"అమ్మా" అనే పిలుపు వినిపించేసరికి ఒక్కసారి ఉలిక్కి పడి చూసింది వందన.తన చుట్టూ ఎవ్వరు లేరు ఏదో ఆలాపన అని అనుకొని తన పని లో నిమగ్నం అయ్యింది.మళ్లీ అమ్మా అనే పిలుపు వినిపించి ఎవ్వరు అది అని పిలిచింది కంగారుగా,,నేనమ్మా నీ బొజ్జలో ఉన్న పాపాయినమ్మ అని ముద్దు ముద్దు మాటలతో పలికింది ఒక స్వరం.వందన అప్పటికే తొమ్మిదవ నెల గర్భవతి.డాక్టర్ వారం లో ఆపరేషన్ చేయటానికి డేట్ ఫిక్స్ చేసింది.
తన పాప తనతో మాట్లాడుతోంది అని ఒకింత సంబ్రమాశ్చర్యాలకు లోనయింది వందన.తను అప్పుడప్పుడు అలాగే తన పాప తో మాట్లాడుతూ ఉంటుంది.అలాంటిది పాప తనతో మాట్లాడేటప్పటికి ఆనందం పట్టలేకపోయింది.
"నా బంగారు తల్లి నా,ఏంటమ్మా ఇంకా బజ్జోలేదా" అని అనునయం గా అడిగింది వందన."లేదమ్మా ఎందుకో భయం గా ఉంది,నిద్ర రావటం లేదు,బాధ గా ఉంది"అది ఆ పసి హృదయం."నీకు బాధలేంటి అమ్మా,హాయ్ గా నిద్ర పో"అని లాలించింది వందన."కాదమ్మా ఇంక నేను ఒక వారం లో వచ్చేస్తా కదా అందుకే దిగులు గా ఉంది"అన్నది పాప."బాధ ఎందుకమ్మా నేను ఉన్నాను కదా,నీకు ఏలోటూ రానివ్వను,అన్నీ కొనిపిస్తాను,నా కంటి రెప్ప లా చూసుకుంటాను" అని తన ప్రేమనంతా కూడకట్టుకుని మాటల్లో చెప్పింది."అడిగినవన్నీ కొనిస్తావమ్మా నువ్వు నాకు తెలుసు కానీ నువ్వే ఉండవు కదా నాతొ ఆడుకోవటానికి,నీ వొళ్ళో కూర్చోపెట్టుకుని జోకొట్ట టానికి" అని బాధ గా అంది పాప,అదేంటమ్మ అలాంటావ్,నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్తాను అని ధైర్యం చెప్పింది వందన."నిన్ననే కదా అమ్మా నువ్వు అన్నావ్ ఇంక మూడు నెలలే ఉంది నా లీవ్. తర్వాత కేర్ సెంటర్ లో చేర్చుదాం అని,ఆ కేర్ సెంటర్ ఆంటీ ని కూడా కలిసావ్ కదా అమ్మా,ఎన్ని వేలయిన పర్వాలేదు మంచి దానిలో చేర్చుదాం అన్నావ్ కదమ్మా,అక్కడ ఉన్న పిల్లలందరి లొనూ నవ్వే లేదు,అందరూ భయం భయం గా ఉన్నారు,అమ్మ కావాలి అని ఏడుస్తున్నారు.కొట్టి మరి తినిపిస్తోంది అమ్మా ఆయా అన్నం ఒక బాబు కు,చక్కగా అమ్మ చేతి గోరుముద్దలు తినాలి అని ఉంటుందమ్మ నాకు,నాకే కాదు నాలాంటి పిల్లలందరికీ ఉంటుంది. కాసేపన్నా అమ్మవొడిలో కూర్చోవాలి అని,ఆ వెచ్చదనం ను ఆస్వాదించాలి అని అనిపిస్తున్దమ్మ నాకు.ఉదయం నుండి సాయంత్రం దాక జైల్లో ఉన్నట్లు ఉంటుంది.రాత్రి కి ఎప్పటికో వాస్తావ్ నాకేమో నిద్ర వచ్చేస్తుంది.