Nov 15, 2010

ఉపవాసము

ఈ కార్తీక మాసం వచ్చిందంటే చాలు జనాలు పిచ్చి భక్తి తో ఉపవాసాలు చేస్తారు.నేను చేస్తాను అనుకోండి కానీ ఏదో కార్తీక సోమవారం  రోజు చేస్తా..వారం లో మిగత రోజులు తింటాం కాబట్టి పర్వాలేదు అంత ఏమి ఇబ్బంది అనిపించదు.పైగా కాస్త మన వయస్సు బట్టి ఓపిక బట్టి చేయాలి.అలాకాకుండా పుణ్యం వస్తుంది అని వారం లో నాలుగు రోజులు ఉపవాసం చేస్తే ఎలాగు.ఎవరు చేస్తారు అలాగా అంటారా..ఎందుకు ఉండరు..మా ఇంట్లో నే ఉన్నారు.మా అమ్మగారు మొన్న కార్తీక సోమవారం ఉపవాసం,మర్నాడు నాగులచవితి కదా ఆ రోజు కూడా ఉపవాసం..సరే తరువాత గురువారం బాబా కి ఇష్టమైన రోజు కదా ప్రతి వారం ఉంటుంది ఏ నెల అయినా కూడా,,సరే తర్వాత శనివారం కోటి శనివారాలు ట కదా ఆ రోజు..ఆ రోజు ఉపవాసం...సో దాదాపు వారం అంతా ఉపవాసమే..ఇంతలో మళ్ళి సోమవారం వచ్చేసింది...ఉపవాసం అంటే మొత్తం గా కడుపు మాడ్చుకోవాలి అని ఏ శాస్త్రము,సైన్సు చెప్పదు..ఒక పూట లంఖణం చేస్తే అన్నీ parts active అవుతాయి అని ఏదో పదిహేనురోజుల కో నెల కో ఒక రోజు చేయమంటారు.ఆ రోజు solid food , అన్నం అలాంటిది తినకుండా liquids తీసుకోవచ్చు అంటారు..ఉపవాసం అని మనం ఆ రోజు నాలుగు అయిదు సార్లు కాఫీ లు  ,టీలు తాగుతాం..చక్కగా పాలు,మజ్జిగ ,కొబ్బరినీళ్ళు తాగితే కాస్త నయం..మంచినీళ్ళు ఏదో ఒకటో రెండో గ్లాసులు తాగుతాం రోజు మొత్తం మీద.అస్సలు ఇక్కడే దెబ్బ పడ్తుంది...నీళ్ళు సరిపడా తాగకపోతే urine infections వచ్చేస్తాయి..చాలా రోజులు వరుసగా food లేకపోతె బాడీ లో షుగర్ లెవెల్స్ పడిపోతాయి...నీరసం మీద మగత నిద్ర వచ్చేస్తుంది.ఇదే జరిగింది మా అమ్మగారికి కూడా.నీరసం మీద తలనొప్పి వచ్చేసి తల తిరుగుతున్నట్టు ఉండి నాలుగు గంటలకు పడుకున్న ఆవిడ మర్నాడు ఏడు గంటలకు నిద్ర లేచింది...అంత మగత గా,,తల తిరగటం, అలాంటివి వచ్చేస్తాయి..ఏముంటుంది లే ఒక పూట తినకపోతే అని మనకు అనిపిస్తుంది...కానీ ఆ affect ఆ రోజు కి ఏమి తెలియదు..ఒక రోజు తర్వాత తెలుస్తుంది...అందుకనే ఉపవాసం చేస్తున్న వాళ్ళు అందరూ ఏదో వారం లో ఒక రోజు చేయండి అంతే..ఎక్కువ రోజులు ఉపవాసం చేస్తే ఎక్కువ పుణ్యం వస్తుంది అనే statistics లేవు గా ఎక్కడ...ముందు మన ఆరోగ్యం బాగుంటే ఎన్నయినా పుణ్యకార్యాలు చేసుకోవచ్చు..లేదంటే మొదటి కే మోసం వస్తుంది....

1 comment:

  1. మంజూ
    నేను మంగళవారం, గురువారం, శనివారం వారంలో మూడు రోజులు ఉపవాసాం చేసి ఆరోగ్యం పాడు చేసుకొని నా కెంతో యిష్టమైన లేడిడాక్టరు కె.ఎ.రావు (ఆండాళ్ళమ్మగారు) చెప్పినట్లుగా గత 2 సంవత్సరాలుగా మానేసాను. శనివారం మాత్రం పలహారంతో ఉపవాసంచేస్తునాను.పెద్దఆపరేషను అయి ప్రాణం మీదకు వస్తే గాని తెలిసిరాలేదు. ఇప్పుడు అందరికి నా అనుభవం చెప్పి ప్రొద్దునే బ్రెక్ ఫాస్టు తప్పక తీసుకోండి. చేయకలిగితేనే చేయండి. మిరు ప్రాణం మీదకి తెచ్చుకోకండి. మీ పక్కనున్న వాళ్ళ ప్రాణం తీయకండీ, అని చెబుతుంటాను.

    ReplyDelete