(ప్రకాశం గత పదేళ్లుగా అమెరికా లోనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా ఉద్యోగం చేస్తున్నాడు,,పిల్లలు అక్కడే చదువుకుంటున్నారు,,తల్లిదండ్రు
తండ్రీ కొడుకులు కలిసి దేశాన్నేమీ ఉద్దరించక్కర్లేదు కానీ, అన్నం వడ్డించాను రండి అని లోపల నుండి పిలిచింది ప్రకాశం తల్లి పార్వతమ్మ.
గ్లాస్సు లో ఉన్న మంచినీళ్ళను చూసి "ఛి dirty water ,,i dont want this " అని అన్నది ప్రకాశం చిన్న కూతురు..అమ్మా రేపటినుండి మినెరల్ వాటర్ తెప్పించండి...మీరు కూడా ఇలాంటి నీళ్ళే తాగుతున్నారా? ఆరోగ్యం పాడవుతుంది,,చూడండీ ఎలా ఉన్నాయో" అని అసహ్యం గా మొహం పెట్టి అన్నాడు ప్రకాశం..పార్వతమ్మ మొహం చిన్నబుచ్చుకుంది..వెంటనే పరంధామయ్య అందుకుని"నువ్వు చిన్నప్పుడంతా తాగింది ఈ నీళ్ళే కదరా,,ఇప్పుడు ఉళ్లో ఉన్న వాళ్ళు అందరూ కూడా ఇవే గా తాగేది,కొత్తగా చెప్తున్నావ్" అని మందలించారు.ఇంక మరుసటి నుండి కొడుకు బాధ భరించ లేక mineral water తెప్పించ సాగాడు పరంధామయ్య.
ఇలాగె ఇబ్బందులతో కొన్ని రోజులు గడిచినాయి.
సుమ్మెర్ కావున ఎండలు బాగా ఉన్నాయి..లోపల పడుకోలేక ఒక రోజు ఆరుబయట మంచాలు వేసుకొని పడుకున్నారు ప్రకాశం ఫ్యామిలీ.పరంధామయ్య గారు,పార్వతమ్మ ఎప్పుడూ చెట్ల కిందే ఆరుబయట వసారా లో పడుకుంటారు చల్లని గాలి కోసం,వాళ్ళు ఈ ఫ్యాన్ గాలిలో ఇమడలేక..తెల్లారి లేచేసరికి ప్రకాశం కూతురి వొంటి నిండా దద్దుర్లు వచ్చేసాయి,రాత్రి బయట పడుకున్నందుకు దోమలు బాగా కుట్టేసాయి,"అందుకే మేము రాము మీరు ఒక్కరే వెళ్లి రమ్మంటే నా మాట విన్నారు కాదు చూడండీ ఏమయిందో అని" ఇంగ్లీష్ లో ప్రకాశం మీద మండిపడుతోంది ప్రకాశం భార్య..ప్రకాశం ఏమి చేయాలో తెలియక తండ్రి మీద ఎగిరాడు" చూడండీ ఏమయిందో,,అప్పుడప్పుడు ఎంతో కొంత డబ్బు పంపిస్తూనే ఉన్నాగా ఒక AC అన్నా కొనలేకపోయారా??ఈ దోమలు,ఈగలు ఏంటి మనతో పాటే మనుషులు లాగా తిరుగుతున్నాయి పగలు రాత్రి,,అస్సలు శుభ్రం ఉండదు,,అందుకే నాకు ఇండియా రావాలి అంటే ఇష్టం ఉండదు,,ఏమీ సౌకర్యాలు ఉండవు,,మీరేమో ఊరికే రండి రండి అంటారు,,ఇంక మళ్లీ ఒక పదేళ్ళ వరకు రమ్మనకండి.."అని విరుచుకుపడ్డాడు,,
పాపం పరంధామయ్య,పార్వతమ్మ లు బాగా బాధపడ్డారు,అయ్యో మనమేకదా వాళ్ళని రమ్మన్నది అని.
భారం గా రోజులు గడిచాయి ప్రకాశం కు..
వెళ్ళాల్సిన రోజు రానే వచ్చింది..
