Dec 31, 2009

నిన్న లేదు నేడు లేదు

నాకు బిల్లా లో అమ్మ లేదు నాన్న లేడు పాట వింటుంటే అనిపించింది నిన్న ఏమి స్పెషల్ లేదు నేడు ఏమి కొత్తదనం  లేదు అంతా ఒకటే బోరింగ్.. అని..కొత్త సంవత్సరం అని ఏదో 11 గంటల  నుండి 12 గంటల దాకా హడావుడి తప్పితే వెళ్ళిపోయిన 2009 లో పాతదనం లేదు ఇప్పుడు వచ్చిన   2010 లోకొత్తదనం ఏమీలేదు..ఇలాగ నాకే అనిపిస్తుందా లేక అందరికి అనిపిస్తుందా అని అనిపిస్తోంది..ఈ సంవత్సరం లో అయిన ఏదన్న  కొత్తగా  ప్రయత్నిద్దాం అన్నా ఈ మట్టి బుర్ర కు ఏమి వినూత్న ఆలోచనలు రావటం లేదు..అందరు నీ న్యూ ఇయర్ resolutions ఏంటి అంటే ఏమున్నాయి అబ్బా అని ఆలోచనలో పడ్తున్నాను ..మీరు అందరు ఏమి resolutiions తీసుకున్నారో కాస్త నాకు కూడా చెప్పండి నేను కూడా నాకు నచ్చినవి  అందులో ఉంటె ఫాలో అవుతాను...

Dec 30, 2009

రాబోయే సంవత్సరానికి స్వాగతం

  20009 సంవత్సరం గ్రహణం తో ముగుస్తోంది...ఈ ఇయర్ తో మన రాష్ట్రానికి పట్టిన గ్రహణం వీడి సుభ సూచకాలు కలగాలి అని అందరం కోరుదాం..ఈ సంవత్సరం లో ముఖ్యం  గ మన రాష్ట్రం వార్త లలోకి బాగా ఎక్కింది.. y,s .మరణం,కర్నూలు ప్రాంతాలలో వరద భీబత్సం,జగన్ ముఖ్యమంత్రి అవ్వాలి అని కొంతకాలం గందరగోళం ఇంకా ఇప్పుడు నెలాఖరున తెలంగాణా లొల్లి..మళ్ళి ఇంతలోనే  రాష్ట్ర గవర్నర్ అనే మంచి పదవి లో ఉండి నీచ పనులు చేసిన తివారి ,దాదాపు డిసెంబర్ నెల అంతా బందులతో నే గడిచిపోయింది.. నెలాఖరు సెలవులు ఉంటాయి కదా ఆఫీసులకు అని   ఉరు వెళ్దాం అన్నా buses ఉండవాయే.. మిగిలిన సెలవులు అన్ని ఈ బందులలో గడిచిపోయాయి...buses ఉండవు పోనీ ఆటో లో వెళ్దాము అన్న మన రోజు జీతం ఆటో వాడె మింగేస్తాడు.. దానికంటే ఉన్న సెలవులు వాడుకోటం మంచిది అని ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితి వచ్చింది.. కనీసం 2010 లో అన్న మన రాష్ట్ర పరిస్థితి మారితే బాగుండు..బాగుండాలి అని కోరుకుందాము.
అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు....

Dec 10, 2009

మా తెలుగు తల్లి-- మా సమైఖ్య ఆంధ్రప్రదేశ్

మా తెలుగు తల్లికీ మల్లెపూదండ
మా కన్న తల్లికీ మంగళారతులు
కడుపులో బంగారు కనుచూపులో కరుణ
చిరునవ్వులో సిరులు దొరలించు మాతల్లి


గల గల గోదారి కదలిపోతుంటేను
బిరబిరా క్రిష్ణమ్మ కదలి పోతుంటేను
బంగారు పంటలే పండుతాయి
మురిపాల ముత్యాలు దొరలుతాయి


అమరావతీ నగర అపురూప శిల్పాలు
త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు
తిక్కయ్య కలములో తియ్యందనాలు
నిత్యమై నిఖిలమై నిలిచి ఉండేదాక


రుద్రమ్మ భుజశక్తి,మల్లమ్మ పతిభక్తి
తిమ్మరుసు ధీయుక్తి, కృష్ణరాయని కీర్తి
మా చెవుల రింగుమని మారుమ్రోగే దాక
నీ ఆటలే ఆడుతాం - నీ పాటలే పాడుతాం
జై తెలుగుతల్లీ! జై తెలుగుతల్లీ!

Dec 7, 2009

బస్సు కస్సుబుస్సు

 "రాష్ట్రం లో ఎక్కడికి వెళ్ళాలి అన్నా చాలా మంది మమ్మల్నే  ఆశ్రయిస్తుంటారు.పది నిముషాలు ఆలస్యం గ వస్తే పట్టరాని కోపం తో ఉగిపోతుంటారు..ఎప్పుడు  ఆందోళన జరిగిన బస్సు ల మీదనే ప్రాతాపం చూపిస్తారు.ఇప్పటిదాకా ఈ అయిదు రోజులలోనే దాదాపు 160 బస్సులు తగలబెట్టారు.50 మందిని మోసే సామర్ధ్యం ఉన్న మా మీద 100 మంది పఇగా ఎక్కినా  మేము అభిమానంతో,ఆయాసం తో మోస్తున్నామే,స్టూడెంట్స్ ను Rs .80 కే సిటీ మొత్తం నెల రోజుల పాటు ఎక్కడికంటే అక్కడకి చేరావేస్తున్నమే,వికలాంగులకు,freedom fighters కు ఫ్రీ గ సేవ చేస్తున్నామే,,మన రాష్ట్రం లో ఉన్న ప్రతి వ్యక్తీ ఏదో ఒక రోజు ఈ బస్స్ ఎక్కినవడేగా  ... తగాలబెట్టేటప్పుడు వాడికి నా సేవలు గుర్తు రాలేదా??కూర్చున్న కొమ్మనే నరుక్కున్టున్నదే..ఇప్పటికే బస్సులు చాలటం లేదు కొన్ని కొత్త బస్సులు వేయండి అని  ధర్నా చేస్తున్నారే మరి  అలాంటప్పుడు ఉన్నవాటిని కూడా మీరు నాశనం చేస్తున్నారే..మళ్ళి ఈ బందులు గట్రా అయిపోయి అందరు ఒక మాట మీదకు రాగానే మళ్ళి మా బస్సుల లోనే గ మీరు తిరిగేది.. ఆనందించేది.. మీరు కోపం ప్రదర్శించడానికి మేమే బలిఅవ్వాలి, ఎన్నో మైళ్ళ దూరం వెళ్లి మిమ్మల్ని సురక్షితం గ గమ్యం చేర్చటానికి కూడా మేమే బలి అవ్వాలి...అయిన ఇది అంతా మాకు కూడా అలవాటు అయింది లెండి..అందుకే బంద్ అన్న మాట వినగానే మాకు చలిజ్వరం వచ్చినట్టు   అయ్యి ఒక మూల న దాక్కున్తున్నాం..ఇప్పటికన్నా మీ కోపం మా మీద చూపకుండా ఉంటె బాగుంటుంది అని ప్రార్ధిస్తున్నాను ".............
ఇది ఇవ్వాళ న్యూస్ పేపర్ లో బస్సుల ఆత్మఘోష అని ఒక కాలమ్ లో వచ్చింది .. దానిలో కొన్ని మాటలు తీసుకుని కొన్ని నేనే సొంతం గ కలిపి రాసాను...

