Aug 31, 2010

రిటైరమెంట్


ఇవ్వాళ మా నాన్నగారు ఉపాధ్యాయ  ఉద్యోగం నుండి రిటైర్ అవ్వబోతున్నారు,,అదేంటి మరి ఇంత తీరిగ్గా బ్లాగు రాస్తున్నారు అనుకుంటున్నారా? అస్సలే ఆయన బాధ లో ఉన్నారు,అప్పుడే నన్ను ఈ ప్రభుత్వం ముసలి వాడిని చేసేసింది.ఇప్పటిదాకా కుర్రాడినే అనుకుని నా పనులు నేను చేసుకుని పిల్లల్లో పిల్లాడిలాగ కాలక్షేపం చేస్తుంటే నీకు వయసు అయింది హయిగా రెస్ట్ తీసుకో అని పంపేస్తోంది అని మదన పడుతున్నారు.అయినా కొన్ని కారణాల వలన కుదరలేదు అనుకోండి వెళ్ళటం.అప్పుడే retirement age వచ్చేసిందా అని అనిపిస్తోంది మాకు.పాత సినిమాలలో చూపించినట్టు ఒపికలు నశించి,వయసు మళ్ళి,ఇంట్లో బాధలు,పెళ్ళిళ్ళు కావలసిన పిల్లలు,జాబులు రాని కొడుకులు..కష్టాలన్నీ retirement టైం లో నే ఉన్నాయి అన్నట్టు ఉండేది అప్పటి దృశ్యాలు .అదృష్టవసాత్తు అలాంటి బాధలు మాకు లేవు. దాదాపు ఈ రోజులలో ఎవ్వరికి లేవు అనే అనుకుంటున్నాను.ఇప్పటి దాక ఒక విధమయిన జీవితానికి అలవాటు పడి ఇంక ఇప్పుడు ఇంకొక రకమయిన జీవితానికి అలవాటు పడాలి అంటే కొద్దిగా కష్టమే.తర్వాత తర్వాత అలవాటు పడిపోతారు లెండి వాళ్ళే ఏమి  చేస్తారు ఇంక.మా నాన్నగారి తో పాటు మా బంధువులు(మామగారు  లు) కూడా ఇద్దరు ఇవ్వాళే రిటైర్ అవుతున్నారు.పెద్దవాళ్ళు అవుతున్నారు తల్లిదండ్రులు కొంచెం బాధ్యతలు తగ్గించి మనం వాళ్ళని,వాళ్ళు చేస్తున్న పనులలో బాధ్యతలను పంచుకోవాలి అని గుర్తుచేయటం కోసమేనేమో ఈ retirement అని అనిపిస్తుంది నాకు .ఇప్పటిదాకా మా కోసం నిరంతరం గా కష్టపడి,వాళ్ల కోసెం ఏమి సమయం వెచ్చించకుండా కష్టపడ్డారు కాబట్టి రిటైర్ అయినతర్వాత వాల్లక్కు నచ్చినట్టు  మంచి గా కాలక్షేపం చేయాలనీ,ఆయురారోగ్యాలు ప్రసాదించాలని,గుండెల నిండుగా మనశ్శాంతిని ఇవ్వాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను..

