Nov 25, 2009
మంచి కాలక్షేపం
ఈ మధ్య న మా వారు కొద్దిగా పని ఉండి కంప్యూటర్ మీద వర్క్ చేస్తున్నారు ఎక్కువసేపు... ఇంక నాకు ఇంటర్నెట్ బ్రౌసె చేసే వీలులేక బోర్ కొట్టి పుస్తకాలూ చదవటం మొదలు పెట్టాను.. చిన్నప్పుడు బాగా చదివేదాన్ని కనపడిన పుస్తకము .. magzines కానీ,వీక్లీ లు కానీ,ఆధ్యాత్మికం కనీ ఎదినా ..ఇప్పుడు ఇంటర్నెట్ ఉంది కదా అని online లోను,డౌన్లోడ్ చేసుకుని చదువుతున్నాను.. అట్లా కంప్యూటర్ లో ఎక్కువసేపు చదవలేక పోయేదాన్ని...ఈ మధ్య మళ్లీ పుస్తకం చేతపట్టేటప్పటికి పేజీలు పేజీలు తిరగేస్తున్నాను... చదువుతుంటే బాగా మనసుకు హత్తుకుపోతుంది... అందుకే అంటారేమో పుస్తకం మంచి ఫ్రెండ్ లాంటిది... అని హాయ్ గ పడుకొని చదువుతూ ఉంటే చక్కగా కాసేపటికి నిద్ర కూడా మంచి గ వస్తుంది... చిన్నప్పటినుండి పిల్లలకు కూడా మంచి మంచి పుస్తకాలూ చదవటం అలవాటు చేయాలి తల్లిదండ్రులు... మేము మా చిన్నప్పుడు మా ఉళ్లో గ్రంధాలయం ఉండేది అక్కడ ఆడవాళ్లకు seperate సెక్షన్ ఉండేది సో నేను మా స్నేహితులం కలిసి దాదాపు ప్రతి ఆదివారం/సెలవు దినాలలో వెళ్లి పుస్తకాలూ చదివేవాళ్ళం... ఇప్పుడు అస్సలు లైబ్రరీ కు మగవాళ్ళు కూడా మానేసి ఉండి ఉంటారు వెళ్ళటం ... అన్ని ఇంటర్నెట్ లోనే ఉంటాయి గ ..చదివే అలవాట్లు కూడా తగ్గిపోయినాయి బాగా.. ఎంతసేపటికి టీవీ లు...ఈ reality show లే గా మన నేస్తాలు.
Subscribe to:
Post Comments (Atom)
నిజమేననిపిస్తోంది మీరు చెపుతుంటే ! నేను పుస్తకాలు కొనడం మానేసాను, లైబ్రరీకి వెళ్ళడం మానేసాను. అంతా గూగులే
ReplyDeleteఎంత కంప్యూటర్ ప్రభావమున్నా...బుక్స్ నుంచే ఎక్కువ విషయాలు మనము తెలుసుకో గలుగుతాము. అందుకే అన్నారు...Books are real friends అని.
ReplyDeleteఇప్పుడూ ఉన్నాయి గ్రంథాలయాలు,గ్రంథాలయాల పన్నుకూడా ఉంది మనకు.చదివేవారు తక్కువయ్యారు. నిధులు కేటాయించడం కూడా క్రమంగా తగ్గిస్తున్నారు.
ReplyDelete