Dec 2, 2009

చక్కర లేని టీ

నేను నిన్న బాబా పుస్తకం చదువుతూ చోల్కేర్ చక్కర లేని టీ అనే కధ  చదివాను.. అప్పుడు అనుకున్నాను చోల్కర్ గారు చక్కర లేని టీ తాగింది చక్కర ఖర్చు తగ్గించి ఆ డబ్బుతో షిరిడి ప్రయాణం కట్టొచ్చు అని అలా నిర్ణయం తీసుకుని ఉంటారు అని.. నా మట్టి  బుర్ర కు అంతే తట్టింది.. ఇవ్వాళ నేను కాఫీ తాగుదాము  అని కలుపుకున్నాను. కొంచం చక్కర తగ్గింది.. తీరా చుస్తే పక్కన ఉన్న చిన్న డబ్బాలో చక్కర నిండుకుంది..(ఐన పెద్ద డబ్బాలో లోపల నిల్వ ఉంటుంది లెండి).వెంటనే నాకు రాత్రి కధ గుర్తుకు వచ్చింది .ఇవ్వాళ గురువారం కదా మనం కూడా చక్కర లేకుండా తాగుదామా అనుకున్నాను..కానీ నా మనసు ఒప్పుకోలేదు అలమర లో పైన ఉన్న పెద్దడబ్బ లో నుండి చక్కర తీసుకుని మళ్ళి వేడి చేసుకుని చక్కగా కాఫీ తాగాను.తాగుతూ అనిపించింది అరె కొంచం చక్కర లేకపోతేనే నేను adjust కలేకపోయానే  ఆయన ఎలా తాగారా అని.. ఆలోచించగా నాకే అనిపించింది చక్కర లేకుండా టీ తాగి తే డబ్బు మిగులుతుంది అని కాదు. అది ఇంద్రియ నిగ్రహం కోసం అలా చేసి ఉంటారు అని అనిపించింది.. ముందు మన మీద మనకు నిగ్రహం వస్తే తర్వాత దేవుడి మీద ధ్యాస అదే నిలుస్తుంది అని....ఈ విధం గ తెలియచేప్పర బాబా నాకు అనిపించింది..
జై సాయి రాం  జై జై సాయి రాం

Nov 30, 2009

గోవిందా గోవింద

నాకు వంట చేసుకుంటూ radio కార్యక్రమాలు వినటం బాగా అలవాటు.ఈ మధ్య ఒక FM ఛానల్ లో ad వస్తోంది ఏంటంటే అది " సోమవారం కు ఒక మూడ్,మంగళవారం కు ఒక మూడ్,అలా రోజుకు ఒక మూడ్ ఉన్నట్లు దానికి తగ్గట్టు మనం మారుతున్నాము కదా మరి మన ట్యూన్ ఎప్పుడు ఒకటే బోరింగ్ ఎందుకు మార్పు చేసుకోండి కొత్తది గా అని" అది వినగానే నాకు ఒక మెరుపు లాంటి ఆలోచన వచ్చింది ... ఎప్పుడూ ఒకటే పిక్చర్ ఎందుకు మన బ్లాగు లో కొత్త రకం గ పెడతాము అని... సరే అని నైట్ అంతా కూర్చొని వెతికి వేసారి మొత్తానికి ఒకటి నచ్చింది... సరే అని మార్చాను... కనీ అది సరిగా రాలేదు... అయ్యో నా బ్లాగు అనుకుంటూ వెతికి వెతికి మళ్లీ ట్రై చేసి మొత్తానికి మార్చాను... హా బాగుంది బాగుంది అనుకుని ఒక సారి మొత్తం బ్లాగుని పైన నుండి కిందదాకా చూసాను .........అయ్యో నా visitors counters గోవింద గోవిందా మల్లి 0 నుండి మొదలు అయ్యింది ఇంకా...ఇప్పటిదాకా నాకు ఆ visitors counters నే హార్లిక్స్ తాగినంత బలం ఇచ్చాయి.. అనవసరం గ మార్చనే అని అనిపించింది ..... ఏమి చేస్తాము మళ్లీ రెడ్డొచ్చె మొదలాడు.. దీన్ని బట్టి నాకు అర్ధం అయింది "ఒక ఐడియా మీ జీవితాన్నే కాదు మీ బ్లాగును కూడా మార్చేస్తుంది" అని.,,సో మళ్లీ మొదటినుండి ప్రారంభించాను..

Nov 25, 2009

మంచి కాలక్షేపం

ఈ మధ్య న మా వారు కొద్దిగా పని ఉండి కంప్యూటర్ మీద వర్క్ చేస్తున్నారు ఎక్కువసేపు... ఇంక నాకు ఇంటర్నెట్ బ్రౌసె చేసే వీలులేక బోర్ కొట్టి పుస్తకాలూ చదవటం మొదలు పెట్టాను.. చిన్నప్పుడు బాగా చదివేదాన్ని కనపడిన పుస్తకము .. magzines కానీ,వీక్లీ లు కానీ,ఆధ్యాత్మికం కనీ ఎదినా ..ఇప్పుడు ఇంటర్నెట్ ఉంది కదా అని online లోను,డౌన్లోడ్ చేసుకుని చదువుతున్నాను.. అట్లా కంప్యూటర్ లో ఎక్కువసేపు చదవలేక పోయేదాన్ని...ఈ మధ్య మళ్లీ పుస్తకం చేతపట్టేటప్పటికి పేజీలు పేజీలు తిరగేస్తున్నాను... చదువుతుంటే బాగా మనసుకు హత్తుకుపోతుంది... అందుకే అంటారేమో పుస్తకం మంచి ఫ్రెండ్ లాంటిది... అని హాయ్ గ పడుకొని చదువుతూ ఉంటే చక్కగా కాసేపటికి నిద్ర కూడా మంచి గ వస్తుంది... చిన్నప్పటినుండి పిల్లలకు కూడా మంచి మంచి పుస్తకాలూ చదవటం అలవాటు చేయాలి తల్లిదండ్రులు... మేము మా చిన్నప్పుడు మా ఉళ్లో గ్రంధాలయం ఉండేది అక్కడ ఆడవాళ్లకు seperate సెక్షన్ ఉండేది సో నేను మా స్నేహితులం కలిసి దాదాపు ప్రతి ఆదివారం/సెలవు దినాలలో వెళ్లి పుస్తకాలూ చదివేవాళ్ళం... ఇప్పుడు అస్సలు లైబ్రరీ కు మగవాళ్ళు కూడా మానేసి ఉండి ఉంటారు వెళ్ళటం ... అన్ని ఇంటర్నెట్ లోనే ఉంటాయి గ ..చదివే అలవాట్లు కూడా తగ్గిపోయినాయి బాగా.. ఎంతసేపటికి టీవీ లు...ఈ reality show లే గా మన నేస్తాలు.

Nov 19, 2009

దినోత్సవాలు

నిన్న నేను న్యూస్ పేపర్ తిరగేస్తుంటే మొదటి పేజి లో ఉన్న advertisement బాగా ఆకట్టుకుంది ఏమిటంటే అది ఒక బాత్రూం cleaner అన్నమాట ఇవ్వాల toilet cleaning day ఈ రోజును ఈ cleaner ఉపయోగించి మీ బాత్రూం లు సుభ్రపరచుకోండి అని... toilet డే కుడా ఉందా అని నాకు నవ్వు వచ్చింది .. సరే మళ్లీ ఇవ్వాళా పేపర్ చూస్తుంటే అందులో ఉంది పురుషుల దినోత్సవం టా.. ఈ దినాలేమిటో అర్ధం కావటం లేదు... వాళ్ళు కొంతమంది సభ నిర్వహించారు ట కొందరు సభ్యులు మాట్లాడిన మాటలు ఏమంటే.."పురుషులు ATM లాంటి వారు కాదు..వాళ్ళు కూడాగృహహింస పడుతున్నవారు ఉన్నారు అని "... ఈ లెక్కన రోజుకొక దినం వస్తుందేమో మనకు అనిపించింది..... మన తల్లితండ్రుల పుట్టినరోజు కూడా కచ్చితం గ చాల మందికుతెలియదు ...ఆ రోజు మనం బహుమతి ఇవ్వకపోయినా వాళ్ళకు కనీసం శుభాకాంక్షలు కూడా చెప్పం... కానీ valentines డే కోసం డిసెంబర్ నుండే వేచి ఉంటాము.. friendship డే కోసం వందలు తగలేసి బాన్డ్స్,గ్రీటింగ్స్ కొంటాం... తప్పు అని నేను అనను కానీ ఇలాంటి అమ్మ పుట్టినరోజు,తమ్ముడు పుట్టినరోజు,తాతయ్య పుట్టినరోజు ఇలాంటివి కొన్ని గుర్తుపెట్టుకుని వాళ్ళకు అ రోజు విష్ చేస్తే వాళ్ళు ఎంత హ్యాపీ గ ఫీల్ అవుతారో కదా...అప్పుడు ప్రత్యేకం గ mothersday,fathers day,parents day ఇలాంటివి దినాలు జరుపుకోవలసిన అవసరం ఉండదు... ఏమంటారు మీరు????

