Nov 23, 2010

శ్రీవారి పూజ

కార్తీక మాసం అందునా శివ భక్తుడు మా వారు అందుకని భక్తీ గా ఎక్కువసేపు పూజ చేసుకుందాం అని ఈ మధ్యనే మొదలు పెట్టారు.దానికోసం పెందలాడే 6 .౩౦ కల్లా నిద్ర లేచి స్నానం చేసి ధావళి కట్టుకుని మరీ పూజ కు ఉపక్రమిస్తారు.6 .౩౦ ఐతే పెందలాడే ఏమిటి  నా మొహం అంటారా..మరే మా వారికీ అదే పొద్దు పొద్దున్న మరీ.ఆయన రెడీ అయ్యి వచ్చేటప్పటికే నేను పూజ చేసేసుకుని ఆయన పూజ కు సిద్ధం చేసేస్తా.ఆయన మొదలుపెట్టి పెట్టగానే మా పనిమనిషి వస్తుంది.డమ డమ సౌండ్ చేసుకుంటూ గిన్నెలు విసిరేసుకుంటూ పనిచేస్తుంది.ఉండబట్టలేక నిన్ననే చెప్పారు కాస్త చిన్నగా తోమమ్మ పూజ చేసుకుంటున్నాను అని.అదే నా చేతి నుండి పొరపాటున గిన్నె జారి పడిందా అంతే కాస్త చూసుకుని చెయ్యి పని,,ఎందుకంత హడావుడి అని...అంతే గా మరీ. నేనేమో ఇంటి మనిషిని.ఇంటి మనిషి కి పనిమనిషి కి కొద్దిగా తేడా ఉంటుంది కదా ..ఇంటిమనిషి ఎన్ని అన్నా పట్టిచ్చుకోదు అదే పనిమనిషిని గట్టిగ గదిమితే రెండో రోజే మానేస్తుంది. అందుకని ఎంతో తెలివిగా మసలుకుంటారు  పాపం మా వారు.అక్కడికి ఈ సౌండ్స్ భరించలేక తలుపు దగ్గరగా వేసే ఉంచుతాను..కరెక్ట్ గా అదే టైం లో మోగుతుంది నా cooker whistle...ఏమి చేస్తాం మరీ box తయారు చేయాలి గా...మళ్ళి లేట్ కాకూడదు,ఉడుకు ఉడుకు  గా  ఉండకుదు..మా cooker wistle దెబ్బకు మా పక్క పోర్షన్ వాళ్ళు కూడా లేస్తారు...అంత పెద్దగ చాలా సేపు వస్తుంది కుయ్య్యో మనుకుంటూ,,,,రోజు ఉండేదేగా అని ఒక సారి నా వైపు లూక్కేసి మళ్ళి పూజ లో మునుగుతారు .ఆ పూజ కూడా చిన్నగా చేసుకోకుండా పెద్ద పెద్దగ మంత్రాలు చదువుతారు...ఆ సౌండ్ కు నిద్రపోతున్న మా వాడు ఉలిక్కిపడి లేచి వస్తాడు ఆరున్నొక్క రాగం తీసుకుంటూ..కాసేపు సముదాయించి బుజ్జగించితే హే పాప కావాలి అనుకుంటూ తన డిమాండ్స్ చెప్తాడు.అదేలెండి మగధీర లో హే పాప పాట పెట్టాలి వాడికి సుప్రభాతం లాగా.మరి రోజు మొదలు అయింది  అంటే వాడికి ఆ పాట,లేదా rhymes నో  ఉండాల్సిందే..మా వారు కూడా తను డిగ్రీ చదివే వయసులో వాళ్ల నాన్నగారు పూజ చేసుకుంటుంటే ఈయన చిరంజీవి పాటలు పెట్టుకుని డాన్సులు చేసేవాళ్ళు ట ..అలాగే ఇప్పుడు మా వాడు రాంచరణ్ పాటలు వింటూ ఎంజాయ్ చేస్తున్నాడు వాళ్ల నాన్న గారి లాగా..సరే ఈ పాటలు ఈ గోలల మధ్య లో ఫోన్లు,,వెళ్లి కాల్ ఆన్సర్ చేసే వరకు మోగుతూనే ఉంటుంది ట్రింగ్ ట్రింగ్ మనుకుంటూ ,ఈ లోగ టైం 7 .౩౦ అవనే అవుతుంది,,మళ్ళి లేచి హడావుడి గా రెడీ అయ్యి బయలుదేరాలిగా ఆఫీసులకు,,అందుకే తెల్లవారు ఝాముననే లేచి పూజ చేసుకోండి అని చెప్తా నేను,ప్రశాంత వాతావరణం లో చేసుకుంటే మనసు లగ్నం అవుతంది దేవుడి మీద..ఈ రణగొణ ధ్వని లో ఏమి ఉంటుంది..చికాకు తప్ప,,,,ఇంక రేపటి నుండి ఎవరు లేవకముందే పొద్దున్నే లేచి పూజ చేసుకుంటా, మీ గోల లేకుండా ఉంటుంది అని నసుగుతూ వెళ్ళిపోతారు ఆఫీసు కు...మరీ ఆ పొద్దు ఎప్పుడు వస్తుందా అని గత వారం రోజులు గా ఎదురు చూస్తూనే ఉన్నాను.