Aug 28, 2010

ప్రాణం ఖరీదు

రాత్రి పదకొండు గంటలకు కాలింగ్  బెల్ మోతకు వెళ్లి తలుపు తీసింది రమణి.ఎదురుగ మత్తులో జోగి ,వంటి నిండా కట్ల తో ఉన్న కొడుకు నిఖిల్ ను చూసి నిశ్చేష్టురాలు అయింది రమణి."ఏమి లేదు ఆంటీ. ఇవ్వాళ birthday కదా అని రెండు పెగ్గులు ఎక్కువ వేసాడు,,ఫ్రెండ్స్ తో బెట్ కట్టి byke రేస్ లో participate చేసాడు,బాలన్సు తప్పి పడిపోయాడు,మరేమి పర్వాలేదు అన్నారు డాక్టర్స్ అని చెప్పి నిఖిల్ ను సోఫా లో కూర్చోపెట్టి వాళ్ల పని అయిపోయిన్దనిపించి వెళ్ళిపోయారు ఫ్రెండ్స్.లేక లేక పుట్టిన ఒక్క కానోక్క కొడుకు ను ఈ స్తితి లో చూసి తల్లడిల్లిపోయింది రమణి."అర్ధరాత్రి పూట ఎందుకురా ఆ పందాలు అవి..ఎన్ని సార్లు చెప్పాలి పబ్బు లకు  క్లబ్బులకు వెళ్లొద్దు తాగి రావద్దు అని,,తొందరగా ఇంటికి వచ్చి హాయ్ గా మాతో ఉండక ఎందుకురా ఫ్రెండ్స్ అంటూ తిరుగుతావు,,ఏదో చిన్న దెబ్బలు కాబట్టి సరిపోయింది,నీకేమన్నా అయితే మేమేమయి పోవాలి రా" అంటూ ఏడుపు లంఘిన్చుకుంది తల్లి.అస్సలే మత్తులో తూగుతూ దెబ్బలతో కొంచెం చికాకు గా ఉన్న నిఖిల్ కు అమ్మ ఏడుపులు చికాకు ను రెట్టింపు చేసాయి,"ఛి ఛి అందుకే నేను ఇంటికి రాను ఎప్పుడు చూడు ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు. చిన్నప్పుడు చదువు చదువు అని.ఏదో ఆ ఇంజనీరింగ్ అయిన్దనిపించాక ఉద్యోగం ఉద్యోగం అని సతాయించారు..ఏదో నా అదృష్టం బాగుంది మంచి జాబు వచ్చింది.నా జీతం నాకు పాకెట్ మనీ కు సరిపోతుంది,,ఇప్పుడు కూడా నన్ను ప్రశాంతం గా నా పని నన్ను చేసుకోనీయరా,ఎంజాయ్ చేస్తే తప్పేంటి.ఏమంత కాని పని చేసానని" అని విసుకుగా తన గదిలోకి వెళ్ళిపోయాడు నిఖిల్.
ఆ రాత్రంతా రమణి,గోపాల్ లకు కంటి మీద కునుకు పట్టలేదు..కొడుకు ఇలా చేయి దాటిపోతున్నాడు అని మనసులో బాధ పడసాగారు,ఒక్క కానోక్క కొడుకు అని చిన్నప్పటినుండి గారాబం గా పెంచారు.అడిగింది కాదనకుండా ఇచ్చారు.ఎంతో మంచి పోసిషన్ లో ఉండాలి తమ కొడుకు అని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.స్వతహాగా తెలివిగల వాడే నిఖిల్.ఇంజనీరింగ్ వరకు బాగానే ఉన్నాడు.ఇంజనీరింగ్ అయిపొయింది వెంటనే మంచి కంపెనీ లో ఉద్యోగం వచ్చింది అప్పటినుండి ఫ్రెండ్ సర్కిల్ పెరిగింది,సొంత సంపాదన.పాతికవేల జీతం..ఒక్కసారి గా అలాంటి జీవితం,జీతం అందేటప్పటికి ఒక్కొక్క వ్యసనము అలవాటు అయింది.పబ్బులు క్లబ్బులు  వెళ్ళటం అలవాటు అయింది.లేట్ నైట్ పార్టీస్ మొదలు అయ్యాయి.దీనికి తోడు byke racelu అంటూ కొత్తగా మొదలు పెట్టాడు.వద్దని ఎన్ని సార్లు చెప్పినా అమ్మ నాన్న ల మాట చెవిన పడలేదు నిఖిల్ కు.చూద్దాం కాలమే సమాధానం చెబుతుంది అని సర్ది చెప్పుకున్నారు రమణి,గోపాల్ దంపతులు.
ఒక వారం గడిచింది.గాయం కాస్త పాత పడింది.మళ్లీ byke రేస్ అని పందెం మొదలుపెట్టాడు.ఎంతో ఫాస్ట్ గా దుసుకుపోతుండగా సడన్ గా ముందు ఉన్న కిరణ్  బండి స్కిడ్ అయ్యి పల్టీలు కొడుతూ వెల్లకిలా పడ్డాడు.బండి వచ్చి అమాంతం మీద ఒరిగిపోయింది.ఒక్కసారి గా అందరూ భయ పడ్డారు జరిగినదానిని చూసి,,వెంటనే హుటాహుటిన హాస్పిటల్ కు తీసుకు వెళ్లి చికిత్స స్టార్ట్ చేయించారు.ఏదో ప్రాధమిక చికిత్స చేసి చిన్న చిన్న దెబ్బలకు కట్టు కట్టారు డాక్టర్స్.కానీ వెన్నుముక కు బలమయిన గాయం తగలటం వలన ఇంక పైకి లేవలేడని డాక్టర్స్ తేల్చి చెప్పేశారు.ఒక్కసారి గా ఫ్రెండ్స్ అందరూ ఉలిక్కి పడ్డారు.అప్పటి దాక తమతో ఉత్సాహం గా చిందులేసిన తమ స్నేహితుడు ఇంక అస్సలు లేచి నిలవలేడని విని తట్టుకోలేకపోయారు.ఇది అంతా నావలన నే  కదా. అనవసరం గా నేనే పోటిపడదాం అని వాడిని రెచ్చకోట్టానే అని గుండెలవిసేలా రోదించాడు నిఖిల్.ఇంతలో వార్త తెలిసి కిరణ్ వాళ్ల parents హాస్పిటల్ కు చేరుకొని మంచం లో ఉన్న తమ కొడుకును చూసి మూర్చపోయారు.తమకు ఎంతో చేదోడుగా ఉంటాడు అని ఎంతో కష్టపడి ఉన్నదానిలోనే దాచి చదివించి చేతి కి అందివచ్చే టైం కు తమ కొడుకు ఇలా మంచానికి అతుక్కుపోవటం చూసి తట్టుకోలేకపోయారు.
ఒక నెల తర్వాత తన జీతం తెసుకుని ఆఫీసు నుండి నేరుగా కిరణ్ వాళ్ల ఇంటికి వెళ్ళాడు నిఖిల్.మంచం లో ఉన్న తన ఫ్రెండ్ ను చూసి తట్టుకోలేకపోయాడు నిఖిల్.తన జీతం లో సగం మొత్తం ఒక పదిహేను వేలును కిరణ్ తండ్రి కి ఇచ్చాడు."సారీ అంకుల్.వీడిని ఇలా చూస్తుంటే చాలా బాధగా ఉంది.ఇదంతా నా వల్లనే జరిగింది అనిపిస్తోంది నాకు.నేను అనవసరం గా వీడిని పురికొల్పకపోతే వీడు byke రేస్ లో పాల్గొనేవాడే కాదు.మా అమ్మా  వాళ్ళు ఎంత చెప్పినా మొండిగా వినలేదు నేను.ఈ శిక్ష ఏదో నాకే వేసుంటే బాగుండేది ఆ దేవుడు.అన్యాయం గా నా ఫ్రెండ్ బలి అయిపోయాడు.నా మూలం గా వాడి ఉద్యోగం పోయింది.మీరు ఇబ్బందులలో ఉంటారు అని నా జీతం లో సగం వాడికి ఇద్దాం అనుకుంటున్నాను.ఇక నుండి మందు తాగను,బైకే రేస్ లు చేయను నా ఫ్రెండ్ సాక్షి గా" అని కుమిలి కుమిలి ఏడ్చాడు నిఖిల్.అప్పటినుండి మందు,byke racelu మానేసి నలుగురికి ఉపయోగ పడే పనులు చేయటం మొదలుపెట్టాడు నిఖిల్.తన ఫ్రెండ్ కు ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకున్నాడు.తమ కొడుకు లో వచ్చిన మార్పు ను చూసి ఎంతో సంతోషించారు నిఖిల్ తల్లిదండ్రులు.

