Jun 16, 2010

నా రాతలు-గీతలు

అబ్బా  అప్పుడే  సెలవులు  అయిపోయినాయి..నాకు కూడా చిన్నపిల్లల లాగా ఇంకా కొన్ని రోజులు ఉంటే బాగుండేది సెలవులు అని పిస్తోంది..సెలవులకు మా అమ్మగారి ఇంటికి వెళ్ళాను,,,ఇల్లు అంతా సోదా చేసి చివరకు నా చిన్నప్పటి జ్ఞాపకాలు అన్నిటిని నా వెంట తెచ్చేసుకున్నాను,,,అదేనండి,,నా చిన్నప్పుడు నా ఫ్రెండ్స్ నాకు ఇచ్చిన గ్రీటింగ్స్,లెటర్స్(అబ్బో లెటర్స్ రాయటం అంటే మహా ఇష్టం లెండి),,నేను ఏదో కొద్దో గొప్పో బొమ్మలు కూడా వేసేదాన్ని,,,నాకేమో అవి MSHussain గారి paintings లా అనిపిస్తాయి...మా అమ్మ కేమో చిత్తు కాగితాలు లా అనిపిస్తాయి.,ఏదో ఒకరోజు అడ్డం అని పారేస్తుందేమో అని కూడా తెచ్చుకున్నాను,,,రేపు మా బాబు కు చూపించొద్దు నా ప్రతిభా పాటవాలు,,,చిన్నపుడు ఉన్న hobbies ఏమీ లేవు ఇప్పుడు,,,ఆ ఇంటరెస్ట్ కూడా లేదు ఏంటో,,,పెళ్లి అయితే అంతేనేమో,,,పనులలో పడి ఆ ధ్యాసే ఉండదేమో,,,నేను బొమ్మలు వేసేప్పుడు eraser use చెయ్యను,,,తప్పు వచ్చింది అనిపిస్తే ఇంక వేయాలి అన్న మూడ్ పోతుంది,,,almost అన్ని eraser సహాయం లేకుండానే వేసాను,,,,
నేను వేసిన బొమ్మలు ఇక్కడ పెడ్తున్నాను చూసి మీ కామెంట్స్ చెప్పండి....
                                                చదువుల మధ్య సతమతమవుతున్న విద్యార్ధి....
    I  am proud to be an Indian
                                                             వస్తాడు నా రాజు Rajadoot పైన ....
                                                              రాజస్థానీ బ్యూటిఫుల్ లేడీ...




ప్రియతమా 
నీ గురించి ఆలోచిస్తూ అన్నీ మరిచిపోతాను,
నీవు వస్తావని,నిన్ను చూడాలని  అనుకుంటాను,
ఒక్కటి మాత్రం నిజం 
నీ తలపులు లేని నేను లేనే లేనని,,,
నిన్ను చూడకుండా  నేను ఉండలేనని....







మేలి ముసుగులో సిద్దమైన  పెళ్లి కూతురు,,
                                             కళ్యాణ వైభోగమే...నా పెళ్లి శుభలేఖ...

8 comments:

  1. chala baagunnai andi mee paintings. malli mee art ni veliki teeyandi mee khali timings lo. atleast mee next generation ki edo vidhanga upayogapadatai. inthati kala ni champeyatam chala pedda tappu.
    Hope, you will consider the request.

    ReplyDelete
  2. బాగున్నాయండీ మీ బొమ్మలు. ఎదురు చూస్తున్న అమ్మాయి మరీ బాగుంది :-)

    ReplyDelete
  3. బాగున్నాయి...ఇండియా బొమ్మలో గుజరాత్, బెంగాల్ స్థానాల్లో కొంచెం ఇంకా వంకరలు ఉండాలి అనుకుంటున్నా.. రాజస్థానీ అమ్మాయిలో కూడా కొద్దిగా ఎక్కడో ఏదో...మిగతా అన్నీ వంక పెట్టడానికి లేవు.. నా పిడకల వేటని మన్నించండి :)

    ReplyDelete
  4. Thanx to Aditya garu,Madhura vani garu,Ramakrishna Reddy garu,,,
    ఇంకా బాగా ప్రావీన్యం రావాలి అండి నాకు,,,ఎదొ అలా చిన్న చిన్నగ ప్రయత్నిస్తున్నా,,మీరు సూచించిన సలహాలు పాటిస్తాను,,,

    ReplyDelete