Nov 21, 2010

బ్లాగు భోజనం

కాసేపు తీరిక దొరికింది కదా అని బ్లాగులు చూస్తుంటే ఏ బ్లాగులో చూసినా వంటలేనాయే,,,అస్సలే కార్తీక  పౌర్ణమి ఉపవాసం ఉందాం అని అనుకున్నాను.ఆ వంటలు చూస్తుంటే నాకు మనసు లయ తప్పుతోంది.ఉపవాసం లేకుండా పోనీ సగం పూట ఉన్నాం కదా అని సర్దిపెట్టుకుని ఆరగించేద్దమా  అంటే అన్నీ ఆయిల్ ఫూడ్స్.పుణ్యం సంగతి  దేవుడు ఎరుగు కాస్త అన్నా బరువు తగ్గాలి అని గట్టిగ ఉపవాసం చేస్తున్నా  కదా సరే నీరసం రాకుండా ఉంటుంది అని ఒక చిన్న వంటకం చేద్దాం అని నేను కూడా నిర్ణయించుకున్నాను.వనాభోజనం లో ఉపవాసం అనుకోండి కాసేపు...
ఈ వంటకం నేను టీవీ లో చూసాను..అది కూడా ఇవ్వాలే..సరే చేద్దాం

పేరు;దహీ  oats .
కావలసిన పదార్ధాలు:
oats 1 కప్
పెరుగు 1 cup
కొత్తిమీర,
కరేపాకు,
నిమ్మ కాయ-1
కాసిన్ని నీళ్ళు;
విధానము:
ముందు గా ఒక గిన్నెలో కాసిని నీళ్ళు పోసి మరిగినాక ఈ oats వేసి మూతపెట్టి మూడు నిముషాలు ఉంచాలి.
oats తొందరగా ఉడుకిపోతాయి..బాగా దగ్గర పడ్డాక స్టవ్ ఆపేయాలి.
ఒక బౌల్ లో పెరుగు వేసి దానిలో కొద్దిగా తరిగిన కొత్తిమీర,కరేపాకు,కొద్దిగా సన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసి బాగా కలపాలి.
ఆ తరువాత ఒక నిమ్మ చెక్కను పిండాలి.
ఈ ఉడికిన oats చల్లారాక పెరుగును కలపాలి.
బాగా కలిపినాక serve చేస్తే చల్ల చల్లగా పెరుగు ను తింటుంటే ఆత్మారాముడు కాస్త శాంతిస్తాడు    ...

taste చూసానండి ఈ వంటకం నేను. బాగానే ఉంది..పాలల్లో వేసుకుని తినే కంటే ఈ విధం గా తింటే బాగుంది.
మీరు కూడా ట్రై చేసి చూడండీ ఇది evening పిల్లలకు పెట్టటానికి బాగుంటుంది snack లాగా..  

