Jul 31, 2010

హ్యాపీ ఫ్రెండ్ షిప్ డే

పయనించే షిప్పే friendship రా అని ఒక పాట లో అన్నట్టు మన జీవిత ప్రయాణం లో  ఫ్రెండ్ కూడా పడవలాంటి వాడే,,మంచి ఫ్రెండ్ ను సెలెక్ట్ చేసుకుంటే మన ప్రయాణం ఆనందం గా,ఎన్ని అటుపోటులు వచ్చిన ధైర్యం గా మనోబలం తో గమ్యాన్ని చేరుకుంటాము,అదే సర్వ అవలక్షణాలు ఉన్న ఫ్రెండ్ తో స్నేహం చేస్తే వాడికి ఉన్న అన్నీ దుర్గునాలు మనకు అలవడి మన జీవితం అధోగతి పాలు అవ్వాల్సిందే,సగం జీవితం అయిపోయాక అరె ఇలాగ అయిపోయామే అని పొరపాటు పడేకంటే ముందుగానే జాగ్రత్త పడటం చాలా మంచిది.ఆరు నెలలలో వాడు వీడు అవుతాడు అన్నట్టు మన సహచరుల లక్షణాలు,హావభావాలు మనకు తెలియకుండానే మనం అలవారుచుకున్టాము,ఎంతమందిని చూడటంలేదు ఫ్రెండ్స్ వల్లన చెడు అలవాట్లు లోనయినవాళ్ళను.మంచి గా మనలను encourage చేసి,మన పనులలో తప్పు ఒప్పులు చెప్తూ,సదా మనకు మంచి చేకూరాలని తలచే వారితో మన జీవితాంతం friendship చేయొచ్చు,అలాంటివాడు మన ఫ్రెండ్ అని చెప్పుకోటానికి కూడా మనకు ఎంతో ఆనందం గా ఉంటుంది,బాధ వచ్చిన మనతో పంచుకోవటానికి,సపోర్ట్ ఇవ్వడానికి ఒక ఫ్రెండ్ ఉన్నాడు అనుకుంటే ఎంతో హైగా అనిపిస్తుంది.అందరికి అలాంటి మంచి సన్నిహితులు ఉండాలి అని కోరుకుంటున్నాను.
                                                HAPPY FRIENDSHIP DAY TO ALL  

12 comments: