Aug 8, 2009

మా వరలక్ష్మి

మాకు వరలక్ష్మి వ్రతం ఆచారం లేదు.. అమ్మ వారిని విగ్రహం పెట్టి వ్రతం ఆనవాయితీ లేదు మా ఫ్యామిలీ కి... మామూలు పూజ చేసుకుంటాము... కానీ సరి మా బాబు వలన అమ్మ వారి రూపం వత్చింది మా ఇంటికి కుడా.. ఎలాగంటే
మా బాబు ఒక నెల నుండి బాగా నడుస్తున్నాడు.. దేవుడి గూటి లో కో ఎక్కి అన్ని పటములు ,విగ్రహాలు లగేస్తున్నాడు.. నేను అనుకున్నాను అసలే శ్రవణ మాసం పూజ లేకుండా ఎలాగా అని అలోచించి మా అతయ్యగారికి దేవుడి ని పైకిఎక్కిస్తే ఎలాగా ఉంటుందా అని ఆలోచన వత్చింది సడన్ గా.. మా పుజమందిరం మందిరం లాగా ఉంటుంది..పైనగోపురం కుడా ఉంటుంది...ఇంక అన్ని విగ్రహాలు,పటములు తీసి మందిరం పైన పసుపు పూసి బొట్టు పెట్టి ముస్తాబుచేసారు.. గోపురం కు కుడా...దానిని చుస్తే అలంకరించిన అమ్మ వారిలాగా ఉంది... చేతుల కోసం ఒక కర్ర,మంచి పట్టుచీర కడితే అమ్మవారి లాగానే ఉంటుంది... ఇంక మరీ ఆచారం వదిలేసి కొతగా వ్రతం చేయలేం కదా అని... మందిరం కేచిన్న జాకెట్ ముక్క చుట్టి అమ్మ వారు అని భావించి పూజ చేసుకున్నాం...
చాల కొత్తగ చేసుకున్నాం శ్రావణ శుక్రవారాలు....
పుణ్యం అంతా మా బంగారు తండ్రికే....
వాడి అల్లరి చేష్టల కే గా మాకు ఆలోచన వత్సింది ....

1 comment:

  1. cute.
    మీరు చెప్పే ఈ చిన్ని చిన్ని కబుర్లు బాగున్నాయి.
    ఒక సూచన .. వచ్చారు, వచ్చింది అని రాయడానికి vaccAru, vacciMdi అని రాయాలి లేఖినిలో. No need to use "t".
    All the best.

    ReplyDelete