Jan 30, 2010

కొత్త హంగులు

చాలా కాలం తర్వాత మా అన్నయ్య నిన్న  నా బ్లాగు చుసాడుట..వెంటనే ఫోన్ చేసి బాగుందే నీ బ్లాగు చాలా రాసావు గా అని అన్నాడు..ఒక కామెంట్ రాయొచ్చు కదా అని అడిగితె నీకు ఒక కామెంట్ రాసే టైం లో నేను నాలుగు బ్లాగులు చదువుతానే అయిన కామెంట్ రాయకపోతే ఏమి ఫోన్ చేసి చెప్పాను కదా అన్నాడు.. కామెంట్ రూపం లో రాస్తే అదొక encouragement గ ఉంటుంది కదా అంటే టైపు చేయటానికి బద్ధకం ట..మా అన్నయ్య ఉండేది సింగపూర్ లో లెండి..ప్రతిసారి ఫోన్ కుదరదు కదా అని ఆఫీసు నుండి రోజు మెయిల్ చెయ్యి అంటే అంత  టైపు చేసే కంటే నిముషం లో ఫోన్ చేసి ఒక అయిదు నిముషాలలో మాట్లాడి పెట్టేస్తే అయిపోతుంది కదా ఆంటాడు..ఫోన్ లో అంత detailed గ మాట్లాడినట్లు ఉండదు,,ఒక పక్క సెల్ bill గుర్తువస్తూ ఉంటుంది  అంటే టైం లేదు మెయిల్ చేయటానికి అంటాడు.. నాకేమో  మెయిల్ చదవటం ఇష్టం, వాళ్ళు గుర్తువచ్చినప్పుడల్లా చక్కగా చదువుకోవచ్చు కదా అని అనిపిస్తుంది..నేను చదువుకునే రోజుల్లో మా అమ్మ ను inland లెటర్ రాయమనే దాన్ని..నేనూ రాసే దాన్ని అమ్మ గుర్తువచ్చినప్పుడల్లా చదువుకునే దాన్ని లెటర్ ను..ఫోన్ ఉన్న కూడా లెటర్ రాసేదాన్ని నిన్నే చూస్తున్నాం అని గేలి చేసేవాళ్ళు మా ఫ్రెండ్స్..ఇంత  techonlogy పెరిగిన నాకు పాత పద్దతులే నచ్చుతాయి కొన్ని. ఫోటోలు కుడా కంప్యూటర్ లో ఉన్నాయి కదా ఇంక ప్రింట్లు ఎందుకు డబ్బులు దండగ అంటారు మా వారు అయినా నాకు ఫోటో ఫోటో లాగా ఆల్బం లో చూస్తేనే ఇష్టం+ చూసినట్లు ఉంటుంది..న్యూస్ పేపర్ ఇంటర్నెట్ లో చదివేకంటే చక్కగా విడిగా పేపర్ లాగా చదివితేనే నచ్చుతుంది.. latest updates ఉంటాయి కదా నెట్లో అయితే అంటారు మా వారు చద్ది వార్త అయిన నాకు ఇలాగె బాగుంటుంది..చక్కగా కాఫీ తాగుతూ పేపర్ చదివితే అ థ్రిల్లే వేరు..టెక్నాలజీ పెరిగే కొద్ది కొన్ని కొన్ని చిన్న చిన్న ఆనందాలు మనం మిస్ అవుతున్నమేమో అనిపిస్తుంది..అయిన ఏమి చేయలేని పరిస్థితి..