Nov 16, 2009

బ్లాగ్ అంటే

ఈ మధ్య టపాలు రాసి చాలా రోజులు అయింది లెండి.. కొద్దిగా పెళ్లి పనుల్లో తీరిక లేకపోయింది....
నా స్నేహితురాలు నా బ్లాగ్ చూసి ఏమిటే అప్పుడే అంత పెద్దదానివి అయినావా messagelu ఇస్తున్నావ్ సంస్కర్త లాగా అని అన్నది...బ్లాగ్ అంటే ఏదో సరదా కు చదువుకునేదే... అందులో కుడా నువ్వు సీరియస్ మెసేజెస్ ఇస్తే ఎలాగే ,, చదివే వారికీ బోర్ కొడుతుంది అని అన్నది...సరే కదా అని ఒక సారి పాత టపాలు అన్ని తీరిగ్గా చదివాను... నాకే ఆశ్చర్యం వేసింది నా లైఫ్ లోనే ఇన్ని సంఘటనలు జరిగాయా అని... నా ఉద్దేశ్యం లో బ్లాగ్ అంటే సరదా ఉండాలి కొద్దిగా చదివిన వారికీ లేదా జనాలకు ఉపయోగ పడాలి.. అది మన చుట్టూ జరిగిన సంఘటనలు తెలుసుకున్న చాలు... అని చిన్న సైజు క్లాసు పీకాలెండి...సో మీరు కూడా బ్లాగ్ అంటే ఎలా ఉండాలో ఎమైన సలహాలు ఇస్తారేమో అని ఆశిస్తున్నాను...

Oct 5, 2009

విజ్ఞప్తి

నేను దసరా సెలవలు అని వచ్చి వర్షాల కారణం గ మా ఉళ్ళో నే ఉన్నాను మాదీ గుంటూరు జిల్లా.. అదృష్టవసాత్తు మాది పట్టణం.. కృష్ణ తీరం వెంబడి లేదు మా ఉరు.. ఈ వరదలు చూసి ఎంత కకలావికలం అయినదో మనసు.. నా తోచినంత సహాయం చేద్దాం అని అనిపించింది.. నిన్న మా ఇంటికి ఒక ఇద్దరు యువకులు వచ్చారు ఎందుకు అంటే వరద విరాళం అని. సరే కదా అని మా ఇంటిలో ఉన్న కొన్ని పాత బట్టలు,దుప్పట్లు ఇద్దాములే అని తెచ్చాను..వాళ్ళు మాకు బట్టలు వద్దు డబ్బులే ఇవ్వండి అని అన్నారు..మాకు ఇవి ఇవ్వాలి అనిపించింది ఇచ్చాము ఏది ఐతే ఏమిటి అని నేను అన్నాను.. వాళ్ళు మేము డబ్బులే తీసుకుంటాము వేరే వాళ్ళు బట్టలు తీసుకుంటున్నరు ... డబ్బులు ఇవ్వండి అని ఒక రకం గ డిమాండ్ చేసారు.. సరేలే అని ఒక 20 రూపాయలు తెచ్చి ఇచ్చాను ..ఇస్తే వాళ్ళు ఇంతకాదు ఒక 100 అయిన ఇవ్వండి అని..అడిగారు.. ఇప్పుడు అంతలేదు నా దగ్గర తీసుకోండి లే,బట్టలు ఇస్తాము మీ వాళ్ళు వస్తే అని చెప్తే..వాళ్ళు ఎదోఎదో చెప్తూ గలాటా చేస్తున్నారు..నాకు అనుమానం వచ్చి అసలు మీరు ఎవరు తరుపున చేస్తున్నారు విరాళాలు గుర్తింపు కార్డ్స్ ఉన్నాయా అని అడిగా ..వాళ్ళు కొద్దిగా తడబడి ఇంక అందరికి ఇవ్వలేదు లెండి...లేట్ అవుతుంది కదా ఇవ్వాలంటే అందుకే ముందు సహాయం కోసం మేము బయలుదేరాం అని చెప్పారు...ఎందుకో నాకు వాళ్ళు చెప్పిన దానిలో నిజం కనపడలేదు...అందుకే ఇంక ఎక్కువ ఇవ్వకుండా పంపించేసాను... కాబట్టి ఎవరినా సహాయం చేయాలి అనుకున్నవాళ్ళు డబ్బులు ఐతే CM Reliefe fund కు పంపండి,, లేదా గుర్తింపు ఉన్నా సంఘాలకు ఇవ్వండి..లేదా మన డబ్బు వృధా చేసినవాళ్ళం అవుతాం.. పాత బట్టలు ఐతే పోనిలే ఎవరో వకరు అవసారినికి వేసుకుంటారు కానీ డబ్బు అంటే వృధా చేస్తారు కదా... వాళ్ళ అవసరాలకు....
సహకార సంఘాలు కూడా నిజయీతి గా పనిచేస్తే బాగుంటుంది..ఆపదలో ఉన్నవాళ్ళకు కాస్త అయిన మనం సహాయ పదగల్గుతాము .

Sep 24, 2009

దసరా సెలవలోచ్చ్

రేపటినుండి అన్ని కాలేజీలకు,ఆఫీసులకు దసరా సెలవలు.. నేను కూడా మా అమ్మ వల్ల ఇంటికి వెళ్తున్నాను.. దసరా కదా అల్లుడిని ఇంటికి ఆహ్వానిస్తారు గా.. కొత్త అల్లుడు అయిన పాత అల్లుడు అయిన అల్లుడే గా... పుట్టింటికి వెళ్తున్నాం అంటే ఎంత ఆనందమో చెప్పలేము...దాదాపు పెళ్లి అయిన ప్రతి ఆడపిల్లకు ఇదే ఫీలింగ్ ఉంటుంది అనుకుంటున్నాను.. ... రెండు రోజులనుండే సర్దుడు మొదలు పెట్టేసాను... మా ఫ్రెండ్స్ అందరమూ కలుస్తాము దసరా సెలవలకు... మా బంధువుల ఇళ్ళకు అన్నిటికి తిరుగుతాము ...దసరా అంటే ౩ రోజులుసెలవలు కాబట్టి దాదాపు అందరు వస్తారు ఇళ్ళకు.. ఇంక ఇప్పుడే అందరమూ బంధువులం కలిసేది (ఉల్లోవాళ్ళు)... ఒక ఊరి లో కలిసి తిరిగిన వాళ్ళను అది బంధువులను కలవాలి అంటే దాదాపు ఒక ఏడాది పడ్తోంది ఈ రోజులలో.. ఒక్క రోజు పండగ శలవ కు వెల్ల లేము గ ఊరు.. అది వీకెండ్ కకబోతే ఇంక ఊరు వెళ్దాం అన్న ఆలోచనే రాదు మరి... అందుకే నాకు అన్ని పండగలకంటే దసరా ఇష్టం.. ఎక్కువ సంబరం చేసుకోకపోయినా కచ్చితంగా ఉరు వెళ్తాం గా ...

Sep 19, 2009

ఉరి తీయాలి

ఒక ఏడాది లోనే మహిళల ఫై ఈవిధం గ అకృత్యాలు మితిమీరిపోతున్నాయి అంటే చాలా విచారించ వలసిన విషయం. చట్టం గట్టి గ లేక పోవటం వల్లనే ఈ విధం గ మ్రుగాళ్ళు బలితెగిస్తున్నారు..మొట్టమొదటి సంఘటనా జరిగినప్పుడే శిక్ష గట్టిగ పడుంటే ఈ విధం గ ఇన్ని సంఘటనలు చోటు చేసుకుని ఉండేవి కావు..కోర్ట్ లో నేరం రుజువు కావాలి అంటేనే కొన్ని నెలలు పడ్తోంది. ఇంక తీర్పు వేలువదేటప్పటికి కొన్ని ఏళ్ళు గడుస్తున్నాయి ..తర్వాత జేవతఖైదు అంతేగా సిక్ష. అలాకాకుండా మహిళల పైన ఎదయన నేరం చేస్తే వరకట్నం కానీ,ప్రేమ పేరుతొ హింస కానీ, చేస్తే వెంటనే 10 రోజులలో శిక్ష అమలు జరిగేలా చూడాలి. అప్పుడు కానీ ఆడవారిని ఎమైన దాడి చేయాలి అంటే ఈ మ్రుగాళ్ళు దడుస్తారు.. లేకపోతె ఎప్పుడో కదా శిక్ష పడేది అని ముందు వెనక ఆలోచించకుండా మహిళను,కుటుంబాన్ని నాశనం చేస్తున్నారు.. ఇక నుండి ఐన ఆడవారి ఫై హింసాత్మక చర్యలు తగ్గితే బాగుండు..

