Nov 1, 2010

చదువు కొంటున్నాము

ఈ మధ్యనే మా బాబు ను playschool  లో వేసాము.కాస్త స్కూల్ అలవాటు అవుతుంది అని అనేకంటే వాడి గొడవ ఇంట్లో భరించలేక వేశాము అంటే బాగుంటుందేమో.కాసేపన్నా ఉపిరి పీల్చుకోవచ్చు అనిపించి వేశాము.వాడిని రెడీ చేసి bag రెడీ చేసి స్కూల్ లో దింపి ఇంటికి వచ్చి అమ్మయ్య అనుకునేటప్పటికి ౩ hours అయిపోతాయి..మళ్ళి పరుగున వెళ్లి తెచ్చుకోవటం.saturday కూడా ఉంటే అలసిపోతారు అని saturday ,sunday శెలవలు.ఈ మాత్రం దానికి అప్పుడే ఎందుకు స్కూల్  అని మా ఇంట్లో పెద్దవాళ్ళంతా గోల.ఈ ౩ గంటలు భరించినందుకు స్కూల్ ఫి 22 ,000  ఈ narsury కు.నా ఇంజనీరింగ్ మొత్తం అయిపొయింది ఆ డబ్బుతో,,అదే నాకు కట్టిన పెద్ద మొత్తం నా చదువు కు నా జీవితం లో.అలా అని చేర్చకుండా ఉరుకోలేము గా.పాజిటివ్ attitude ,సెల్ఫ్ కాన్ఫిడెన్సు  అలాంటివి నేర్పిస్తారు ట వాళ్ళు,.నా మొహం మనకే గట్టిగ తెలియదు ఆ పదాలు ఏమిటో వీళ్ళకేమి తెలుస్తుంది.అన్నట్టు ఈ మధ్య parents మీటింగ్ కూడా పెట్టారు.పెట్టి వీళ్ళకు gradings ఇచ్చారు.మా వాడికి ఏదో B గ్రేడ్ ఇచ్చారనుకోండి. పాపం చేరి వారమే కదా వాళ్ళకు analyze చేయడానికి టైం సరిపోలేదు ట..అందులో ఉన్న columns ఏమిటంటే  sharing ,సెల్ఫ్ confidence ,respect to others ,talking ,running ,jumping ,eating ,behaviour ,cleanness etc ..ఇవి అన్నీ observe చేసి చైల్డ్ లో gradings ఇచ్చారు.మా వాడికి jumping ,running లో A + గ్రేడ్,follwing teacher అనే item  లో occassionally following అని C గ్రేడ్ ఇచ్చారు.వాళ్ల టీచర్ చెప్పింది మీ వాడు ఇంకా ఫాలో అవ్వాలి teacher ను..మీరు ఇంగ్లీష్ లోనే మాట్లాడండి ఇంట్లో కూడా అని. ఎందుకంటే ఆ టీచర్ కు తెలుగు అస్సలు రాదు.ఇంగ్లీష్ లో come here అని పిలుస్తుంటుంది ..ఇంకా మొత్తం తెలుగు పదాలే  రాలేదు మా వాడికి. ఇంక ఆ ఇంగ్లీష్ ఏమి అర్ధం అవుతుంది..నన్ను కాదు అన్నట్టు బిక్క మొహం వేసి ఉంటాడు.చేరగానే అన్నీ ఎలా వచ్చేస్తాయి అనుకుంటారో.ఈ మాత్రం స్కూల్ మానకుండా,ఏడవకుండా వెళ్తున్నాడు అంటే గ్రేట్,ఈడ్చుకుని తెసుకు వెళ్ళాల్సిన అవసరం లేదు మా వాడిని,హయిగా స్కూల్ లోనే ఆడుకోవచ్చు అని వాడి ఆనందం. ,అన్నీ రకాలు గాను డెవలప్ అయినాయి స్కూల్స్.

7 comments:

 1. >>>అన్నీ రకాలు గాను డెవలప్ అయినాయి స్కూల్స్. >>>
  నిజంగా ఇది డెవలప్‌మెంటే అంటారా?
  మీరు చెప్పారు చూడండి చదువు కొంటున్నాము అని, అది నూటికి నూరుపాళ్ళూ నిజం.
  nursery కు పాజిటివ్ attitude ,సెల్ఫ్ కాన్ఫిడెన్సు ట్రయినింగ్. PG కి కూడా అదే ట్రయినింగ్.
  ఇప్పటి చదువుల్లో ఎన్నేళ్ళు చెప్పినా పాజిటివ్ attitude ,సెల్ఫ్ కాన్ఫిడెన్సు రావడం లేదనుకుంటా పిల్లలకి. గ్రేడింగ్స్ అంటే ఏమిటో కూడా అర్ధంకాని వయసునుండే నువ్వు ఎక్కువ, నువ్వు తక్కువ అంటూ గ్రేడింగ్స్. ఇక ఎంత ట్రయినింగ్ ఇస్తే మాత్రం సెల్ఫ్ కాన్ఫిడెన్సు ఏం పెరుగుతుంది?

  ReplyDelete
 2. వాళ్ళపిండాకూడు చదువు చెప్పటమా పాడా ! డబ్బు సంపాదనకొకమార్గం
  ఇక కోరి కన్న పిల్లలుకూడా భారంగా భావిస్తున్న తల్లిదండ్రులు వీళ్లకు ఆదాయ వనరులు

  ReplyDelete
 3. చదువు కొనలేము అని మన తల్లిదండ్రులు అనుకుని ఉంటె మనం ఇప్పుడు ఈ positions లో ఉండేవాల్లమా,,ఆ time కు మనకు కష్టమైనా మన పిల్లల భవిష్యత్తు కోసం కష్టపడాలి కద

  ReplyDelete
 4. 22,000 Rs. is ridiculous in us standards as well, unless it is of international standards.

  ReplyDelete
 5. నాగరికత నశిస్తున్న కాలంలో ఇవి అన్నీ ఈతిబాధలు.మన పిల్లలు మనలను old age homes లో కి నెట్టి, సంవత్సరానికొకసారి hai mom,dad best wishes(ఎందుకు?!) అనే చిలక పలుకులు భరించకతప్పదు

  ReplyDelete
 6. తప్పు మన లొనె ఉంది,రెకుల షెడ్డు స్కూల్ లొ చెర్పించటనికి ఇష్టపడము ,గవర్నమెంట్ బడి అస్సలే వద్దు,మంచి పొష్ గ ఉన్న స్కూల్ కావాలి ,మనం బాగా చదువుకున్నవాళ్ళం అయిన మన పిల్లలకు మనం అంత ఒర్పు గ చెప్పము,చెప్పె Time కుడా ఉండదు ,,మనం Create చెసిన Situtaion నె ఇది,ఇంకొకల్లని blame చెయకూడదు మనం..

  ReplyDelete