Jan 30, 2010

కొత్త హంగులు

చాలా కాలం తర్వాత మా అన్నయ్య నిన్న  నా బ్లాగు చుసాడుట..వెంటనే ఫోన్ చేసి బాగుందే నీ బ్లాగు చాలా రాసావు గా అని అన్నాడు..ఒక కామెంట్ రాయొచ్చు కదా అని అడిగితె నీకు ఒక కామెంట్ రాసే టైం లో నేను నాలుగు బ్లాగులు చదువుతానే అయిన కామెంట్ రాయకపోతే ఏమి ఫోన్ చేసి చెప్పాను కదా అన్నాడు.. కామెంట్ రూపం లో రాస్తే అదొక encouragement గ ఉంటుంది కదా అంటే టైపు చేయటానికి బద్ధకం ట..మా అన్నయ్య ఉండేది సింగపూర్ లో లెండి..ప్రతిసారి ఫోన్ కుదరదు కదా అని ఆఫీసు నుండి రోజు మెయిల్ చెయ్యి అంటే అంత  టైపు చేసే కంటే నిముషం లో ఫోన్ చేసి ఒక అయిదు నిముషాలలో మాట్లాడి పెట్టేస్తే అయిపోతుంది కదా ఆంటాడు..ఫోన్ లో అంత detailed గ మాట్లాడినట్లు ఉండదు,,ఒక పక్క సెల్ bill గుర్తువస్తూ ఉంటుంది  అంటే టైం లేదు మెయిల్ చేయటానికి అంటాడు.. నాకేమో  మెయిల్ చదవటం ఇష్టం, వాళ్ళు గుర్తువచ్చినప్పుడల్లా చక్కగా చదువుకోవచ్చు కదా అని అనిపిస్తుంది..నేను చదువుకునే రోజుల్లో మా అమ్మ ను inland లెటర్ రాయమనే దాన్ని..నేనూ రాసే దాన్ని అమ్మ గుర్తువచ్చినప్పుడల్లా చదువుకునే దాన్ని లెటర్ ను..ఫోన్ ఉన్న కూడా లెటర్ రాసేదాన్ని నిన్నే చూస్తున్నాం అని గేలి చేసేవాళ్ళు మా ఫ్రెండ్స్..ఇంత  techonlogy పెరిగిన నాకు పాత పద్దతులే నచ్చుతాయి కొన్ని. ఫోటోలు కుడా కంప్యూటర్ లో ఉన్నాయి కదా ఇంక ప్రింట్లు ఎందుకు డబ్బులు దండగ అంటారు మా వారు అయినా నాకు ఫోటో ఫోటో లాగా ఆల్బం లో చూస్తేనే ఇష్టం+ చూసినట్లు ఉంటుంది..న్యూస్ పేపర్ ఇంటర్నెట్ లో చదివేకంటే చక్కగా విడిగా పేపర్ లాగా చదివితేనే నచ్చుతుంది.. latest updates ఉంటాయి కదా నెట్లో అయితే అంటారు మా వారు చద్ది వార్త అయిన నాకు ఇలాగె బాగుంటుంది..చక్కగా కాఫీ తాగుతూ పేపర్ చదివితే అ థ్రిల్లే వేరు..టెక్నాలజీ పెరిగే కొద్ది కొన్ని కొన్ని చిన్న చిన్న ఆనందాలు మనం మిస్ అవుతున్నమేమో అనిపిస్తుంది..అయిన ఏమి చేయలేని పరిస్థితి..

1 comment:

  1. హాహాహా.. మీ ఆవేదన సింగపూర్ అన్నయ్యకు బహుషా అర్ధం అయినట్టే లేదు..పోనిలే నేను చెబుతున్న నీ బ్లాగ్ చాలా బాగుంది. కానీ బ్లాగ్ ఒకసారి రాసి వదిలేస్తే ఏం బావుంటుంది.. కంటిన్యూగా పోస్టులను.. మీ స్టైల్లో పెట్టండి. బ్లాగ్ చదివే ఇంట్రస్ట్ ఉన్నవారు బానే మంది ఉన్నారు. నిజం చెప్తున్న మీ బ్లాగ్ చాలా చాలా బావుంది. ఇలానే బ్లాగ్ ను కొనసాగించండి.
    రామ్.

    ReplyDelete