Dec 27, 2010

ప్రేమ లేఖ

ప్రియాతి ప్రియమైన సరసు
నేనంటే నీకు ఎందుకంత అలుసు
నువ్వడిగితే తినిపించలేదనా చేపల పులుసు
నువ్వు ఎంత తిట్టినా నీ వెంటే పడుతుంది నా మనసు
నీ చుట్టూ తిరిగి తిరిగి తరిగిపోయింది నా ముఖ వర్చస్సు
అందుకనే చేరాను అమీర్ పేట్  లో అనూసు
స్టైల్ గా ఉండాలి అని కొంటున్నాను రోజు కొక డ్రెస్సు
ఇన్ని బాధలను తట్టుకోలేకపోతోంది నా మనస్సు
మా అన్నకు చెప్తే పీకాడు పెద్ద క్లాసు
నేనంటే నీకు ఇష్టమని నాకు తెలుసు
కావాలంటే గుండెను కొలవటానికి తెచ్చుకో  ఒక త్రాసు
నువ్వు కాదంటే పట్టుకుంటాను వైను గ్లాస్సు
అవునంటే అవుతాము మనము లవ్వర్సు
ఇంట్లోవాళ్ళని ఒప్పించి అవుదాము లైఫ్ పార్ట్ నర్స్
పెళ్లి అవగానే ఎగిరిపోదాము యుఅస్స్ (US )
 చూసి వద్దాము Texas
నీ జవాబు కోసం కుక్కలా ఉంటాను ఎదురు చూస్తూ
అంతేగాని నా జీవితంతో ఆడుకోకు బోమ్మాబొరుసు  ....
     