నీతో ఆడెదెప్పుడు,నా చిలిపి చేష్టలను ,నా ప్రతికదలికను నువ్వు చూసి ఆనందించేదేప్పుడు ,నన్ను స్వేచ్చగా నీ కడుపు లో కూడా ఉండనియట్లేదు నువ్వు నేను ఎప్పుడు రావాలో కూడా నువ్వే మంచి రోజు నిర్నయించేసావు,,ఇదెక్కడి న్యాయం అమ్మా,ఇదివరకు బయటి ప్రపంచం చూడాలి అని ఉవ్విళ్ళూరే వాళ్ళు ట కడుపులో పాపాయిలు,కానీ ఇప్పుడు నాకు రావాలి అంటేనే భయం వేస్తోందమ్మ" అంటూ కళ్ళనీళ్ళు పెట్టుకుని బోరున ఏడ్చింది చిట్టి తల్లి,,,
గబక్కున మెలకువ వచ్చింది వందన కు.చుట్టూ చుస్తే ఎవరు లేరు,వందన భర్త ఇంక నిద్రలోనే ఉన్నాడు,అయితే ఇప్పటి దాక తను పాప తో మాట్లాడిందంతా కలలో కాబోలు అని అనుకున్నది,,ఏంటి అంత కంగారు గా లేచావ్ అంటూ లేచాడు వందన భర్త,"ఏమి లేదండి,నేను ఒక ఏడాది అన్న నా లీవ్ ని extension చేస్తాను,ఈ జాబు కాకపోతే నాకు వేరే జాబు వస్తుంది, పాప కు నేను కాకబోతే ఎవరు చూస్తారు,నాకు ఆ creche నచ్చలేదు.పాపను స్వేచ్చగా,నా కళ్ళ ఎదురుగానే పెంచుకుంటాను,దాని ప్రతి అడుగు నేను ఎంజాయ్ చేయాలి,నా పాప ను నేనే కన్నుల్లో పెట్టుకుని చూసుకోవాలి"అని ఉద్వేగ భరితమయి కళ్ళ నీళ్ళతో భర్త ను అడిగింది వందన,"అలాగే అలాగే చేద్దాం లే దానికోసం ఎందుకు కంగారు పడుతున్నావ్,నీకు ఇష్టం అయినప్పుడే జాబు లో చేరుదువు గాని" అని భరోసా ఇచ్చాడు భర్త.ఇంక ఏ దిగులు లేదులే హాయ్ గా బజ్జో అని మనసులో అనుకుని పొట్ట మీద చేయి వేసుకుని నిశ్చింత గా నిద్రపోయింది వందన.
ఉద్యోగం చేసే ప్రతి మహిళ కు ఉండే బాధే ఇది,కానీ ఒక్క ఏడాది లీవ్ తీసుకున్నంత మాత్రానా మనం ఏమి కెరీర్ లో నష్ట పోము కదా,పిల్లలా మానసిక ఎదుగుదల చక్కగా ఉంటుంది తల్లి దగ్గర పెరిగితే,,నేను కూడా ముందు ఎక్కడో ఒక చోట పెడదాం లే బాబు ను అనుకున్నాను,కుదరక నేనే జాబు మానేసాను,,మళ్లీ ట్రై చేయొచ్చు,కానీ ఈ మధ్యనే తెలుస్తోంది అమ్మ ఎంత important నో first one year చైల్డ్ growth కు.
Chala bagundi :)
ReplyDeleteGood. When ever you have to take a judgement call on your personal and professional life balance, leaning towards personal life is always a better option.
ReplyDeleteKontavaraka manato mana peddavallu ante tatayyoo, naanammo etc vallu unte kontavaraku ee problem solve cheyavachu....