Jan 28, 2010

మానసిక సంఘర్షణ


ఇది నా మానసిక సంఘర్షణ, నాది అనే బదులు నాలాంటి తల్లుల మానసిక ఘర్షణ అనవచ్చేమో..మాత్రుత్వపు అనుభూతులు చవిచూస్తునె కెరీర్ పరం గ దూరమ్ అయినవాళ్ళు ఏదో ఒక రోజు అనుభవించే ఉంటారు..పిల్లలు పుట్టకముందు దాక ఉద్యోగం చేసి పిల్లలు పుట్టాక వారి సంరక్షణ కుదరక ఉద్యోగం మనివేయాల్సి వస్తే ఇటు పూర్తిగా పిల్లలతో ఉత్సాహం గ ఉండలేరు,అలా అని ధైర్యం చేసి ఉద్యోగం కు వెళ్ళలేరు.. ఏముందిలే అమ్ముమ్మ దగ్గరో,డే కేర్ లలోనో ఉంచొచ్చు లే అని పిల్లలు పుట్టేదాకా అనిపిస్తుంది..తర్వాతే అస్సలు పరిస్థితి అర్ధం అవుతుంది..నేను కూడా ఇలాగె అనుకుని మా పెద్దవాళ్ళ దగ్గర ఉంచాను మా బాబును ..రెండు రోజులలోనే వాడికి 105 జ్వరం వచ్చింది అంటే మీరు నమ్మరు..వాళ్లకి చెప్పటం చేతకాక మనసులో బెంగా పెట్టుకునేటప్పటికి అలా ఏదో జ్వరం లాగ అనారోగ్యం రూపం లో కనిపిస్తుంది..సరేలే ఉద్యోగం మానేసి చక్కగా పిల్లలను చూసుకుందాం అనుకుంటే అరే మంచిగా రాంక్ తెచ్చుకుని  చదివి ఇలాగా ఖాళీగా ఉన్నామే అని అనిపిస్తుంది.. Idle brain isA  house of devil అని ఎక్కడో విన్నానో చదివానో గుర్తులేదు లెండి.. ఖాళీగా ఉంటె అలాగే ఉంటుంది మనసు.సరేలే పిల్లలు బడికి వెళ్ళాక మొదలు పెడతాము అనుకుంటే అస్సలే ఇది టెక్నాలజీ పరంగా బాగా ఫాస్ట్ గ ఉన్న యుగము . ఇంకా ఇంకా వెనకపడిపోతాము.. ఇంత గ్యాప్ వచ్చేటప్పటికి దాదాపు గ మనకు కూడా ఉద్యోగం మీద ఆసక్తి పోతుంది.. పిల్లలను బడినుండి తేవటం ,వర్క్ చేయించటం  ఈ బాధ్యతలు పెరిగిపోతాయి గా.. అయినా ధైర్యం చేసి వెళ్దాము అంటే వెళ్ళిన తర్వాత మనసు అంతా పిల్లల మీదే ఉంటుంది తిన్నాడా,ఏడుస్తున్నాడా  అనుకుంటూ..ఉద్యోగం చేసే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందా అని అనిపిస్తుంటుంది నాకు... మీలో ఎవరినా ఉంటె చెప్పండి ఎలా మేనేజ్  చేస్తున్నారో...

సమ్మక్క సారలమ్మ ఉత్సవం




నిన్న టీవీ లో చూసాను సమ్మక్క సారలమ్మ జాతర ను జాతీయ  పండుగ చేయాలి అని కొంతమంది కోరారు అని.. ఏంటి ఈ జాతర ఎందుకు చేస్తారు,అస్సలు ఎ దేవతను పూజిస్తారు  అని  ఇంటర్నెట్ లో వెతికాను .. తీరా చుస్తే మొన్న ఆదివారం ఈనాడు బుక్ లో ఈ జాతర గురించి వివరంగా రాసారుట..మాకు పేపర్ వచ్చినా ఆదివారం చదవటానికే తీరుబడి ఉండదు.. అందుకని తీరిగ్గా కుర్చుని రెండు రోజుల తర్వాత పుస్తకం ను చదువుతాను.. అలాగా ఇవ్వాళ కుదిరింది చదవటానికి ..నాలాగే మీకు కూడా జాతర గురించి తెలుసుకోవాలి అంటే ఈ కింద లింక్ చుడండి..
http://www.eenadu.net/archives/archive-24-1-2010/htm/2vnewfeatureshow.asp?qry=7&reccount=14

Jan 24, 2010

మన జన గణ మన


" Jana Gana Mana Adhinayaka Jaya He
Bharat Bhagya Vidhata
Punjab Sindh Gujarat Maratha
Dravida Utkala Banga
Vindhya Himachal Yamuna Ganga
Ucchala Jaladhi Taranga
Tubh Shubha Name Jage
Tubh Shubha Ashisha Mange
Gahe Tubh Jaya Gata
Jan Gan Mangaldayak Jay He
Bharat Bhagya Vidhata
Jaye He ! Jaye He ! Jaye He !
Jaye,Jaye,Jaye,Jaye He "
 
The Jana Gana Mana was composed by Shri Rabindranath Tagore and first sung at the Calcutta session of the Indian National Congress on December 27th, 1911. It was adopted as the National Anthem of India on 24th January, 1950 by the Constituent Assembly. The first stanza( out of five stanzas) of the song forms the National Anthem. 
అందరికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

Jan 16, 2010

vote plz...

