"ఏంటి రా ఏమయింది,ఏంటి హడావుడి గ వచ్చావ్ " అని ఆదుర్దాగా వంట ఇంటి లోనుండి వచ్చింది సంయుక్త ,సంపత్ వాళ్ళ అమ్మ..
"అమ్మా ఇవ్వాళ ప్రొగ్రెస్స్ reports ఇచ్చారు,నేను prefinal లో క్లాసు సెకండ్ వచ్చానమ్మ,," అని ఎంతో సంతోషం గ వాళ్ల అమ్మ కు చెప్పాడు,,
"కంగ్రాట్స్ కన్నా,,ఇంక బాగా చదివి ఈ సారి ఫైనల్స్ లో క్లాసు ఫస్ట్ రావాలి,,నువ్వు బాగా చదువుతావు నాకు ఆ నమ్మకముంది నీ పైన " అని ఆప్యాయం గా కొడుకు తల నిమిరింది.
క్లాసు లో ఫస్ట్ ఎందుకు రాలేదు,ఎప్పుడూ సెకండ్ రాంక్ ఏనా, ఇన్ని మర్కులేనా, అని ఎప్పుడూ నిరాసపరచకుండా మంచి మాటలతో encourage చేసే వాళ్ల అమ్మ అంటే సంపత్ కు ఎంతో ఇష్టం...క్లాస్స్ లో ఫస్ట్ ఎవరికి వచ్చింది రా ఈ సారి అని అనునయం గా అడిగింది సంయుక్త
"నా ఫ్రెండ్ నే అమ్మ రాజు, ఎప్పుడూ వాడికే వస్తుంది ఫస్ట్ రాంక్,,బాగా చదువుతాడు,,క్లాసు లో నాకు doubts ఉంటే ఎప్పుడూ వాడే చెప్తాడు"
"అమ్మ, అమ్మా ,రేపటి నుండి preparation holidays నే కదా వాడిని మన ఇంటి కి రమ్మని చెప్తానమ్మా, ఇద్దరం కలిసి చదివుకుంటాం అని" బ్రతిమిలాడుతూ అమ్మ ను అడిగాడు సంపత్.
సర్లే అలాగేలే అని ముక్తసరిగా సమాధానం ఇచ్చింది సంయుక్త..
"ఏంటే ఈ మధ్య బాగా నాగాలు పెడుతున్నావు,,,ఈ నెల లో ఇది నాలుగవది,,,ఇట్లాగయితే పని మనేసేయ్యి,,,వేరే వాళ్ళు నాకు కుదరకపోరు,,,రాను రాను మరీ నెత్తికెక్కి కూర్చుంటోంది" అని వాళ్ల పనిఅమ్మాయి లక్ష్మి మీద రుస రుస లాడుతోంది సంయుక్త.
"వానలు పడుతున్నాయి కదమ్మా,,బాగా పడిసెం పట్టి వంట్లో నలత గ ఉన్నాదని రాలేకపోయానమ్మ,," అని దీనం గా సమాధానం ఇచ్చింది పనిఅమ్మాయి.
"ఏదో ఒకటి వంక చెప్తుంది పని ఎగ్గొట్టటానికి,,బానే ఉన్నావు గా " అని దీర్ఘాలు తీసింది సంయుక్త
"పోనిలేవే పాపం, బాలేదు అంటోంది గా ఒక్క రోజే గా అని సమర్ధించ పోయాడు" సంయుక్త భర్త సందీప్
"మీరు ఊరుకోండి,,ఒక్క రోజు రాకపోయేసరికి ఇంటెడు చాకిరీ చేయలేక చస్తున్నాను...మీకే చెప్తారు బాగానే,,,అయినా ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి...పని వాళ్ళను పని వాళ్ల లాగానే చూడాలి" అని భర్త మీద గయ్య్ మంది..
