Sep 5, 2010

టీచర్స్ డే

నిదురించే  ఆత్మలను మేలుకోలిపెవాడు,సోమరిపోతును చురుగ్గా తయారు చేసేవాడు,
తెలుసుకోవాలన్న ఆతురత గల వ్యక్తులను ప్రోత్సహించేవాడు,
చంచల మనస్తత్వం గల వ్యక్తిని అంచెలంచలు గా మార్చేవాడు అధ్యాపకుడు.
తెలుసుకోవడం లో ఉన్న ఆనందాన్ని నలుగురికి తెలియజేసేవాడు,
తన విధ్యార్ధులతో తన విద్యా ధనాన్ని పంచుకునేవాడు,భావి జీవితం లో ఉత్సాహపు వెలుగును పంచే వెలుగు దీపాలను వెలిగించేవాడే అధ్యాపకుడు అవుతాడు.
                                           నేను వేసిన ఈ చిత్రం మా drawing మాస్టారు కు అంకితం..చిన్నప్పుడు  నేను వేసిన బొమ్మలను చూసి నన్ను ప్రోత్సహించిన మాస్టరుకు గుర్తు గా ఈ చిత్రం వేసాను .

తల్లిదండ్రులు మనకు జన్మ నిస్తే గురువులు జీవితాన్ని ఇస్తారు.అలాంటి మంచి జీవితాన్ని నాకు ఇచ్చిన అందరి గురువులకు ధన్యవాదాలు.
                              విద్య ను పంచే అందరు గురువులకు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు.