Aug 16, 2010

స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

నిన్న ఆగష్టు  14 న  మా ఇంటి దగ్గర స్కూల్ లో జెండా పండుగ బాగా చేసారు..జెండా ఎగరేసారు.చాక్లెట్టులు,బిసికెట్టులు పంచారు.competitions ఏవో పెట్టారు ట గత వారం నుండి పిల్లలకు prizes ఇచ్చారు,,పిల్లలు స్కూలు ను భలే బాగా decorate చేసారు..నాకైతే నేను చదువుకునే రోజులు గుర్తువచ్చాయి..మేము కూడా మా క్లాసు ను ఇలాగె చేసేవాళ్ళం అని అనిపించింది..చిన్న ప్రైవేటు స్కూల్ అయినా డ్రిల్ చేయించి మార్చ్ ఫాస్ట్ చేయించారు పిల్లలతో. చాలా ముచ్చట గా అనిపించినిది.
అంతా బానే ఉంది కానీ నేనే ఆగష్టు  14 అని రాసాను తప్పు గా అని మీరు అనుకుంటున్నారు కాదు..కానే కాదు ఎందుకంటే ఈ తతంగం అంతా జరిగింది నిజం గా ఆగష్టు 14 ననే,ఎందుకంటే ఆగష్టు 15 ఆదివారం వచ్చింది కదా,ఆ రోజు సెలవు కదా,పిల్లలు రారు కదా బడికి అని ముందే చేసేస్తున్నారు టా,ఇదేక్కడ విడ్డురం అనిపించింది నాకు,సెలవు అయినా పిల్లలు ఇష్టం గా వస్తారు ఇలాంటి స్కూల్ functions కు,పోనీ చిన్నపిల్లలను వద్దు అని చెప్పి ఎనిమిదవ తరగతి నుండి పిల్లలను రమ్మన వచ్చు గా.అస్సలు ముందు పంతుల్ల కు బద్ధకం,ఎవడు వస్తాడులే మళ్లీ ఒక గంట పని కోసం అని మన చరిత్ర లో ఒక రోజు ఘటన ను ముందుకు మార్చేసారు.ఈ స్కూలు నేను కళ్లారా చుస్తే ఇంకొక స్కూల్ లో కూడా ఇలాగె చేసారు అని నేను చెవులారా విన్నాను,అంత గా పదిహేనున స్కూల్ వద్దు అనిపిస్తే అస్సలు జెండా ఎగరేయటమే మానేయాలి కానీ ఎవరిష్టమోచ్చినట్టు వాళ్ళు ఎగరేస్తారా,అస్సలు కాలేజీ కు అయితే వెళ్ళే పనే లేదు అందరికీ సెలవే,software  ఆఫీసు లలో అయితే అస్సలు గుర్తే ఉండదు ఈ రోజు,వాళ్ళకి thanksgiving డే గుర్తువుంటుంది కానీ మన independence డే పట్టిచ్చుకొనే పట్టిచ్చుకోరు,ఏదో ఒక రోజు సెలవు కోసమే ఈ హడావుడి అని అనిపిస్తుంది.అంతా మొక్కుబడి హడావుడి.

1 comment:

  1. నాకు same అనుబవమండి, మా బాబు విద్యాలయం లో , నేనే బ్లాగు లో రాద్దామనుకుని మీ కన్నా ముందు, కాని పని హడావిడి లో పడి, కాస్త ఆలస్యం ఐంది, ఈ లోగ మీరు నా భావాన్ని పంచేసారు అందరికి, కృతజ్ఞతలు. తరువాత నే వెళ్లి గొడవ పడి మర్చనులెండి, అది వేరే విషయం.

    ReplyDelete