సంయుక్త వాళ్ళు కాస్తో కూస్తో డబ్బు ఉన్నవాళ్ళే,,భర్త software engineer గ జాబు చేస్తున్నాడు,,మంచి శాలరీ,,ఒక్క గానొక్క కొడుకు సంపత్..డబ్బుతో కూడిన అహంకారం కొంచెం ఎక్కువనే చెప్పుకోవచ్చు.పనివాళ్ళు అంటే కొంత చులకన భావం కూడా ఉంది,,పనివాళ్ళ కు గతి లేక వీళ్ళ దగ్గర పని చేస్తున్నారు అని భావిస్తుంది.అందుకే వాళ్ల మీద ఏదో ఒకటి అరుస్తూ తన ఆధిపత్యాన్ని నిరూపించుకుంటూ ఉంటుంది..
##############################
"అమ్మా అమ్మా నేను చెప్పానే రాజు వీడేనమ్మా "అని తల్లి కు పరిచయం చేసాడు సంపత్
"నమస్తే ఆంటీ" అని రాజు వినయం గ అన్నాడు.
కాసేపు కబుర్లు ఆడినతర్వత "ఎక్కడుంటారు మీరు..ఏమీ చేస్తుంటారు మీ నాన్నగారు" అని అడిగింది సంయుక్త
"మా నాన్నగారు నా చిన్నప్పుడే పోయారండి...మా అమ్మే కష్టపడి నన్ను చదివిస్తోంది..టాలెంట్ టెస్ట్ లో ఫస్ట్ వచ్చానని నాకు Fee concession కూడా ఇచ్చారండి స్కూల్ వాళ్ళు " అని బాధ గ తన దయనీయమయిన పరిస్థితిని వివరించాడు రాజు.
"అయ్యో అలాగా ,,పోనిలే బాబు నువ్వేమి బాధపడకు,,,రోజు వచ్చి మా వాడితో కలిసి చదువుకో...ఇద్దరు మంచి మార్కులతో పాస్ అవ్వాలి " అని జాలి గుండెతో అన్నది."అరె చెప్పాను కదరా మా అమ్మా అందరిలా కాదు...అందరిని మంచి గా Encourage చేస్తుంది...మా మంచి అమ్మ " అని తల్లి ని ఆప్యాయం గ చుట్టేసాడు సంపత్.మీ అమ్మ ఏమి చేస్తుంది అని అడగాలి అని సంయుక్త అనుకుంది కాని ఇంక అడగలేకపోయింది..అయినా ఏదో చిన్న జాబు చేస్తూ ఉండి ఉంటుంది లేకపోతె ఇలాగ priavte schools లో చదువు చెప్పించలేరు కదా అని తనలో తానే అనుకుంది..
ఆ రోజు స్కూల్ Annual డే.,ఆ రోజు స్కూల్ ఫస్ట్,సెకండ్ వచ్చినవాళ్ళకు prizes ఇస్తారు ఆ స్కూల్ యాజమాన్యం.సంపత్ కు సెకండ్ రాంక్ వచ్చింది అందుకని వాళ్ల తల్లిదండ్రులు ఎంతో ఉత్సాహం గ స్కూల్ కు విచ్చేశారు..ప్రైజ్ Distrubution స్టార్ట్ చేసారు. "ఫస్ట్ ప్రైజ్ goes to రాజు అని announce చేసారు". రాజు కు ప్రైజ్ ఇస్తూ ప్రిన్సిపాల్ అభినందించారు."రాజు మన స్కూల్ లో చదవటం ఎంతో గర్వకారణం గా ఉంది నాకు.రాజు వాళ్ల నాన్నగారు చిన్నప్పుడే చనిపోతే వాళ్ల అమ్మ గారే నాలుగు ఇళ్ళల్లో పనిచేసుకుంటూ రాజు ను చదివిస్తున్నారు.ఆమె లాగా తన పిల్లాడు చదువు లేని వాడు కాకూడదు అని వాళ్ల అమ్మ రేయింబవళ్ళు కష్టపడింది...దానికి తగ్గట్టుగానే చిన్న వాడయినా రాజు అమ్మ కష్టాన్ని అర్ధం చేసుకుని చక్కగా చదివి ఫస్ట్ రాంక్ తెచ్చుకున్నాడు..మీరు కూడా బాగా చదివి మంచి రాంకులు తెచ్చుకోవాలి "అని రాజు గురించి మూడు ముక్కలు చెప్పారు..