"నాన్న మీరు మమ్మల్ని రమ్మని ఫోన్ చేసిన ప్రతిసారి రమ్మని చెప్పేవారు.నాకు కూడా మిమ్మల్ని చూడాలనే ఉంటుంది..కానీ దగ్గర ఊళ్లు కాదు కదా ఊరికే వచ్చిపోవటానికి,,,అయినా వచ్చాక ఇన్ని ఇబ్బందుల తో మేము ఇక్కడ ఇమడలేము,,మేము వచ్చి ఇబ్బంది పడి దాన్ని చూసి మీరు బాధ పడి,ఎందుకు నాన్నా ఇవన్నీ,,హాయ్ గా ఫోన్ లోనే మాట్లాడుకుందాము,మీరే రావటానికి ఏర్పాట్లు చేస్తాను ఈ సారి,అప్పుడు ఎవ్వరికి ఇబ్బంది ఉండదు,అక్కడ జీవితానికి అలవాటు పడిపోయాము మేము ఇక్కడ ఉండాలి అంటే కొంచెం ఇబ్బందే అవుతుంది,సారీ నాన్నా " అని తను చెప్పదలుచుక్కన్న నాలుగు ముక్కలు చెప్పేసాడు ప్రకాశం.
ఈ మాటలకు బాధపడి పరంధామయ్య "నిజమే రా,,మేము నీ చిన్నప్పుడు ఎన్నో కష్టాలు,చిన్న చిన్న కోరికలు కూడా కాదనుకుని నీకు అడిగినవి అన్నీ కొనిచ్చాము,ఆ బాధలు కూడా ఎంతో ఆనందిచాము,ఎందుకంటే నా కొడుకు కోసం అని అనిపించేది,,ఇప్పుడు ముసలివారము అయిపోయిన మాకోసం ఒక్క నెల కష్టాని ఒర్చుకోలేకపోతున్నవా?? చిన్నప్పటినుండి పిల్లలకు తాతయ్య,నానమ్మ అని అప్పుడప్పుడు అన్నా మా గురించి బాగా చెప్తేనే వాళ్ళకు మా మీద అభిమానం,ప్రేమ కలుగుతాయి,ఇక్కడ ఉన్న నెల రోజులలో ఏ నాడు వాళ్ళు తాతా ఆని ఆప్యాం గా మా దగ్గరికి వచ్చింది లేదు,మనం చెప్పే దాన్ని బట్టే మన పిల్లల నడవడిక ఉంటుంది,మన వాళ్ల కోసం అంటే కొంచెం కష్టాన్నైనా ఇష్టం గా భావిస్తాము,పోనిలే బాబు మీరు రావద్దులే ఇక్కడకు,వచ్చి ఇబ్బంది పడటం ఎందుకులే,ఈ శేషజీవితం ఇక్కడే ఇలాగే గడిపేస్తాం,ఇక్కడ అంతా మాకు అలవాటు అయినదే కదా,మాకు ఇంతే ప్రాప్తం అనుకుంటాం,,"అని బాధాతప్త హృదయాలతో వీడ్కోలు పలికారు,.
-----------------------------------------------------------------------------------------------------------------------------
మన నిజ జీవితం లో ఇలాగా చాలా మందినే చూస్తూ ఉంటాము,అక్కడ అలవాట్లకు అలవాటు పడి ఇక్కడ adjust కాలేక నిజం గానే చాలా బాధ పడుతుంటారు,అంత దాక ఎందుకు మనమే ఈ నగర జీవితానికి అలవాటు పడి ఒక్క నాలుగు రోజులు పల్లెల్లో అది కూడా మనం పుట్టి పెరిగిన మన పల్లెటూరు లో ఉండాలి అంటేనే adjust కాలేకపోతున్నాము,మన వాళ్ళే వాళ్ళు అని అనుబంధం పెంచుకుంటే ఎంతటి కష్టాన్నైనా ఇష్టం గా భావించవచ్చు,,పెద్దవాళ్ళు కొంచెం అర్ధం చేసుకోవాలి,చిన్న వాళ్ళు కూడా కొంచెం adjust అవ్వాలి పరిస్థితులకు అపుడే బంధాలు అనుబంధాలు కలకాలం నిలుస్తాయి.
అవును నిజమే .
ReplyDeleteNice one. Its true.
ReplyDeletechala baga rasavu.. Manchivallu chala mandi vuntaru kani ardham chesukune vallu, adjust ayye vallu thakkuvaga vuntaru..
ReplyDeletemana pakkavallaki kooda manasuntundi ani vallakee konni feelings vuntayanna chinna vishayam telisthe chalu.. kasthapette pani emi cheyamu.. really gr8 job akka.. nenu neeku pedda fan ni ayipoyaa ;)
nice one. Kathanam bagundi. Kallaku kattinatlu undi...
ReplyDeleteReally heart touching.
Konniti viluva avi mana daggara unnappudu teliyadu...avi mrugyamaipoinappudee telustundi...