Sep 18, 2009

పండగ హడావుడి

ఇవ్వాల్టినుండి పండగ మొదలు.ఇంక గుడిలో హడావుడి మొదలు అవుతుంది.భక్తుల తో కిటకిట లాడుతాయి. మా ఇల్లు శివాలయం కు ఎదురుగ ఉంటుంది.ఇంటి మేడ ఫై నుండి చూస్తే గుడి కన్నుల పండుగ గ ఉంటుంది.సాయంత్రం పూట ఏదో ఒక సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. ఈ నవరాత్రిల్లు బాగా సందడి సందడి గ ఉంటుంది మాకు..అన్నీ బాగానే ఉంటాయి కానీ పండగలు అప్పుడు గుడి లో మైక్ పెడ తారు అదీ పెద్ద సౌండ్ తో. ఉదయం నుండి రాత్రి 11 దాక ..మరీ ఎదురు అవ్వటం వల్లన మా ఇంట్లోనే మైక్ పెట్టారా అన్నట్లు ఉంటుంది ఆ సౌండ్.మేము మొదటి నుండి అదే మా సొంత ఇల్లు కావటాన అలవాటు పడిపోయాము. కానీ ఇప్పుడు మా బాబు (ఏడాదిన్నర వయస్సు) వాడికి అంత సౌండ్ ఉంటే చికాకు గ ఏడుస్తాడు.. పోనీ గుడిలో పూజారులు తెలిసినవాళ్ళే కదా చెప్పుదాం సౌండ్ తగ్గించండి అంటే 9 రోజులే కదండీ కొంచం adjust అవ్వండి అంటారు.. పోనిలే 9 రోజులే కదా అని అనుకోటానికి లేదు దసరా తర్వాత ఒక 10 రోజులకే కార్తీక మాసం ఉంటుంది గా.. శివునికి ఇష్టమైన మాసం దానికి తోడూ అయ్యప్ప దీక్షలు,పూజలు.. ఇంక భజన కార్యక్రమం ఉంటుంది గ ఇంక మైక్ సంగతి చెప్పేదేముంటుంది.. దాని తర్వాత ధనుర్మాసం సంక్రాతి దాక ఈ సందడి కొనసాగుతూనే ఉంటుంది...అంటే ఇంచుమించు ఒక ౩ నెలలు అన్నమాట.. చిన్నప్పుడు మేము ఎలా భరించామ ఇంత సౌండ్ అనిపిస్తుంది... కొంచం పెట్టుకుంటే పర్వాలేదు కనీ 4 స్పీకర్లు పెడతారు.. అది నలుదిక్కుల వినిపించాలి అని రోడ్డు వైపుకు కడతారు..ఇంక హోరేహోరు..
చక్కగా వినసొంపుగా తక్కువ సౌండ్ పెట్టుకుని కార్యక్రమాలు చేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది.. పెద్దవారికి(ముసలివారికి) ,చిన్నపిల్లల కు ఇబ్బంది కలగకూడదు కదా మన భక్తి వల్ల ..

Sep 14, 2009

Flue effect

రెండు రోజుల క్రితం నేను మా వాళ్ళ పిల్లలను హాస్పిటల్ లో చేర్చారు అంటే చూద్దాం అని వెళ్ళాను. ఎందుకు జాయిన్ చేసారు అంటే swine flue భయం వల్లన.పిల్లలకు గత ౩ రోజుల నుండి బాగా జలుబు,దగ్గు ఉన్నాయిట. సామాన్యం గానే జలుబు కు మందులు వాడితే 7 రోజులతో తగ్గుతుంది వేయకపోతే వారం లో తగ్గుతుంది అని నానుడు ఉంది కదా.. కొంచం జలుబు,దగ్గు ఉంటే చిన్న పిల్లలకు జ్వరం వస్తుంది కొద్ది గ.. ఇప్పుడు అస్సలే రాజధాని లో పరిస్థితి బాగోలేదు కదా ఒకసారి చెక్ అప్ చేసితే బాగుంటుంది అనుకోని పిల్లల హాస్పిటల్ (కార్పొరేట్ హాస్పిటల్,పేరు ఎందుకులెండి) కు తీసుకు వెళ్లారు. వాళ్ళు జలుబు,దగ్గు అని చెప్పగానే swine flue టెస్ట్ చేయించాలి అని admitt అవ్వమని చెప్పారు.అడ్వాన్సు 10000 రూపాయలు కట్టించుకున్నారు.రూం రెంట్ ౩౦౦౦ రూపాయలు ట.ఇంక టెస్టులకు,మందులకు ఆ బిల్లు వేరే ఇంక చెప్పే దేముంది..reports రేపు వస్తాయి అని ఒక రోజు మొత్తం ఉంచుకున్నారు..తీర reports లో చుస్తే అదృష్టవసాత్తు swine కాదు. ఏదో జలుబు తగ్గటానికి మందులు రాసి ఒక వారం చూద్దాం తగ్గకపోతే మళ్లీ తీసుకురండి అని పంపారు ట.... swine భయం కాదు కానీ బిల్ తడిసి మోపెడు అయింది .
అంతేలెండి పరిస్థితులు అలా ఉన్నాయి ఇప్పుడు...

Sep 13, 2009

అమ్మో ఆదివారం

దాదాపు గ ఆదివారం అంటే అందరికి ఉత్సాహం గ ఉంటుంది.కానీ నాకు అనిపిస్తుంది అన్ని వారాలకంటే ఆదివారమే చాల బిజీ గ ఉంటామేమో అనిపిస్తుంది అందులోను ఆడవాళ్లు.మాములు రోజుల లో ఐతే 9 గంటల కల్లా వంట అయిపోయి చాలా ఖాలీ గ ఉంటాము దాదాపు గ అన్ని కుటుంబాల వాళ్ళు. కానీ ఆదివారం మాత్రం ఇంట్లో అందరు (భర్తా,పిల్లలు) దాదాపు గ ఆలస్యం గ లేస్తారు..విడి రోజులలో పాపం అలసిపోతారు కదా అందుకని . ఆదివారం టిఫిన్స్ అయ్యేటప్పటికే 10 గంటలు అవుతుంది.ఇంక వంట కార్యక్రమం చేసి భోజనాలు పెట్టి మనం(ఆడవాళ్లు) తినేటప్పటికి దాదాపు గ 1.౩౦ అవుతుంది.ఇంక కాసేపు తిని నడుము వాలుడ్డం అనుకోటానికి ఉండదు..ఉదయం శ్రీవారు మార్కెట్ కు వెళ్లి తెచ్చే కూరలు అన్ని చక్కగ సర్దుకొని ఫ్రిజ్ లో పెట్టుకోవటం,వారానికి సరిపడా ఆయన వి,పిల్లలవి బట్టలు ఇస్త్రి చేయటం..(అస్సలే సరుకుల ధరలు పెరిగాయి ఇంక ప్రతి వారం ఇస్త్రి కు అన్నేసి వందలు ఏమి పెడతాం లే అని ఐరన్ బాక్స్ ఉంది కదా అని ఇలా ఆదివారం నేనే పని పెట్టుకున్న లెండి).. ఇవి అన్ని అయ్యేటప్పటికి సాయంత్రం 4 గంటలు అవుతుంది.మళ్లీ కాఫీ ల సెక్షన్ మొదలు అవుతుంది..సరే ఇంట్లో ఉంటారు కదా అని ఏదో పకోడీ నో,బజ్జి నో రోజు T.V ల లో చూసే కొత్త వంటకం చేసి పెట్టి మన ప్రయోగం సక్సెస్ అయింది అని చాల గర్వంగా ఫీల్ అవుతాం ..ఆదివారం కదా స్నేహితులో,బంధువులో చూడటానికి వస్తుంటారు లేదా మనమే ఎ పార్క్ కో,బంధువుల ఇల్లకో వెళ్తుంటాం... ఇంక రాత్రికి ఏదో ఒకటి తిని తిన్నాం అనిపించి పడుకునే ప్పటికి 10.౩౦ మామూలుగానే.... తీరా చుస్తే వారం ముందు నుండే T.V లలో ఓ ఏదో ఒక కొత్త సినిమా అని ad వేస్తుంటాడు...చూద్దాం అనుకుంటాం కానీ టైం నే ఉండదు.....ఆదివారం అంతా fullబిజీ గ గడిచిపోతుంది...
ఇనా మళ్లీ ఆదివారం ఎప్పుడొస్తుందా అనే ఎదురు చూస్తూ ఉంటాం ఎందుకంటే ఇంట్లో అందరు హయిగా కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేసేది ఈ రోజే గ....
అందుకే మల్లి ఆదివారం కోసం ఎదురుచూస్తూ...

