Nov 7, 2010

పెళ్లిగోల

ఈ  మధ్య  ఒక  వివాహ  పరిచయ  వేదిక  దగ్గరకు  వెళ్ళాను మా అన్నయ్య వి పెళ్లి సంబంధాల కోసం. అది  ఒక  గుడి  లో  ఏర్పాటు  చేసారు.నేను వెళ్ళేటప్పటికే మొదలు అయింది.ఒకచోట అందరూ గుమిగూడి ఉన్నారు.ఎవరయినా  పడిపోయారేమో అనుకుని వెళ్ళాను.తీరా చుస్తే వాళ్ల అందరూ ఉన్న  గుంపు  మధ్యలో  కొన్నిఫైళ్లు ఉన్నాయి అవి అమ్మాయి ల  ఫోటోలు,biodata ల ఫైళ్లు.వాటికోసం మగపిల్లల తాలూకు వాళ్ళు గుమిగూడారు.అంతమంది మధ్యలో మనం వెళ్లి విజయవంతం గా ఫైలు తెసుకురాలేము లే అని ఆ ప్రయత్నం మానుకున్నాను.సరే ఆల్రెడీ చూస్తున్న వాళ్ల పక్కనే కూర్చొని కాసేపు మనం కూడా ఆ ఫైల్ చూడొచ్చు అనుకుని ఒకావిడ ను అడిగాను.ఇద్దరం చూద్దాం అండి అని..దానికి ఆమె ఒక వింత లుక్ ఇచ్చింది నా వైపు.అస్సలే గంట నుండి కుస్తీ పట్టి నేను తెచ్చుకుంటే,ఇప్పుడొచ్చి మా సంబంధాలు గద్ద లా తన్నుకు పోతావా అన్నట్టు.నాకు టైం పడుతుంది మీరు వేరే ఫైల్ తెచ్చుకోండి అని నిర్మొహమాటం గా చెప్పింది.ఆహ అమ్మాయిల పెళ్లి ఫైల్ లకు డాలర్ రేట్ కంటే ఫాస్ట్ గా craze పెరిగిపోయింది అనుకున్నాను.ముందు రిజిస్ట్రేషన్ చేసుకోండి, మీరు వెళ్లి వచ్చేలోగా నా ఈ ఫైల్ అయిపోతుంది అప్పుడు ఇస్తాను అన్నది నెమ్మదిగా .కొత్తగా వచ్చినవాళ్ళు regestration చేసుకోవాలి ట.సరేలే అని line వంక చుస్తే నేను TCS జాబు కోసం కూడా అంత పెద్ద line లో ఉండలేదేమో.కానీ  తప్పదు కదా.నుంచుని ఒక అరగంట గడిచాక రిజిస్ట్రేషన్ complete చేశా.ఆహ ఆ వేదిక నడుపుతున్నది ఆడవారే.యాభయ్యేల్లు పై పడినవారే.టైం పాస్ కోసం ఇలాగ చేస్తున్నారు సంఘ సేవ.కాసేపు అక్కడ ఉన్న ఫైళ్లు తిరగేసి మంచి సంబంధాలు రాసుకున్నా .ఇంతలో ఒకళ్ళు ఇద్దరు వచ్చారు నా దగ్గరకు అబ్బాయి కావాలా అండి ,అమ్మాయా అని.అదేంటి ఇలా అడుగుతున్నారు అనుకున్నాను.. మీరు అమ్మాయి కోసం చూస్తున్నారా,అబ్బాయి కోసం చూస్తున్నారా అని వివరించింది..ఓహ్ ఇలాగ మనమే వచ్చినవాళ్ళను అడిగితె ఇంకొన్ని తెలుస్తాయి కాబోలు అనుకుని నేను కూడా ఉన్న వాళ్ల అందరి దగ్గరికి ఆ చాయ్,చాయ్ అని అరిచినట్టు అమ్మాయి కోసం చూస్తున్నా మండి అంటూ అందరిని అడిగా.సగం పైగా అందరూ నా లాంటి వాళ్ళే,,అదేలెండి అమ్మాయి కోసం చుస్తున్నవాళ్ళే.పాపం అక్కడికొచ్చిన తల్లిదండ్రులను చుస్తే అబ్బాయి పెళ్లి కు ఎంత టెన్షన్ పడుతున్నారో అనిపించింది.ఉద్యోగం అక్కర్లేదు,ఏ చదువు అయినా పర్లేదు,ఏ రంగు అయినా పర్లేదు....average గా  ఉండే ఏ అమ్మాయి అయినా పర్లేదు...అస్సలు చివరకు అమ్మాయి అయితే చాలు అన్నట్టు అయింది పరిస్థితి.మా ఇళ్ళల్లో నేను వినగా ఏ అమ్మాయి కు ఇలాగ వేదిక లకు వెళ్లి సంబంధాలు చూసింది లేదు,,చేద్దాం అనుకోగానే ఒకటి రెండు చూసి చేసేసారు,ఇప్పుడు అబ్బాయిల పెళ్ళిళ్ళు అంటే చెప్పులే  కాదు...జేబులు వాటికి తోడు క్రెడిట్/డెబిట్ కార్డ్ లు కూడా కరిగిపోతున్నాయి,,ఏం చేస్తాం..కాలం మారింది గా..

1 comment:

  1. కాలం మారింది కాని అబ్బయి పెళ్ళి వారి అహంకారపు ధోరణి మాత్రం అలాగే ఉంది.అత్తరికం వెలగబెట్తే అత్తగారులూ....పీల్చుకు తినే ఆడబిడ్దలు ఇంకా ఉన్నారు ఈ సమాజంలో.....మారాలి...మార్పు రావాలి అని ఎదురు చూడడం తప్ప ఏమీ చేయలెం :)

    ReplyDelete