Aug 25, 2010

నూరేళ్ళు

ఇవ్వాల్టికి సరిగా మదర్ తెరిస్సా పుట్టి వందేళ్ళు..ఎవ్వరూ ఇప్పటిదాకా రాయలేదేంటా అనుకున్నా,,బహుశా ఎవరికీ గుర్తు ఉండి ఉండదేమో,,టీవీ లలో కూడా ఎక్కడ చూడలేదే ఒక్క ఛానల్ లో మాత్రం  చూసా అంతే,,అయినా మన వాళ్ళకు మంచి చేసినవాళ్ళు గుర్తు ఉండరు కదా ఎక్కువగా,,ఎవరు ఎప్పుడు స్కాం    లలో ఉంటారా,,ఎవరి గుట్టు రట్టు చేద్దామ అనే కానీ జనాలకు ఉపయోగ పడే మంచిని గుర్తుచేద్దాం అని ఉండదు కదా,,పోనిలెండి మనం గుర్తు చేసుకుందాం ఆవిడని కనీసం ఈ ఒక్క రోజైన...
తెరిస్సా  చెప్పిన  నేటి కాలానికి పనికొచ్చే quotes గుర్తుచేసుకుందాం  ..
                                  Do not wait for leaders; do it alone, person to person.
                                  Everytime you smile at someone,it is an action of love,a gift to that person,a beautiful  thing.                                   I am a little pencil in the hand of a writing God who is sending a love letter to the world.  
                                  If you can't feed a hundred people, then feed just one.
                                  Kind words can be short and easy to speak, but their echoes are truly endless.