Dear Blogger,
 
Thanks a lot for the blogger community for participating in Best Blog 2009 Contest. We got very good response and it took a while for our panel to carefully review and select top 10 finalists. Our panel has given importance to clarity, subject and popularity. Following are top 10 Finalists. We ask our visitors to select their choice from January 15 2010 to January 31 2010. Our OPINION POLL section in the main page will display the top 10 bloggers names for the voting.
 
1. SIVARAMAPRASAD KAPPAGANTU (http://saahitya-abhimaani.blogspot.com/)
2. Rama (http://sumamala.info)
3. Manjusha N (http://nenu-naa-prapancham.blogspot.com)
4. Jagadeesh Reddy (http://saradaa.blogspot.com)
5. Kiran Yalamanchi(http://nishigandha-poetry.blogspot.com)
6. PHANI MADHAV KASTURI (http://funcounterbyphani.blogspot.com)
7. Jyothi Valaboju (http://jyothivalaboju.blogspot.com)
8. Chaitanya Yemineni(http://nemalikannu.blogspot.com)
9. Giri(http://giri-art.blogspot.com)
10. Basabathina(www.kalas3.blogspot.com)
 
 
Please ask your blog followers to participate in voting.
 
Regards,
Andhralekha Team
 
 బ్లాగులు  చదివి చక్కగా వోట్ చెయ్యండి..
 
 దయచేసి నాకు వోట్ చేయండి మీకు నాబ్లాగ్ నచ్చితే.. ఎట్లా వోట్ చేయాలి అంటే www   .ఆంధ్రలేఖ.com ఓపెన్ చేసి అందులో పేజి చివరన top10 bloggers అని ఉంటుంది దానిలో Manjusha .N , బ్లాగ్ nenu -naa -prapancham .blogspot .com అని ఉంటుంది దానికి వోట్ చేయండి..నాకు ఇలాగ అడుగుతుంటే ఏదో వత్తిదిచేస్తున్నట్లు గా అనిపిస్తోంది.. మీ వోట్ వేసి బ్లాగర్ ను ఉత్సాహపరచండి..ముందస్తుగా ధన్యవాదములు..
 
       




Jan 15, 2010

దర్భ

ఇవ్వాళ సూర్యగ్రహణం కదా అని మా ఇంటి owner తాతగారు దర్భలు ఇచ్చారు నీళ్ళల్లో,పాలు,పెరుగు లలో వేసుకోండి అని.. మా అమ్మ వాళ్ళు కుడా వేసేవాళ్ళు నా చిన్నప్పుడు కానీ నాకు దర్భను ఎందుకు వేస్తున్నామో తెలియదు.. పోనీ ఇంటర్నెట్ లో వెతుకుదాము  అని ట్రై చేశాను కానీ దొరకలేదు.. ఆ తాతగారు ను అడిగితె సుద్ధి అవుతుంది అని వేస్తాం అని అన్నారు.. కానీ ఇంకా విపులం  గా తెలుసుకుందాము అంటే కుదరలేదు..దర్భ కు మాములు ఎండుగడ్డికి  తేడా ఏంటి?? పెళ్ళిళ్ళలో కుడా దర్భ వాడతారు..
ఈ వివరాలు ఎవరికన్నా తెలిస్తే చెప్పండి..నా లాంటి తెలియని వాళ్ళకు ఉపయోగపడ్తుంది కదా..
వివరాలు చెప్పినందుకు ధన్యవాదాలు ముందస్తుగా ...

