నిగ్గ దీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని
అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్చవాన్ని
మారదు లోకం మారదు కాలం
దేవుడు దిగి రాని యెవ్వరు యేమై పోని
మారదు లోకం మారదు కాలం
గాలి వాటు గమనానికి కాలి బాట దేనికి
గొర్రెదాటు మందకి మీ జ్ణానబోధ దేనికి
యే చరిత్ర నేర్చుకుంది పచ్చని పాఠం
యే క్షణాన మార్చుకుంది జిత్తుల మార్గం
రామబాణమార్పిందా రావణ కాష్ఠం
క్రిష్ణ గీత ఆర్పిందా నిత్య కురుక్షేత్రం
పాత రాతి గుహలు పాల రాతి గౄహాలయినా
అడవి నీతి మారిందా ఎన్ని యుగాలయినా
వేట అదే వేటు అదే నాటి కధే అంతా
నట్టడవులు నడివీధికి నడిచొస్తే వింతా
బలవంతులె బ్రతకాలని సూక్తి మరవకుండా
శతాబ్దాలు చదవలేదా ఈ అరణ్యకాండ
దీన్ని రాసింది సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ట..చాలా బాగా రాసారు అనిపించింది..ప్రస్తుత భాగ్యనగర పరిస్థితే గుర్తుకువచ్చింది ఈ కవిత చదువుతున్నంత సేపు,,
మారరు ఈ జనం,మారదు ఈ రాజకీయం...
>>నిగ్గ దీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని
ReplyDeleteఅగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్చవాన్ని..
గాయం సినిమాలో శాస్త్రి గారు స్వయంగా చెప్తారు ఈ లైన్లు ... గుర్తు చేసినందుకు నెనరులు
మంచి కవితని గుర్తు చేసారు.
ReplyDeleteఈ సమాజాన్ని మార్చడానికి ప్రయత్నిచడం కూడా వౄధానెమో?
ReplyDelete----
రాముడివా నువ్వు రామరాజ్యం సృష్టించడానికి ?
కృష్ణుడివా నువ్వు కురుక్షేత్రం నడింపించడానికి ?
కాదు కాదు భావి భారత పౌరుడివి బిచ్చమెత్తుకు తిరగడానికి.
నిస్సహాయ ఆశావాదివి నిట్టూర్పులతో కాలం గడపటానికి !
--
వ్యాస విరచితము