Aug 17, 2010

జల జలా జలపాతం

ఈ వీడియొ నేను మా ఇంట్లో తీసాను,,నాకు పెద్ద వర్షం పడినప్పుడు  మెట్ల  మీద  నుండి  నీళ్ళు  పడుతుంటే  చూడటం  ఇష్టం ,,అదొక  జలపాతం లా  అనిపిస్తుంది ,,ఎప్పుడు  వీడియొ తీద్దామన్నా కుదరదు,,అలాంటిది ఈ సారి కుదిరింది,,మీరు కూడా చూడండీ ఒకసారి,,,

చేసి చూడండీ,,

కరెంటు పోయినప్పుడే మనకు సెల్ లో battery అయిపోతుంది,,కనీసం ఒక గంట అయినా ఉంటే బాగుండు charging అనిపిస్తుంది,,అందుకే ఈ వీడియొ లో ఉన్నట్టు ఫాలో అయిపోండి,,జస్ట్ ఒక సారి సరదా గా చేసి చూడండీ,,సెల్ ఏమి పాడవదు    లెండి,,battery ఫుల్ అవకపోయినా పర్వాలేదు సెల్ పాడుకాకుండా ఉంటే చాలు అంటారా,,సరే మీ ఇష్టం,,
ఈ వీడియొ నాకు మా ఫ్రెండ్ మెయిల్ చేసింది,,తనకు ఎవరో పంపారు ట,,తను ట్రై చేసింది ఒక 5 గంటలు మాత్రం వచ్చింది ట battery ,అప్పటికే ఉన్న ఒక్క పాయింట్ వాళ్ల వచ్చిందో లేక నిజంగానే charging అయ్యిందో ఆ దేవుడి కే తెలియాలి.పర్లేదులెండి ఆ మాత్రం వచ్చింది గా,నేను ట్రై చేద్దాం అంటే నాది నోకియా సెల్ కాదు,(అది నా అదృష్టం అనుకోండి,,లేకపోతె నా ఈ పిచ్చి ప్రయోగం తో సెల్ పాడయితే ఇంట్లో జజ్జనకే ఇంక..)ఇందులో నోకియా తో చేసాడు గా.ఎవరైనా ట్రై చేస్తే నాకు కామెంట్ చేయండి,,
అల్ ది బెస్ట్...

Aug 16, 2010

స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

నిన్న ఆగష్టు  14 న  మా ఇంటి దగ్గర స్కూల్ లో జెండా పండుగ బాగా చేసారు..జెండా ఎగరేసారు.చాక్లెట్టులు,బిసికెట్టులు పంచారు.competitions ఏవో పెట్టారు ట గత వారం నుండి పిల్లలకు prizes ఇచ్చారు,,పిల్లలు స్కూలు ను భలే బాగా decorate చేసారు..నాకైతే నేను చదువుకునే రోజులు గుర్తువచ్చాయి..మేము కూడా మా క్లాసు ను ఇలాగె చేసేవాళ్ళం అని అనిపించింది..చిన్న ప్రైవేటు స్కూల్ అయినా డ్రిల్ చేయించి మార్చ్ ఫాస్ట్ చేయించారు పిల్లలతో. చాలా ముచ్చట గా అనిపించినిది.
అంతా బానే ఉంది కానీ నేనే ఆగష్టు  14 అని రాసాను తప్పు గా అని మీరు అనుకుంటున్నారు కాదు..కానే కాదు ఎందుకంటే ఈ తతంగం అంతా జరిగింది నిజం గా ఆగష్టు 14 ననే,ఎందుకంటే ఆగష్టు 15 ఆదివారం వచ్చింది కదా,ఆ రోజు సెలవు కదా,పిల్లలు రారు కదా బడికి అని ముందే చేసేస్తున్నారు టా,ఇదేక్కడ విడ్డురం అనిపించింది నాకు,సెలవు అయినా పిల్లలు ఇష్టం గా వస్తారు ఇలాంటి స్కూల్ functions కు,పోనీ చిన్నపిల్లలను వద్దు అని చెప్పి ఎనిమిదవ తరగతి నుండి పిల్లలను రమ్మన వచ్చు గా.అస్సలు ముందు పంతుల్ల కు బద్ధకం,ఎవడు వస్తాడులే మళ్లీ ఒక గంట పని కోసం అని మన చరిత్ర లో ఒక రోజు ఘటన ను ముందుకు మార్చేసారు.ఈ స్కూలు నేను కళ్లారా చుస్తే ఇంకొక స్కూల్ లో కూడా ఇలాగె చేసారు అని నేను చెవులారా విన్నాను,అంత గా పదిహేనున స్కూల్ వద్దు అనిపిస్తే అస్సలు జెండా ఎగరేయటమే మానేయాలి కానీ ఎవరిష్టమోచ్చినట్టు వాళ్ళు ఎగరేస్తారా,అస్సలు కాలేజీ కు అయితే వెళ్ళే పనే లేదు అందరికీ సెలవే,software  ఆఫీసు లలో అయితే అస్సలు గుర్తే ఉండదు ఈ రోజు,వాళ్ళకి thanksgiving డే గుర్తువుంటుంది కానీ మన independence డే పట్టిచ్చుకొనే పట్టిచ్చుకోరు,ఏదో ఒక రోజు సెలవు కోసమే ఈ హడావుడి అని అనిపిస్తుంది.అంతా మొక్కుబడి హడావుడి.

