Jan 28, 2010

మానసిక సంఘర్షణ


ఇది నా మానసిక సంఘర్షణ, నాది అనే బదులు నాలాంటి తల్లుల మానసిక ఘర్షణ అనవచ్చేమో..మాత్రుత్వపు అనుభూతులు చవిచూస్తునె కెరీర్ పరం గ దూరమ్ అయినవాళ్ళు ఏదో ఒక రోజు అనుభవించే ఉంటారు..పిల్లలు పుట్టకముందు దాక ఉద్యోగం చేసి పిల్లలు పుట్టాక వారి సంరక్షణ కుదరక ఉద్యోగం మనివేయాల్సి వస్తే ఇటు పూర్తిగా పిల్లలతో ఉత్సాహం గ ఉండలేరు,అలా అని ధైర్యం చేసి ఉద్యోగం కు వెళ్ళలేరు.. ఏముందిలే అమ్ముమ్మ దగ్గరో,డే కేర్ లలోనో ఉంచొచ్చు లే అని పిల్లలు పుట్టేదాకా అనిపిస్తుంది..తర్వాతే అస్సలు పరిస్థితి అర్ధం అవుతుంది..నేను కూడా ఇలాగె అనుకుని మా పెద్దవాళ్ళ దగ్గర ఉంచాను మా బాబును ..రెండు రోజులలోనే వాడికి 105 జ్వరం వచ్చింది అంటే మీరు నమ్మరు..వాళ్లకి చెప్పటం చేతకాక మనసులో బెంగా పెట్టుకునేటప్పటికి అలా ఏదో జ్వరం లాగ అనారోగ్యం రూపం లో కనిపిస్తుంది..సరేలే ఉద్యోగం మానేసి చక్కగా పిల్లలను చూసుకుందాం అనుకుంటే అరే మంచిగా రాంక్ తెచ్చుకుని  చదివి ఇలాగా ఖాళీగా ఉన్నామే అని అనిపిస్తుంది.. Idle brain isA  house of devil అని ఎక్కడో విన్నానో చదివానో గుర్తులేదు లెండి.. ఖాళీగా ఉంటె అలాగే ఉంటుంది మనసు.సరేలే పిల్లలు బడికి వెళ్ళాక మొదలు పెడతాము అనుకుంటే అస్సలే ఇది టెక్నాలజీ పరంగా బాగా ఫాస్ట్ గ ఉన్న యుగము . ఇంకా ఇంకా వెనకపడిపోతాము.. ఇంత గ్యాప్ వచ్చేటప్పటికి దాదాపు గ మనకు కూడా ఉద్యోగం మీద ఆసక్తి పోతుంది.. పిల్లలను బడినుండి తేవటం ,వర్క్ చేయించటం  ఈ బాధ్యతలు పెరిగిపోతాయి గా.. అయినా ధైర్యం చేసి వెళ్దాము అంటే వెళ్ళిన తర్వాత మనసు అంతా పిల్లల మీదే ఉంటుంది తిన్నాడా,ఏడుస్తున్నాడా  అనుకుంటూ..ఉద్యోగం చేసే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందా అని అనిపిస్తుంటుంది నాకు... మీలో ఎవరినా ఉంటె చెప్పండి ఎలా మేనేజ్  చేస్తున్నారో...

3 comments:

 1. జీవితం లో ప్రయారిటీస్ అనేవి ఎవరికి వారు నిర్ణయించుకొనేవి. మీరు పడే సంఘర్షణ మాకు అర్థమైనా, ఆ సంఘర్షణకు సమాధానం చెప్పుకోవాల్సింది మీరే..!

  సరే మీ రెండు పరిస్థితుల్నీ విశ్లేషిద్దాం..

  1) ఉద్యోగం మానేసి ఇంట్లో ఉండి, పిల్లల బాగోగులు చూడటం!

  ఇది చాలా ఆనందదాయకమైన విషయం. ఎందుకంటారా..? ఉద్యోగం, అనేది మీరు మీ జీవితపు ఏ దశ లో ఐనా మీకు దొరుకుతుంది. ఆ జీవితం కోల్పోయామే అనే బాధే అనవసరం. కాక పోతే కొంత ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. కానీ అసంభవమైతే కాదు.

