May 17, 2010

గురుభ్యోన్నమః


నిజం గా గురు శిష్యుల సంబంధం చూడాలి అంటే మా వారి గురువు గారు (పట్టభిరామాచార్యులు) గారినే చూడాలి..గురువు గారు లెక్కల లో doctorate చేసారు...NIT వరంగల్ లో చేసి 90 లలో అనుకుంటా రిటైర్ అయ్యారు..అప్పటినుండి ఎంతోమంది కు guide గా చేస్తున్నారు,,ఆయనకు దాదాపు డెబ్బై అయిదు ఉంటాయి వయస్సు,,ఈ వయస్సు లోను ఆయన చలాకీగా అన్ని సెమినార్లకు,maths olampyad లకు  క్లాస్సేస్ చెప్తుంటారు,,ఆయనకు విద్య మీద ఉన్న మక్కువ అలాంటిది,,,టెక్నాలజీ లో కూడా ముందు ఉన్నారు,,,గూగుల్ లో సెర్చ్ చేసి materials collect చేసి లేటెస్ట్ గా ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారు స్టూడెంట్స్ కు.
మొన్న ఇంటి ముందు ముగ్గు వేసాను,,దాన్ని చూసి గురువు గారు దాన్ని చుస్తే ఏమి గుర్తువస్తోంది అని అడిగారు,,,
మనకు ఆయనంత knowledge లేదు గా...ఏమి రావటం లేదండి అన్నా,,ఆయన చెప్పారు అది Hamelton 's therom కు బెస్ట్ example లాగా ఉన్నది,,అని మళ్ళి "నువ్వు చదివే ఉంటావు కదా చెప్పు ఎలాగో" అని ప్రశ్నించారు ,,,నాకు ఏదో ఎగ్జామ్స్ అప్పుడు ముక్కున పెట్టుకోవడం చీదేయటం అంతే ఇంత practical knowledge మనకెక్కడ,,,అదే చెప్పా ఏమో నండి గుర్తురావటంలేదు,,,అని అప్పుడు చెప్పారు ఆయన therom చెప్పి,,,ఎప్పుడైనా  చదువును రియల్ వరల్డ్ కు అప్లై చేసుకుంటూ చదివితే బాగా గుర్తువుంటుంది,,అది అస్సలు చదవాల్సిన పద్ధతి అని,,,, 
మొన్న ఆ మధ్య ఆయన మా ఇంటికి వచ్చారు లెండి,,అప్పుడు ఆయనను కలవటానికి బోలెడు మంది వచ్చారు,,,phd చేస్తున్నవాళ్లు,,,అందరు మంచి గా ఉద్యోగం చేస్తున్నవాల్లే,,,age లో కూడా పెద్దవాల్లె దాదాపు నలభైలు ఉంటాయి,,,అలాంటిది వాళ్ళు కూడా ఏంటో భయం గా,నిదానం గా అంటే సౌమ్యం గా మాట్లాడుతూ ఉంటే భలే అనిపించింది,,,ఆయన కూర్చొని ఉంటే వీళ్ళు కిందనే కూర్చున్నారు,,
గురువు గారు కు ఒక గురువు గారు(రఘునాధాచార్యులు) ఉన్నారు టా,,ఆయన శ్రీభాస్స్యం లో doctorate చేసారు టా..గురువు గారికంటే ఆయన వయస్సు దాదాపు నాలుగేళ్ళు ఎక్కువ అంతే...ఆయన దగ్గర ఈ రామాచార్యులు గారు ఎప్పడు ఎదురుగా కుర్చీలో కూర్చోలేదు ట..ఫొటోస్ కూడా చూపించారు,,,నిజం గా ఈ రోజుల లో కూడా ఇలాంటి గురువులు అందులోను ప్రత్యేకించి అలాంటి శిష్యులు ఉన్నారు అంటే నిజం గా విద్య కు విలువ ఎప్పుడు ఉన్నది అనిపిస్తుంది,,,,
మేము చదువుకునే రోజుల్లో మా మాష్టారు కనిపిస్తే సైకిల్ మీద నుండి దిగటమో లేక gudmorning అని చెప్పటమో చేసేవాళ్ళం,,,వాళ్ళ ఇళ్ళకు వెళ్ళాలి అంటేనే దడ పుట్టేది,,,,అలాంటిది నేను ఇంజనీరింగ్ చదువుకునేటప్పుడు మాస్టర్లను ఎలా అనేవారంటే  వీడా మనకు చెప్పేది అని అనేవాళ్ళు స్టూడెంట్స్,,,,
దీనికి తోడూ సినిమా లలో గురువుల మీద వేసే జోకులు అగ్ని కు ఆజ్యం పోసేట్టు ఉన్నాయి,,,అలా చేస్తే మనం కూడా హీరోలు అయిపోతాం అనుకుంటున్నారు పిచ్చి పిల్లలు,,,,,మళ్ళి మనం ఆ గురువు స్థానం కు వెళ్లి పాటాలు చెప్తే గాని తెలియదు ఆ position అంటే ఎంత గౌరవమో,,,,
గురువు ను గౌరవిన్చినప్పుడే మన విద్య మనకు కలిసివస్తుంది,,,,

