటున్నాను.ఇక నుండి మందు తాగను,బైకే రేస్ లు చేయను నా ఫ్రెండ్ సాక్షి గా" అని కుమిలి కుమిలి ఏడ్చాడు నిఖిల్.అప్పటినుండి మందు,byke racelu మానేసి నలుగురికి ఉపయోగ పడే పనులు చేయటం మొదలుపెట్టాడు నిఖిల్.తన ఫ్రెండ్ కు ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకున్నాడు.తమ కొడుకు లో వచ్చిన మార్పు ను చూసి ఎంతో సంతోషించారు నిఖిల్ తల్లిదండ్రులు.

Aug 25, 2010
నూరేళ్ళు
ఇవ్వాల్టికి సరిగా మదర్ తెరిస్సా పుట్టి వందేళ్ళు..ఎవ్వరూ ఇప్పటిదాకా రాయలేదేంటా అనుకున్నా,,బహుశా ఎవరికీ గుర్తు ఉండి ఉండదేమో,,టీవీ లలో కూడా ఎక్కడ చూడలేదే ఒక్క ఛానల్ లో మాత్రం చూసా అంతే,,అయినా మన వాళ్ళకు మంచి చేసినవాళ్ళు గుర్తు ఉండరు కదా ఎక్కువగా,,ఎవరు ఎప్పుడు స్కాం లలో ఉంటారా,,ఎవరి గుట్టు రట్టు చేద్దామ అనే కానీ జనాలకు ఉపయోగ పడే మంచిని గుర్తుచేద్దాం అని ఉండదు కదా,,పోనిలెండి మనం గుర్తు చేసుకుందాం ఆవిడని కనీసం ఈ ఒక్క రోజైన...
తెరిస్సా చెప్పిన నేటి కాలానికి పనికొచ్చే quotes గుర్తుచేసుకుందాం ..
Kind words can be short and easy to speak, but their echoes are truly endless.
తెరిస్సా చెప్పిన నేటి కాలానికి పనికొచ్చే quotes గుర్తుచేసుకుందాం ..
Do not wait for leaders; do it alone, person to person.
Everytime you smile at someone,it is an action of love,a gift to that person,a beautiful thing. I am a little pencil in the hand of a writing God who is sending a love letter to the world.
If you can't feed a hundred people, then feed just one. Kind words can be short and easy to speak, but their echoes are truly endless.
Aug 17, 2010
జల జలా జలపాతం
ఈ వీడియొ నేను మా ఇంట్లో తీసాను,,నాకు పెద్ద వర్షం పడినప్పుడు మెట్ల మీద నుండి నీళ్ళు పడుతుంటే చూడటం ఇష్టం ,,అదొక జలపాతం లా అనిపిస్తుంది ,,ఎప్పుడు వీడియొ తీద్దామన్నా కుదరదు,,అలాంటిది ఈ సారి కుదిరింది,,మీరు కూడా చూడండీ ఒకసారి,,,
చేసి చూడండీ,,
కరెంటు పోయినప్పుడే మనకు సెల్ లో battery అయిపోతుంది,,కనీసం ఒక గంట అయినా ఉంటే బాగుండు charging అనిపిస్తుంది,,అందుకే ఈ వీడియొ లో ఉన్నట్టు ఫాలో అయిపోండి,,జస్ట్ ఒక సారి సరదా గా చేసి చూడండీ,,సెల్ ఏమి పాడవదు లెండి,,battery ఫుల్ అవకపోయినా పర్వాలేదు సెల్ పాడుకాకుండా ఉంటే చాలు అంటారా,,సరే మీ ఇష్టం,,
ఈ వీడియొ నాకు మా ఫ్రెండ్ మెయిల్ చేసింది,,తనకు ఎవరో పంపారు ట,,తను ట్రై చేసింది ఒక 5 గంటలు మాత్రం వచ్చింది ట battery ,అప్పటికే ఉన్న ఒక్క పాయింట్ వాళ్ల వచ్చిందో లేక నిజంగానే charging అయ్యిందో ఆ దేవుడి కే తెలియాలి.పర్లేదులెండి ఆ మాత్రం వచ్చింది గా,నేను ట్రై చేద్దాం అంటే నాది నోకియా సెల్ కాదు,(అది నా అదృష్టం అనుకోండి,,లేకపోతె నా ఈ పిచ్చి ప్రయోగం తో సెల్ పాడయితే ఇంట్లో జజ్జనకే ఇంక..)ఇందులో నోకియా తో చేసాడు గా.ఎవరైనా ట్రై చేస్తే నాకు కామెంట్ చేయండి,,
అల్ ది బెస్ట్...

Aug 16, 2010
స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
నిన్న ఆగష్టు 14 న మా ఇంటి దగ్గర స్కూల్ లో జెండా పండుగ బాగా చేసారు..జెండా ఎగరేసారు.చాక్లెట్టులు,బిసికెట్టులు పంచారు.competitions ఏవో పెట్టారు ట గత వారం నుండి పిల్లలకు prizes ఇచ్చారు,,పిల్లలు స్కూలు ను భలే బాగా decorate చేసారు..నాకైతే నేను చదువుకునే రోజులు గుర్తువచ్చాయి..మేము కూడా మా క్లాసు ను ఇలాగె చేసేవాళ్ళం అని అనిపించింది..చిన్న ప్రైవేటు స్కూల్ అయినా డ్రిల్ చేయించి మార్చ్ ఫాస్ట్ చేయించారు పిల్లలతో. చాలా ముచ్చట గా అనిపించినిది.
అంతా బానే ఉంది కానీ నేనే ఆగష్టు 14 అని రాసాను తప్పు గా అని మీరు అనుకుంటున్నారు కాదు..కానే కాదు ఎందుకంటే ఈ తతంగం అంతా జరిగింది నిజం గా ఆగష్టు 14 ననే,ఎందుకంటే ఆగష్టు 15 ఆదివారం వచ్చింది కదా,ఆ రోజు సెలవు కదా,పిల్లలు రారు కదా బడికి అని ముందే చేసేస్తున్నారు టా,ఇదేక్కడ విడ్డురం అనిపించింది నాకు,సెలవు అయినా పిల్లలు ఇష్టం గా వస్తారు ఇలాంటి స్కూల్ functions కు,పోనీ చిన్నపిల్లలను వద్దు అని చెప్పి ఎనిమిదవ తరగతి నుండి పిల్లలను రమ్మన వచ్చు గా.అస్సలు ముందు పంతుల్ల కు బద్ధకం,ఎవడు వస్తాడులే మళ్లీ ఒక గంట పని కోసం అని మన చరిత్ర లో ఒక రోజు ఘటన ను ముందుకు మార్చేసారు.ఈ స్కూలు నేను కళ్లారా చుస్తే ఇంకొక స్కూల్ లో కూడా ఇలాగె చేసారు అని నేను చెవులారా విన్నాను,అంత గా పదిహేనున స్కూల్ వద్దు అనిపిస్తే అస్సలు జెండా ఎగరేయటమే మానేయాలి కానీ ఎవరిష్టమోచ్చినట్టు వాళ్ళు ఎగరేస్తారా,అస్సలు కాలేజీ కు అయితే వెళ్ళే పనే లేదు అందరికీ సెలవే,software ఆఫీసు లలో అయితే అస్సలు గుర్తే ఉండదు ఈ రోజు,వాళ్ళకి thanksgiving డే గుర్తువుంటుంది కానీ మన independence డే పట్టిచ్చుకొనే పట్టిచ్చుకోరు,ఏదో ఒక రోజు సెలవు కోసమే ఈ హడావుడి అని అనిపిస్తుంది.అంతా మొక్కుబడి హడావుడి.

Aug 12, 2010
చుక్ చుక్ రైలు
మా బాబు కు రైలు అంటే బాగా ఇష్టం..రైల్లో వెళ్ళేప్పుడు అందరికి టాటా చెప్తూ ఉండేవాడు,ఇంక కంప్యూటర్ లో కూడా rhymes కాకుండా ట్రైన్ పెట్టమనేవాడు,వాడి గొడవ భరించలేక గూగుల్ లో వెతికి మరీ ఇండియన్ ట్రైన్స్ పెట్టేదాన్ని.బాగా ఎంజాయ్ చేసేవాడు,ఒక సినిమాలో బ్రహ్మానందం కు కూడా రైలు కూత వినిపిస్తేగాని ముద్ద దిగనట్టు మా వాడికి కూడా రైలు పెట్టందే ముద్ద ముట్టడు,,
ఈ ట్రైన్ మోత విని విని నాకు రైల్వే స్టేషన్ లో ఉన్నట్టు అనిపించేది.,ఆ ట్రైన్ లు వీడితో పాటు చూసి చూసి నాకు కూడా బోర్ కొట్టేసింది,సరే కదా ఒక సారి వేరే దేశాల్లోని రైళ్ళు చూద్దాం అని సింగపూర్ ట్రైన్స్ అని సెర్చ్ చేశా,భలే బాగున్నాయి మన ట్రైన్స్ తో compare చేస్తే,ఆటోమాటిక్ డోర్ సిస్టం..మరీ మన దేశం లో కూడా ఉన్నాయేమో ఎక్కడైనా నాకు తెలియదు.స్టాప్ రాగానే డోర్ ఓపెన్ అవుతోంది,డోర్ క్లోజ్ అవ్వగానే ట్రైన్ స్టార్ట్ అవుతోంది,ట్రైన్ announcement కూడా బాగుంది,వస్తోంది అని, వచ్చింది అని, తర్వాత వెళ్ళిపోయింది అని.ఇలా మనకు కూడా ఉంది అనుకోండి ట్రైన్ announcement మరి వేరే దేశం అంటే కొంచెం మన మనస్సు కు బాగా నప్పుతుంది కదా,పొరిగింటి పుల్లకూర రుచి కదా ,ఆలోచిస్తుంటే ఈ డోర్ సిస్టం కొంచెం బానే ఉంది కానీ మన ఉరులలో కుదరదేమో అనిపిస్తోంది,మనకసలే డోర్ దగ్గర నిలబడందే గాలి రాదాయే,మనలో చాలా మంది అంతే కదా ఎంట్రన్సు లో ఉన్న మెట్ల మీదే కూర్చుంటారు, ఎక్కేవాళ్ళకు అడ్డం గా ఉన్నా కుడా అక్కడే కూర్చుంటారు తట్ట బుట్ట తో..
అస్సలు ముఖ్యమైనది సమోసా,వేరుసెనగ కాయలు,popcorn వీళ్ళు రారు గా డోర్ సిస్టం ఉంటే,అస్సలు ట్రైన్ ఎక్కేది ఆ సమోసా తినటం కోసం ఏగా,మరీ అంతలా ఛి అనక్కర్లేదండి,,చిన్నప్పుడు అందరం తిన్నవాల్లమే,నాకైతే బాగా నచ్చుతుంది ట్రైన్ సమోసా ఇప్పుడు తినటం లేదనుకోండి,నేను కూడా ఏబ్బే అనే అంటున్నాను.ప్లాట్ఫారం కు ట్రైన్ కు మధ్య కొంచెం ఎక్కువనే ఖాలీ ఉంటుంది మనకు,(అదేనండి హడావుడి లో ఎక్కేప్పుడు మన చెప్పు జారి పడే అంత),సింగపూర్ ట్రైన్స్ కు ప్లాట్ఫారం కు అంత గ్యాప్ కనిపించలేదు నాకు,చెప్పు లుపారేసుకుని,ఇంట్లో వాళ్ల చేత తిట్టించుకునే పని ఉండదు వాళ్లకు హాయ్ గా,లోపల సిట్టింగ్ arrangement కూడా బాగుంది వెరైటీ గా బస్సు లో ఉన్నట్టు ఉంది. అటు ఇటు సీట్స్ మధ్యలో hangers నున్చున్నవాళ్ళు పట్టుకోటానికి,నాకైతే బాగా నచ్చాయి సింగపూర్ ట్రైన్స్,,,
అక్కడ వాళ్ళు ఎవైరనా ట్రైన్స్ గురించి బ్లాగ్ లో రాస్తే బాగుండు..చదవాలి అని ఉంది,,
ఆల్రెడీ ఎవరైనా రాసి ఉంటే నాకు లింక్ పంపించండి మీ బ్లాగ్ ది
చూడండీ ఈ కింద లింక్స్ మీరు కూడా,,
http://www.youtube.com/watch?v=x1Jz1XT3r3k