Jan 14, 2010

భోగి భోగము

నిన్న భోగి సందర్భం గా మా బుజ్జిగాడికి కుడా భోగిపళ్లు పోసాము..ఎట్లాగు మన ఊరు వెళ్ళలేదు కదా అని ఉళ్లో ఉన్న బంధువులు అందరమూ మా ఇంటిలోనే కలుసుకున్నాము..దాదాపు 15-20 మందిమి కలిసాము...మొత్తం మీద అయిదుగురు పిల్లలకు పోసాము భోగిపళ్లు..ఇల్లంతా సందడి సందడి..మా ఉళ్లో అయితే అందరమూ కలిస్తే వంట ఆవిడ ను పిలిచి వంట చేయించుకునే వాళ్ళం..ఇక్కడ కొద్దిగా ధర కుడా ఎక్కువే వంటవారిది ,కేటరింగ్ కా చెప్పలేదు.. ఇంక అందరమూ తలా ఒక చేయి వేసి అన్ని పిండిపదార్ధాలు వండుకున్నాము..చక్కగా ఒకళ్ళు కూర తరిగితే ఒకళ్ళు వంట  చేయటం అలా పంచుకున్నాము పనులు అన్ని..ఇది ఒక టైపు enjoyment లెండి.. అందరమూ కలిసాము కాని మా అక్క ఒక ఆవిడ రాలేదు ఏమిటి అయ్యా  కారణము అంటే వాళ్ళ బాబు కు బడి ఉంది త ...అందరికి సెలవే కదా అంటే మొన్ననే బందు అని చాలా శెలవలు  ఇచ్చారు కదా అందుకని ఒక్క పండగ రోజే సెలవు ఇచ్చారు అని మాకు పెద్ద ఉపోద్ఘాతం ఇచ్చింది. పోనీ సాయంత్రం రండి అంటే బడి అయ్యి వచ్చే టప్పటికె అయిదు గంటలు  అవుతుంది ఇంకా ఏమి వస్తాము లే వాడు అలసిపోయి ఉంటాడు కదా మా apartment లో చేసుకుంటున్నాం అని చల్లగా కబురు చెప్పింది , పయిగా వాళ్ళు ఉండే ECIL నుండి మేము ఉండే kukatpalli కు రావాలి అంటే అబ్బ చాల దూరం అని అనేస్తారు.. పోనీ సెలవ పెట్టేయ్యి బడి కు అంటే అమ్మో అంత donations కట్టి బడి మానిపియ్యటమే అని ఒక  దీర్ఘం తీసింది వాడేదో పదవతరగతి పబ్లిక్ ఎగ్జామ్స్ కు చదువుతున్నట్లు ,వాడు చదివే మూడవ తరగతి కు బడి మానటమా అని ఒక సందేం వెలిబుచ్చింది ..వాళ్లదేదో  పెద్ద international స్కూల్ ట donations నే దాదాపు 50000 కట్టింది ట ,సరేలే అని ఇంక మేము మా పిల్లలు అందరికి భోగిపళ్లు పోసి పండగను బాగా ఎంజాయ్ చేసాము.. చిన్నపిల్లలను  చక్కగా పండగ రోజు ఎంజాయ్ చెయ్యనివ్వకుండా ఏంటో ఈ బడులు బండలు మరి???????

Jan 11, 2010

guiness రికార్డులలో మన తెలుగువారు

2009 లో కాలిఫోర్నియా USA లో DESIUSA and SILICON ఆంధ్ర వాళ్ళ సంయుక్తం లో 318 కూచిపూడి కళాకారులు రికార్డు create చేసారు.
విజయ నిర్మల గారు,రామానాయుడు గారు,దాసరి గారు
డిసెంబర్-2007 లో హాస్య బ్రహ్మ బ్రహ్మానందం గారు రికార్డు సృష్టించారు. 20 సంవత్సరాలలో 754 సినిమాలు చేసిన  ఘనత ఆయనదే
అన్నమయ్య లక్ష గలార్చన మే-2009 లో హైదరాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ వేదికగా సాగిన సంగీత కార్యక్రమం లో 1,60 ,000 మంది తెలుగు గాయకులు పాల్గొన్నారు.
గజల్ శ్రీనివాస్ ఒకే పాట ను 76 భాషలలో పాడి రికార్డు సృష్టించారు జూన్-2008 గాందిహిల్ విజయవాడ లో 
ఇంక ఈ కొత్త సంవత్సరం లో recent గ Dinaz 26 hours of Continuous Aerobics!
ఇంకా ఇంకా మన తెలుగువారు కొత్త కొత్త అద్భుతాలు సృష్టించి రికార్డులు break చేయాలి అని ఆశిద్దాం..
                     ********************************************************
                                              అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు..

