Apr 17, 2010

నా కపిత్వం

  ఏమి ఉబుసుపోక ఇవ్వాళ నేను నా కాలేజీ టైం నాటి డైరీ ఊరికే తిరగేసాను,, అందులో అప్పట్లో నేను చదివిన కవితలకు కొద్దిగా నా కపిత్వం జోడించి అంటే కొన్ని లైన్స్ మార్చి,కొన్ని లైన్స్ తీసేసి remix చేసి మళ్ళి రాసేదాన్ని,,,అదేనండి కాళిదాసు కవిత్వం కొంత నా పైత్యం కొంత అంటారే ఆ విధం గ కవిత్వం ను కాస్త కపిత్వం చేశా చుడండి మీరూ కూడా..

                       ఒకరికొకరం ఎవరో కుడా తెలియని స్థితి నుంచి
                       ఒకరికోసం ఒకరం అన్న పరిస్థితి కి తెచ్చే
                       అద్భుతమైన బంధం...స్నేహం
                       కళ్యానిరాగం అంత మధురమైనది 
                       రక్తసంబందానికి మించిన ఆత్మసంబంధం ...
                        .................మన ఈ స్నేహం... 

                       ప్రేమ గుడ్డిది అనుకుంటున్నారా ...కాదు
                       ప్రేమకు చూపు ఉంటుంది,
                       అ చూపే నాకు నిన్ను చూపింది
                       నా హృదయాన్ని నీ వైపు నడిపింది
                       నిన్ను నన్ను దగ్గర చేసింది
                       నా "మనసంతా నువ్వే" అనేలా చేసి
                      "నువ్వు లేక నేను లేను" అయ్యేటట్లు చేసి
                       తనను తానూ నిరూపించుకుంది...

                      నిన్నే నిత్యం తలుస్తూ 
                      నన్నే నిలువునా మరుస్తూ 
                      నా ఆణువణువూ లో నిండిన నీ తలపులను చూసి
                      నాలో నేనే మురుస్తూ 
                       నీకై నిలువెల్లా తపిస్తూ 
                       నీలో విలీనమయ్యే రోజు కోసం వేచి చూస్తూ,,, 
                       నిన్ను నా ప్రాణం కంటే మిన్న గా ప్రేమించే నీ......

                       నీ రాక కోసం 
                       వేచి చూస్తున్న నయనానికి ఎలా చెప్పాను... నిద్రపోమని 
                       నీ పిలుపు కోసం
                       పలవరిస్తున్న హృదయానికి ఎలా చెప్పాను... మానుకోమని 
                       ఎలా చెప్పినా,ఎంత చెప్పినా,,,
                       నా మాట వినదే....
                       తన మారం ఆపదే.....

                      గుండెలో ఆశను తెలుపలేదు నా మౌనం 
                      చూపులోని ఆశను చదవలేదు నీ స్నేహం
                      తలపులలో నీవు కొలువున్నా
                      కలుసుకోలేను ఎదురున్నా...
                      తెలిసి ఈ తప్పులు చేస్తున్నా,, 
                      అడగవే ఒక్కసారి అయినా  నేస్తమా 
                      నీ పరిచయం కలకరిగించేటి కన్నీటి వానేనా????????

4 comments:

  1. మీ కపిత్వంలో కవిభావం ఉట్టిపడుతుంది....బాగున్నాయండి!

    ReplyDelete
  2. నిజంగానా అండి,,thanx

    ReplyDelete
  3. బాగున్నాయండి మీ కవితలు ... నిస్సందేహంగా ఇది కపిత్వం కాదండి!
    కవితాసౌందర్యం ఉందండి మీ కవితలో..

    కపిత్వమంటే ఇదిగో ఇలా ఉండాలి:(Sorry for posting my Kapitvam here.)

    అనగనగా ఒక బగ్గు
    దానిని క్రియేట్ చెసిన వాడికి లేదు సిగ్గు
    తేల్చాలి నువ్వు దాని నిగ్గు
    తేల్చలేకపోతే ఇంటికి వెళ్ళి కప్పుకో రగ్గు
    ఇది చదవగానే అయ్యిఉంటుంది మీ వళ్ళు భగ్గు
    నాకు తెల్సు ఇప్పుడు మీరు అంటారు "నువ్వు కాస్త తగ్గు"


    Vyasa Virachitam

    ReplyDelete
  4. Thanx అండి ,,మీ కపిత్వం చాలా బాగుంది,,,ప్రాస పోనీయలేదు గ వ్యాసులు(వ్యస విరచితం) గారు

    ReplyDelete