Dec 14, 2010

పెళ్ళిచూపులు-1

మొన్న ఈ మధ్యన పెళ్ళిచూపులకు వెళ్ళాను నేను..హవ్వ పెళ్ళయిన మీకు పెళ్లి చూపులేంటి అని అంటారా???నాకు కాదండి,మా అన్నయ్యకు. వెళ్ళాను నేను కూడా..మరి ఆడపడచు కదా ఉండాలి కదా నేను.సరే అనుకున్న మంచి టైం కు వెళ్ళాం వాళ్ల ఇంటికి ..ఇక్కడ విచిత్రం ఏమంటే పెళ్ళికూతురు ఒక అరగంట ముందు చేరింది వాళ్ల ఇంటికి మా కంటే..తనది సాఫ్ట్వేర్ కంపెనీ లో జాబు మరి..hytech సిటీ నుండి dilsukhnagar కు వచ్చేటప్పటికి బస్సు లో నే గంటన్నర పట్టింది ఏం చేస్తుంది మరి..శెలవలు లేవు ట..ఇంక పాపం రెడీ అయ్యే సమయం లేక  అలాగే అంటే చుడిదార్ లోనే (అంటే జనరల్ గా చీర కట్టుకుంటారు గా.) వచ్చేసింది మా ముందు కు..పైగా ఇప్పటి fashion ప్రకారం pony tail ..మరి పూలు పెట్టె ప్లేస్ ఏది..చిన్న chain ..చక్కగా సింపుల్ గా మా మధ్యకు వచ్చేసింది..హయిగా అందరం కబుర్లు చెప్పుకున్నాం...పైగా అక్కడ ఉన్న వారిలో ఎక్కువ మండి software engineers నే సో ఇంక జాబు గురించి,,salarys గురించే నడిచాయి ఎక్కువ కబుర్లు...ఏమైనా అడగండి అమ్మాయిని అని అంటారు వాళ్ల అమ్మగారు వాళ్ళు...ఏమడుగుతాం కొత్తగా...ఇదివరకు అంటే  నీ పేరు,వంట వొచ్చా,పాటలు వచ్చా అని అడిగేవారు..ఇప్పుడు నీ పేరు ఏంటి,ఏ ఉద్యోగం, అలా అడిగామనుకోండి...ఏ biodata చూడలేదా అని  అంటారేమో అని భయం,,వంట సంగతి అంటారా..సరే పెళ్లి అయ్యి ఇన్నేళ్ళయిన మనకు చక్కగా వచ్చా వాళ్ళకు రావటానికి...అయిన ఏముంది ఎవరి ఆఫీసుల్లో వాళ్ళు తినటం...రాత్రి కు ఏదో టిఫిన్ నో ఏదో లాగించేయటం నే గా ఇప్పుడు .పాటలు అంటే ఇప్పుడా కార్యక్రమం ఎందుకులే రోజు టీవీ లలో చూసి చూసి బోర్ కొట్టేసింది అని అనిపిస్తుంది..ఏమడగాలో కూడా అర్ధం కాలేదు..అయిన ఏదో అడిగాం మధ్య మధ్యలోతలా ఒకటి  .
సరే ఇలోగా రానే వచ్చాయి మనం ఎదురుచూసే ఫలహారాలు..మరి ఘనం గా ఉండాలి కదా అని పాపం జీడిపప్పు తో చేసిన హాట్..స్వీట్..పెట్టారు..చుస్తే తినాలి అనిపిస్తుంది..కాని హై కాలోరీ...వదిలేస్తే బాగోదు..అలా అని అదేపని గా తింటే బాగోదు...ముందు నుయ్యి వెనక గొయ్యి అలా ఉంటుంది ఆ పరిస్థితి...కబుర్లు చెప్తూ అప్పుడప్పుడు ఒక రెండు పలుకులు అలా నోట్లో వేసుకొని...తిని తిన్నట్టు గా తిన్నాం...కాసేపు అలా గదిలో కెళ్ళి మాట్లాడుకోండి బాబు.మా అమ్మాయి కి కాస్త సిగ్గు ఇక్కడ మాట్లాడాలి అంటే అన్నది వాళ్ల అమ్మగారు,,,అస్సలే బిడియస్తుడు పాపం మా అన్నయ్య.,.సరే మొహమాటానికి అని వెళ్లి కాసేపు మాట్లాడాడు...వీళ్ళ మధ్య ఎస్కార్ట్ లా నేను ఉంటాను అని మాకు ధైర్యాన్ని ఇస్తూ మా బుడతడు మామా నేను వస్తా అని ఫాలో అయ్యాడు వాళ్ళని...మేము ఉన్న చోటనుండి ఆ dilsukhnagar వెళ్ళాలి అంటే గంటన్నర పట్టింది అది కూడా కార్ లో...మరి తిరిగి వెళ్ళాలి అంటే అంతే టైం అవుతుంది కదా...అందుకని వెళ్ళిన అరగంట కే జైహింద్ చెప్పి మళ్ళి బయటపడ్డాం..నాకు ఈ పెళ్ళిచూపులు చుస్తే ఏదో వీకెండ్ లో చుట్టాలింటికి వెళ్లి వచ్చినట్టుంది తప్ప పెళ్ళిచూపులు లా లేదు..ఇప్పుడు tradition అలాగే ఉంది లెండి,,అమ్మాయి కు కూడా మరి భయం గా లేకుండా casual గా ఇలా ఉంటేనే బాగుంటుంది అని అనిపించింది...ఇంటి కి వచ్చాక మా పెళ్ళిచూపులు ఎలా జరిగి నాయి అని గుర్తుతెచ్చుకున్నం నేను మా వారు..అదొక పెద్ద హిస్టరీ ...నెక్స్ట్ పోస్ట్ లో చెబుతా..చాలా traditional గా funny గా జరిగింది మా పెళ్ళిచూపులు..

Dec 13, 2010

నిన్న-నేడు-రేపు

పాతకాలం లో పెళ్లి అయిన ఆడవారు గుమ్మం దాటి బయటకు రాకుండా,,ఎవర అయిన మగవారు వస్తే తలుపు చాటున ఉండే సమాధానాలు ఇచ్చేవారు,,పాపం అప్పుడు అంత స్వతంత్రం లేదు గా ...