Nov 15, 2010

ఉపవాసము

ఈ కార్తీక మాసం వచ్చిందంటే చాలు జనాలు పిచ్చి భక్తి తో ఉపవాసాలు చేస్తారు.నేను చేస్తాను అనుకోండి కానీ ఏదో కార్తీక సోమవారం  రోజు చేస్తా..వారం లో మిగత రోజులు తింటాం కాబట్టి పర్వాలేదు అంత ఏమి ఇబ్బంది అనిపించదు.పైగా కాస్త మన వయస్సు బట్టి ఓపిక బట్టి చేయాలి.అలాకాకుండా పుణ్యం వస్తుంది అని వారం లో నాలుగు రోజులు ఉపవాసం చేస్తే ఎలాగు.ఎవరు చేస్తారు అలాగా అంటారా..ఎందుకు ఉండరు..మా ఇంట్లో నే ఉన్నారు.మా అమ్మగారు మొన్న కార్తీక సోమవారం ఉపవాసం,మర్నాడు నాగులచవితి కదా ఆ రోజు కూడా ఉపవాసం..సరే తరువాత గురువారం బాబా కి ఇష్టమైన రోజు కదా ప్రతి వారం ఉంటుంది ఏ నెల అయినా కూడా,,సరే తర్వాత శనివారం కోటి శనివారాలు ట కదా ఆ రోజు..ఆ రోజు ఉపవాసం...సో దాదాపు వారం అంతా ఉపవాసమే..ఇంతలో మళ్ళి సోమవారం వచ్చేసింది...ఉపవాసం అంటే మొత్తం గా కడుపు మాడ్చుకోవాలి అని ఏ శాస్త్రము,సైన్సు చెప్పదు..ఒక పూట లంఖణం చేస్తే అన్నీ parts active అవుతాయి అని ఏదో పదిహేనురోజుల కో నెల కో ఒక రోజు చేయమంటారు.ఆ రోజు solid food , అన్నం అలాంటిది తినకుండా liquids తీసుకోవచ్చు అంటారు..ఉపవాసం అని మనం ఆ రోజు నాలుగు అయిదు సార్లు కాఫీ లు  ,టీలు తాగుతాం..చక్కగా పాలు,మజ్జిగ ,కొబ్బరినీళ్ళు తాగితే కాస్త నయం..మంచినీళ్ళు ఏదో ఒకటో రెండో గ్లాసులు తాగుతాం రోజు మొత్తం మీద.అస్సలు ఇక్కడే దెబ్బ పడ్తుంది...నీళ్ళు సరిపడా తాగకపోతే urine infections వచ్చేస్తాయి..చాలా రోజులు వరుసగా food లేకపోతె బాడీ లో షుగర్ లెవెల్స్ పడిపోతాయి...నీరసం మీద మగత నిద్ర వచ్చేస్తుంది.ఇదే జరిగింది మా అమ్మగారికి కూడా.నీరసం మీద తలనొప్పి వచ్చేసి తల తిరుగుతున్నట్టు ఉండి నాలుగు గంటలకు పడుకున్న ఆవిడ మర్నాడు ఏడు గంటలకు నిద్ర లేచింది...అంత మగత గా,,తల తిరగటం, అలాంటివి వచ్చేస్తాయి..ఏముంటుంది లే ఒక పూట తినకపోతే అని మనకు అనిపిస్తుంది...కానీ ఆ affect ఆ రోజు కి ఏమి తెలియదు..ఒక రోజు తర్వాత తెలుస్తుంది...అందుకనే ఉపవాసం చేస్తున్న వాళ్ళు అందరూ ఏదో వారం లో ఒక రోజు చేయండి అంతే..ఎక్కువ రోజులు ఉపవాసం చేస్తే ఎక్కువ పుణ్యం వస్తుంది అనే statistics లేవు గా ఎక్కడ...ముందు మన ఆరోగ్యం బాగుంటే ఎన్నయినా పుణ్యకార్యాలు చేసుకోవచ్చు..లేదంటే మొదటి కే మోసం వస్తుంది....