Aug 1, 2010
ఎట్లాగబ్బా
ఇవ్వాళ నాకు పిచ్చేక్కినంత పనయిందనుకోండి ఎందుకంటారా ఇవ్వాళ ఉదయం నుండి సాయంత్రం దాక నెట్ కనెక్షన్ పోయింది మాకు.నిన్ననే ఒక ఛానల్ లో న్యూస్ చూపించారు ఇంటర్నెట్ కు ఇంక 344 రోజులేటా ఎందకంటే ip అడ్రస్ ల లిమిట్ అయిపోవచ్చింది ట.400 కోట్ల నిడివి పెడ్తే అది దాదాపు అయిపోవచ్చింది ట.జీవితం ఆగిపోతుంది అని ఆ anchor వ్యాఖ్యానిస్తే మరీ అంతలా ఎందుకు అనిపిస్తుంది లే అని అనుకున్నాను,కానీ ఇవ్వాళ బాగా తెలిసింది.
బాగా అలవాటు పడిపోయాం ఈ ఇంటర్నెట్ కు,ఎవరెవరు బ్లాగులు రాసారా,న్యూస్ ఏంటా? ఎవరెవరు నా బ్లాగు ను చూసారా? ఏమి కామెంట్స్ ఇచ్చారా,మెయిల్స్ ఏమైనా వచ్చాయా ఇలాగ ఆలోచనలన్నీ నెట్ చుట్టుతా పరుగులు పెట్టాయి.కనీసం గంట లో ఒకసారైన మెయిల్ నో లేక బ్లాగుల update నో,ఫ్రెండ్స్ తో చాట్ నో,గ్రూప్ లలో మెసేజెస్ నో చూసే అలవాటు ఈ ప్రాణానికి.అలాంటిది అన్నీ బంద్ ఆంటే ఒక్కసారి ఉహించుకోటానికి కొంచెం కష్టం గానే అనిపిస్తుంది.మన సంగతి పక్కన పెట్టండి పెద్ద పెద్ద కంపెనీ లో అందునా మన software engineers పని అయితే అంతే ఇంక అస్సలే code గూగుల్ లో సెర్చ్ చేసి కాపీ పేస్టు లు చేస్తుంటారు ఇంక నెట్ లేకపోతె అందరి జాబులు గోవిందే,(అంటే జాబు చేసినప్పుడు నేను అంతే చేసేదాన్ని లెండి అందుకే అలా అన్నా,)బ్యాంకులు,రైళ్ళు అన్నీ సర్వీసెస్ ఆగిపోతా ఏమో ,అయినా దీనికి solution కనిపెడతారు లెండి మన వాళ్ళు..జస్ట్ ఒకసారి ఆలోచిస్తే భయం వేస్తుంది ఇంత అలవాటు ఇంత అవసరం పడిపోయాం నెట్ కు అని.
Jul 31, 2010
హ్యాపీ ఫ్రెండ్ షిప్ డే
పయనించే షిప్పే friendship రా అని ఒక పాట లో అన్నట్టు మన జీవిత ప్రయాణం లో ఫ్రెండ్ కూడా పడవలాంటి వాడే,,మంచి ఫ్రెండ్ ను సెలెక్ట్ చేసుకుంటే మన ప్రయాణం ఆనందం గా,ఎన్ని అటుపోటులు వచ్చిన ధైర్యం గా మనోబలం తో గమ్యాన్ని చేరుకుంటాము,అదే సర్వ అవలక్షణాలు ఉన్న ఫ్రెండ్ తో స్నేహం చేస్తే వాడికి ఉన్న అన్నీ దుర్గునాలు మనకు అలవడి మన జీవితం అధోగతి పాలు అవ్వాల్సిందే,సగం జీవితం అయిపోయాక అరె ఇలాగ అయిపోయామే అని పొరపాటు పడేకంటే ముందుగానే జాగ్రత్త పడటం చాలా మంచిది.ఆరు నెలలలో వాడు వీడు అవుతాడు అన్నట్టు మన సహచరుల లక్షణాలు,హావభావాలు మనకు తెలియకుండానే మనం అలవారుచుకున్టాము,ఎంతమందిని చూడటంలేదు ఫ్రెండ్స్ వల్లన చెడు అలవాట్లు లోనయినవాళ్ళను.మంచి గా మనలను encourage చేసి,మన పనులలో తప్పు ఒప్పులు చెప్తూ,సదా మనకు మంచి చేకూరాలని తలచే వారితో మన జీవితాంతం friendship చేయొచ్చు,అలాంటివాడు మన ఫ్రెండ్ అని చెప్పుకోటానికి కూడా మనకు ఎంతో ఆనందం గా ఉంటుంది,బాధ వచ్చిన మనతో పంచుకోవటానికి,సపోర్ట్ ఇవ్వడానికి ఒక ఫ్రెండ్ ఉన్నాడు అనుకుంటే ఎంతో హైగా అనిపిస్తుంది.అందరికి అలాంటి మంచి సన్నిహితులు ఉండాలి అని కోరుకుంటున్నాను.
HAPPY FRIENDSHIP DAY TO ALL
HAPPY FRIENDSHIP DAY TO ALL
Jul 30, 2010
నాలో సుపరిచితుడు
హా ఏంటి ఈ టైటిల్ అనుకున్నారా?? నిజమేనండి ఎందుకో మొన్న ఈ సినిమా చుస్తే అనిపించింది.నాకు కూడా ఇలాంటి multiple personality ఉందేమో అని.నాకేంటి గట్టిగ ఆలోచిస్తే అందరి లొనూ ఉంటుంది ఇలాంటి వేషాలు.ఎలాగంటారా వినండి చెప్తాను.
శుక్రవారాలు,పండగలు,వ్రతాలు వచ్చిన రోజుల్లో చక్కగా సాంప్రదాయం గా చీరెలు కట్టి,కాళ్ళకు పసుపు పూసుకుని,మడి వంట చేసుకుంటూ,స్తోత్రాలు చదువుతూ,పెద్ద కుంకుమ పెట్టుకుని రామం టైపు లో అమాయకం గా భక్తీ బావం తో ఉంటాను,,అదే శ్రీవారు ఏ బర్త్డే పార్టీ కో,imax లో సినిమా కో,ఇంకా మరి pub కో,disco కో వెళ్దాము అన్నారనుకోండి చెప్పేదేముంది,మెరుపు తీగ లాగా ఫాస్ట్ గా modern గా రెడీ అయ్యి ఏదో మనకు సూట్ అయ్యే వేషం లో ఏ గాగ్ర నో,చుడిదార్ నో,వర్క్ sarees నో ,jeans నో ఏదో మొత్తానికి ఫుల్ posh posh గా రెడీ అయ్యి remo లాగా తయారవుతం.అప్పటి దాక కాళ్ళకు పూసిన పసుపు కూడా శుభ్రం గా కడిగేస్తాం,పెద్ద బొట్టు తీసేసి ఏదో తలక్కు,చమక్కు బొట్టు పెట్టేస్తాం కనీ కనిపించకుండా,,చిన్న గొలుసు వేస్తాం మరేమి చేస్తాం jeans మీద బాగోదు కదా అలాంటివన్నీ,మరి కొంచెం modern లుక్ ఇవ్వాలి గా.
ఇంక అపరిచుతుడు ఎప్పుడూ వస్తాడా అస్సలు హీరో అనుకుంటున్నారా??? హహహ అదెప్పుడు ఉండేదేగా మనలో..మనకు ఎవరి మీద అయినా కోపం వచ్చిందనుకోండి వెంటనే మన గొంతు మారిపోతుంది గా,,కోపం నషాళానికి ఎక్కుతుంది,,అదే శ్రీవారి వలన కోపం వచ్చిందనుకోండి మరీ ఎక్కువ ప్రదర్సించలేము గా అందుకే నేను వేసే శిక్ష (మరీ పెద్ద మాట అయ్యింది కదా) స్వయం పాకం అదేనండి కుంభి పాకం లాగా.నాకు కోపం వచ్చింది అని ధైర్యం గా చెప్పలేము కదాభయం,ఏదో ఆలోచనలతో ఉండి వంట చేస్తానా కూరల్లో మర్చిపోయి రెండు సార్లు ఉప్పు వేస్తాను ఇంకేముంది,మరీ కోపం వస్తే కొంచెం కారం వేద్దాం అనుకుంటూనే ఎక్కువ పడిపోతుంది,అందుకే ఎప్పుడైనా కూరల్లో కారం ఎక్కువైతే అంటారు ఇవ్వాలేమి అనలేదే నిన్ను.మంట గా ఉందేటి కూర అని,మరీ సినిమాల్లో హీరో కాబట్టి అన్నీ శిక్షలు వేసేస్తాడు కోపం వస్తే.మనం మాములు మనుషులం కదా మరి మనం చేయలేం గా అవి,గరిటెల దడ దడ ఇంకొక శిక్ష,అదేనండి శుల దండన లాగా. ఎం చేస్తాం కోపం వచ్చినప్పుడు ఇంట్లో గిన్నెలన్నీ దబ దబ వాటంతట అవే పడిపోతుంటాయి,కావాలని పడేయకపోయినా కొంచెం సౌండ్ వచ్చేట్టు గట్టిగ పెడ్తామాయే,సౌండ్ కన్నా తెలుస్తుంది గా మనం hurt అయ్యామని,,గబక్కున పింగాణి కప్పు పగిలిపోయిందే అనుకోండి అయ్యో మళ్లీ అపరిచుతుడు కాస్త తుస్స్ మని వెళ్ళిపోయి మాములు మనిషి అయిపోయోతాను.ఇంకా నయం కదండీ నేను ఆయన మీద విసేరవేయటం లేదు,,కాస్త నయమే,
అపరిచుతుడు కాసేపు అలా వచ్చి ఇలా వెళ్ళిపోతూ ఉంటాడులెండి,ఎక్కువసేపేమి ఉండదు,అప్పుడప్పుడు ఈ మూడు వేషాలలో మారుతూ ఉంటాను
అందుకే నాకు ఆ సినిమా చుస్తే ఏముంది మామూలే కదా అని అనిపిస్తుంది,కాకపోతే మరీ శిక్షలు ఎక్కువ వేస్తుంటాడు అంతే.అందులో హీరో కు పాపం తను ఇలా మారుతున్నాడని తెలియదు కాబట్టి అపరిచుతుడు అయ్యాడు.నాకు తెలుసు గా నేను మారే పాత్రలు. అందుకే నేను సుపరిచితుడు..

