ఇప్పుడే జల్లెడ లో ని జ్ఞాపకాలు చదివేసరికి నాకు నా బాల్యం లోని జ్ఞాపకాలు గుర్తుకువత్చాయి... నాకు మా నాన్నగారునా ౩వ తరగతి లో నేర్పిన పద్యం ఇప్పటికి బాగా గుర్తువుంది
అక్కరకు రాని చుట్టము
మ్రొక్కిన వరమీని వేల్పు
మొహారమున దాగిన గుర్రము
గ్రక్కున విడవంగా వలయు గదరా సుమతి!!!
దీని తర్వాత ఇంక చాల పద్యాలూ నేర్పారు...
ఇన ఇది మొట్టమొదటి శతక పద్యం కాబట్టి ..మీ ముందు ఉంట్చుతున్నాను...
దీని తర్వాత ఇంక ఇలాంటి పద్యాలూ,దేవుని స్తోత్రాలు చాల చాల నేర్పారు...
ఇప్పటికి నాన్నగారి వలన నేను లలితా సహస్రనామం. విష్ణు సహస్రనామం, ఆదిత్య హృదయం,
ఇలా చాల చాల కష్టమిన స్త్రోత్రాలు కూడా నేర్పారు..
దానివల్లనే నాకు పెళ్లి ఇనతర్వాత కాస్త పూజ పునస్కారాలు అలవాటు ఇనయేమో...
ఇప్పటికి ఆఫీసు కు వెళ్లేముందు పూజ చేసుకునే వెళ్ళేదాన్ని...(ఇప్పుడు లీవ్ పెట్టాను... ఆఫీసు కు మాత్రమే పూజ కుకాదండోయ్ )...
ఈ కాలం లో పిల్లల కు మనం శతక పద్యాలూ, స్తోత్రాలు కాస్త నేర్పిస్తే వాళ్ల కు కూడా కొంచం భక్తీ ..దాంతో పాటు మనసంప్రదాయాలు కూడా నేర్పినా వాళ్ళం అవుతాం...
No comments:
Post a Comment