Nov 14, 2010

పెళ్లి పిలుపు

ఇక్కడ ఒక సరదా కార్డు ఉన్నది,,,సరదా కోసమే పెట్టాను,,ఎవరినా ఫీల్ అయితే i am so sorry ,,,

Nov 7, 2010

పెళ్లిగోల

ఈ  మధ్య  ఒక  వివాహ  పరిచయ  వేదిక  దగ్గరకు  వెళ్ళాను మా అన్నయ్య వి పెళ్లి సంబంధాల కోసం. అది  ఒక  గుడి  లో  ఏర్పాటు  చేసారు.నేను వెళ్ళేటప్పటికే మొదలు అయింది.ఒకచోట అందరూ గుమిగూడి ఉన్నారు.ఎవరయినా  పడిపోయారేమో అనుకుని వెళ్ళాను.తీరా చుస్తే వాళ్ల అందరూ ఉన్న  గుంపు  మధ్యలో  కొన్నిఫైళ్లు ఉన్నాయి అవి అమ్మాయి ల  ఫోటోలు,biodata ల ఫైళ్లు.వాటికోసం మగపిల్లల తాలూకు వాళ్ళు గుమిగూడారు.అంతమంది మధ్యలో మనం వెళ్లి విజయవంతం గా ఫైలు తెసుకురాలేము లే అని ఆ ప్రయత్నం మానుకున్నాను.సరే ఆల్రెడీ చూస్తున్న వాళ్ల పక్కనే కూర్చొని కాసేపు మనం కూడా ఆ ఫైల్ చూడొచ్చు అనుకుని ఒకావిడ ను అడిగాను.ఇద్దరం చూద్దాం అండి అని..దానికి ఆమె ఒక వింత లుక్ ఇచ్చింది నా వైపు.అస్సలే గంట నుండి కుస్తీ పట్టి నేను తెచ్చుకుంటే,ఇప్పుడొచ్చి మా సంబంధాలు గద్ద లా తన్నుకు పోతావా అన్నట్టు.నాకు టైం పడుతుంది మీరు వేరే ఫైల్ తెచ్చుకోండి అని నిర్మొహమాటం గా చెప్పింది.ఆహ అమ్మాయిల పెళ్లి ఫైల్ లకు డాలర్ రేట్ కంటే ఫాస్ట్ గా craze పెరిగిపోయింది అనుకున్నాను.ముందు రిజిస్ట్రేషన్ చేసుకోండి, మీరు వెళ్లి వచ్చేలోగా నా ఈ ఫైల్ అయిపోతుంది అప్పుడు ఇస్తాను అన్నది నెమ్మదిగా .కొత్తగా వచ్చినవాళ్ళు regestration చేసుకోవాలి ట.సరేలే అని line వంక చుస్తే నేను TCS జాబు కోసం కూడా అంత పెద్ద line లో ఉండలేదేమో.కానీ  తప్పదు కదా.నుంచుని ఒక అరగంట గడిచాక రిజిస్ట్రేషన్ complete చేశా.ఆహ ఆ వేదిక నడుపుతున్నది ఆడవారే.యాభయ్యేల్లు పై పడినవారే.టైం పాస్ కోసం ఇలాగ చేస్తున్నారు సంఘ సేవ.కాసేపు అక్కడ ఉన్న ఫైళ్లు తిరగేసి మంచి సంబంధాలు రాసుకున్నా .ఇంతలో ఒకళ్ళు ఇద్దరు వచ్చారు నా దగ్గరకు అబ్బాయి కావాలా అండి ,అమ్మాయా అని.అదేంటి ఇలా అడుగుతున్నారు అనుకున్నాను.. మీరు అమ్మాయి కోసం చూస్తున్నారా,అబ్బాయి కోసం చూస్తున్నారా అని వివరించింది..ఓహ్ ఇలాగ మనమే వచ్చినవాళ్ళను అడిగితె ఇంకొన్ని తెలుస్తాయి కాబోలు అనుకుని నేను కూడా ఉన్న వాళ్ల అందరి దగ్గరికి ఆ చాయ్,చాయ్ అని అరిచినట్టు అమ్మాయి కోసం చూస్తున్నా మండి అంటూ అందరిని అడిగా.సగం పైగా అందరూ నా లాంటి వాళ్ళే,,అదేలెండి అమ్మాయి కోసం చుస్తున్నవాళ్ళే.పాపం అక్కడికొచ్చిన తల్లిదండ్రులను చుస్తే అబ్బాయి పెళ్లి కు ఎంత టెన్షన్ పడుతున్నారో అనిపించింది.ఉద్యోగం అక్కర్లేదు,ఏ చదువు అయినా పర్లేదు,ఏ రంగు అయినా పర్లేదు....average గా  ఉండే ఏ అమ్మాయి అయినా పర్లేదు...అస్సలు చివరకు అమ్మాయి అయితే చాలు అన్నట్టు అయింది పరిస్థితి.మా ఇళ్ళల్లో నేను వినగా ఏ అమ్మాయి కు ఇలాగ వేదిక లకు వెళ్లి సంబంధాలు చూసింది లేదు,,చేద్దాం అనుకోగానే ఒకటి రెండు చూసి చేసేసారు,ఇప్పుడు అబ్బాయిల పెళ్ళిళ్ళు అంటే చెప్పులే  కాదు...జేబులు వాటికి తోడు క్రెడిట్/డెబిట్ కార్డ్ లు కూడా కరిగిపోతున్నాయి,,ఏం చేస్తాం..కాలం మారింది గా..