  కానీ చిన్న చిన్న పిల్లల బోసి నవ్వులూ, కేరింతలూ, ముద్దు మాటలు మీరు తర్వాత ఎంత కష్టపడ్డా మికు లభించని అమూల్యమైన మధురానుభూతులు! పిల్లలకు చేసే సేవ అప్పటికి కొంత దాకా విసుగుని కలిగించ వచ్చేమో కానీ, వారి శైశవం, బాల్యం మీకు జీవితాంతం గుర్తుండి పోయే మధురానుభూతిని ఇస్తున్నప్పుడు, ఆ విసుగు భరించవచ్చు ! అందుకే ఎంత కష్టమైనా సరే చిన్నారుల్ని డే కేర్లలో వదలడం లేక మన అమ్మా, నాన్నల దగ్గర వదలడం చేస్తే మనమే ఆ ఆనందాన్ని కోల్పోయిన వాళ్ళవుతాం.. ఇంతకన్న ఈ విషయం గురించి ఎమీ చెప్పలేము

  2) కారిర్ పాడవకుండా ఉద్యోగం చేస్తూ, కాంప్రమైజ్ కావడం

  పైకి కనిపించదు కానీ తల్లులు ఎక్కువగా బాధ పడేది ఈ నిర్ణయానికే. కాంప్రమైజ్ అనే పదం వాడాను గమనించండి. యే తల్లికీ పిల్లలను అలా మూడో వ్యక్తికి అప్పగించి ఉద్యోగం చేయాలి అని ఉండదు. అలా చెయ్యాల్సిన పరిస్థితి ఉంటే మనసంతా పిల్లల మీదే ఉంటుంది. ఎప్పుడెప్పుడు ఇంటికి వెడదామా.. పాపం పాలు తాగాడొ/తాగిందో లేదో, నిద్ర పోయాడో లేదో.. బెంగ పెట్టుకొన్నాడొ/పెట్టుకొందో ఏంటొ.. ఇలా లక్ష అనుమానలు మనసుని పట్టి పీడిస్తుంటాయి. కానీ మన జీవితపు ప్రాధాన్యతల దృష్ట్యా తప్పదు. ఇది కావాలి అనుకొన్నప్పుడు, అది కోల్పోవాలి. మొదట్లో చాలా బాధ గా ఉన్నా, కొంత కాలానికి మనమే అడ్జస్ట్ అవుతాం. చెప్పొచ్చేదేమంటే.. ఈ రెండో ఆప్షన్ తీసుకోకుంటే వచ్చే వెలితిని నేను జీవితాంతం భరించలేను అనుకొంటే మాత్రం, సెంటిమెంట్ కొంత పక్కన బెట్టి, మనసు దిటవు చేసుకొని నిర్నయం తీసుకోవాలి. కానీ పిల్లలు మీ దగ్గరే ఉంటే, కనీసం సాయంత్రం ఇంటికి వెళ్ళే సరికి వాళ్ళ చిరునవ్వులతో ఉదయం పడ్డ శ్రమ మరచి పోవచ్చు..

  వెరసి.. మీ జీవితపు ప్రాధాన్యతలను బట్టి ఉద్యోగం చెయ్యక పోయినా పర్లేదు అనుకొంటే కొంత గాప్ తీసుకోవడం వల్ల వచ్చే నష్టం ఏమీ లేదు.. బొలేడు స్వీట్ మెమొరీస్ తప్ప. ! అలాకాదు ఉద్యోగం చెయ్యక పోతే కుదరని పరిస్థితే అయితే - చెప్పాగా కొంత దాకా కాంప్రమైజ్ తప్పదు.

  ReplyDelete
 2. Okati kavali ante enkoti vadileyaali...ede jeevitam....Nenu naa pillalni amma daggara vadilesaanu 1.5years babuni, 6months appudu rendo babuni....chalaa hard gaa vuntundi...kaaanee mana kanna amma vallu baagaa penchutaaru anna okka nammakam to....

  ReplyDelete
 3. very valid worry.
  దానికి తోడు మన సమాజం చేసే దోహదం కొంత, పిల్లలు ఉండగా కెరీర్ గురించి ఆలోచిస్తావా హన్నా! అంటూ.

  మొదటిది .. మీకు దగ్గర్లో, స్నేహితులో బంధువులో మీ వయసు వాళ్ళు మీ లాంటి పరిస్థితిలోనే ఉన్నవాళ్ళయిన ఒక ముగ్గురు నలుగురు స్త్రీలతో దోస్తీ కట్టండి .. ఒక చిన్న సపోర్ట్ గ్రూపులాగా అన్న మాట.

  ఆంగ్లంలో అయితే చాలానే online resources ఉన్నాయి. Mommy blogs అని ఉన్నాయి.

  పిల్లల సంరక్షణ, ఇంటి నిర్వహణ పోగా ప్రతి రోజూ మీకోసం అని కోంత సమయం కేటాయించుకోండి. దినచర్యకి ఒక పద్ధతి ఏర్పరుచుకోండి. పొద్దున లేచేప్పుడు ఒక స్పష్టమైన ఐడియా ఉండలి .. ఇవ్వాళ్ళ నా ప్రత్యేక సమయంలో ఈ పని చేస్తాను - అని.

  You must explore avenues for working from home or a small business - so that you can generate some income too. All the best

  ReplyDelete