బామ్మ లు ,తాతమ్మలు ను చూసి చూసి బోనులో వేసిన పిల్లి మాదిరి గా తిరగబడింది నేడు,,కొంచెం తెలివితేటలూ ముదిరాయి కదా,,అంటే కొంతమంది కి మంచి గానే ఉన్నాయి కానీ కొంతమంది మరీ domination అయ్యారు కదా..సో ముదిరాయి అని అనక తప్పట్లేదు..కొంచెం తేడా వచ్చినా చక్కగా నిర్మొహమాటం గా తమ తడాకా  చూపిస్తున్నారు.
ఇంక ఇప్పుడే ఇలా ఉంటే మున్ముందు అస్సలు ఎలా ఉంటారూ అని భయం వేస్తోంది కదా...ఏముంది నడుం వంచి మరీ పని చేయించుకుంటారేమో...


 ఏం చేస్తాం మరి..మనకు స్వతహాగా ఇలాంటి కాలం రావాలి అని అనిపించక పోయినా ప్రస్తుత పరిస్థితులలో చూస్తే మగవారు ఆడదాన్ని హింసించటం,చులకన చేసి చూడటం ఇలాంటివి చేస్తుంటే  ఇలాంటి కాలం వస్తే బాగుండు అని అనిపిస్తూ ఉంటుంది....

Dec 8, 2010

ప్రస్తుత రాజకీయం

ప్రస్తుత రాజకీయ పరిస్థితి గురించి వచ్చిన జోక్,,సో మీతో షేర్ చేస్తున్నాను,,,

Dec 7, 2010

బాల విన్యాసం


చూసారా  ఈ  వీడియొ ..మా ఇంటి ముందు చేసారు ఈ డాన్సు ..అందుకే వీడియొ తీయగలిగాను.ఆ చిన్న పాప ఆ తాడు మీద గా కర్ర పట్టుకుని ఎంతసేపు నడిచిందో అటు ఇటు...మొత్తం వీడియొ తీయటానికి కుదరలేదు,,అందుకే కొంచెమే తీయగలిగాను..ఎన్నాళ్ళ శ్రమ నో పాపం ఆ అమ్మాయి ది ,,నడిచే అంత సేపు ఎక్కడ పడుతుందో అని టెన్షన్ అనిపించింది నాకు ,,, అంతా అయిపోయాక కిందకు వచ్చి పళ్ళెం లో డబ్బులు అడుక్కుంది..పోనిలే అని మూడు రూపాయలు వేయించా మా బాబు చేత.పక్కనే ఉండి చుస్తున్న ఆయన ఎందుకు బాబు అమ్మాయి జీవితం తో అలా అడుకుంటున్నావ్.నువ్వు ఏదైనా పని చేసుకోవచ్చు కదా అని అన్నారు..నిజమే కదా అని అనిపించింది నాకు..దానికి ఆ పాప తండ్రి ఏమన్నాడంటే.."ఇదే circus లో చేస్తే చూడటానికి 50 /- ఇచ్చి మరీ చూసి చప్పట్లు కొడతారు..ఇంత సేపు చూసారు కనీసం ఒక్కల్లన్నా పిల్ల బాగా చేసింది అని ఒక్క రూపాయన్న ఇచ్చారా...ఎదుటి వాడికి చెప్పమంటే ఎన్నైనా చెపుతారు అని నసుక్కుంటూ వెళ్ళిపోయాడు",కబుర్లు/సలహాలు  బాగానే చెపుతారు మనవాళ్ళు కాని సహాయం చేయటం లో మాత్రం వెనకడుగు వేస్తారు..అమ్మాయిని అలా చేయించటం తప్పే నిజం గా కాని ఏదో తప్పక చేయించాడు వాళ్ల నాన్న,,,అమ్మాయి బాగా చేసినందుకైన ఏదో తలా ఒక రూపాయి ఇచ్చుంటే బాగుండేది అనిపించింది..