Sep 12, 2009

పండగల విశేషాలు

వ్యాఖ్యలు నేను ఒక పుస్తకం లో చదివాను.మన పండగలు ఆచారాలూ లో ఉన్నా గొప్పతనం అందరికి తెలియాలి అనిఇక్కడ పొందుపరుస్తున్నాను.
వినాయక చవితి నాడు ఉండ్రాళ్ళు ఒంటికి బలానిచ్చి దేహ శాంతి ని కలిగిస్తాయి.పిత్త దోషం పోగొడుతుంది అని వైద్యశాస్త్రం.
మసూచి వసంత ఋతువులో వస్తుంది కాబట్టి అది రాకుండా ఉండటానికి వేపపువ్వు తింటారు (ఉగాది పచ్చడి )
ధనుర్మాసం లో రాత్రి ఎక్కువగా ఉండి పగలు తక్కువ ఉండడం వల్ల తగిన ఆహరం లేకపోతె రసాది ధాతువులునుఎండించి రోగాలు కలిగిస్తాయి .కనుక దద్దోజనం,చక్రపొంగలి మో!! నివేదన పెట్టి ఆరగిస్తారు
ఆషాడ మాసం నుండి జటరగ్ని మందం ఉంటుంది.కనుక చాతుర్మాస్య వ్రతాలూ చేసి ఆహరం లో అనేకనియమాలు పాటిస్తారు.
వర్ష ఋతువు లో భూమి యొక్క ఆవిరి చేత గాలి చెడి పోయి ఉంటుంది.కనుక అటువంటి గాలిని పీల్చడం వల్ల రోగాలుపుడతాయి కనుక లక్క,పసుపు,అతివాస మొదలైన విషాన్ని పోగొట్టే ద్రవ్యాలను నిప్పు మీద వేసి పుట్టిన పొగచేవాతావరణాన్ని శుభ్రం చేయాలి అన్నారు.దీపావళి లో బాణసంచా కూడా అందుకే.
ఉగాది లో మామిడి,నేరేడు,మేడి,జువ్వి వీటి ఆకులను నానిపి తలంటు స్నానం చేయాలి అని ఆయుర్వేద గ్రంధాలుఅంటున్నాయి.రధ సప్తమి నాడు జిల్లేడు ఆకులను తల ఫై పెట్టి స్నానం చేయడం వడదెబ్బ నుండి రక్షించడానికే.
మకర సంక్రాంతి లో నువ్వుల ఉండలు తినడం వల్ల వాతం హరిస్తుంది.హృదయ స్పందనకి నువ్వులు,బెల్లంఉపకరిస్తాయి.
రాత్రివేళల్లో భూగర్భ జల లలో శక్తిమంతము ఐన అయస్కాంత మండలం ఉంటుంది కనుక కార్తీక మసాల లోతెల్లవారు జామున స్నానాలు చేయాలి అన్నారు.
అట్లతద్ది నాడు గోరింట పెట్టుకోవడం వల్ల చేతులకు,కాళ్ళకు చర్మ రోగాలు రావు.
మామిడాకు తోరణాలు చెడు గాలిని హరిస్తుంది అందుకే పండగ నాడు మామిడి తోరణాలు గుమ్మానికి కడతాము.

ఇవి మన పండగల లో ఉన్న ముఖ్య ఉద్దేశం.పండగ అంటే ఏదో సెలవు దినం అనే కాకుండా కాస్త ఆచారం కూడా పాటిస్తేపండగ సార్ధకమవుతుంది.



Sep 7, 2009

మీడియా అత్యుత్సాహం

మన మీడియా వాళ్ళు మరీ అతి ఉత్సాహం ప్రదర్శిస్తారు.Y.S.R హెలికాప్టర్ కనిపించనప్పటి నుండి అయన అంత్యక్రియలు వరకు లైవ్ దానికి తోడూ చర్చలు.క్లోజ్ అప్ లో ప్రజల భావాలను ప్రదర్శించడం. హెలికాప్టర్ కనపడలేదు అని ఒక 4 గంటలు హడావుడి చేసారు తర్వాత ఎక్కడో నల్ల మల అడవిలో ఉన్నది అని అదొక ప్రచారం ఇంతా కనిపెట్టే టప్పటికి తెల్లారిపోయింది.. ఈ లోగ చూసే జనానికి రాత్రి అంతా నిద్ర పట్టదు.టీవీ చూద్దాం అనుకున్నా టెన్షన్ నే చూడక పోయిన ఏమి అయిందో అని టెన్షన్.. ఈ లోగ చూస్తూ చూస్తూ కన్ను కునుకు పట్టేసరికి తెల్లారిపోయింది ఇంక 8 గంటలకు హెలికాప్టర్ ఆచూకి దొరికింది ఇంక అక్కడకు చేరాలి అంటే ఒక గంట సమయం పడ్తుంది.అక్కడి వాళ్ళు ఎలా ఉన్నారో తెలియదు..అని అదొక సస్పెన్షన్.. ఈలోగా మనం టెన్షన్ తో ప్రార్ధనలు..ఇన ఏమి లాభం పాపం వై.స.ర బృందం పాపం పోయారు..ఈ వార్త తెలిసే లోగ ఒక 50 మంది పోయారు మన రాష్ట్రం లో..ఏమి చేస్తారు గుండె నిబ్బరం లేని వాళ్ళు అంత సేపు టీవీ లో చుస్తే ..ఇంక అక్కడ నుండి అంత్యక్రియలు దాక లైవ్. దాదాపు ఒక రోజు అంతా పట్టింది ఈ లోగ మన అభిమానుల మృతి సెంచరీ దాటేసింది.. ఇంక ఇప్పుడు జగన్ ముఖ్యమంత్రి అవుతాడా లేదా అని అదొక చర్చ..అవకపోతే ఆత్మహత్యా చేసుకుంటాం అని బెదిరింపులు ..
ఇది అంతా మీడియా ముందు హడావుడి చేయటం కోసమే అభిమానుల ఆరాటం అని అనిపిస్తుంది. ఈ చానల్స్ వాళ్ళు కూడా వల్ల ratings పెంచుకోవటం కోసం లైవ్ టెలికాస్ట్ లు వీపరీతం గ చేస్తున్నారు..
ఎప్పటికి మారతారో ఈ జనాలు

Sep 3, 2009

రాబోయే కాలానికి కాబోయే ముఖ్యమంత్రి

C.M మరణ వార్త వచ్చి రాగానే రాజకీయ నాయకులలో చర్చ మొదలు అయ్యింది.తర్వాత మంత్రి ఎవ్వరు అవ్వాలి అని.చాలా మంది ఏకగ్రీవంగా Y.S.R. తనయుడు జగన్ మోహన్ రెడ్డి నే కావాలి అని కోరుతున్నారు మంత్రులు.కాంగ్రెస్ ను మళ్లీ పటిష్టం చేయాలి అంటే యువ నాయకుడు తప్పని సరిగా కావాలి.కానీ జగన్ ప్రత్యక్ష రాజకీయాల లోకి వచ్చింది ఇప్పుడే కదా అంత అనుభవం ఉండదు కదా కాబట్టి మంచి గ అలోచించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది..రాజకీయ క్రియాశీలత,ఆలోచనా శక్తీ బట్టి తీసుకోవాలి కాని వారసత్వం గ ,Y.S.మీద ప్రేమ తో నిర్ణయం తీసుకోకుండా ఉంటే బాగుంటుంది.అప్పటి దాకా వేచి ఉండాల్సిందే.
జోహార్ Y.S.R
జోహార్ Y.S.R

Aug 28, 2009

తెలుగు భాషా దినోత్సవం

రోజు లాగానే రోజు కుడా మా వారు వార్తా పత్రిక చదువుతూ అందులోని కబుర్లు చెప్తున్నారు.నేను నా వంటహడావుడి లో ఉన్నా.ఇవ్వాళా తెలుగు భాషా దినోత్సవం నువ్వు కనీసం ఇవ్వాళా అన్నా చక్కని తెలుగు మాట్లాడు అనితన దైన స్వరం లో చెప్పారు.ఇవ్వాళా అంతా నేను ఆంగ్లము లో మాట్లాడతాను అని ప్రగల్బాలు పలికాను.దాని కోసంనేను నా కార్యాలయానికి సెలవు పెట్టాలా అని సరే ఇప్పుడు సమయం 7.30 ఇనది కాబట్టి 8.00 దాక తెలుగు లో నేమాట్లాడాలి అస్సలు ఆంగ్లము వాడకూడదు అని పందెం వేసారు.పందెం లో మరి రసపట్టు ఉండాలి కదా ఒకవేళ నేనుఓడిపోతే రేపు ఎట్లాగు ఆదివారము సెలవు కాబట్టి రేపు వంట నేను చేస్తాను అని అన్నారు.ఇది ఏదో బాగుందే అని సైఅంటే సై అన్నాను.ఒక 10 నిముషాలు బాగానే మాట్లాడా తెలుగు లో ..అమ్మో బాగా మొండిగా ఉందే పిల్ల అని ఇంకఆయన రిమోట్ ఎక్కడ పెట్టావ్ టీవీ పెడతాం అంటే రిమోట్ అస్సలు కనిపించదు అని తన దైన స్వరం లో కొద్దిగాహెత్చు అరిచారు.. నేను పందెం గుర్తుపెట్టుకొని అక్కడే ఎక్కడో కుర్చీ లో ఉంటుంది వెతకండి నేను వంట హడావుడిలో ఉన్నాను అని అన్నాను...ఏది ఒకసారి వచ్చి వెతికి పెట్టు అన్నారు..ఇంక లాభం లేదు వెళ్లి రిమోట్ ఇవ్వకపోతేఇలాగె అరుస్తుంటారు అని హడావుడి వచ్చి చుస్తే అక్కడే ఉన్న కుర్చీ లో ఉంది..దాన్నిచూడగానే కోపం వచ్చి ఇక్కడేఎదురుగ ఉంది కదా రిమోట్ ..ఏది ఏది అని హడావుడి చేస్తారు..వెతుక్కోవచ్చు కదా 2 నిముషాలు అన్నా...వెంటనేఓడిపోయవు ఓడిపోయావ్ అని ఎగిరారు...నేను ఎందుకు ఓడిపోయాను అంటే రిమోట్ అనేది ఆంగ్లము కదా అనిఅన్నారు.... అయ్యో అని అనిపించింది....
కాబట్టి అస్సలు ఇంగ్లీష్ వాడకుండా అంటే కష్టమే కనీ ఏంటంటే ఇప్పుడు సిటీస్ లో ఎక్కడ చుసిన కేవలం ఇంగ్లీష్ లో నేమాట్లాడుతున్నారు అది ఒక స్టైల్ గా.. మన మాతృభాష ఉంది కదా చక్కగా తెలుగు లో మాట్లాడవచ్చు కదా.. తెలుగురానివాళ్ళ తో ఐతే పర్వాలేదు కానీ పుట్టి పెరిగిన మన ఆంధ్రావాళ్ళు కూడా కేవలం ఇంగ్లీష్ లో మాట్లాడితే అది కూడాఏదో గొప్ప కోసం చేస్తే కోపం నషాళానికి అంటుతుంది.....

