May 4, 2010

వచ్చేసారు వచ్చేసారు

అమ్మో వచ్చేసారు ట ఉగ్రవాదులు,,,నిన్నటి నుండి తెగ చుపిచ్చేస్తున్నారు టీవీ లలో...వాళ్ళకేమి చక్కగా దర్జాగా వచ్చేసుంటారు,,,పుట్టింటికి వచ్చినట్టు మహా ఉత్సాహం గ వచ్చేసుంటారు,,,ఇక్కడేమో మనం అమీర్పేట్ నుండి కోటి వెళ్ళాలి అంటేనే మధ్యలో దాదాపు పది చెకింగులు జరిగితే గాని వెళ్ళలేము,,,ఇన్ని జాగ్రతలు తీసుకుంటున్న వాళ్ళను కనిపెట్టలేక పోతున్నాము,,కారు లో బాంబు ఉంది అని newyork వాళ్ళు భలే నిముషాల్లో కనిపెట్టేసారు...మనకు ఎప్పుడొస్తుందో అంత భద్రతా సిబ్బంది,,,ఆ పరికరాలు,,అసలే వచ్చారు ఉగ్రవాదులు అని మనకు చచ్చే భయం వేస్తుంది,,,ఇంట్లో ఉన్నా కానీ బయటకు వెళ్ళిన వాళ్ళు ఎలా వస్తారో,,అని తిరిగి ఇంటికి వచ్చేదాకా మన అరికాళ్ళల్లో అదురు పుట్టాల్సిందే,,,కాసేపు టైం పాస్ కోసం టీవీ చూద్దాం అంటే దానిలో scorllings ,,,20 మంది వచ్చారు ౩౦ మంది వచ్చారు,,,ఎక్కడైనా  పెట్టచ్చు బాంబు...షాపింగ్ మాల్ల్స్,గుడులు,,,కార్లలో,,schootar లలో,,,అని ,,,,మీరు కనక సెంటర్ ల లో ఇళ్ళ వాళ్ళు ఐతే మీ ఇంట్లో కూడా పెట్టొచ్చు అని స్క్రోల్ ఇచ్చేట్టున్నారు ఈ టీవీ వాళ్ళు,,,
వచ్చారు మన శత్రువులు,,,సరే ఎవరైనా  అనుమానం గ ఉంటే ఈ నెంబర్ కు ఫోన్ చెయ్యండి,,,ఏదైనా  కొత్త వస్తువు కనిపిస్తే ఫోన్ చెయ్యండి ఇలాంటి ధైర్యవచనాలు చెప్పకుండా...అదురుపుట్టిస్తున్నారు,,,రోజు గడిస్తే అమ్మయ్య ఏమి కాలేదు,,,అని ఉపిరి పీల్చుకోవలసిన పరిస్థితి వచ్చింది,,,

No comments:

Post a Comment