Jul 28, 2010
నా చేతి పాకం
మొన్న మా కజిన్ భోజనం చేస్తూ నీ చేతి వంట భలే బాగుంది,పెళ్లి కి ముందే వంట బాగాచేసేదానివా అని అడిగింది,మా వారు కూడా మా ఆవిడ వంట బాగా చేస్తుంది అని ఈ మధ్య బాగా బిరుదులు ఇచ్చేస్తున్నారు,ఇంక అలా మాటల్లో టాపిక్ వచ్చి పెళ్లి అయినాక నువ్వు మొట్టమొదట గా చేసి పెట్టిన వంట ఏంటి అని అడిగింది.అడిగిన క్షణమే ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ కు వెళ్ళిపోయా
ఒక్క క్షణం నా ఆలోచనలను వెనక్కు మళ్ళించా,
పెళ్లి అయినాక ఇల్లు వెత్తుక్కుని మేము చేరేటప్పటికి ఒక మూడు నెలలు గడిచింది.అప్పటిదాకా బంధువుల ఇంటిలో ఉండేటప్పటికి వంట చేయాల్సిన అవసరం రాలేదు.ఏముంది వంట అంటే ఇంతేనా అని అనుకునేదాన్ని,ఈ మాత్రం చేయలేమా అనిపించేది.అస్సలు బాధలు మనం వంట చేసే టప్పుడే ఉంటుంది అని తర్వాత తెలిసింది.
ఇంట్లో చేరిన ఒక రెండురోజులు బయట తిన్నాం భోజనం.అన్నీ సరుకులు తేవటానికి కాస్త టైం పట్టింది. పైగా కొంచెం కొత్త కదా ఎందుకులే ఇబ్బంది పెట్టటం అని మా వారు అలా ప్లాన్ చేసారు.ఇవ్వాళ నేను ఇంట్లోనే చేస్తాను మీకు ఏమి ఇష్టం చెప్పండి వండుతాను అన్నాను ఆయన తో ప్రేమగా,"నాకు అన్నీ ఇష్టమే,అన్నీ కూరలు తింటాను,నీకు ఏది ఇష్టం బాగా అని నన్నే అడిగారు" అబ్బో నాకే ఫస్ట్ preference ఇచ్చారు అని ఎంతో మురిసిపోయా.నాకు బాగా ఇష్టం అయింది అంటే వండటం కూడా కాస్తో కూస్తో వచ్చి ఉంటుంది లే అని ఆయన అభిప్రాయం అని నాకు తర్వాత అర్ధం అయింది.నాకు బెండకాయ కూర ఇష్టం అది చేస్తాను అని చెప్పా.సరే బెండకాయ Fry చెయ్యి అన్నారు,ఎంతసేపులే అని వంట ఇంట్లోకి ఉత్సాహం గా ఉల్లాసం గా బయలుదేరా,
అలసట తెలియకుండా ఉంటుంది వంట చేసేటప్పుడు అని మా వారు ఎంతో ప్రేమగా radio కూడా పెట్టారు,
సరే ముందు శుచి గా శుభ్రం గా చేయాలి అని బెండకాయలు అన్నిటిని నీళ్ళల్లో వేసాను,మా వారు అడిగారు అప్పటికి అదేంటి నీళ్ళల్లో ఎందుకు, తుడువులే మురికి ఏమి ఉండదు కదా అని.నాకేం తెలుసు బాగా శుభ్రం అవుతుయిలెండి అని గిన్నెడు నీళ్ళల్లో వేసా,సరే ఒక్కక్కోటి తీసి కట్ చేయటం మొదలు పెట్టా,చాకు కు అంటుకుని బంకలు సాగుతోంది జిగురు,సరే పోతుందిలే అనుకున్నాను.Fry చేద్దామనుకుని కూడా ఎందుకు హెల్త్ కు మంచిది కాదు చక్కగా కుర లా చేద్దాం అని తిరగమాత వేసి ముక్కలుపెట్టి ముత పెట్టాను,కొంచెం సేపు అయ్యాక చుస్తే మొత్తం జిగురు జిగురు గా ఉంది,
కొంచెం టెన్షన్ వేసింది అరె ఇదేంటి ఇలాగ ఉంది అని,సరే కొంచెం పాలో,పెరుగో వేస్తారు కదా అని సందిగ్దం లో పడి పాలు పోసి కలియపెట్టి ముతా పెట్టా.
మా వారు ఫోన్ చేసి అందరికి చెప్పారు మా ఆవిడ వంట చేస్తోంది ఇవ్వాళ అని,ఎంతో eager గా వెయిట్ చేస్తున్నారు నా వంట కోసం.
చివరికి అయింది అనిపించాను కూర,పప్పు చేశాను,,,
భోజనాల సమయం లో కంచం లో వడ్డించాను పప్పు,కూర,అన్నం.అన్నం తిందురు రండి అని పిలిచాను కొంచెం భయం భయం గా.అస్సలే మా వారికి వంట వచ్చు.వంట వచ్చిన మగవాళ్ళతో మహా ఇబ్బందే.వంకలు మహా బాగా పెడతారు.మా వారు మంచి ఆకలి తో వచ్చారు.కూర కలుపుదాం అని కూర లో చేయి పెట్టారు అంతే టీవీ లో అప్పుడే ad వస్తోంది జోరసే లాగో హైస జోరసే లాగో హైస,.ఏ బంధన్ టుటెగా నహి అని ఫెవికాల్ ad వస్తోంది,దాని కి తగ్గట్టే ఆయన చేతి నుండి ఆ బెండ కాయ జిగురు వదలటం లేదు.
ఏమి అనలేక పాపం కళ్ళుమూసుకుని తినేసారు,తర్వాత చెప్పారు ఎలా చేయాలో కూర,
దాదాపు వంటలు అన్నీ ఆయనే నేర్పారు,మనం పెరిగినప్పటి నుండి చదువులతో సమయం గడిచి పోతుంది. హాస్టల్ లో ఉండటం,సో వంట చేసే తీరిక ఏది,పైగా ఇంట్లో మడి వంటలు,మహా నైవేద్యాలు,ఇంక మనకు చేసే ఛాన్స్ ఏది,
ఎట్లాగో ఇప్పటికి కాస్త ది బెస్ట్ అనిపించుకో డానికి మూడేళ్ళు పట్టిందనుకోండి,
ఇప్పటికి బెండకాయ కుర అంటే మాకు ఆ కూర గుర్తువచ్చి నవ్వుకుంటాం, అన్నం తినేటప్పుడు టీవీ అయితే అస్సలు పెట్టవద్దు అంటాను మళ్లీ ఆ ad వస్తుందేమో అని భయం వేసి.