అమ్మాయిలూ జాగ్రత్త!!!!!!!!!!!!!

నాకు నిన్ననే నా ఫ్రెండ్ నుండి మెయిల్ వట్చింది.దానిని వేరే వాళ్ళు పంపారు .దాన్ని మీకు ఇక్కడ రాస్తున్నాను
Hi All,

Yesterday night there was a incident happened to a girl in front of my eyes.

I was coming back from Forum Around 11. Near the Church of Madiwala there was a signal and Maruti Omni was standing there. I just crossed the van and One girl crossed me. Once she went near the van the People in the van Pulled her in and the girl started shouting and what i heard is huge slap and they started driving. There were people around a few feet away from that place.

I tried to catch the Van and ran behind it and few others who were standing there also started chasing with their bikes. But hardly the van was running like a race Car. I think nobody would be able to catch them. It was too fast. We went to Police Station to file a complaint against the van. But the police responded at the least bothered. For them we were disturbing their sleep.

Girls,


Ensure that You are not going alone anywhere after nights. Even if you go by auto to home in night don’t go alone. Help others as well. Drop in by your home. Don’t take any risks. Life Matters.

Pass this to all girls whom u know and make them aware of whats happening. This should not happen to any other girls. Lets not give chances to those.It happend no where other than Madiwala.Plz take necessary steps for your safety.That too while going late ensure u r guarded by somebody and don't pass the supid Omni.Still there are people using that for Kidnapping.


కాబట్టి అమ్మాయిలూ ఆటోలో వెళ్ళేప్పుడు,ఒంటరిగా వెళ్ళేప్పుడు చాల జాగ్రత్త ఉండండి....

Aug 27, 2009

అమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు....

ఒక అమ్మాయి స్నేహితులతో కలిసి ఇంట్లో కబుర్లు చెప్పుకుంటోంది.వాళ్లంతా వేరే స్నేహితుల గురించి వ్యంగ్యం గ మాట్లాడుకోవటం అ అమ్మాయి తల్లి గమనించింది.వెంటనే అ గదిలో దీపం ఆర్పేసింది .తర్వాత అ అమ్మాయి అడిగితె ఇక్కడ లేని వారి గురించి అగౌరవం గ మాట్లాడుకోవడానికి దీపం అవసరమా అని అ తల్లి ప్రశ్నించింది.అ స్నేహితుల వరస నట్చని ఆమె కూతుర్ని ఓ ఆపిల్ పండ్ల బుట్టను తెమ్మంది.వాటి మధ్య ఓ కుళ్ళిన పండును పెట్టి రేపు గమనించమంది.మర్నాడు అన్ని పండ్లు పాడయిపోవడం చూపించి,"చెడ్డవారి స్నేహం కూడా ఇలాంటిదే" అని సున్నితం గ భోదించింది.
అలాంటి చక్కని పెంపకం లో పెరిగిన అ అమ్మాయి చక్కని వ్యక్తిత్వాన్ని సంతరించుకుంది.అమ్మ చెప్పిన మాటల్ని మనసుకు పట్టించుక్క అ అమ్మాయే పెద్దయ్యాక "మదర్ థెరిస" గ ప్రపంచ ఖ్యాతి పొందింది.
ఈ రోజు మదర్ థెరిస జన్మ దినం.నిజానికి ఆమె పుట్టింది ఆగష్టు 20th ఆమె తన పుట్టిన రోజు గ ఆగష్టు 27 గుర్తుంచింది.ఎందుకో తెలుసా? పద్దెనిమిది వయసులోనే సరిగ్గా 27 న నే ఆమె సన్యాసిని గ మారింది....
కాబట్టి ఈ రోజు ఆమెను కనీసం ఒక్క సారైనా గుర్తుచేసుకుందాం... ఆమె సేవలను ఆదర్శం గ తీసుకుందాం.. మన జీవితం లో కొంతమందికిన మనకు తోచిన విధం గ సహాయం చేద్దాం...

Aug 26, 2009

ఇండియా vs అమెరికా

ఇటివలే మా వాళ్ళు అమెరికా నుండి వట్చారు ఇండియా కు ... మేము అందరం కలిసి ఒక coffee షాప్ కు వెళ్ళాం అక్కడ ఒక కాఫీ ఆర్డర్ చేసాం... (అది ఫ్లవౌర్ ఏదో కాఫీ పేరు గుర్తులేదు)... ధర వట్చేసరికి Rs110 అక్కడ దాదాపు ౩ డాలర్లు ట...అంటే మన లెక్క లో 150 దాదాపు గ... ఇక్కడికి అక్కడికి దాదాపు ఒక Rs25నే తేడా... ఇంక ఒక్కసారిగా షాక్ కు గురి అయ్యాం ...ఆనవసరంగ ఇంత షాప్ కు వట్చమే అని... ఇంక ఏదో గుటుక్కున తాగేసి బయట పడ్డాం.... ఇవ్వాళా మేము మా కజిన్ కలిసి beauti పార్లర్ కు వెళ్ళాం అక్కడ facial రేటు Rs1000 చెప్పింది... వాళ్ళు అక్కడ అమెరికా లో 30dollars ట.. అంటే దాదాపు 1250... అంటే అక్కడ వత్చే 4000dollars లో ౩౦ అంటే పర్లేదు లే అనిపిస్తుంది కనీ ఇక్కడ మనకు వత్చే 25000 వేళల్లో 1000 అంటే చుడండి అస్సలు ఇంక మనకు వెళ్ళాలి అనే అనిపించదు ఏదో ఇక ఫంక్షన్ కాబట్టి అవసరం అయ్యి వెళ్ళటమే.... ఇవ్వాళా మా ఇంట్లో అదే డిస్కషన్... ఇండియా కు అమెరికా కు rates విషయం లో పెద్ద తేడ లేదు... కానీ మన తలసరి ఆదాయం అమెరికా అంత లేదు... కానీ అమెరికా ని ఫాలో అయిపోదం అని అనిపిస్తూ ఉంటుంది..... అక్కడే కొద్దో గొప్పో డబ్బులు దాచుకోవట్చు అని అంటుంటే నాకు అనిపించింది మనం అమెరికా కు దీటు గానే ఉన్నాం కాకపోతే టెక్నాలజీ లో కొంచం తగ్గాం అంతే అని... ఏం చేస్తాం మన వాళ్ళంతా అమెరికా వెళ్ళిపోతే మనం ఎట్లా ఎదుగుతం టెక్నికల్ గ....

