మా బాబు కు రైలు అంటే బాగా ఇష్టం..రైల్లో వెళ్ళేప్పుడు అందరికి టాటా చెప్తూ ఉండేవాడు,ఇంక కంప్యూటర్ లో కూడా rhymes కాకుండా ట్రైన్ పెట్టమనేవాడు,వాడి గొడవ భరించలేక గూగుల్ లో వెతికి మరీ ఇండియన్ ట్రైన్స్ పెట్టేదాన్ని.బాగా ఎంజాయ్ చేసేవాడు,ఒక సినిమాలో బ్రహ్మానందం కు కూడా రైలు కూత వినిపిస్తేగాని ముద్ద దిగనట్టు మా వాడికి కూడా రైలు పెట్టందే ముద్ద ముట్టడు,,
ఈ ట్రైన్ మోత విని విని నాకు రైల్వే స్టేషన్ లో ఉన్నట్టు అనిపించేది.,ఆ ట్రైన్ లు వీడితో పాటు చూసి చూసి నాకు కూడా బోర్ కొట్టేసింది,సరే కదా ఒక సారి వేరే దేశాల్లోని రైళ్ళు చూద్దాం అని సింగపూర్ ట్రైన్స్ అని సెర్చ్ చేశా,భలే బాగున్నాయి మన ట్రైన్స్ తో compare చేస్తే,ఆటోమాటిక్ డోర్ సిస్టం..మరీ మన దేశం లో కూడా ఉన్నాయేమో ఎక్కడైనా నాకు తెలియదు.స్టాప్ రాగానే డోర్ ఓపెన్ అవుతోంది,డోర్ క్లోజ్ అవ్వగానే ట్రైన్ స్టార్ట్ అవుతోంది,ట్రైన్ announcement కూడా బాగుంది,వస్తోంది అని, వచ్చింది అని, తర్వాత వెళ్ళిపోయింది అని.ఇలా మనకు కూడా ఉంది అనుకోండి ట్రైన్ announcement మరి వేరే దేశం అంటే కొంచెం మన మనస్సు కు బాగా నప్పుతుంది కదా,పొరిగింటి పుల్లకూర రుచి కదా ,ఆలోచిస్తుంటే ఈ డోర్ సిస్టం కొంచెం బానే ఉంది కానీ మన ఉరులలో కుదరదేమో అనిపిస్తోంది,మనకసలే డోర్ దగ్గర నిలబడందే గాలి రాదాయే,మనలో చాలా మంది అంతే కదా ఎంట్రన్సు లో ఉన్న మెట్ల మీదే కూర్చుంటారు, ఎక్కేవాళ్ళకు అడ్డం గా ఉన్నా కుడా అక్కడే కూర్చుంటారు తట్ట బుట్ట తో..
అస్సలు ముఖ్యమైనది సమోసా,వేరుసెనగ కాయలు,popcorn వీళ్ళు రారు గా డోర్ సిస్టం ఉంటే,అస్సలు ట్రైన్ ఎక్కేది ఆ సమోసా తినటం కోసం ఏగా,మరీ అంతలా ఛి అనక్కర్లేదండి,,చిన్నప్పుడు అందరం తిన్నవాల్లమే,నాకైతే బాగా నచ్చుతుంది ట్రైన్ సమోసా ఇప్పుడు తినటం లేదనుకోండి,నేను కూడా ఏబ్బే అనే అంటున్నాను.ప్లాట్ఫారం కు ట్రైన్ కు మధ్య కొంచెం ఎక్కువనే ఖాలీ ఉంటుంది మనకు,(అదేనండి హడావుడి లో ఎక్కేప్పుడు మన చెప్పు జారి పడే అంత),సింగపూర్ ట్రైన్స్ కు ప్లాట్ఫారం కు అంత గ్యాప్ కనిపించలేదు నాకు,చెప్పు లుపారేసుకుని,ఇంట్లో వాళ్ల చేత తిట్టించుకునే పని ఉండదు వాళ్లకు హాయ్ గా,లోపల సిట్టింగ్ arrangement కూడా బాగుంది వెరైటీ గా బస్సు లో ఉన్నట్టు ఉంది. అటు ఇటు సీట్స్ మధ్యలో hangers నున్చున్నవాళ్ళు పట్టుకోటానికి,నాకైతే బాగా నచ్చాయి సింగపూర్ ట్రైన్స్,,,
అక్కడ వాళ్ళు ఎవైరనా ట్రైన్స్ గురించి బ్లాగ్ లో రాస్తే బాగుండు..చదవాలి అని ఉంది,,
ఆల్రెడీ ఎవరైనా రాసి ఉంటే నాకు లింక్ పంపించండి మీ బ్లాగ్ ది
చూడండీ ఈ కింద లింక్స్ మీరు కూడా,,
http://www.youtube.com/watch?v=x1Jz1XT3r3k
Same train system is available in DELHI.
ReplyDeletesame with my kid..we run all train rhymes , real trains in youtube and feed him...i wonder how the generation changed...
ReplyDeleteDear Sister
ReplyDeletePlease go through the blog
http://jaajipoolu.blogspot.com/2010/05/blog-post_11.html
Regards
Your Brother
Anil