Jul 22, 2010
మనోవేదన
"అమ్మా" అనే పిలుపు వినిపించేసరికి ఒక్కసారి ఉలిక్కి పడి చూసింది వందన.తన చుట్టూ ఎవ్వరు లేరు ఏదో ఆలాపన అని అనుకొని తన పని లో నిమగ్నం అయ్యింది.మళ్లీ అమ్మా అనే పిలుపు వినిపించి ఎవ్వరు అది అని పిలిచింది కంగారుగా,,నేనమ్మా నీ బొజ్జలో ఉన్న పాపాయినమ్మ అని ముద్దు ముద్దు మాటలతో పలికింది ఒక స్వరం.వందన అప్పటికే తొమ్మిదవ నెల గర్భవతి.డాక్టర్ వారం లో ఆపరేషన్ చేయటానికి డేట్ ఫిక్స్ చేసింది.
తన పాప తనతో మాట్లాడుతోంది అని ఒకింత సంబ్రమాశ్చర్యాలకు లోనయింది వందన.తను అప్పుడప్పుడు అలాగే తన పాప తో మాట్లాడుతూ ఉంటుంది.అలాంటిది పాప తనతో మాట్లాడేటప్పటికి ఆనందం పట్టలేకపోయింది.
"నా బంగారు తల్లి నా,ఏంటమ్మా ఇంకా బజ్జోలేదా" అని అనునయం గా అడిగింది వందన."లేదమ్మా ఎందుకో భయం గా ఉంది,నిద్ర రావటం లేదు,బాధ గా ఉంది"అది ఆ పసి హృదయం."నీకు బాధలేంటి అమ్మా,హాయ్ గా నిద్ర పో"అని లాలించింది వందన."కాదమ్మా ఇంక నేను ఒక వారం లో వచ్చేస్తా కదా అందుకే దిగులు గా ఉంది"అన్నది పాప."బాధ ఎందుకమ్మా నేను ఉన్నాను కదా,నీకు ఏలోటూ రానివ్వను,అన్నీ కొనిపిస్తాను,నా కంటి రెప్ప లా చూసుకుంటాను" అని తన ప్రేమనంతా కూడకట్టుకుని మాటల్లో చెప్పింది."అడిగినవన్నీ కొనిస్తావమ్మా నువ్వు నాకు తెలుసు కానీ నువ్వే ఉండవు కదా నాతొ ఆడుకోవటానికి,నీ వొళ్ళో కూర్చోపెట్టుకుని జోకొట్ట టానికి" అని బాధ గా అంది పాప,అదేంటమ్మ అలాంటావ్,నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్తాను అని ధైర్యం చెప్పింది వందన."నిన్ననే కదా అమ్మా నువ్వు అన్నావ్ ఇంక మూడు నెలలే ఉంది నా లీవ్. తర్వాత కేర్ సెంటర్ లో చేర్చుదాం అని,ఆ కేర్ సెంటర్ ఆంటీ ని కూడా కలిసావ్ కదా అమ్మా,ఎన్ని వేలయిన పర్వాలేదు మంచి దానిలో చేర్చుదాం అన్నావ్ కదమ్మా,అక్కడ ఉన్న పిల్లలందరి లొనూ నవ్వే లేదు,అందరూ భయం భయం గా ఉన్నారు,అమ్మ కావాలి అని ఏడుస్తున్నారు.కొట్టి మరి తినిపిస్తోంది అమ్మా ఆయా అన్నం ఒక బాబు కు,చక్కగా అమ్మ చేతి గోరుముద్దలు తినాలి అని ఉంటుందమ్మ నాకు,నాకే కాదు నాలాంటి పిల్లలందరికీ ఉంటుంది. కాసేపన్నా అమ్మవొడిలో కూర్చోవాలి అని,ఆ వెచ్చదనం ను ఆస్వాదించాలి అని అనిపిస్తున్దమ్మ నాకు.ఉదయం నుండి సాయంత్రం దాక జైల్లో ఉన్నట్లు ఉంటుంది.రాత్రి కి ఎప్పటికో వాస్తావ్ నాకేమో నిద్ర వచ్చేస్తుంది.నీతో ఆడెదెప్పుడు,నా చిలిపి చేష్టలను ,నా ప్రతికదలికను నువ్వు చూసి ఆనందించేదేప్పుడు ,నన్ను స్వేచ్చగా నీ కడుపు లో కూడా ఉండనియట్లేదు నువ్వు నేను ఎప్పుడు రావాలో కూడా నువ్వే మంచి రోజు నిర్నయించేసావు,,ఇదెక్కడి న్యాయం అమ్మా,ఇదివరకు బయటి ప్రపంచం చూడాలి అని ఉవ్విళ్ళూరే వాళ్ళు ట కడుపులో పాపాయిలు,కానీ ఇప్పుడు నాకు రావాలి అంటేనే భయం వేస్తోందమ్మ" అంటూ కళ్ళనీళ్ళు పెట్టుకుని బోరున ఏడ్చింది చిట్టి తల్లి,,,
గబక్కున మెలకువ వచ్చింది వందన కు.చుట్టూ చుస్తే ఎవరు లేరు,వందన భర్త ఇంక నిద్రలోనే ఉన్నాడు,అయితే ఇప్పటి దాక తను పాప తో మాట్లాడిందంతా కలలో కాబోలు అని అనుకున్నది,,ఏంటి అంత కంగారు గా లేచావ్ అంటూ లేచాడు వందన భర్త,"ఏమి లేదండి,నేను ఒక ఏడాది అన్న నా లీవ్ ని extension చేస్తాను,ఈ జాబు కాకపోతే నాకు వేరే జాబు వస్తుంది, పాప కు నేను కాకబోతే ఎవరు చూస్తారు,నాకు ఆ creche నచ్చలేదు.పాపను స్వేచ్చగా,నా కళ్ళ ఎదురుగానే పెంచుకుంటాను,దాని ప్రతి అడుగు నేను ఎంజాయ్ చేయాలి,నా పాప ను నేనే కన్నుల్లో పెట్టుకుని చూసుకోవాలి"అని ఉద్వేగ భరితమయి కళ్ళ నీళ్ళతో భర్త ను అడిగింది వందన,"అలాగే అలాగే చేద్దాం లే దానికోసం ఎందుకు కంగారు పడుతున్నావ్,నీకు ఇష్టం అయినప్పుడే జాబు లో చేరుదువు గాని" అని భరోసా ఇచ్చాడు భర్త.ఇంక ఏ దిగులు లేదులే హాయ్ గా బజ్జో అని మనసులో అనుకుని పొట్ట మీద చేయి వేసుకుని నిశ్చింత గా నిద్రపోయింది వందన.
ఉద్యోగం చేసే ప్రతి మహిళ కు ఉండే బాధే ఇది,కానీ ఒక్క ఏడాది లీవ్ తీసుకున్నంత మాత్రానా మనం ఏమి కెరీర్ లో నష్ట పోము కదా,పిల్లలా మానసిక ఎదుగుదల చక్కగా ఉంటుంది తల్లి దగ్గర పెరిగితే,,నేను కూడా ముందు ఎక్కడో ఒక చోట పెడదాం లే బాబు ను అనుకున్నాను,కుదరక నేనే జాబు మానేసాను,,మళ్లీ ట్రై చేయొచ్చు,కానీ ఈ మధ్యనే తెలుస్తోంది అమ్మ ఎంత important నో first one year చైల్డ్ growth కు.

Jul 21, 2010
విచిత్రం
ఇవ్వాళ తొలిఎకాదసి కదా అంటే ఇవ్వాళ నుండి మనకు తెలుగు క్యాలెండరు ప్రకారం పండగలు మొదలు అవుతాయి అని అనుకొని పాత నెలల లో ఏమి లేవా పండుగలు చూద్దాం అని తిరగేసా క్యాలెండరు ను ,,,ఇప్పటిదాకా మనం observe చేయని విషయం ఒకటి వచ్చింది ఈ నెల చూడండీ
4 saturydays
4 sundays
4 mondays
4 tuesdays
4 wednesday
4 thursdays
4 fridays
ఉన్నాయి,,ఇప్పటిదాకా ఏ నెలలోనూ ఇలా రాలేదు ,,,,భలే విచిత్రం గా ఉంది కదా..

Jul 20, 2010
Wrong address
ఒక అతను ఆఫీసు పని మీద వేరే ఊరు వెళ్లి ఒక హోటల్ రూం లో దిగాడు.రూం లో కంప్యూటర్ ఉండేటప్పటికి క్షేమం గా చేరాను ఇక్కడికి అని మెయిల్ ఇద్దాము wife కు అని మెయిల్ టైపు చేసాడు..పొరపాటున మెయిల్ id తప్పు టైపు చెయ్యటం జరిగింది.అది చూసుకోకుండా అతను మెయిల్ పంపించేసాడు.
వేరే దేశం లో ఉన్న ఒక మహిళ తన భర్త మరణించితే funeral కు అటెండ్ అయ్యి వచ్చింది.కొన్ని రోజులు అయింది కదా మెయిల్స్ ఓపెన్ చేసి బంధువులు ఏమైనా మెసేజ్ ఇచ్చారేమో అని మెయిల్స్ ఓపెన్ చేసింది.
మొట్ట మొదట ఉన్న మెయిల్ ను చూసి షాక్ అయ్యి కింద పడిపోయి స్పృహ కోల్పోయింది,,,ఇంతలో ఆమె కొడుకు వచ్చి ఏమయింది అని చుస్తే కంప్యూటర్ లో మెయిల్ కనిపిస్తోంది...ఏంటి అది అని చూసాడు...ఆ మెయిల్ ఏంటి అంటే...
To: My Loving Wife
Subject: I've Reached
I know you're surprised to hear from me. They gave computers here, and we are allowed to send e-mails to loved ones.
I've just reached and have been checked in.
I see that everything has been prepared for your arrival tomorrow.
Looking forward to seeing you TOMORROW!
Bye Bye

