Feb 27, 2010

ఆనందాల హోలీ

 
అందరికి హోలీ శుభాకాంక్షలు..
 హోలీ ను natural colors తో ఎంజాయ్ చెయ్యండి..క్రిందటి ఇయర్ అనుకుంటా ఈ రంగులు కల్లల్లోపడి పాపం ఒకరిద్దరికి కళ్ళు పోయిన సంఘటనలు జరిగినాయి... natuaral colors కు కొన్ని చిట్కాలు నేను చెప్తాను... ఏంటంటే ఎరుపు రంగు కు చక్కగా కుంకుమ చల్లుకోవచ్చు,పసుపు ఎట్లాగు పసుపే,బ్లూ కలర్ కోసం బట్టలకు పెట్టె నీలి మందు బాగా ఉంటుంది,,ఇంకా బీట్రూట్ ను mixi లో వేసి కాసిని నీళ్ళు పోసి తిప్పితే  చక్కగా నిండు ఎరుపు రంగు వస్తుంది... ఇంకా carrot ను కుడా ఇలాగె mixi లో వేస్తె వెరైటీ గ ఎల్లో shade వస్తుంది...చాలు కదా మనకు ఈ రంగులు ఆడుకోవడానికి... బయట రంగులు వాడాము అనుకోండి అస్సలే ఎండలు ఎక్కువగా ఉన్నాయి స్కిన్ అల్లెర్జీస్  వస్తాయి...బట్టలు కు అంటినా రంగు సామాన్యం గ వదలదు... కళ్ళలో పడినా ప్రమాదమే... సో ఆరోగ్యమైన హోలీ జరుపుకుందాం అందరం...
 