రాజు ను మాట్లాడాల్సింది గా అందరు కోరగా రాజు "మా అమ్మ కష్టం చూసి నాకు బాధవేసేది,,అందుకనే పట్టుదలగా చదివేవాడిని...అమ్మ తో పాటు గా ఇంకొక అమ్మ కృషి కూడా ఉంది నా విజయం వెనుక. అది ఎవరో కాదు సంపత్ వాళ్ల అమ్మగారు అని చెప్పి ఆంటీ మీరు కూడా వేదిక పైకి రావాలి అంటీ అని" గద్గద స్వరం తో పిలిచాడు,అందరూ కరతాళ ధ్వనులు చేస్తుండగా సంయుక్త వేదిక పైన కు వచ్చింది,"ఆంటీ మీరు ఇచ్చిన ప్రోత్సాహం వల్లనే నేను ఇంతవాడిని అయ్యాను ఆంటీ,మేము పేదవారము అని తెలిసి కూడా ఆంటీ ఎంతో మంచి మనసు తో నన్ను ఆదరించింది,సంపత్ ను ప్రోత్సహించినట్టే నన్ను ప్రోత్సహించింది,నిజం గ చాలా చాలా thanx ఆంటీ అని కాళ్ళ మీద పడ్డాడు",సంయుక్త ఏమీ జరుగుతోందో అర్ధం కాని అయోమయం లో ఉంది,ఇంట్లో ఉన్న పని అమ్మాయి మీదేమో తను ఎప్పుడూ కసురుతూ ఉండేది,పని వాళ్ళను తన బానిసలూ గ భావించేది,అలాంటిది ఒక పని అమ్మాయి కొడుకు ఇంత బాగా చదివి ర్యాంకు తెచ్చుకోవడం,అది తన దగ్గరే ఉండి చదువుకోవడం,ఆ అబ్బాయి తనను ఎంతో ఉన్నతమైన వ్యక్తి అని పొగడటం,ఇది అంతా ఏదో గందరగోళం లాగా అనిపించింది ఒక్క క్షణం..
పనివాళ్ళయినా ఏదో వాళ్ల పరిస్థితి బాగోలేక మన దగ్గర చేరారు తప్ప వాళ్ళేదో తక్కువ జాతివాల్లని,అంటరాని వాళ్ళని అలా మనం తక్కువ చేసి చూడడం తప్పు.వాళ్ళు మనలాంటి మనుషులే అని అర్ధం చేసుకుని మనసులోనే తన తప్పుకు పశ్చాత్తాప్పడింది.తెలియకుండానే తన కంటి లోనుండి నీరు జల జలా రాలాయి ,కాస్త తెప్పరిల్లి రాజు ను పైకి లేపి హృదయపూర్వకం గా దగ్గరకు తీసుకుంది.తన మనసులోని అడ్డుగోడను కూల్చేసి మనస్పూర్తి గా రాజూను అభినందించింది,,,
.........................................................
ఏదో నాకు నచ్చినది,తోచినది ఎప్పటినుండో రాద్దాం అని అనుకున్నాను ఒక కధలాగా,లేదా కధానిక లాగా,ఇదిగో ఇప్పటికి కుదిరింది,ఎలా ఉందొ నా కొత్త ప్రయోగం కాస్త చెప్పండి,బాగుంటే,నచ్చితే భేష్ అనండి,లేదనుకోండి ఇంకా ఎలా ఉండాలో ఎలా రాస్తే బాగుండేదో నాలుగు అక్షింతలు వెయ్యండి,రెండో సారి రాసేటప్పుడు ఆ లోపాలు సరిదిద్దుకుంటా..
it's in simple and straight to our hearts.
ReplyDelete