Jul 15, 2010
New Ads
Boy - "I am a PB boy"
Girl - "I am a PB gal"
Girl - "I am a PB gal"
"Badte bacho ke liye complete software -Powerbuilder "
" Software ki raksha karta hein Norton Anti virus.... Software hai jaha, Norton Antivirus hein vaha..."
Progect Manager - "Power objects is the secret of my programs"
Programmers - "Our programs"
Programmers - "Our programs"
Husband - Thak gaya hoon mein
Wife gives him instant coffee and says
To create instant miracle....Use Oracle !
It takes 15 trees to produce the amount of paper that we use to write our exam once (excluding supplementary). Join us in promoting the noble cause of saving trees.
Say NO to EXAMS
Say NO to EXAMS
ahh what an "idea " Sir ji ...
Jul 12, 2010
అనుబంధాలు
"ఛీ ఛీ..వెధవ ప్రయాణం..అమెరికా నుండి ఇండియా కు ఏమీ శ్రమ లేకుండానే వచ్చాం కానీ ఇక్కడనుండి పక్కన ఉన్న విజయవాడ కు వెళ్ళినందుకు ఒళ్ళు హూనం అయిపొయింది," అని ఇంటి లోపలకు వస్తూనే ప్రకాశం చిందులు తొక్కాడు,,ఏమైంది రా అంత విసుగ్గా ఉన్నావ్,,దర్సనం బాగా జరగలేదా అని తండ్రి అడిగాడు,,"ఒకటనేమిటి లే అన్నీ అన్ని గా నే ఉన్నాయి.ఈ రోడ్లు ఎంత గుంటలు పడిపోయి ఉన్నాయి,,మన గవర్నమెంట్ వాళ్ళకు ఏమి కనపడవా?" అని.కాస్త మెయిన్ రోడ్ వరకు కొంచెం ఇబ్బంది తర్వాత హై వే వేసారు కదరా రూట్ బానే ఉంటుందే..అని సర్ది చెప్పపోయాడు తండ్రి పరంధామయ్య.,"ఆ కొంచెం లో కొంచెం నయం లే,,అయినా ఒక్కళ్ళు కూడా ట్రాఫ్ఫిక్ సెన్స్ పాటించరు,,ఆ సిగ్నళ్ళు కూడా పని చేయవు,అందుకే ఆన్ని ప్రమాదాలు మన దేశం లో,ఈ కాస్త ప్రయానానికే పిల్లలు ఎలా హైరానా పడ్డారో చూడండీ " అని చిర్రు బుర్రు లాడాడు ప్రకాశం తన పదిహేనేళ్ళ పిల్లలను చూపించి.."ఇంత చిన్న దానికే అలా హైరానా పడితే ఎలారా,,అయినా మీరు వెళ్ళింది కారు లోనే కదా.బస్స్ లో ఏమి కాదు కదా??" అని చిరుకోపం గా అన్నాడు పరంధామయ్య.
(ప్రకాశం గత పదేళ్లుగా అమెరికా లోనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా ఉద్యోగం చేస్తున్నాడు,,పిల్లలు అక్కడే చదువుకుంటున్నారు,,తల్లిదండ్రు లు ను చూద్దాం అని ఒక నెల సెలవు పెట్టి సొంత ఊరు కు వచ్చాడు,,వాళ్ళది విజయవాడ కు దగ్గర లోని పల్లెటూరు..)
తండ్రీ కొడుకులు కలిసి దేశాన్నేమీ ఉద్దరించక్కర్లేదు కానీ, అన్నం వడ్డించాను రండి అని లోపల నుండి పిలిచింది ప్రకాశం తల్లి పార్వతమ్మ.
గ్లాస్సు లో ఉన్న మంచినీళ్ళను చూసి "ఛి dirty water ,,i dont want this " అని అన్నది ప్రకాశం చిన్న కూతురు..అమ్మా రేపటినుండి మినెరల్ వాటర్ తెప్పించండి...మీరు కూడా ఇలాంటి నీళ్ళే తాగుతున్నారా? ఆరోగ్యం పాడవుతుంది,,చూడండీ ఎలా ఉన్నాయో" అని అసహ్యం గా మొహం పెట్టి అన్నాడు ప్రకాశం..పార్వతమ్మ మొహం చిన్నబుచ్చుకుంది..వెంటనే పరంధామయ్య అందుకుని"నువ్వు చిన్నప్పుడంతా తాగింది ఈ నీళ్ళే కదరా,,ఇప్పుడు ఉళ్లో ఉన్న వాళ్ళు అందరూ కూడా ఇవే గా తాగేది,కొత్తగా చెప్తున్నావ్" అని మందలించారు.ఇంక మరుసటి నుండి కొడుకు బాధ భరించ లేక mineral water తెప్పించ సాగాడు పరంధామయ్య.
ఇలాగె ఇబ్బందులతో కొన్ని రోజులు గడిచినాయి.
సుమ్మెర్ కావున ఎండలు బాగా ఉన్నాయి..లోపల పడుకోలేక ఒక రోజు ఆరుబయట మంచాలు వేసుకొని పడుకున్నారు ప్రకాశం ఫ్యామిలీ.పరంధామయ్య గారు,పార్వతమ్మ ఎప్పుడూ చెట్ల కిందే ఆరుబయట వసారా లో పడుకుంటారు చల్లని గాలి కోసం,వాళ్ళు ఈ ఫ్యాన్ గాలిలో ఇమడలేక..తెల్లారి లేచేసరికి ప్రకాశం కూతురి వొంటి నిండా దద్దుర్లు వచ్చేసాయి,రాత్రి బయట పడుకున్నందుకు దోమలు బాగా కుట్టేసాయి,"అందుకే మేము రాము మీరు ఒక్కరే వెళ్లి రమ్మంటే నా మాట విన్నారు కాదు చూడండీ ఏమయిందో అని" ఇంగ్లీష్ లో ప్రకాశం మీద మండిపడుతోంది ప్రకాశం భార్య..ప్రకాశం ఏమి చేయాలో తెలియక తండ్రి మీద ఎగిరాడు" చూడండీ ఏమయిందో,,అప్పుడప్పుడు ఎంతో కొంత డబ్బు పంపిస్తూనే ఉన్నాగా ఒక AC అన్నా కొనలేకపోయారా??ఈ దోమలు,ఈగలు ఏంటి మనతో పాటే మనుషులు లాగా తిరుగుతున్నాయి పగలు రాత్రి,,అస్సలు శుభ్రం ఉండదు,,అందుకే నాకు ఇండియా రావాలి అంటే ఇష్టం ఉండదు,,ఏమీ సౌకర్యాలు ఉండవు,,మీరేమో ఊరికే రండి రండి అంటారు,,ఇంక మళ్లీ ఒక పదేళ్ళ వరకు రమ్మనకండి.."అని విరుచుకుపడ్డాడు,,
పాపం పరంధామయ్య,పార్వతమ్మ లు బాగా బాధపడ్డారు,అయ్యో మనమేకదా వాళ్ళని రమ్మన్నది అని.
భారం గా రోజులు గడిచాయి ప్రకాశం కు..
వెళ్ళాల్సిన రోజు రానే వచ్చింది..
"నాన్న మీరు మమ్మల్ని రమ్మని ఫోన్ చేసిన ప్రతిసారి రమ్మని చెప్పేవారు.నాకు కూడా మిమ్మల్ని చూడాలనే ఉంటుంది..కానీ దగ్గర ఊళ్లు కాదు కదా ఊరికే వచ్చిపోవటానికి,,,అయినా వచ్చాక ఇన్ని ఇబ్బందుల తో మేము ఇక్కడ ఇమడలేము,,మేము వచ్చి ఇబ్బంది పడి దాన్ని చూసి మీరు బాధ పడి,ఎందుకు నాన్నా ఇవన్నీ,,హాయ్ గా ఫోన్ లోనే మాట్లాడుకుందాము,మీరే రావటానికి ఏర్పాట్లు చేస్తాను ఈ సారి,అప్పుడు ఎవ్వరికి ఇబ్బంది ఉండదు,అక్కడ జీవితానికి అలవాటు పడిపోయాము మేము ఇక్కడ ఉండాలి అంటే కొంచెం ఇబ్బందే అవుతుంది,సారీ నాన్నా " అని తను చెప్పదలుచుక్కన్న నాలుగు ముక్కలు చెప్పేసాడు ప్రకాశం.
ఈ మాటలకు బాధపడి పరంధామయ్య "నిజమే రా,,మేము నీ చిన్నప్పుడు ఎన్నో కష్టాలు,చిన్న చిన్న కోరికలు కూడా కాదనుకుని నీకు అడిగినవి అన్నీ కొనిచ్చాము,ఆ బాధలు కూడా ఎంతో ఆనందిచాము,ఎందుకంటే నా కొడుకు కోసం అని అనిపించేది,,ఇప్పుడు ముసలివారము అయిపోయిన మాకోసం ఒక్క నెల కష్టాని ఒర్చుకోలేకపోతున్నవా?? చిన్నప్పటినుండి పిల్లలకు తాతయ్య,నానమ్మ అని అప్పుడప్పుడు అన్నా మా గురించి బాగా చెప్తేనే వాళ్ళకు మా మీద అభిమానం,ప్రేమ కలుగుతాయి,ఇక్కడ ఉన్న నెల రోజులలో ఏ నాడు వాళ్ళు తాతా ఆని ఆప్యాం గా మా దగ్గరికి వచ్చింది లేదు,మనం చెప్పే దాన్ని బట్టే మన పిల్లల నడవడిక ఉంటుంది,మన వాళ్ల కోసం అంటే కొంచెం కష్టాన్నైనా ఇష్టం గా భావిస్తాము,పోనిలే బాబు మీరు రావద్దులే ఇక్కడకు,వచ్చి ఇబ్బంది పడటం ఎందుకులే,ఈ శేషజీవితం ఇక్కడే ఇలాగే గడిపేస్తాం,ఇక్కడ అంతా మాకు అలవాటు అయినదే కదా,మాకు ఇంతే ప్రాప్తం అనుకుంటాం,,"అని బాధాతప్త హృదయాలతో వీడ్కోలు పలికారు,.
-----------------------------------------------------------------------------------------------------------------------------
మన నిజ జీవితం లో ఇలాగా చాలా మందినే చూస్తూ ఉంటాము,అక్కడ అలవాట్లకు అలవాటు పడి ఇక్కడ adjust కాలేక నిజం గానే చాలా బాధ పడుతుంటారు,అంత దాక ఎందుకు మనమే ఈ నగర జీవితానికి అలవాటు పడి ఒక్క నాలుగు రోజులు పల్లెల్లో అది కూడా మనం పుట్టి పెరిగిన మన పల్లెటూరు లో ఉండాలి అంటేనే adjust కాలేకపోతున్నాము,మన వాళ్ళే వాళ్ళు అని అనుబంధం పెంచుకుంటే ఎంతటి కష్టాన్నైనా ఇష్టం గా భావించవచ్చు,,పెద్దవాళ్ళు కొంచెం అర్ధం చేసుకోవాలి,చిన్న వాళ్ళు కూడా కొంచెం adjust అవ్వాలి పరిస్థితులకు అపుడే బంధాలు అనుబంధాలు కలకాలం నిలుస్తాయి.
(ప్రకాశం గత పదేళ్లుగా అమెరికా లోనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా ఉద్యోగం చేస్తున్నాడు,,పిల్లలు అక్కడే చదువుకుంటున్నారు,,తల్లిదండ్రు