Jan 8, 2010

నేటి సంక్రాంతి

మేము ఈ హైదరాబాద్ కు వచ్చి దాదాపు 2 సంవత్సరాలు అయ్యింది.కిందటి సంవత్సరం మా ఊల్లొ ఉన్నాను ఈ సారి ఇక్కడ ఉన్నాను ఇక్కడ మా ఇంట్లో floor majaic floor సో ముగ్గు వేసిన అదేలెండి chalkpeice తో వేసినా కనపడదు.. లక్క(paint ) పెడదాం అని కూడా ట్రై చేశాను అస్సలు కనపడటం లేదు.. అదే మా ఉరిలో ఐతే  రోజుకు ఒక varitey ముగ్గు పోటీల మీద వేసేవాళ్ళం వేసిన ముగ్గు వెయ్యకుండా రంగులు దిద్ది మరీ.. పొద్దున్నే కాలేజి కు వెళ్ళాలి అని రాత్రిపూటే వేసి పడుకునేవాళ్ళం.. సరే ఇంకా ఆ ఉత్సాహం పోక ఇక్కడ కుడా అలాగా చేద్దాం అనుకుంటే రంగు పడలేదు అదేలెండి ముగ్గు కనపడలేదు.. సరే కదా అని ఈ మధ్య ఒక sticker లాంటి పేపర్స్ వస్తున్నాయి కదా ముగ్గులు వేసినవి ఇంక అవి అతికించి రోజు వాటి మధ్యలో పసుపు,కుంకుమ వేస్తున్నాను..ఏదో ఆత్మసంతృప్తి.. ఇంకా గొబ్బెమ్మల సంగతి చెప్పేదేముంటుంది అస్సలు గొబ్బెమ్మలు పెడదామా మనం కూడా అంటేనే మా వారు వింతగా ఒక లుక్ ఇచ్చారు..ఎవరీ పల్లెటూరు పిల్ల అన్నట్టు...మా ఉరు టౌన్ నే అయిన మా ఇంటి ఎదురుగ గుడి ఉండేది అందుకని మాకు గొబ్బెమ్మ పెట్టటం,గొబ్బి తట్టటం అలాంటివి అన్ని చేసేవాళ్ళం... మరి ఇంకా భోగిపెరంటం..దీనికి రేగుపళ్ళు ఉంటాయో లేదా సీమరేగి పళ్ళు పోయలో..లేదా మరీ విడ్డురం గ అమెరికా వాళ్ళ లాగా cheryy పళ్ళు పోయాలో మరి..ఎట్లా అయినా మన ఊరిలొ ఉండే  పండుగ వాతావరణం వేరు ఈ హడావుడి సిటిలలో ఉండే పండగ వాతావరణం  వేరు 
చూద్దాం ఈ సంక్రాంతి ఎలా జరుగుతుందో..

Jan 6, 2010

VERY Important INFO about Water Bottle!!





How to avoid:
Check on the bottom of the bottle there is a triangle sign and there will be a number on it.


If the number is higher than or equal to 5 --> then this bottle is safe to use.


Whatever number under 5, will release the chemical. For most bottle water, the number is 1.


Did you know chemical released by plastic water bottles can cause cancer

(It is not the water that affecting you but the chemical releasing from the bottle)  
 

Pass this to all your friends and also make them aware of it



 
i have gathered this info and presenting here..just see once for our health purpose.
Thanx

Jan 3, 2010

ఆలోచించండి

మొన్న న్యూ ఇయర్ రోజున మా ఇంటి ఎదురుగ ఉన్న Restaurant  కు ఒక ఫ్యామిలీ లంచ్ చేయటానికి వచ్చారు  .. వాళ్ళు లంచ్ అయిపోయినాక బయటకు వచ్చారు .వాళ్ళు నలుగురు , భర్త,భార్య,ఒక పాప,బాబు,బాబు తొమ్మిదవ తరగతి  చదువుతూ ఉండవొచ్చు సుమారుగా..ఐతే భర్త Restaurant   బయట నే పక్కనే ఒక చిన్న షాప్ లాంటిది ఉన్నది అందులో sigarette ,biscuites స్, టీ ఇలాంటివి అమ్ముతూ ఉంటారు.భర్త sigarette కొని తాగుతున్నాడు వాళ్ళ ఫ్యామిలీ దగ్గర నుంచొని..ఊహ వచ్చిన బాబు ఎదురుగ ఈయన sigarette తాగుతున్నాడేంటి  అని అనిపించింది నాకు.. ఎందుకో నాకు నచ్చలేదు..అప్పటిదాకా చెడు ఆలోచనలు ఉండని బాబు కు తను  కూడా ఇలాగ sigeratte తాగాలి అని అనిపిస్తుంది కదా..రేపు వాళ్ళ నాన్న వాళ్ళు లేనప్పుడు చాటుగా వెళ్లి sigarette తాగే  ప్రయత్నం చేయొచ్చు కదా.. మనం అలా తాగకూడదు అని చెప్పటానికి కుడా అవకాశం ఉండదు నువ్వు తాగగా లేంది నేను తాగితే తప్పా అని కుడా అంటారు..కాబట్టి ఇలా పిల్లల ఎదురుగా మాత్రం దయచేసి తాగొద్దు అని నా చిన్నమాట !!!!!!!!