నెల బ్లాగు

నా బ్లాగు వయసు ఒక నెల... క్రిందటి నెల 27 మొదలు పెట్టా. నెలలో నే8 టపాలు రాసేసాను..నేను బ్లాగ్లు బాగా చదివేదాన్ని.... రాయాలి అంటే టాపిక్స్ ఏమి దొరుకుతాయిలే అని అనుకునేదాన్ని.... కానీ మొదలు పెట్టినతర్వాత నుండి అది చెప్పాలి ఇది చెప్పాలి... అని చాల చాల కబుర్లు దొరికేవి.... మన టప ఏదో కొద్దిగా అన్నా మెసేజ్ అన్దేవిధం ఉంటే బాగుంటుంది అని అలంటి టపాలే రాసేదాన్ని.... కొన్నిటికి కామెంట్స్ గూడా వట్చాయి చదువరుల దగ్గర నుండి... నా బ్లాగు చూసేవారికి...కామెంట్స్ పంపిన, పంపే వారికీ నా ధన్యవాదములు.....200 హిట్స్ వత్చాయి నా బ్లాగు కి... ఇప్పుడే పుట్టిన పాపాయి కదా. . ఇంక పెరిగే కొద్ది ఇంక మంచి వ్యాఖ్యలు రాయాలి అని... చదివె వారు కామెంట్స్ పంపాలి అని కోరుకుంటున్నాను....ఇప్పుడు ఇప్పుడే తెలుస్తోంది.. టపాలు రాయటం కూడా ఒక కలే అని...
చూడాలి ఇంక ఏడాది లో ఎంత ఎదుగుతుందో నా బ్లాగు...
మీ ఆశీస్సుల కోసం నీరిక్షణ లో
నా అందమైన ప్రపంచం....


Aug 25, 2009

మా ఊరు

ఆగష్టు 15n మేము మా ఫ్యామిలీ మెంబెర్స్ అందరం కలిసి మా వారు ,వాళ్ళ అన్నయ్య చెల్లి పుట్టిన ఊరు చూద్దాం అని ఒక కార్ మాట్లాడుకొని హైదరాబాద్ నుండి సత్తెనపల్లి దాకా వెళ్ళాం... అ ఊరు ఇంక పక్కన పల్లెటూరు లెండి... అక్కడ దాక వెళ్ళాం.... ఇది మా పెళ్లి అయిన తర్వాత తొలి గ వెళ్ళటం మేము మా బాబు తో.... క్రితం రోజున బాగా వర్షం పడటం వలన పొలాలు అన్ని పచ్చగా ఉన్నాయి.... అక్కడ ఒక హనుమంతుడి గుడి ఉంది... అక్కడ పూజ చేయించి ప్రసాదాలు చేయించి ఊరు అంతా పంచాం.... మేము వచ్చాము అని తెలియగానే ఊరులో చాలా మంది అక్కడకు చేరుకున్నారు...... వాళ్ళీ మా అందరికి భోజనాలు పెట్టి.... చిన్నప్పటి సంగతులు అన్ని గుర్తు చేసుకుంటూ మాకు వీళ్ళు చిన్నతనం లో చేసిన అల్లరి అంట చెప్ప్తుంటే ఒకటే సంబరమ అందరికి.... తిరిగి వెళ్తుంటే అందరి కళ్ళ నుండి నీళ్లు జల జలా రాలాయి...... అది చూసి నాకే ఏంటో బాధగా మన వాళ్ళను మిస్ అవుతున్నాం అనిపించింది..... ఈ హైదరాబాద్ వచ్చి మేము 3years ఇంది కానీ మా పక్కన ఉండే నాలుగు ఇల్లవాళ్ళు కూడా తెలియదు మాకు... అలా ఉంది ఇక్కడ పరిస్థితి... మా వారు చదివిన స్కూల్ ,ఉన్నా ఇల్లు అన్ని చూసాం... వీళ్ళు ఆ స్కూల్ కు ఏమినా చేద్దాం అనిపించి అక్కడ స్కూల్ లో మంచినీళ్ళ పంపు లేదు అని పంపు వేయించటానికి అయ్యే ఖర్చు పెట్టుకుంటాం అని పంపు వేయించమని అక్కడ మునసబు గారికి చెప్పాము.... స్వతంత్ర దినం నాడు ఒక మంచి పని చేసినందుకు మాకు చాలా ఆనందం వేసింది...

Aug 11, 2009

పుట్టినరోజు

ఇప్పుడే నేను నా మెయిల్స్ చెక్ చేసుకుంటున్నాను... నాకు ఇవ్వాళా మా ఆఫీసు collegue పుట్టినరోజు విషెస్ పంపండి అని Birthday Reminder నుండి మెయిల్ వత్చింది... కానీ మా ఫ్రెండ్ & collegue ఇప్పుడు మనలో లేరు... అ భగవంతుని సన్నిధి లో ఉన్నారు......
ఒక 2 నెలల క్రితం జరిగిన సంఘటనా... అతనూ నేను ఒకే ఆఫీసు లో చేసేవాళ్ళం 6 నెలల క్రిందటి వరకు... తర్వాత కొత్త ఆఫీసు లో జాయిన్ అయ్యారు... శాలరీ పెరిగింది... ఇంక బస్ లో వెళ్ళటం కష్టం లే అని బైకే తెసుకున్నాడు... యూత్ కదా బాగా ఫాస్ట్ గ డ్రైవ్ చేసేవాడు.... ఒకటి రెండు సార్లు పడటం దెబ్బలు తగిలి చిన్న గాయాలు అవటం జరిగాయి.... కానీ స్పీడ్ తగ్గలేదు డ్రైవింగ్ లో.... ఒక శనివారం ఆఫీసు టైం అవుతోంది అని బాగా fast drive చేస్తున్నాడు ...అది ఒక చిన్న సందు గుండా వెళ్తున్నారు.... జనరల్ గ ఆఫీసు కు త్వరగా వెళ్ళాలి అని shortcut రూట్స్ లూ వెళ్ళేవాళ్ళు మా collegues అంతా... అలాగే అ రోజు కూడా వెళ్తున్నారు..... ఇంతలొ వాటర్ tanker వత్చింది... దాన్ని ఓవర్తకే చేద్దాం అని కొంచం పక్కగుండా స్పీడ్ గ వెళ్ళాడు.... ఇంతలొ ఎదురుగ ఒక బైకే వత్చి గుద్దేసింది... తన్కేర్ ముందు చక్రం దగ్గర పడిపోయారు.... గాంధీ హాస్పిటల్ కు వెళ్ళే లోపే ప్రాణం పోయింది.....
నెమ్మది గ డ్రైవ్ చేసి ఉంటే ఈ ల అయ్యేది కాదు కదా


నా మిత్రునికి అశ్రువులతో జన్మదిన శుభాకాంక్షలు.....
ఆ భగవంతుని సన్నిధి లో హాయ్ గ ఉండాలి అని కోరుకుంటున్నాను......

అందమైన ఫోటోలు


కైలాస గిరి (వైజాగ్)




R.K.బీచ్

Aug 10, 2009

పెళ్ళంటే ......టెన్షన్ టెన్షన్

2 రోజుల క్రితం జరిగిన ఒక సంఘటనా...
మాకు తెలిసిన వాళ్ళ పెళ్లి కి వెళ్ళాను... ముహూర్తం రాత్రి 8 కు.. జీలకర్ర బెల్లం వరకు సాఫీగానే జరిగింది... రాత్రి అవటన దాదాపు గ అందరు డిన్నర్ హడావిడి లో ఉన్నారు... పెల్లికుతురి ఫ్రెండ్'స కూడా భోజనాలు చేస్తున్నారు... చేసేసి దూరం ఇళ్ళ వాళ్ళు కావటాన వెళ్ళిపోయారు...
ఇంక పెళ్లి తంతు లో తాళి వంతూ వట్చింది ... పళ్ళెం లో తాళిబొట్టు పెట్టండి అని పంతులు గారు అన్నారు... ఇంకేముంది కనపడలేదు.... అంతా ఒకటే టెన్షన్...పోయిందేమో ఎక్కడిన జారిపోయిందేమో అని కంగారు పెద్దవాళ్ళకి... ఇంక అప్పుడే మధుపర్కాలు కట్టుకొని వత్చిన పెళ్ళికూతురు పాపం డీలా పడిపోయింది... ఏడుస్తూ గదిలోకి వెళ్ళిపోయింది... అప్పుడు గుర్తుకువత్చింది తనకి తాళిబొట్టు,మెట్టెలు ఉన్నా పర్సు తన ఫ్రెండ్ hanbag లో పెట్టమన్నది... పెళ్లి టైం లో ఇద్దువు అని ఉంచింది... కానీ ఇంతలొ అ ఫ్రెండ్ అ పర్సు గురించి మర్చిపోయి డిన్నర్ చేసేసి ఇంటికి వెళ్ళింది.... ఇంక వెంటనే అ ఫ్రెండ్ మొబైల్ కు కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ ....బహుశా చార్జింగ్ అయ్పోయి ఉంటుంది ... అమ్మాయి ఉండేది హాస్టల్ లో.... ఇంక హాస్టల్ కు ఒకరిని పంపించి అ తాళిబొట్టు,మెట్టెలు తీసుకు వట్చి మొత్తానికి పెళ్లి చేసారు.... ఇది మొత్తం జరగటానికి దాదాపు 2 గంటలు పట్టింది..... అప్పటిదాకా అందరికి టెన్షన్ నే... రాత్రి పూట ...అందులోను పెళ్లి మండపం ఎక్కడో ఇంటికి దూరం గ తేసుకున్నారు.... మళ్ళి అప్పటికప్పుడు కొనాలి అన్నా తాళిబొట్టు కష్టమే... ఇంక దొరకకపోతే పసుపుకొమ్ము కట్టిద్దాం అనుకున్నారు...కానీ భగవంతుడి దయవల్ల దొరికింది.... నారు పోసిన వాడు నీరు కూడా పోస్తాడు గా.... ఇంక డిన్నర్ ఏదో చేసాం అంటే చేసాం అనిపించి ఇంటికి వత్చేటప్పటికి అర్ధరాత్రి 2 అయ్యింది..... మనం అన్ని బాగానే చూసుకుంటాం పెళ్లి అంటే...కానీ ఏదో చిన్న అతిజగ్రత వాళ్ళ ఇలాంటి అనుకోని ప్రమాదాలు జరుగుతాయి.... చాలా planned గ చేయాలి... నలుగురి లో అభాసుపాలు కాకూడదు కదా...