Jul 8, 2010
చిరుజల్లులు
ఇవ్వాళ ఉదయం నుండి సన్నగా వాన పడుతూనే ఉన్నది.ఇలాగ చిరుజల్లులతో పడే వాన లో తడవటం భలే సరదాగా ఉంటుంది.
మా చిన్నప్పుడు మా ఎదురింటి అంకుల్ వాన పడ్తుంటే చక్కగా చిన్న తువ్వాలు వొంటికి చుట్టుకుని చిన్న బెంచ్ తెచ్చుకుని హాయ్ గ వాన లో వేసుకుని కూర్చునేవారు, వాన నీరు చాలా స్వచ్చమైన నీరు.ఏమి జలుబులు చేయవులే సరదాగా మీరు రండి అని పిలిచేవారు,,మాకు కూడా అలాగా వాన లో తడవాలి అనిపించేది.కానీ మా అమ్మపడనిస్తే గా.
వాన తడికి మట్టి నేల అంతా తడిసి ఒక రకమైన కమ్మని వాసన వచ్చేది.
వానలో వెళ్తే జలుబోస్తుంది,జ్వరం వస్తుంది,బడి ఎగ్గొట్టటానికి ఇది ఒక వంక అని నాలుగు గదిమి లోపల కుర్చోమనేది అమ్మ.
ఎప్పుడైనా బడి నుండి ఇంటికి వెళ్ళేటప్పుడు వాన పడితే ఆ పుస్తకాలను నెత్తి మీద పెట్టుకుని పరుగులు పెట్టేవాళ్ళం,పుస్తకాలు తడవకుండా వాటి మీద అట్ట (righting pad) ను పెట్టేవాళ్ళం.
వేడి వేడి మొక్కజొన్న పొత్తులు తింటూ,వాన నేలల్లో చిందులు వేసుకుంటూ సరదాగా ఇంటికి వెళ్ళేవాళ్ళం.
అలాంటివి అన్ని తలుచుకుంటే మళ్లీ అలాంటి రోజులు వస్తే బాగుండు అనిపిస్తుంది,అవన్నీ బాల్యం లోని మధుర స్మృతులు.

Jul 7, 2010
నా బ్లాగు కధ
"బ్లాగు అంటే " ఏమిటి అస్సలు.అందరూ బ్లాగులు రాసేస్తున్నారు అని అనుకున్నాను.నీకు కూడా "మంచి కాలక్షేపం" అవుతుంది "ఆలోచించండి" అని "మా వరలక్ష్మి" నా "పుట్టిన రోజు " నాడు మంచి "Idea " ఇచ్చింది. "అనుకోకుండా కొన్ని రోజులు" తర్వాత "గురుభ్య్యోన్నమః " అని మనసులో నే మా గురువు గారిని నమస్కరించుకొని "నా అందమైన ప్రపంచం" అనే నా బ్లాగు కు శ్రీకారం చుట్టాను.
మన సంస్కృతి గురించి తెలియచెప్పే "పండగల విశేషాలు",నేను తీసిన "అందమైన ఫోటోలు",నేను రాసిన "కవిత"లు,"ఉత్తమ ఇల్లాలు" కు ఉండవలసిన లక్షణాలు ఇలా అన్ని రకాలు గా కొన్ని "తమాషా" గా,కొన్ని ఉపయోగకరమైనవి గా,కొన్ని "మనోభావాలు" పంచుకునేవి గా ఇలాగ రాద్దాం అని నిర్ణయించుకున్నాను.
మొదట్లో కొంత "మానసిక సంఘర్షణ" పడ్డాను.ఎంతో మంది "Great People " రాసే బ్లాగులు ఆదరిస్తారు కానీ నాది ఎవరు చదువుతారు అని..కానీ ఈ "కలికాలం" లో కూడా అలాంటి "అడ్డుగోడలు" ఏమీ లేవని మన బ్లాగు members ఈ బ్లాగు లోకం లోకి నాకు "తియ్యని ఆహ్వానం" పలికారు.
ఇంతలో ఒక నెల గడిచింది."నెల బ్లాగు" కు "కొత్త హంగులు" చేద్దాం అని మెయిన్ ఫోటో ఉంది కదా దానికి "ఫోటో సవరణ" చేసాను.నా "బ్లాగు రిపోర్ట్" బాగుంది అని మన నేస్తాలు "అక్షారాల బహుమతి" కానుక గ ఇచ్చారు..
అలా కొంత కాలం గడిచింది.
ఇంతలో "దసరాసెలవలోచ్చ్".."బస్స్ కస్సుబుస్సు" ఎక్కి "మా ఊరు" వెళ్ళాను,,బ్లాగు రాయటం మొదలు పెట్టాక "నా రాతలు-గీతలు" బాగా మెరుగుపడ్డాయి.."అమ్మ ప్రేమ" కు బహుమానం గా అమ్మ మీద నేను రాసిన "నా కపిత్వం" ను "అమ్మ కు పుట్టినరోజు శుభాకాంక్షలు" గా వినిపించాను,,,
మేము అక్కడ ఉన్నప్పుడే "లైలా తుఫాను" ట తుఫాను వచ్చింది,,,వాన వస్తే ముందు గానే మనకు రోగాలు పొంచి ఉంటాయి గదా,అందుకని ఈ "Flue affect" కు భయపడి మా "మగధీర" ను తీసుకుని అదేనండి మా బాబు ను తీసుకుని "పండగ హడావుడి" ముగియకుండానే బస్సేక్కేసాను..
కాలం ఇంకా వేగం గా పరుగులుపెట్టింది...
"summer లో సరదాగా" గడపవచ్చని మా చుట్టాలందరూ బిల బిల మంటూ మా ఇంటికి "వచ్చేశారు...వచ్చేశారు",,సరే అందరమూ ఉన్నాం కదా అని "హైదరాబాద్ అందాలు" అన్నీ చూసాము..ఎన్నాళ్టికి కుదిరిందో.
,,, కాలం ఇంకా ముందుకు పోతోంది,,,
సడన్ గా నాకు ఒక thought వచ్చింది,అదీ ఈ మధ్యనే.బ్లాగులో ఎక్కువ posts రాసి "Guiness రికార్డ్స్ లో మన తెలుగు వారు" ఎవరైనా ఉన్నారా అని వెతికాను ,,తెలుగు వారు కాదు కదా అస్సలు ఎవరు లేరు,,,"నిన్న లేదు నేడు లేదు",,సో ఇక ముందు మనం ట్రై చేయొచ్చు కదా అని అనిపించింది,,వాళ్ళు కనక వోటింగ్ పెడ్తే నాకే మీ "vote plz ",,
ఇది నా "విజ్ఞప్తి" మీ అందరికి.,,అలా జరిగితే కనుక ఈ నా "జీవితం" ధన్యమవుతుంది.
ఇదండీ నా బ్లాగు మొదటి సంవత్సర "తీపి గుర్తులు"
"రాబోయే సంవత్సరానికి స్వాగతం" పలుకుతూ .నా బ్లాగు ఇంకా ఇంకా ఎదగాలని దానికి మీ ఆశిస్సులు కోరుకుంటున్నాను.
.............................. .............................. .............................. .............................. .............
ఇది అంతా చదివి ఏంటి ఈ సోది అనుకున్నారా?? ఇక్కడ colors లో రాసిన పదాలు బ్లాగులో నేను రాసిన పోస్ట్ యొక్క టైటిల్స్.సో నా బ్లాగ్ బర్త్ డే కు ఇలా నేను రాసిన posts టైటిల్ తో వెరైటీ గ ఏమైనా చేద్దాం అనిపించింది,సో ఇలాగ చేసాను,మా బాబు ఫస్ట్ బర్త్ డే కు కూడా ఇలాగె ఒక్కొక్క month లో తీసిన ఫోటో పెట్టి 12 months వి ఒక ఫోటో లో వచ్చేట్టు గా పెట్టి frame కట్టించాము అదే ఐడియా ను ఫాలో అయ్యాను ఇక్కడ కూడా,
మీ అందరికి నచ్చింది నా కొత్త ప్రయోగం అని అనుకుంటున్నాను.
రెండవ సంవత్సరం లోకి శరవేగం తో దూసుకు వెళ్ళబోతున్న నా బ్లాగును ఆశిర్వదించాలి అని కోరుతున్నాను.

..............................

Jul 4, 2010
Over work
పోనిలే కదా ప్రాజెక్ట్ ఉంది అంటే నా laptop ఇచ్చాను వీడికి,,,nightout చేసి మరీ ప్రాజెక్ట్ చేసాడు..చివరికి ఎం చేసాడో చూడండీ......
...
..
...
...
,,,
..
..
వామ్మో నా mouse ను అరగకోట్టేసాడు దేవుడో....

