హా హా..నా మొదటి సినిమా అంటే ఇప్పటిదాకా అస్సలు సినిమాలే చూడలేదు అనుకుంటున్నారా?? కాదండి..మా బాబు పుట్టినప్పటినుండి సినిమాలు బంద్ చేసాము..ఈ మూడేళ్ళ తర్వాత మొట్టమొదటి సినిమా ఇవ్వాళ చూసాను theatre లో..మా బాబు కు ఇదే మొదటి సినిమా..ఇవ్వాళ 10 -10 -10 కదా..ఏదైనా కొత్తగా గుర్తు ఉండేటట్టు చేద్దాం అనుకున్నాము.ను మహేష్ బాబు కు పిచ్చ ఫాన్స్ లెండి,మా వాడికి మొదటి సినిమా మహేష్ బాబు దే చూపించాలి అనుకున్నా,అనుకున్నది జరిగింది ,పాపం మహేష్ బాబు మా వాడి కోసమే మూడేళ్ళు ఆగి సినిమా తీసినట్టున్నాడు,ఎంతో ఉత్సాహం గా సినిమా కు వెళ్తే మా వాడు నాకు చూపించాడు సినిమా.కాసేపు నోటికి పని పెడితే నస ఆపుతాడు అని popcorn కొని పెట్టా.ఆ ప్యాకెట్ అయిపోయే వరకు బానే ఉంది..తర్వాత మళ్ళి మొదలు..అక్కడ..50 పెట్టి సినిమా కు వెళ్తే డోర్ keeper దగ్గర కుర్చుని సినిమా చూడాల్సి వచ్చింది.ofcourse నేను ఒక్కదాన్నే కాదనుకోండి .పాపం నాలాంటి తల్లులు,కొంతమంది తండ్రులు కూడా same.గోడకు అనుకుని అందరం line లో మెట్ల మీద నుంచుని సినిమా చూసాము.చిన్నప్పుడు స్కూల్ లో మా టీచర్ హోం వర్క్ చేయని వాళ్ళను గోడకు అనుకుని line లో ఒకళ్ళ వెనకాల ఒకళ్ళని నున్చోపెట్టేది..అలా నుంచొని క్లాసు వినేవాళ్ళం.అలా punishment లాగా అనిపించింది ఇవ్వాళ నాకు.
ఈ లోగ ఇంటర్వెల్.మళ్ళి చిప్స్ ప్యాకెట్.icecream .సరే ఇంటర్వెల్ నుండి మళ్ళి సగం సినిమా బాగానే చూసాము.తెచ్చిన తినుబండారాలు అయిపోయాక మళ్ళి మొదలు.మళ్ళి మెట్ల మీదే..ఆ విధం గా మొత్తానికి మొదటి సినిమా దాదాపు ఆనందం గా,కాస్త విసుగుగా బాగానే గడిచింది.కాకపోతే సినిమా టికెట్ కంటే మా వాడికి timepass snacks రేట్ నే ఎక్కువ అయింది..
నేను ఒకసారి ఆహ్మేదాబాద్ వెళ్ళినప్పుడు అక్కడ open theatre లో సినిమా చూసాను,open theatre అంటే జస్ట్ ఒక పార్క్ లాంటి open place లో బిగ్ స్క్రీన్ మీద మూవీ వస్తుంది,మనం మన కార్ లో కూర్చొని చూడొచ్చు,లేదా చక్కగా lan లో చాప వేసుకుని లేదా పడుకుని చూడొచ్చు,పిల్లలు చక్కగా ఆడుకుంటూ ఉంటారు .మనం హయిగా సినిమా చూడొచ్చు.మనకు theatre లాగానే కావాలి అనుకుంటే ఇక్కడ లాగా బాల్కనీ ఉంటుంది,అక్కడ చైర్స్ లో కూర్చొని సినిమా చూడొచ్చు.మాములు theatre కు దీనికి తేడా ఏంటి అంటే ఇది డబల్ ది fare ఉంది,,nearlly 150 అనుకుంటా టికెట్..ఇక్కడ కూడా అలాంటి theatres వస్తే బాగుండు అనిపించినిది నాకు..ఫుల్ చీకటి ఉంటుంది కదా theatres లో ఆ చీకటి కు భయపడి పిల్లలు ఏడుపు.మనకేమో అయ్యో సినిమా పోతోందే అనిపిస్తుంది,,అందుకే చక్కగా ఓపెన్ theatre సిస్టం వస్తే బాగుంటుంది. మా లాంటి పిడుగుల బాధితులు ఆనందిస్తారు.
బాగున్నాయండి. మీ పిడుగు మొదటి సినిమా కబుర్లు. :)
ReplyDeleteపిల్లాడికి అడిగినవన్నీ కొనిచ్చి ఇబ్బంది పడే బదులు, నాలుగు తగిలిస్తే, మళ్ళీ అరవకుండా బుద్ధిగా సినిమా చూస్తాడు. :-)).
ReplyDeletevadina ..soooper!!..motham meeda chinna pandu gadu pedda pandu gadi movie chusesadu ...ala ne vadini pedda start cheddam ..meeremo akshrabyasam plan chesthunnarata..ade roju "act"obyasam kooda cheyincheddam
ReplyDeleteThank you sisira gaaru,naga prasad gaaru and swathi.
ReplyDelete