4 comments:

 1. మళ్ళి మనం ఆ గురువు స్థానం కు వెళ్లి పాటాలు చెప్తే గాని తెలియదు ఆ position అంటే ఎంత గౌరవమో,,,,
  గురువు ను గౌరవిన్చినప్పుడే మన విద్య మనకు కలిసివస్తుంది,,,,
  super ga undi

  ReplyDelete
 2. meeru cheppina guru-sishya sambhandham chala sravana/nayana aandakaramugaa undi..
  you are correct.
  ee rojullo guruvuki gouravam iche varu taggipoyaru..
  engineering college lo ithe mareenu...
  as you said..cinema lu agniki aajyam posayi..

  the other side of the coin also we need to see...
  kondaru teaching profession kee talavampulu techettu panulu chestaru..
  respecting Guru is the duty of student and at the same time Guru's should become a role model to students by showing his character.
  Understanding concepts and applying them to real word problems is very much important..same thing in Potana's words..
  ప్రహ్లాదుడు తన తండ్రి హిరణ్యకశిపునితో ఈ విధముగా తన విద్యాభ్యాసం గురించి చెప్తాడు ..
  (పోతన భాగవతం నుండి)

  చదివించిరి నను గురువులు
  చదివితి ధర్మార్ధ ముఖ్య శాస్త్రంబులు నే
  చదివినవి గలవు పెక్కులు
  చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రీ

  Prahlada emphasized on understanding the concept.. (marmamella chadivithi)..
  Annyyaku andaroo manchi guruvulee ... andari guruvulaku annayya priya sishude...

  Vyasavirachitam..

  ReplyDelete
 3. Manju గారూ...,&nbspనిజం గా గురు శిష్యుల సంబంధం చూడాలి అంటే మా వారి గురువు గారు (పట్టభిరామాచార్యులు) గారినే చూడాలి..గురువు గారు లెక్కల లో doctorate చేసారు...NIT వరంగల్ లో చేసి 90 లలో అనుకుంటా రిటైర్ అయ్యారు..అప్ప_____________________చాలా మంచి పోస్ట్.......... ధన్యవాదాలండి.

  ReplyDelete
 4. "మొన్న ఇంటి ముందు ముగ్గు వేసాను,,దాన్ని చూసి గురువు గారు దాన్ని చుస్తే ఏమి గుర్తువస్తోంది అని అడిగారు"
  ఇది చదవగానే ఏదీ మీముగ్గు ఫోటో ఏమైనా పెట్టారేమోనని చూసాను. ప్చ్...

  ReplyDelete