Jul 2, 2010
అడ్డుగోడలు
"అమ్మా,, అమ్మా " అని అరుచుకుంటూ ఇంటి లోపలి వచ్చాడు పదిహేనేళ్ళ సంపత్.
"ఏంటి రా ఏమయింది,ఏంటి హడావుడి గ వచ్చావ్ " అని ఆదుర్దాగా వంట ఇంటి లోనుండి వచ్చింది సంయుక్త ,సంపత్ వాళ్ళ అమ్మ..
"అమ్మా ఇవ్వాళ ప్రొగ్రెస్స్ reports ఇచ్చారు,నేను prefinal లో క్లాసు సెకండ్ వచ్చానమ్మ,," అని ఎంతో సంతోషం గ వాళ్ల అమ్మ కు చెప్పాడు,,
"కంగ్రాట్స్ కన్నా,,ఇంక బాగా చదివి ఈ సారి ఫైనల్స్ లో క్లాసు ఫస్ట్ రావాలి,,నువ్వు బాగా చదువుతావు నాకు ఆ నమ్మకముంది నీ పైన " అని ఆప్యాయం గా కొడుకు తల నిమిరింది.
క్లాసు లో ఫస్ట్ ఎందుకు రాలేదు,ఎప్పుడూ సెకండ్ రాంక్ ఏనా, ఇన్ని మర్కులేనా, అని ఎప్పుడూ నిరాసపరచకుండా మంచి మాటలతో encourage చేసే వాళ్ల అమ్మ అంటే సంపత్ కు ఎంతో ఇష్టం...క్లాస్స్ లో ఫస్ట్ ఎవరికి వచ్చింది రా ఈ సారి అని అనునయం గా అడిగింది సంయుక్త
"నా ఫ్రెండ్ నే అమ్మ రాజు, ఎప్పుడూ వాడికే వస్తుంది ఫస్ట్ రాంక్,,బాగా చదువుతాడు,,క్లాసు లో నాకు doubts ఉంటే ఎప్పుడూ వాడే చెప్తాడు"
"అమ్మ, అమ్మా ,రేపటి నుండి preparation holidays నే కదా వాడిని మన ఇంటి కి రమ్మని చెప్తానమ్మా, ఇద్దరం కలిసి చదివుకుంటాం అని" బ్రతిమిలాడుతూ అమ్మ ను అడిగాడు సంపత్.
సర్లే అలాగేలే అని ముక్తసరిగా సమాధానం ఇచ్చింది సంయుక్త..
############################## ##########
"ఏంటే ఈ మధ్య బాగా నాగాలు పెడుతున్నావు,,,ఈ నెల లో ఇది నాలుగవది,,,ఇట్లాగయితే పని మనేసేయ్యి,,,వేరే వాళ్ళు నాకు కుదరకపోరు,,,రాను రాను మరీ నెత్తికెక్కి కూర్చుంటోంది" అని వాళ్ల పనిఅమ్మాయి లక్ష్మి మీద రుస రుస లాడుతోంది సంయుక్త.
"వానలు పడుతున్నాయి కదమ్మా,,బాగా పడిసెం పట్టి వంట్లో నలత గ ఉన్నాదని రాలేకపోయానమ్మ,," అని దీనం గా సమాధానం ఇచ్చింది పనిఅమ్మాయి.
"ఏదో ఒకటి వంక చెప్తుంది పని ఎగ్గొట్టటానికి,,బానే ఉన్నావు గా " అని దీర్ఘాలు తీసింది సంయుక్త
"పోనిలేవే పాపం, బాలేదు అంటోంది గా ఒక్క రోజే గా అని సమర్ధించ పోయాడు" సంయుక్త భర్త సందీప్
"మీరు ఊరుకోండి,,ఒక్క రోజు రాకపోయేసరికి ఇంటెడు చాకిరీ చేయలేక చస్తున్నాను...మీకే చెప్తారు బాగానే,,,అయినా ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి...పని వాళ్ళను పని వాళ్ల లాగానే చూడాలి" అని భర్త మీద గయ్య్ మంది..
సంయుక్త వాళ్ళు కాస్తో కూస్తో డబ్బు ఉన్నవాళ్ళే,,భర్త software engineer గ జాబు చేస్తున్నాడు,,మంచి శాలరీ,,ఒక్క గానొక్క కొడుకు సంపత్..డబ్బుతో కూడిన అహంకారం కొంచెం ఎక్కువనే చెప్పుకోవచ్చు.పనివాళ్ళు అంటే కొంత చులకన భావం కూడా ఉంది,,పనివాళ్ళ కు గతి లేక వీళ్ళ దగ్గర పని చేస్తున్నారు అని భావిస్తుంది.అందుకే వాళ్ల మీద ఏదో ఒకటి అరుస్తూ తన ఆధిపత్యాన్ని నిరూపించుకుంటూ ఉంటుంది..
############################## #################
"అమ్మా అమ్మా నేను చెప్పానే రాజు వీడేనమ్మా "అని తల్లి కు పరిచయం చేసాడు సంపత్
"నమస్తే ఆంటీ" అని రాజు వినయం గ అన్నాడు.
కాసేపు కబుర్లు ఆడినతర్వత "ఎక్కడుంటారు మీరు..ఏమీ చేస్తుంటారు మీ నాన్నగారు" అని అడిగింది సంయుక్త
"మా నాన్నగారు నా చిన్నప్పుడే పోయారండి...మా అమ్మే కష్టపడి నన్ను చదివిస్తోంది..టాలెంట్ టెస్ట్ లో ఫస్ట్ వచ్చానని నాకు Fee concession కూడా ఇచ్చారండి స్కూల్ వాళ్ళు " అని బాధ గ తన దయనీయమయిన పరిస్థితిని వివరించాడు రాజు.
"అయ్యో అలాగా ,,పోనిలే బాబు నువ్వేమి బాధపడకు,,,రోజు వచ్చి మా వాడితో కలిసి చదువుకో...ఇద్దరు మంచి మార్కులతో పాస్ అవ్వాలి " అని జాలి గుండెతో అన్నది."అరె చెప్పాను కదరా మా అమ్మా అందరిలా కాదు...అందరిని మంచి గా Encourage చేస్తుంది...మా మంచి అమ్మ " అని తల్లి ని ఆప్యాయం గ చుట్టేసాడు సంపత్.మీ అమ్మ ఏమి చేస్తుంది అని అడగాలి అని సంయుక్త అనుకుంది కాని ఇంక అడగలేకపోయింది..అయినా ఏదో చిన్న జాబు చేస్తూ ఉండి ఉంటుంది లేకపోతె ఇలాగ priavte schools లో చదువు చెప్పించలేరు కదా అని తనలో తానే అనుకుంది..
ఆ రోజు స్కూల్ Annual డే.,ఆ రోజు స్కూల్ ఫస్ట్,సెకండ్ వచ్చినవాళ్ళకు prizes ఇస్తారు ఆ స్కూల్ యాజమాన్యం.సంపత్ కు సెకండ్ రాంక్ వచ్చింది అందుకని వాళ్ల తల్లిదండ్రులు ఎంతో ఉత్సాహం గ స్కూల్ కు విచ్చేశారు..ప్రైజ్ Distrubution స్టార్ట్ చేసారు. "ఫస్ట్ ప్రైజ్ goes to రాజు అని announce చేసారు". రాజు కు ప్రైజ్ ఇస్తూ ప్రిన్సిపాల్ అభినందించారు."రాజు మన స్కూల్ లో చదవటం ఎంతో గర్వకారణం గా ఉంది నాకు.రాజు వాళ్ల నాన్నగారు చిన్నప్పుడే చనిపోతే వాళ్ల అమ్మ గారే నాలుగు ఇళ్ళల్లో పనిచేసుకుంటూ రాజు ను చదివిస్తున్నారు.ఆమె లాగా తన పిల్లాడు చదువు లేని వాడు కాకూడదు అని వాళ్ల అమ్మ రేయింబవళ్ళు కష్టపడింది...దానికి తగ్గట్టుగానే చిన్న వాడయినా రాజు అమ్మ కష్టాన్ని అర్ధం చేసుకుని చక్కగా చదివి ఫస్ట్ రాంక్ తెచ్చుకున్నాడు..మీరు కూడా బాగా చదివి మంచి రాంకులు తెచ్చుకోవాలి "అని రాజు గురించి మూడు ముక్కలు చెప్పారు..
రాజు ను మాట్లాడాల్సింది గా అందరు కోరగా రాజు "మా అమ్మ కష్టం చూసి నాకు బాధవేసేది,,అందుకనే పట్టుదలగా చదివేవాడిని...అమ్మ తో పాటు గా ఇంకొక అమ్మ కృషి కూడా ఉంది నా విజయం వెనుక. అది ఎవరో కాదు సంపత్ వాళ్ల అమ్మగారు అని చెప్పి ఆంటీ మీరు కూడా వేదిక పైకి రావాలి అంటీ అని" గద్గద స్వరం తో పిలిచాడు,అందరూ కరతాళ ధ్వనులు చేస్తుండగా సంయుక్త వేదిక పైన కు వచ్చింది,"ఆంటీ మీరు ఇచ్చిన ప్రోత్సాహం వల్లనే నేను ఇంతవాడిని అయ్యాను ఆంటీ,మేము పేదవారము అని తెలిసి కూడా ఆంటీ ఎంతో మంచి మనసు తో నన్ను ఆదరించింది,సంపత్ ను ప్రోత్సహించినట్టే నన్ను ప్రోత్సహించింది,నిజం గ చాలా చాలా thanx ఆంటీ అని కాళ్ళ మీద పడ్డాడు",సంయుక్త ఏమీ జరుగుతోందో అర్ధం కాని అయోమయం లో ఉంది,ఇంట్లో ఉన్న పని అమ్మాయి మీదేమో తను ఎప్పుడూ కసురుతూ ఉండేది,పని వాళ్ళను తన బానిసలూ గ భావించేది,అలాంటిది ఒక పని అమ్మాయి కొడుకు ఇంత బాగా చదివి ర్యాంకు తెచ్చుకోవడం,అది తన దగ్గరే ఉండి చదువుకోవడం,ఆ అబ్బాయి తనను ఎంతో ఉన్నతమైన వ్యక్తి అని పొగడటం,ఇది అంతా ఏదో గందరగోళం లాగా అనిపించింది ఒక్క క్షణం..
పనివాళ్ళయినా ఏదో వాళ్ల పరిస్థితి బాగోలేక మన దగ్గర చేరారు తప్ప వాళ్ళేదో తక్కువ జాతివాల్లని,అంటరాని వాళ్ళని అలా మనం తక్కువ చేసి చూడడం తప్పు.వాళ్ళు మనలాంటి మనుషులే అని అర్ధం చేసుకుని మనసులోనే తన తప్పుకు పశ్చాత్తాప్పడింది.తెలియకుండానే తన కంటి లోనుండి నీరు జల జలా రాలాయి ,కాస్త తెప్పరిల్లి రాజు ను పైకి లేపి హృదయపూర్వకం గా దగ్గరకు తీసుకుంది.తన మనసులోని అడ్డుగోడను కూల్చేసి మనస్పూర్తి గా రాజూను అభినందించింది,,,
.........................................................
ఏదో నాకు నచ్చినది,తోచినది ఎప్పటినుండో రాద్దాం అని అనుకున్నాను ఒక కధలాగా,లేదా కధానిక లాగా,ఇదిగో ఇప్పటికి కుదిరింది,ఎలా ఉందొ నా కొత్త ప్రయోగం కాస్త చెప్పండి,బాగుంటే,నచ్చితే భేష్ అనండి,లేదనుకోండి ఇంకా ఎలా ఉండాలో ఎలా రాస్తే బాగుండేదో నాలుగు అక్షింతలు వెయ్యండి,రెండో సారి రాసేటప్పుడు ఆ లోపాలు సరిదిద్దుకుంటా..

##############################

Jul 1, 2010
మా బాదం చెట్టు-కధా జగత్ పోటి
కధా జగత్తు లో కధలు చదువుదాము సరదాగా అని ఓపెన్ చేశాను ఇవ్వాలే..చాలా కధలు ఉన్నాయి ఏది చదువుదాము అని జస్ట్ ఒక సారి అలా చూసాను అన్నిటిని ...పేరు బట్టి కొంచం ఇంట్రెస్ట్ వస్తుంది నాకు,సో అలా చూస్తుంటే సడన్ గా మా బాదాం చెట్టు అని మల్లాది వెంకట కృష్ణ మూర్తి గారి కధ కనిపించింది,అరె బాదాం చెట్టు ఇదేదో చెట్టు గురించి రాసిన కధేమో అనుకుని చూద్దాం అని కధ చదవటం స్టార్ట్ చేశాను.
అస్సలు ముందు ఇంట్రెస్ట్ ఎందుకువచ్చింది అంటే మా ఇంట్లో కూడా బాదాం చెట్టు ఉంది,మా తాతగారు పుట్టిన కాలం నాటిది,చాలా పెద్ద చెట్టు.మల్లాది గారు రాసిన వైనం అంతా చదువుతుంటే ఇదేదో నా భావాలే.నాకు ఇలాగె అనిపిస్తోంది మా చెట్టు ను చూసినప్పుడల్లా,అని మా చెట్టు గురించి కూడా చెబుతాము అనిపించింది. మేము కూడా చిన్నప్పుడు బాదం కాయలు కోసి బాదం పప్పులు బాగా ఇష్టం గా తినేవాళ్ళం,ఇప్పుడు ఉన్న పిల్లలు ఛి ఆ కాయ లోని పప్పులా తినేది అని అంటున్నారు,వాళ్ళకేమి తెలుస్తుంది బాదం కాయ ను కొట్టి దానిలో ని పప్పు ని తింటే ఉండే రుచి..ఎప్పుడైనా చెట్టు నుండి వచ్చిన పప్పు రుచి వేరు మనకు ప్యాకెట్లలో దొరికే బాదం పప్పు రుచి వేరు..
చెట్టు మీద ఎప్పుడూ కాకులు,రామచిలుకలు,ఉడుతలు ఉంటూ ఉండేవి,ఆ కాకి ను చూపిస్తూ మాకు అన్నం పెట్టేది ట మా అమ్మ,,ఇప్పుడు నేను మా ఊరు వెళ్ళినప్పుడు మా బాబు కు ఆ చెట్టు దాని మీద ఉన్న కాకులనే చూపిస్తూ అన్నం తినిపిస్తాను.పక్షులకి చెట్లే కదండీ నివాసాలు పాపం ఆ చెట్లను మనం నరికేస్తే వాటికి నివాసం ఏముంటుంది,,అందుకే పక్షి జాతులు అంతరించి పోతున్నాయి. మనంతట మనమే వాటిని నాశనం చేస్తున్నాం..
"వెధవ చెట్టు. కూరా, పళ్ళూ ఇవ్వదు. వెధవ చాకిరీ. రాలే బాదం ఆకులని ఏరలేక చస్తున్నాను." అలాగేలే. బొగ్గుల రాముడితో చెప్పి కొట్టిస్తాను" అనేవారు. same ఇలాగే అనేవాళ్ళు మా అమ్మ వాళ్ళు,కొట్టిచ్చేద్దాము ఎందుకు చిమ్మించటానికి నెలకు 25 రూపాయలు అనవసరం గా ఖర్చు అని.మనం పెట్టె ఎన్నో అనవసర ఖర్చులతో పోలిస్తే ఒక 25 రూపాయలు కష్టం కాదు కదా,దానికోసం తాతల నాటి చెట్టు కొట్టిస్తామా.
"ఆయన విస్తళ్ళు కుట్టడం నాకు ఆనందంగా ఉండేది. చీపురుపుల్లని తీసుకుని దాన్ని మధ్యకి చీల్చేవారు. రెండు బాదం ఆకులని పక్కపక్కనే ఉంచి పూచిక పుల్లని వాటి అంచుల్లోకి చొప్పించి కుట్టి విరిచేవాడు. అలా రెండు పూచిక పుల్లలు పూర్తయ్యేసరికి ఓ గుండ్రటి బాదం విస్తరి తయారయ్యేది."
మా ఇంట్లో కూడా భోజనం,టిఫిన్స్ కు కూడా ఈ ఆకులనే విస్తరి లాగా కుట్టి వాడేవాళ్ళం ,పచ్చని ఆకులో తింటే ఆరోగ్యానికి మంచిది అని.
మా అమ్మ వాళ్ళు కూడా ఇప్పుడు ఇల్లు పాతకాలం ది కదా మొత్తం పడేసి (చెట్టు తో) సహా ఇల్లు కడదాము అని అనుకుంటున్నారు,నాకు కూడా మల్లాది గారికి వచ్చినట్టే దిగులు వచ్చేసింది.ఇంట్లో ఉన్న ఇలాంటి పెద్ద పెద్ద చెట్లే అడ్డం వస్తాయి అందరికి.
మనుషుల తో కంటే ఇలాంటి చెట్లు,పక్షులు,జంతువుల తో మనకు తెలియకుండా అనుబంధం ఏర్పడుతుంది.
మల్లాది గారు చాలా సులభ శైలిలో రాసిన విధానం బాగుంది.ఇంట్లోని చెట్టు మీద ఆయనకు ఉన్న ప్రేమను బాగా రాసారు.పెద్ద పెద్ద చెట్లు(మామిడి,బాదం ఇలాంటివి) ఉంటే చక్కగా నీడను ఇస్తాయి,,చల్లని గాలి వస్తాయి,,మనం కొత్తగా నాటక పోయిన ఉన్న చెట్లని నాశనం చేయకపోతే అదే చాలు అని మల్లాది గారు చెప్పకనేచెప్పారు.. .
మల్లాది గారు రాసిన వాక్యాలు చదువుతుంటే నా చిన్నతనం నా కళ్ళముందు కడులాడుతూ ఉంది,,మేము కూడా ఇలాగె చేసేవాళ్ళం కదా అని అనిపించి కాసేపు నా చిన్నతనం లోకి నా మనస్సు పరుగులు తీసింది..
మల్లాది గారు రాసిన కధ లింక్ ఇక్కడ ఇస్తున్నాను మీరు కూడా చదవండి.,
Jun 29, 2010
అనుకోకుండా కొన్ని రోజులు....
ఇదేదో అనుకోకుండా ఒక రోజు సినిమా టైటిల్ లాగా ఉంది కదా...ఒక రోజు మిస్ అయినట్లు ఇక్కడ దాదాపు 11 రోజులు మిస్ అయినాయి చూడండీ దీని కధ..
ఇక్కడ ఒక వింత కనిపిస్తోంది చూసారా ??? September లో 2nd నుండి 14th మధ్యలో 11 days miss అవుతున్నాయి.
అప్పుడే ఇంగ్లాండ్ రాజు ఇంగ్లాండ్ లో అప్పటిదాకా నడుస్తున్న Roman Julian క్యాలెండరు నుండి Greogrian క్యాలెండరు కు మార్చారు..
ఆ నెలలో పనిచేసిన వర్కేర్స్ అందరికి కుడా మొత్తం ౩౦ రోజుల జీతాన్ని ఇచ్చాడు ట .
అప్పటినుండే paid leave polocy స్టార్ట్ అయ్యింది...
గూగుల్ లో సెర్చ్ చెయ్యండి మీరు కూడా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. 1752 calender అని సెర్చ్ చేస్తే చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది,,
నాకు అర్ధం అయ్యింది ఇక్కడ పోస్ట్ చేశాను,,,
ఇలాగ మళ్లీ days miss అయ్యే month వస్తే బాగుండు కదా,,,,,

Jun 28, 2010
మనోభావాలు
కలల ఊహల పల్లకీ లో ఊరేగుతూ
క్షణక్షణం నీ తలపులలో బ్రతుకుతూ
నా వాలుకన్నులనే నీ కోటగా మలచి
నా ప్రేమతో నిన్నా కోటలో బంధించి
నా కంటే సాటి ఇంకెవరూ లేరని భావించే
నీ కంటే నాకింక ఎవరు సాటి..
ప్రేమ,ఆప్యాయతలు అన్న పదాలకు
అర్ధం తెలియని పిచ్చిదానను నేను,,
వాటి ఉనికిని అనుక్షణం వెదుకుచూ,
ఆ బంధాలలోని మాధుర్యాన్ని గ్రోలాలని
నిలువెల్లా తపించే వేర్రిదానను నేను,,
అలాంటి నాకు
ఆ ప్రేమను,ఆప్యాయతను నిండు మనసుతో
నువ్వు అందిస్తుంటే,,
నీ ప్రేమను ఎలా కాదనగలను....
పొగడకుండా ఎలా ఉండగలను......
Subscribe to:
Posts (Atom)