Aug 12, 2010

చుక్ చుక్ రైలు

మా బాబు కు రైలు అంటే బాగా ఇష్టం..రైల్లో వెళ్ళేప్పుడు అందరికి టాటా చెప్తూ ఉండేవాడు,ఇంక కంప్యూటర్ లో కూడా rhymes కాకుండా ట్రైన్ పెట్టమనేవాడు,వాడి గొడవ భరించలేక గూగుల్ లో వెతికి మరీ ఇండియన్ ట్రైన్స్ పెట్టేదాన్ని.బాగా ఎంజాయ్ చేసేవాడు,ఒక సినిమాలో బ్రహ్మానందం కు కూడా రైలు కూత వినిపిస్తేగాని ముద్ద దిగనట్టు మా వాడికి కూడా రైలు పెట్టందే ముద్ద ముట్టడు,,

ఈ ట్రైన్ మోత విని విని నాకు రైల్వే స్టేషన్ లో ఉన్నట్టు అనిపించేది.,ఆ ట్రైన్ లు వీడితో పాటు చూసి చూసి నాకు కూడా బోర్ కొట్టేసింది,సరే కదా ఒక సారి వేరే దేశాల్లోని రైళ్ళు చూద్దాం అని సింగపూర్ ట్రైన్స్ అని సెర్చ్ చేశా,భలే బాగున్నాయి మన ట్రైన్స్ తో compare చేస్తే,ఆటోమాటిక్ డోర్ సిస్టం..మరీ మన దేశం లో కూడా ఉన్నాయేమో ఎక్కడైనా నాకు తెలియదు.స్టాప్ రాగానే డోర్ ఓపెన్ అవుతోంది,డోర్ క్లోజ్ అవ్వగానే ట్రైన్ స్టార్ట్ అవుతోంది,ట్రైన్ announcement కూడా బాగుంది,వస్తోంది అని, వచ్చింది అని, తర్వాత వెళ్ళిపోయింది అని.ఇలా మనకు కూడా ఉంది అనుకోండి ట్రైన్ announcement మరి వేరే దేశం అంటే కొంచెం మన మనస్సు కు బాగా నప్పుతుంది కదా,పొరిగింటి పుల్లకూర రుచి కదా ,ఆలోచిస్తుంటే ఈ డోర్ సిస్టం కొంచెం బానే ఉంది కానీ మన ఉరులలో కుదరదేమో అనిపిస్తోంది,మనకసలే డోర్ దగ్గర నిలబడందే గాలి రాదాయే,మనలో చాలా మంది అంతే కదా ఎంట్రన్సు లో ఉన్న మెట్ల మీదే కూర్చుంటారు, ఎక్కేవాళ్ళకు అడ్డం గా ఉన్నా కుడా అక్కడే కూర్చుంటారు తట్ట బుట్ట తో..
అస్సలు ముఖ్యమైనది సమోసా,వేరుసెనగ కాయలు,popcorn వీళ్ళు రారు గా డోర్ సిస్టం ఉంటే,అస్సలు ట్రైన్ ఎక్కేది ఆ సమోసా తినటం కోసం ఏగా,మరీ అంతలా ఛి అనక్కర్లేదండి,,చిన్నప్పుడు అందరం తిన్నవాల్లమే,నాకైతే బాగా నచ్చుతుంది ట్రైన్ సమోసా ఇప్పుడు తినటం లేదనుకోండి,నేను కూడా ఏబ్బే అనే అంటున్నాను.ప్లాట్ఫారం కు ట్రైన్ కు మధ్య కొంచెం ఎక్కువనే ఖాలీ ఉంటుంది మనకు,(అదేనండి హడావుడి లో ఎక్కేప్పుడు మన చెప్పు జారి పడే అంత),సింగపూర్ ట్రైన్స్ కు ప్లాట్ఫారం కు అంత గ్యాప్ కనిపించలేదు నాకు,చెప్పు లుపారేసుకుని,ఇంట్లో వాళ్ల చేత తిట్టించుకునే పని ఉండదు  వాళ్లకు హాయ్ గా,లోపల సిట్టింగ్ arrangement కూడా బాగుంది వెరైటీ గా బస్సు లో ఉన్నట్టు ఉంది. అటు ఇటు సీట్స్ మధ్యలో hangers నున్చున్నవాళ్ళు పట్టుకోటానికి,నాకైతే బాగా నచ్చాయి సింగపూర్ ట్రైన్స్,,,
అక్కడ వాళ్ళు ఎవైరనా ట్రైన్స్ గురించి బ్లాగ్ లో రాస్తే బాగుండు..చదవాలి అని ఉంది,,
ఆల్రెడీ ఎవరైనా  రాసి ఉంటే నాకు లింక్ పంపించండి మీ బ్లాగ్ ది  




