ఇవ్వాళ ఉదయం నుండి సన్నగా వాన పడుతూనే ఉన్నది.ఇలాగ చిరుజల్లులతో పడే వాన లో తడవటం భలే సరదాగా ఉంటుంది.
మా చిన్నప్పుడు మా ఎదురింటి అంకుల్ వాన పడ్తుంటే చక్కగా చిన్న తువ్వాలు వొంటికి చుట్టుకుని చిన్న బెంచ్ తెచ్చుకుని హాయ్ గ వాన లో వేసుకుని కూర్చునేవారు, వాన నీరు చాలా స్వచ్చమైన నీరు.ఏమి జలుబులు చేయవులే సరదాగా మీరు రండి అని పిలిచేవారు,,మాకు కూడా అలాగా వాన లో తడవాలి అనిపించేది.కానీ మా అమ్మపడనిస్తే గా.
వాన తడికి మట్టి నేల అంతా తడిసి ఒక రకమైన కమ్మని వాసన వచ్చేది.
వానలో వెళ్తే జలుబోస్తుంది,జ్వరం వస్తుంది,బడి ఎగ్గొట్టటానికి ఇది ఒక వంక అని నాలుగు గదిమి లోపల కుర్చోమనేది అమ్మ.
ఎప్పుడైనా బడి నుండి ఇంటికి వెళ్ళేటప్పుడు వాన పడితే ఆ పుస్తకాలను నెత్తి మీద పెట్టుకుని పరుగులు పెట్టేవాళ్ళం,పుస్తకాలు తడవకుండా వాటి మీద అట్ట (righting pad) ను పెట్టేవాళ్ళం.
వేడి వేడి మొక్కజొన్న పొత్తులు తింటూ,వాన నేలల్లో చిందులు వేసుకుంటూ సరదాగా ఇంటికి వెళ్ళేవాళ్ళం.
అలాంటివి అన్ని తలుచుకుంటే మళ్లీ అలాంటి రోజులు వస్తే బాగుండు అనిపిస్తుంది,అవన్నీ బాల్యం లోని మధుర స్మృతులు.
me post chusi naku malli aa rojulu gurtu vachai
ReplyDeletegood post
బాగుందండి. నాకు కూడా వాన పడుతుంటే ఆమట్టి వాసన తడవడం చాలా ఇష్టం .
ReplyDelete