Dec 31, 2009
నిన్న లేదు నేడు లేదు
నాకు బిల్లా లో అమ్మ లేదు నాన్న లేడు పాట వింటుంటే అనిపించింది నిన్న ఏమి స్పెషల్ లేదు నేడు ఏమి కొత్తదనం లేదు అంతా ఒకటే బోరింగ్.. అని..కొత్త సంవత్సరం అని ఏదో 11 గంటల నుండి 12 గంటల దాకా హడావుడి తప్పితే వెళ్ళిపోయిన 2009 లో పాతదనం లేదు ఇప్పుడు వచ్చిన 2010 లోకొత్తదనం ఏమీలేదు..ఇలాగ నాకే అనిపిస్తుందా లేక అందరికి అనిపిస్తుందా అని అనిపిస్తోంది..ఈ సంవత్సరం లో అయిన ఏదన్న కొత్తగా ప్రయత్నిద్దాం అన్నా ఈ మట్టి బుర్ర కు ఏమి వినూత్న ఆలోచనలు రావటం లేదు..అందరు నీ న్యూ ఇయర్ resolutions ఏంటి అంటే ఏమున్నాయి అబ్బా అని ఆలోచనలో పడ్తున్నాను ..మీరు అందరు ఏమి resolutiions తీసుకున్నారో కాస్త నాకు కూడా చెప్పండి నేను కూడా నాకు నచ్చినవి అందులో ఉంటె ఫాలో అవుతాను...
Subscribe to:
Post Comments (Atom)
నిన్న లేదు నేడు లేదు పాట ఉన్న సినిమా పేరు "బిల్లా" కాదు "ఏక్ నిరంజన్". ఆ పాటకు కేసీఆర్ చేసిన అద్భుత నృత్యాన్ని ఇక్కడ చూడవచ్చు. http://nagaprasadv.blogspot.com/2009/12/blog-post_23.html
ReplyDeleteనాకు resolutions పెద్దగా ఏమీ లేవు కాని, పోయిన సంవత్సరం మిగిల్చిన తీపి గురుతులను రాసుకున్నాను. అవి మీక్కూడా నచ్చవచ్చు. :) :) :) ఇక్కడ చూడండి: http://nagaprasadv.blogspot.com/2010/01/blog-post.html
నిన్న లేదు, నేడు లేదు! అనుకొంటే ఫర్వాలేదు కాని రేపు మాత్రం ఉందండి!
ReplyDeleteనూతన సంవత్సర శుభాకాంక్షలు!
బ్లాగు మిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకంక్షలు,
ReplyDeleteఈ కొత్త వత్సరం అందరు సుఖ సంతోషాలతో ఉండాలని ,
మనందరి పై ఆ శ్రీ నృసింహుని కృప ఉండాలని ఆసిస్తూ మీ కోసం భద్రాచల నరసింహ క్యాలండర్ - 2010 ఈ కింది లింకులో
http://bhadrasimha.blogspot.com/2010/01/2010.html
ధన్యవాదములు
- భద్రసింహ
నిన్నటి నుండి నేర్చుకోండి.
ReplyDeleteరేపటి కలలను కని, నేడే సాకారం చేసుకుని
ఆ వెలుగులలో రేపు జీవించండి.
కానీ కలలు కనటం, సాకారం చేసుకోవటం మటుకు ఆపొద్దు.
చేసే ప్రతి పనిని ప్రేమించండి. అప్పుడు విడిగా resolution రాసుకునే పని వుండదు.
పైన ప్రసాద్ గారు ఇచ్చిన వీడియో చుస్తే ఈపాటికి మీలో ఉత్సాహం వచ్చి వుండాలి.
నూతన సంవత్సర శుభాకాంక్షలు .
ReplyDelete