చూడండీ ఈ కింద లింక్స్ మీరు కూడా,,
http://www.youtube.com/watch?v=x1Jz1XT3r3k

Aug 1, 2010

ఎట్లాగబ్బా


ఇవ్వాళ నాకు పిచ్చేక్కినంత పనయిందనుకోండి ఎందుకంటారా ఇవ్వాళ ఉదయం నుండి సాయంత్రం దాక నెట్ కనెక్షన్ పోయింది మాకు.నిన్ననే ఒక ఛానల్ లో న్యూస్ చూపించారు ఇంటర్నెట్ కు ఇంక 344 రోజులేటా ఎందకంటే ip అడ్రస్ ల లిమిట్ అయిపోవచ్చింది ట.400 కోట్ల నిడివి పెడ్తే అది దాదాపు అయిపోవచ్చింది ట.జీవితం ఆగిపోతుంది అని ఆ anchor వ్యాఖ్యానిస్తే మరీ అంతలా ఎందుకు అనిపిస్తుంది లే అని అనుకున్నాను,కానీ ఇవ్వాళ బాగా తెలిసింది.
బాగా అలవాటు పడిపోయాం ఈ ఇంటర్నెట్ కు,ఎవరెవరు బ్లాగులు రాసారా,న్యూస్ ఏంటా? ఎవరెవరు నా బ్లాగు ను చూసారా? ఏమి కామెంట్స్ ఇచ్చారా,మెయిల్స్ ఏమైనా వచ్చాయా ఇలాగ ఆలోచనలన్నీ నెట్ చుట్టుతా పరుగులు పెట్టాయి.కనీసం గంట లో ఒకసారైన మెయిల్ నో లేక బ్లాగుల update నో,ఫ్రెండ్స్ తో చాట్ నో,గ్రూప్ లలో మెసేజెస్ నో చూసే అలవాటు ఈ ప్రాణానికి.అలాంటిది అన్నీ బంద్ ఆంటే ఒక్కసారి ఉహించుకోటానికి కొంచెం కష్టం గానే అనిపిస్తుంది.మన సంగతి పక్కన పెట్టండి పెద్ద పెద్ద కంపెనీ లో అందునా మన software engineers పని అయితే అంతే ఇంక అస్సలే code గూగుల్ లో సెర్చ్ చేసి కాపీ పేస్టు లు చేస్తుంటారు ఇంక నెట్ లేకపోతె అందరి జాబులు గోవిందే,(అంటే జాబు చేసినప్పుడు నేను అంతే చేసేదాన్ని లెండి అందుకే అలా అన్నా,)బ్యాంకులు,రైళ్ళు అన్నీ సర్వీసెస్ ఆగిపోతా ఏమో ,అయినా దీనికి solution కనిపెడతారు లెండి మన వాళ్ళు..జస్ట్ ఒకసారి ఆలోచిస్తే భయం వేస్తుంది ఇంత అలవాటు ఇంత అవసరం పడిపోయాం నెట్ కు అని.