Jul 30, 2010

నాలో సుపరిచితుడు

హా ఏంటి ఈ టైటిల్ అనుకున్నారా?? నిజమేనండి ఎందుకో మొన్న ఈ సినిమా చుస్తే అనిపించింది.నాకు కూడా ఇలాంటి multiple personality ఉందేమో అని.నాకేంటి గట్టిగ ఆలోచిస్తే అందరి లొనూ ఉంటుంది ఇలాంటి వేషాలు.ఎలాగంటారా వినండి చెప్తాను.
శుక్రవారాలు,పండగలు,వ్రతాలు వచ్చిన రోజుల్లో చక్కగా సాంప్రదాయం గా చీరెలు కట్టి,కాళ్ళకు పసుపు పూసుకుని,మడి వంట  చేసుకుంటూ,స్తోత్రాలు చదువుతూ,పెద్ద కుంకుమ పెట్టుకుని  రామం టైపు లో అమాయకం గా భక్తీ బావం తో ఉంటాను,,అదే శ్రీవారు ఏ బర్త్డే పార్టీ కో,imax లో సినిమా కో,ఇంకా మరి pub కో,disco కో వెళ్దాము అన్నారనుకోండి చెప్పేదేముంది,మెరుపు తీగ లాగా ఫాస్ట్ గా modern గా రెడీ అయ్యి ఏదో మనకు సూట్ అయ్యే వేషం లో ఏ గాగ్ర నో,చుడిదార్ నో,వర్క్ sarees నో  ,jeans నో  ఏదో మొత్తానికి ఫుల్ posh posh గా రెడీ అయ్యి remo లాగా తయారవుతం.అప్పటి దాక కాళ్ళకు పూసిన పసుపు కూడా శుభ్రం గా కడిగేస్తాం,పెద్ద బొట్టు తీసేసి  ఏదో తలక్కు,చమక్కు బొట్టు పెట్టేస్తాం కనీ కనిపించకుండా,,చిన్న గొలుసు వేస్తాం మరేమి చేస్తాం jeans మీద బాగోదు కదా అలాంటివన్నీ,మరి కొంచెం modern లుక్ ఇవ్వాలి గా.
ఇంక అపరిచుతుడు ఎప్పుడూ వస్తాడా అస్సలు హీరో అనుకుంటున్నారా??? హహహ అదెప్పుడు ఉండేదేగా మనలో..మనకు ఎవరి మీద అయినా  కోపం వచ్చిందనుకోండి వెంటనే మన గొంతు మారిపోతుంది గా,,కోపం నషాళానికి ఎక్కుతుంది,,అదే శ్రీవారి వలన కోపం  వచ్చిందనుకోండి మరీ ఎక్కువ ప్రదర్సించలేము గా అందుకే నేను వేసే శిక్ష (మరీ పెద్ద మాట అయ్యింది కదా) స్వయం పాకం అదేనండి కుంభి పాకం లాగా.నాకు కోపం వచ్చింది అని ధైర్యం గా చెప్పలేము కదాభయం,ఏదో ఆలోచనలతో ఉండి వంట చేస్తానా కూరల్లో మర్చిపోయి రెండు సార్లు ఉప్పు వేస్తాను  ఇంకేముంది,మరీ కోపం వస్తే కొంచెం కారం వేద్దాం అనుకుంటూనే ఎక్కువ పడిపోతుంది,అందుకే ఎప్పుడైనా కూరల్లో కారం ఎక్కువైతే అంటారు ఇవ్వాలేమి అనలేదే నిన్ను.మంట గా ఉందేటి కూర అని,మరీ సినిమాల్లో హీరో కాబట్టి అన్నీ శిక్షలు వేసేస్తాడు కోపం వస్తే.మనం మాములు మనుషులం కదా మరి మనం చేయలేం గా అవి,గరిటెల దడ దడ ఇంకొక శిక్ష,అదేనండి శుల దండన లాగా. ఎం చేస్తాం కోపం వచ్చినప్పుడు ఇంట్లో గిన్నెలన్నీ దబ దబ వాటంతట అవే పడిపోతుంటాయి,కావాలని పడేయకపోయినా కొంచెం సౌండ్ వచ్చేట్టు గట్టిగ పెడ్తామాయే,సౌండ్ కన్నా తెలుస్తుంది గా మనం hurt అయ్యామని,,గబక్కున పింగాణి కప్పు పగిలిపోయిందే అనుకోండి అయ్యో మళ్లీ అపరిచుతుడు కాస్త తుస్స్ మని వెళ్ళిపోయి మాములు మనిషి అయిపోయోతాను.ఇంకా నయం కదండీ నేను ఆయన మీద విసేరవేయటం లేదు,,కాస్త నయమే,
అపరిచుతుడు కాసేపు అలా వచ్చి ఇలా వెళ్ళిపోతూ ఉంటాడులెండి,ఎక్కువసేపేమి ఉండదు,అప్పుడప్పుడు ఈ మూడు వేషాలలో మారుతూ ఉంటాను 
అందుకే నాకు ఆ సినిమా చుస్తే ఏముంది మామూలే కదా అని అనిపిస్తుంది,కాకపోతే మరీ శిక్షలు ఎక్కువ వేస్తుంటాడు అంతే.అందులో హీరో కు పాపం తను ఇలా మారుతున్నాడని తెలియదు కాబట్టి అపరిచుతుడు అయ్యాడు.నాకు తెలుసు గా నేను మారే పాత్రలు. అందుకే నేను సుపరిచితుడు..

4 comments:

  1. :-)

    అన్నట్టు, పక్కన ఉల్లాసంగా ఉత్సాహంగా మీరెనా? ఎప్పుడు ఆపుతారా అని రోజూ చూసి వెల్తున్నా. అసలు అలుపే రాదటండీ ?

    ReplyDelete
  2. బంచికు బంచికు బం చెయ్యి బాగా వంటికి యోగా మంచిదేగా,,,
    ఇదే నా సూత్రమండి బద్రి గారు,,పొనిలెండి ఇలాగైనా నా బ్లాగును చూస్తున్నారు మీరు
    ధన్యావదాలు

    ReplyDelete
  3. :))

    పబ్బులకీ, డిస్కోలకీ రెగ్యులర్గా వెళుతుంటారా? నా లైఫులో ఇంతవరకూ పబ్బుకీ, డిస్కోకీ వెళ్ళలేదండీ. ఆ భాగ్యం ఎప్పుడు కలుగుతుందో ఏమో. పోనీ మా ఆవిడ అయినా నన్ను తీసుకువెళ్ళలేదు :( (అంటే తను ఒక్కతే వెళుతుందనే అర్ధం కాదు)

    ReplyDelete