Nov 4, 2010

దీపావళి పూజ

మూడేళ్ళ క్రితం హాస్టల్ లో ఉండి ఉద్యోగానికి వెళ్ళే రోజుల్లో దీపావళి రోజు కూడా ఆఫీసు కు వెళ్ళాల్సి వచ్చింది నేను.జస్ట్ one hour నే  వచ్చివెల్లండి అని మా బాస్ ఆర్డర్.some errors ఉన్నాయి so immediate గా corrections చేయాలి అని...ఇంక వెళ్లక తప్పింది కాదు.గుడికి వెళ్లి వెళ్దాం అనుకుంటే కుదరలేదు..సరే అని ఆఫీసు కు వెళ్లి మెయిల్స్ చెక్ చేసుకుంటే DIWALI గ్రీటింగ్స్ వచ్చాయి మా ఫ్రెండ్స్ నుండి,,అందులో ఒకటి virtual లక్ష్మి పూజ..ఏదో ఒకటి లే virtual పూజ నే మనసులో నిజం పూజ లాగా ఫీల్ అయ్యి సౌండ్ mute చేసి చేసుకున్నాను..టెక్నికల్ పూజ భలే thrill గా అనిపించింది..అలాంటివి softwares కూడా ఉంటాయి ట.అంతకుముందు  నేను ఎప్పుడు చూడలేదు..తర్వాత పంపించింది మా ఫ్రెండ్ గణేష్ virtual పూజ..సిస్టం ఆన్ చేయగానే virtual పూజ చేసి నా పని స్టార్ట్ చేసుకునేదాన్ని.same మళ్ళి ఆ గ్రీటింగ్ పంపింది ఈ దీవాలి కు కూడా..but ఇప్పుడు అంత అవసరం లేదనుకోండి...ఎక్కడున్నా సరే ముక్కోటి దేవుళ్ళని లాక్కొచ్చి మరీ కూర్చోపెట్టి నా స్త్రోత్రాలు వినిపిస్తున్నా గా..
మెయిల్ చుస్తే నాకు ౩ ఏళ్ళ క్రితం విషయం గుర్తువచ్చి ఇలా షేర్ చేస్తున్నా మీతో.
లక్ష్మి పూజ
ఈ లింక్ పైన క్లిక్ చేయండి..ఓపెన్ అయినాక ప్లే పైన క్లిక్ చేయండి..పూజ starts..(Light తో  blink అయ్యేవాటిని  click చేయండి)
click on flowers.
click on agarubatti
click on deepas


                                                       దీపావళి శుభాకాంక్షలు అందరికీ...
                                                  HAVE A SWEET AND SAFE DIWALI..