Feb 26, 2010

ఇంటి బడ్జెట్

టీవీ లో ఈ బడ్జెట్ గురించి చూస్తుంటే నాకు నా చిన్నప్పటి విషయాలు గుర్తువస్తున్నాయి..
నా చిన్నప్పుడు మా నాన్నగారు నెల బడ్జెట్ అంటే నెలవారీ ఖర్చులు ఎ నెలకు ఆ నెల ఒక డైరీ లో రాసేవాళ్ళు. అప్పుడు ATM లు లేవు గా శాలరీ అంతా కాష్ ఇచ్చేవాళ్ళు..సో నెల మొదటి తారీఖున ఎంతవచ్చింది ఎంత ఖర్చులు ఉన్నాయి..అని లెక్కలు వేసేవాళ్ళు,.ప్రతి ఆదివారం బాలన్స్ డైరీ లో ఎంత  ఉంది..ఇంట్లో ఎంత ఉంది అని tally చేసుకునేవాళ్ళు..
నేను ఇంటర్ నుండి హాస్టల్ లో ఉండే చదువుకున్నా లెండి..పాకెట్ మనీ ఇచ్చింది,ఖర్చులు  కుడా ఇలాగె డైరీ లో రాయమనేవాళ్ళు.. అంటే వృధా ఖర్చులు చేయకుండా ఉంటాము అని.. అలాగే రాసేదాన్ని..
ఇంకా నా జాబు మొదటి లో కుడా శాలరీ కాష్ నే ఇచ్చేవాళ్ళు అది చిన్న కంపెనీ అందుకని,, తర్వాత ATM వచ్చింది ఎకౌంటు create చేసారు... సరే ఖర్చు కాస్త అదుపు లో ఉండాలి కదా అని నేను ATM ministatements అన్ని tally చేసుకుని చూసుకునేదాన్ని.. ఎలాగ ఖర్చు చేస్తున్నాను అని...
ఇంక పెళ్లి అయినాక ఇంకా ఖర్చులు పెరుగుతాయి గా.. నేను నా ఖర్చులు,ఆయన ఖర్చులు,కలిపి ఇంటి కోసం చేసే ఖర్చులు.. ఇంక ఇన్ని statements ఎక్కడ దాచుతాం...కాష్ ఏమి తీసుకు వెళ్తాము అని ATM పట్టుకెల్తాము షాపింగ్ కు ఇంకేముంది అక్కడ అవసరం ఉన్నవి లేనివి చూడగానే నచ్చేస్తాయి...పోనిలే ఉన్నాయి గ డబ్బులు next month తగ్గిద్దాం లే  అని  కోనేస్తాము  .. చేతిలో డబ్బుండి ఇచ్చేస్తుంటే ఆ భాధ వేరు ఇలా ATM ద్వారా ఐతే అంతగా బాధ ఉండదు గా..కూరలు కుడా ఏమి వెళ్తాములే రైతు బజార్ దూరం కదా  అని దగ్గరే ఉన్న ఫ్రెష్ లో కొనేస్తాము  అక్కడ కార్డు నే.. ఇంక సరుకులు చెప్పేదేముంది అక్కడే...ఇలాగా అయిపోయేటప్పటికి మనం ఎంత ఖర్చు చేస్తున్నాం అనేది ఖర్చు అయినాక కానీ తెలియటం లేదు..అదే మనం చక్కగా కాష్ తీసుకు వెళ్తే మన దగ్గర ఉన్న వేయి తో తే షాపింగ్ చేసి వద్దుము కదా..
ఇది వరకు కాష్ కదా ఎంత మిగిలిందో చూసుకుని మిగిలింది ముందు జాగ్రత్త గ బ్యాంకు లో వేసుకునేవాళ్ళం ఇప్పుడు మొత్తం బ్యాంకు నే కదా.. ఎంత మిగిలిందో తెలియదు (అంటే ఈ నెల మనం ఎంత సేవ్ చేసాము అనేది...  )
కేంద్ర బడ్జెట్ ఎంత important నో మనకు  మన ఇంటి బడ్జెట్ కూడా అంటే important .. మనం శాలరీ ఎకౌంటు అనే అక్షయపాత్ర వచ్చింది అని ఎంత సంతోష పడతామో ATM అనే పెద్ద చిళ్లి  ఉంది అని కూడా గ్రహించాలి..
షాపింగ్ కు వెళ్ళాల్సి వస్తే ఆయనను నేను ఏమండి డబ్బులు ఇవ్వరా అని అడగకుండా  మీ ATM ఇవ్వండి అను అడుగుతున్నాను.. ఆయన "అదే ఇదివరకు మొగుడిని ఏమండి ఒక 500 ఇవ్వండి ఇవి కొనాలి, అవి  కొనాలి  అని చెప్పి అడిగేవాళ్ళు ఆడవాళ్ళు  ఏకం గ ATM నే అడుగుతున్నావ్ నువ్వు ,,కాలం మారింది"  అని అంటూ  ఉంటారు..
జాగ్రత్త గ చూసుకుంటే ATM ఉన్నా కూడా మనం ఖర్చు అదుపు లో పెట్టుకోవచ్చు కాకపోతే కాస్త ఖర్చు పెట్టేముందు ఇది అవసరమా కాదా అని ఒక్క సారి అనుకుంటే చాలు..

Feb 24, 2010

కాశీ అందము

ఇవి  అన్ని  కాశీ  లో  తీసిన  ఫొటోస్ ..ఈ  మధ్య మా  అత్తయ్యగారు,మామయ్యగారు మహాశివరాత్రి  కు  వెళ్లారు ..వాళ్ళు  తీసిన  అందమైన  ఫొటోస్ .. వాళ్ళు ఊరు వెళ్తున్నారు అని ఒక రోజులో డిజిటల్ కెమెరా తో ఫొటోస్ తీయటం చూపించాం .. ఎంత అందమైన ఫోటో తీసారో చుడండి..ఇంకా చాలా తీసారు కాని వాటిలో కొన్ని ఇక్కడ పెట్టాను..

Feb 15, 2010

ఏమవుతోంది మన భవిత


ఈ మధ్య మా వారు ఎన్ని క్లాస్సేస్ జరిగాయి కాలేజి  లో అని లేక్కలేసుకుంటుంటే నేను ఉన్నాలెండి అక్కడే..
సెప్టెంబర్ లో ఒక పది రోజులు,అక్టోబర్ లో పదహారు రోజులు,నవంబర్  లో పన్నెండు రోజులు,డిసెంబర్ లో అయిదు రోజులు
january   లో పద్నాలుగు రోజులు మొత్తం మీద ఈ నాలుగు నెలల మీద 51 రోజులు క్లాస్సులు జరిగినాయి..మిగతా అన్ని బందులు,సెలవలె...
ఇంక మరి ఈ ఫిబ్రవరి లో ఎలా ఉంటుందో..ఇప్పుడే మళ్ళి రాజుకుంటోంది గ తెలంగాణా మీద మళ్ళి (లొల్లి)..
రోజు కాలేజి కు వెళ్లి ఏదో పాటాలు వింటేనే ప్రస్తుత తరుణం లో ఉద్యోగాలు రావటం చాలా కష్టం గ ఉంది..అస్సలే recission టైం ఇది..
ఇంక ఈ విధం గ కాలేజి  నడవకపోతే ఇంక ఏమి వస్తుంది చదువు పిల్లలకు...మన university లలో చదువుకోవాలి అని పాపం దూరం  జిల్లాల నుండి వచ్చ్హిన వాళ్ళకు చుక్కెదురే ఈ సెమిస్టరు..మిగత university వాళ్ళకు చక్కగా క్లాస్సేస్ జరుగుతున్నాయి,,
రేపు ఉద్యోగం interivew లలో ఇలా మాకు క్లాస్సేస్ జరగలేదు అందుకే percentage తక్కువ వచ్చింది అని చెప్తే వాళ్ళు ఇస్తారా మనకు ఉద్యోగం..
బంద్ అనగానే ముందుగ విద్యాసంస్థలు సెలవు ,పరిక్షలు రద్దు,బస్సులు బందు ఇంక ఇంతేనా
ROME CAN NOT BE BUILT IN A DAY కదా.. టైం పట్టే విషయాల మీద ప్రస్తుత పరిస్థితులను  తారుమారు చేస్తే ఎట్లాగు..
విద్యార్దులను ఎక్కవ involve చేయటం ఎందుకో ఈ రాజకీయాల వాళ్ళు..వాళ్ల పదవులు కు మాత్రం వాళ్ళు రాజీనామాలు చేయరు..హాయిగా AC రూం లలో కూర్చొని కబుర్లు చెప్తారు..
ఎటొచ్చి చేడేది విధ్యార్దులే  ..ఈ విద్యార్ధులు అది అర్ధం చేసుకోకుండా అనవసరం గ వాళ్ళ కెరీర్ పాడుచేసుకుంటున్నారు  ...
ఇప్పటికన్నా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఏదో ఒక నిర్ణయం చేస్తే బాగుంటుంది...

Feb 13, 2010

Funny Love Appointment letter
Dearest Ms XXX,

I am very happy to inform you that I have fallen in Love with you since the 14th of October (Monday). With reference to the meeting held between us on the 27th of July. at 1500 hrs, I would like to present myself as a prospective lover.

Our love affair would be on probation for a period of three months and depending on compatibility, would be made permanent.
Of course, upon completion of probation, there will be continuous on the job training and performance appraisal schemes leading up to promotion from lover to spouse.

The expenses incurred for coffee and entertainment would initially be shared equally between us. Later, based on your performance, I might take up a larger share of the expenses. However I am broadminded enough to be taken care of, on your expense account.

I request you to kindly respond within 30 days of receiving this letter, failing which, this offer would be cancelled without further notice and I shall be considering someone else. I would be happy, if you could forward this letter to your sister, if you do not wish to take up this offer.

