May 6, 2010

బ్లాగు రిపోర్ట్

చిన్నప్పుడు  క్లాస్సులో  మార్కులు ,చదువులు,ప్రొగ్రెస్స్ కార్డు ను చూసి  మా  అన్నయ్య  ఎలా  అనేవాడో  దాన్ని  బ్లాగు  కు  వర్తించి  సరదాగా  రాస్తున్న  టపా,,,,
ఫోన్ లో అన్నయ్య,నేను సంభాషణలు 
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
నేను: హలో అన్నయ్య,,,ఎలా ఉన్నావు ఏంటి సంగతులు
అన్నయ్య:  హలో,,నేను బానే ఉన్నాను,,నీకే ఏమయ్యిందో అర్ధం కాక ఫోన్ చేశాను
నేను: ఏమయింది అన్నయ్య బానే ఉన్ననే నేను,,,
అన్నయ్య:ఇప్పుడే నీ బ్లాగు చూసాను,,ఏంటది అస్సలు ఏంటి ఆ రాంకులు
         (అదేలెండి webtelugu ,indiblog రాంకులు ఉన్నాయి గా అవి )
నేను: ఏముంది అన్నయ్య బానే ఉంది గా ర్యాంకు,,,అంటే మొన్న ఆ మధ్య ఊరు వెళ్ళాను కదా సో రాయలేక పోయాను కదా అందుకని తక్కువ వచ్చినట్టుంది,,,ఈ సరి బాగా తెచ్చుకుంటాను అన్నయ్య,,,
(అదేదో ఎంసెట్ రాంక్ అన్నంత బిల్డ్ అప్)
అన్నయ్య: ఇది వరకు మొదటి ర్యాంకు లో ఉండేది ఇప్పుడ ౩ లోకి వచ్చేశావు,,,ఇట్లగు అయితే లాభం లేదు,,,నీ తోటి వాళ్ళు చూడు ఎలా మంచి రాంకులు తెచ్చుకుంటున్నారో,,,,నాన్నగారి తో మాట్లాడి నిన్ను ఏదైనా  మంచి tution లో చేర్పించమని చెప్తాను,,,

నేను: అన్నయ్య ఈ సారి కి వదిలేయి అన్నయ్య ,,,నాన్నగారికి చెప్పొద్దూ,,,,ఈ సారి కాపీ కొట్టి ఆయినా  మంచి రాంక్ తెచ్చుకుంటా అన్నయ్య,,,
అన్నయ్యా:సరే ఊరు వెళ్ళావు,, కనీసం రాసిన వాటికి అయినా ఫుల్ మార్కులు రావాలి గా,,,
నేను:అంటే అన్నయ్యా నేను కరెక్ట్ గ నే రాసాను కానీ వాళ్ళు  మంచి గ మార్కులు ఇవ్వలేదు అన్నయ్యా,,,
(నేను answers రాసాను గాని పంతులుకే ఏమి రాదు అన్నట్టు)
అన్నయ్య: సరే ఇదే నీకు చివరి అవకాసం,,,తెచ్చుకుంటే మంచి రాంక్ వచ్చేట్టు రాయి లేదా ఈ బ్లాగు లు అవి చాలు ఇంక మానేసి హాయ్ గ కూర్చో ఇంట్లో....
నేను: అన్నయ్యా అన్నయ్యా..ప్లీజ్ అన్నయ్యా దయచేసి బ్లాగు మాత్రం మానేయమని చెప్పొద్దూ అన్నయ్యా,,,నేను బాగా రాస్తాను అన్నయ్యా ,,ఈ బ్లాగు లోకానికే ఫస్ట్ వస్తాను అన్నయ్యా,,,నీ పేరు,నాన్న గారి పేరు నిలబెడతాను అన్నయ్యా,,నిజం అన్నయ్యా,,,
(చదువు మానేసి పెళ్లి చేస్తాం అన్నంత ఫీలింగ్ వచ్చింది కదా,,అస్సలే బ్లాగులు రాయటం అలవాటు అయిన ప్రాణం రాయకుండా ఉండగలదా )
అన్నయ్యా: సరే ఈ సారికి పోనిలే అనుకుంటాను ,,next time ఇలాగ జరగకూడదు,,,
నేను: సరే అన్నయ్యా thanx ,,thank you అన్నయ్యా,,,
(ఈ సారి ఆ రాంకుల display తీసేస్తే పోలా.. అన్నయ్యా తో గొడవే ఉండదు...progress రిపోర్ట్ లు దాచేసినట్టు )
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

6 comments:

  1. nenu cheptunnaga nide 1st rank.
    keep up the good work.

    ReplyDelete
  2. do you need any training/coaching material or all-in-one to get better rank? :)

    ReplyDelete
  3. Thanx to all,,,వ్యాసులు గారు ఇంతకు ముందే కోచింగ్ తీసుకున్నట్టున్నారు,,,మాకంటే ఒక అడుగు ముందే ఉన్నారండి మీరు....ఆ All In One ఎదొ కాస్త మాకు ఇవ్వండి..plz

    ReplyDelete