Nov 1, 2010

చదువు కొంటున్నాము

ఈ మధ్యనే మా బాబు ను playschool  లో వేసాము.కాస్త స్కూల్ అలవాటు అవుతుంది అని అనేకంటే వాడి గొడవ ఇంట్లో భరించలేక వేశాము అంటే బాగుంటుందేమో.కాసేపన్నా ఉపిరి పీల్చుకోవచ్చు అనిపించి వేశాము.వాడిని రెడీ చేసి bag రెడీ చేసి స్కూల్ లో దింపి ఇంటికి వచ్చి అమ్మయ్య అనుకునేటప్పటికి ౩ hours అయిపోతాయి..మళ్ళి పరుగున వెళ్లి తెచ్చుకోవటం.saturday కూడా ఉంటే అలసిపోతారు అని saturday ,sunday శెలవలు.ఈ మాత్రం దానికి అప్పుడే ఎందుకు స్కూల్  అని మా ఇంట్లో పెద్దవాళ్ళంతా గోల.ఈ ౩ గంటలు భరించినందుకు స్కూల్ ఫి 22 ,000  ఈ narsury కు.నా ఇంజనీరింగ్ మొత్తం అయిపొయింది ఆ డబ్బుతో,,అదే నాకు కట్టిన పెద్ద మొత్తం నా చదువు కు నా జీవితం లో.అలా అని చేర్చకుండా ఉరుకోలేము గా.పాజిటివ్ attitude ,సెల్ఫ్ కాన్ఫిడెన్సు  అలాంటివి నేర్పిస్తారు ట వాళ్ళు,.నా మొహం మనకే గట్టిగ తెలియదు ఆ పదాలు ఏమిటో వీళ్ళకేమి తెలుస్తుంది.అన్నట్టు ఈ మధ్య parents మీటింగ్ కూడా పెట్టారు.పెట్టి వీళ్ళకు gradings ఇచ్చారు.మా వాడికి ఏదో B గ్రేడ్ ఇచ్చారనుకోండి. పాపం చేరి వారమే కదా వాళ్ళకు analyze చేయడానికి టైం సరిపోలేదు ట..అందులో ఉన్న columns ఏమిటంటే  sharing ,సెల్ఫ్ confidence ,respect to others ,talking ,running ,jumping ,eating ,behaviour ,cleanness etc ..ఇవి అన్నీ observe చేసి చైల్డ్ లో gradings ఇచ్చారు.మా వాడికి jumping ,running లో A + గ్రేడ్,follwing teacher అనే item  లో occassionally following అని C గ్రేడ్ ఇచ్చారు.వాళ్ల టీచర్ చెప్పింది మీ వాడు ఇంకా ఫాలో అవ్వాలి teacher ను..మీరు ఇంగ్లీష్ లోనే మాట్లాడండి ఇంట్లో కూడా అని. ఎందుకంటే ఆ టీచర్ కు తెలుగు అస్సలు రాదు.ఇంగ్లీష్ లో come here అని పిలుస్తుంటుంది ..ఇంకా మొత్తం తెలుగు పదాలే  రాలేదు మా వాడికి. ఇంక ఆ ఇంగ్లీష్ ఏమి అర్ధం అవుతుంది..నన్ను కాదు అన్నట్టు బిక్క మొహం వేసి ఉంటాడు.చేరగానే అన్నీ ఎలా వచ్చేస్తాయి అనుకుంటారో.ఈ మాత్రం స్కూల్ మానకుండా,ఏడవకుండా వెళ్తున్నాడు అంటే గ్రేట్,ఈడ్చుకుని తెసుకు వెళ్ళాల్సిన అవసరం లేదు మా వాడిని,హయిగా స్కూల్ లోనే ఆడుకోవచ్చు అని వాడి ఆనందం. ,అన్నీ రకాలు గాను డెవలప్ అయినాయి స్కూల్స్.