Thanking you in anticipation,

Yours sincerely,
Mr. YYY
                        HAPPY VALENTINE'S DAY                    

Feb 11, 2010

Idea

మొన్న  మా ఇంటి ముందున్న restaurant కు ఒక couple వచ్చారు కార్ లో..ఐతే అతను పార్సెల్ తెసుకురావటానికి లోపలకు వెళ్లారు కార్ బయటనే పార్క్ చేసి..లోపల వాళ్ళ భార్య,చిన్న పాపా ఉన్నారు ఎందులో కార్ లోపల..అంతే దిగటం ఎందుకులే అనుకున్నట్లున్నారు.. సో ఆయన ఒక్కరే వెళ్లారు..కార్ కు లాక్ చేసి..ఐతే అది AC కార్ అనుకుంటా విండోస్ అన్ని బంధించి ఉన్నాయి..లోపల పాప బాగా ఎడుస్తున్నట్లు ఉన్నది ఇంక ఆమె ఫోన్ చేసి రామ్మన్నట్లు ఉన్నది..(ఇది నేను అనుకున్నలెండి) ఆయన వెళ్ళిన 10 minutes లోపలే వచ్చేసారు...లాక్ తీయగానే  ఆమె పాప తో కిందకు  దిగి లాలిస్తోంది ఏడుస్తున్న పాపను...అంటే లోపల చికాకు వేసి ఏడిచి ఉంటుంది పాప అనుకున్నాను నేను,,కార్ అద్దాలు కుడా నల్ల గ ఉన్నాయి ..లోపల వాళ్ళు బయట వాళ్ళకు ఎవ్వరు కనపడరు.. నాకు అ కార్ చూడగానే అనిపించింది మొన్న ఇలాగ నల్ల విండోస్ ఉన్న టయోట లో నే కదా వైష్ణవి ను ఎత్తుకెళ్ళింది kidnappers అని ..లోపల ఎవరైన  అరుస్తున్న,విండో ను కొడుతున్న బయట వాళ్లకు కనపడదు కదా..అందుకే kidnappers ఎక్కువగా కార్లలో కిడ్నాప్ చేస్తున్నారేమో అనిపించింది నాకు..
అలాగా కార్లకు నల్ల అద్దాలే  ఎందుకు పెట్టాలి??? కొంచం transparant పెట్టొచ్చు కదా like ambassodor కు ఉన్నట్టు గ..
బస్సు ల లో ఉన్నట్టు గా emergency విండో లాగా కార్ కు బ్యాక్ ఉండే అద్దం emergency విండో అని ఈజీ బ్రేఅక్  పెట్టొచ్చు కదా అని అనిపించింది...ఎవరినా emergency అప్పుడు దూకటానికి వీలుగా ఉంటుంది కదా...మరి ఈ కార్ అద్దం  మనం చేతితో కొడ్తే పగులుతుందో లేదో నాకు తెలియదు లెండి ఎప్పుడు ట్రై చేయలేదు గ పగలకొట్టతానికి... సో కొన్ని కొన్ని changes వల్ల ఇలాంటి kidnaps వాటిని ఏమైనా  కొంచం కంట్రోల్ చేయచ్చేమో అనిపించింది..

Feb 1, 2010

ఫోటో సవరణ

ఇవ్వాళ పేపర్ లో వేసారు ముస్లిం మహిళలు బురఖ లేకుండా ఫోటోలు తీయిన్చుకోవచ్చు  అని..బురఖ ఉండేటప్పటికి ఎవరు ఎవరో అర్ధం కాదు కదా అందుకే ఎక్కువమంది మహిళలను అరబ్ దేశాలకు తేలికగా ఎత్తుకుపోగల్గుతున్నారు  దుండగులు.. కనీసం ఇప్పటికయినా మతపెద్దలు ఆమోదించినందుకు  మనం ఆనందపడాలి..

ఈ ఫోటో నేనూ ఒక సైట్ నుండి డౌన్లోడ్ చేశాను.. కేవలం సరదా కోసమే పెట్టాను..
ఎవ్వరయిన  ఫీల్ అయితే క్షమించండి  అని మనస్పూర్తి గ కోరుకుంటున్నాను..

ఎ కుళ్ళు కుతంత్రాలు లేని లోకం లో చిన్నారి వైష్ణవి తో జన్మాంతం ఆడుకోడానికి వెళ్ళిపోయిన వైష్ణవి తండ్రి ,వైష్ణవి ల ఆత్మలు శాంతించాలి అని కోరుతున్నాను..