Aug 8, 2009

మా వరలక్ష్మి

మాకు వరలక్ష్మి వ్రతం ఆచారం లేదు.. అమ్మ వారిని విగ్రహం పెట్టి వ్రతం ఆనవాయితీ లేదు మా ఫ్యామిలీ కి... మామూలు పూజ చేసుకుంటాము... కానీ సరి మా బాబు వలన అమ్మ వారి రూపం వత్చింది మా ఇంటికి కుడా.. ఎలాగంటే
మా బాబు ఒక నెల నుండి బాగా నడుస్తున్నాడు.. దేవుడి గూటి లో కో ఎక్కి అన్ని పటములు ,విగ్రహాలు లగేస్తున్నాడు.. నేను అనుకున్నాను అసలే శ్రవణ మాసం పూజ లేకుండా ఎలాగా అని అలోచించి మా అతయ్యగారికి దేవుడి ని పైకిఎక్కిస్తే ఎలాగా ఉంటుందా అని ఆలోచన వత్చింది సడన్ గా.. మా పుజమందిరం మందిరం లాగా ఉంటుంది..పైనగోపురం కుడా ఉంటుంది...ఇంక అన్ని విగ్రహాలు,పటములు తీసి మందిరం పైన పసుపు పూసి బొట్టు పెట్టి ముస్తాబుచేసారు.. గోపురం కు కుడా...దానిని చుస్తే అలంకరించిన అమ్మ వారిలాగా ఉంది... చేతుల కోసం ఒక కర్ర,మంచి పట్టుచీర కడితే అమ్మవారి లాగానే ఉంటుంది... ఇంక మరీ ఆచారం వదిలేసి కొతగా వ్రతం చేయలేం కదా అని... మందిరం కేచిన్న జాకెట్ ముక్క చుట్టి అమ్మ వారు అని భావించి పూజ చేసుకున్నాం...
చాల కొత్తగ చేసుకున్నాం శ్రావణ శుక్రవారాలు....
పుణ్యం అంతా మా బంగారు తండ్రికే....
వాడి అల్లరి చేష్టల కే గా మాకు ఆలోచన వత్సింది ....

Jul 31, 2009

నా తీపి గుర్తులు

ఇప్పుడే జల్లెడ లో ని జ్ఞాపకాలు చదివేసరికి నాకు నా బాల్యం లోని జ్ఞాపకాలు గుర్తుకువత్చాయి... నాకు మా నాన్నగారునా ౩వ తరగతి లో నేర్పిన పద్యం ఇప్పటికి బాగా గుర్తువుంది
అక్కరకు రాని చుట్టము
మ్రొక్కిన వరమీని వేల్పు
మొహారమున దాగిన గుర్రము
గ్రక్కున విడవంగా వలయు గదరా సుమతి!!!
దీని తర్వాత ఇంక చాల పద్యాలూ నేర్పారు...
ఇన ఇది మొట్టమొదటి శతక పద్యం కాబట్టి ..మీ ముందు ఉంట్చుతున్నాను...
దీని తర్వాత ఇంక ఇలాంటి పద్యాలూ,దేవుని స్తోత్రాలు చాల చాల నేర్పారు...
ఇప్పటికి నాన్నగారి వలన నేను లలితా సహస్రనామం. విష్ణు సహస్రనామం, ఆదిత్య హృదయం,
ఇలా చాల చాల కష్టమిన స్త్రోత్రాలు కూడా నేర్పారు..
దానివల్లనే నాకు పెళ్లి ఇనతర్వాత కాస్త పూజ పునస్కారాలు అలవాటు ఇనయేమో...
ఇప్పటికి ఆఫీసు కు వెళ్లేముందు పూజ చేసుకునే వెళ్ళేదాన్ని...(ఇప్పుడు లీవ్ పెట్టాను... ఆఫీసు కు మాత్రమే పూజ కుకాదండోయ్ )...
కాలం లో పిల్లల కు మనం శతక పద్యాలూ, స్తోత్రాలు కాస్త నేర్పిస్తే వాళ్ల కు కూడా కొంచం భక్తీ ..దాంతో పాటు మనసంప్రదాయాలు కూడా నేర్పినా వాళ్ళం అవుతాం...

Jul 27, 2009

Prevention is better than Cure!!!!

There was a wooden bridge on top of a river in a city.
whenever people walked over it to cross the river,they would fall down.
To take care of this problem,the city appointed a strong policeman to stand under the bridge to save poeple who fall down.
while this helped the problem to some extent pople continued to fall down the bridge.
When the policeman moved to a different position,a new policeman was appointed to the job.
During the first few days,instead of standing at the botton of the bridge and saving the falling people,the new policeman worked with an engineer and fixed the hole on the bridge,which had not been noticed by the earlier policeman.
People the stopped falling down the bridge and the newe policeman did not have anyone to save.
This made his current job redundant and he moved on to do other things that yielded even better results for himself and the people.

Jul 8, 2009

జీవితం

ఇప్పుడే నేను టీవీ లో ఫ్లాష్ న్యూస చూసా...ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ ఆత్మహత్యా అని...కారణము తనకు బ్రతుకు మీద ఇష్టం లేదు అని....అప్పుడే ఈ వయసు కే బ్రతుకు మీద విరక్తి.... వాళ్ల అమ్మ వాళ్ళు ఎంత కష్టపడి ఫీజు కట్టి చదివిస్తుంటే... వాళ్ళ ఆశల మీద నీళ్లు చల్లి... వెళ్ళిపోయింది..... ఎందుకో అంత ఆవేశం గ నిర్ణయాలు తెసుకుంటారో....ఈ మధ్య కాలం లో ఆత్మహత్యలు చాల ఎక్కువ అయినాయి.. భర్త కోప్పడ్డాడు అని నిన్న ఒక వివాహిత ఆత్మహత్యా చేసుకుంది తన ఏడాదిన్నర బాబు ను వదిలేసి....పాపం అ చిన్నారి ఆలనా పాలనా ఎవరు చూస్తారు.... ఎంతైనా అమ్మ ను సాటి రారు కదా....కొంచం కంట్రోల్ చేసుకొంటే.... లైఫ్ మిగిలేది కదా...నాకు చాలా బాధ వేసింది ఈ సంఘటనలు చూసి...
నాకు ఉన్నాడు ఒక బాబు 14 నెలలు ... బాగా విసిగిస్తుంటే చిన్న గ ఒక దెబ్బ వేద్దాం అని చేయి ఎత్తాను...ఫస్ట్ టైం వాడి మీద చేయి లేపటం... వాడు అలా లేపటం చూసి గలగల నవ్వాడు....ఏదో అడిస్తున్నట్టు నవ్వాడు.... నిమిషం లో కోపం ఎగిరి పోయింది నాకు..... వాడికి దెబ్బ కొడ్తోంది అన్నా విషయం కూడా తెలియదు... పసివాడు పాపం... అలంటి పసివాడిని వదిలేసి ఆమె అఘాయిత్యం చేసిందంటే నాకు ఎందుకో తెలియని కోపం ,బాధ వచ్చేసాయి .. ఒక్కసారి కూడా తన తర్వాత బాబు ఎలాగా అని సందేం కూడా రాలేదా అనిపిస్తుంది.....
ఇది చదివి కొంతమంది ఇన కోపం ను ఆవేశం ను కంట్రోల్ చేసుకుంటారు అని రాస్తున్నాను...
విచిత్రం ఏమిటి అంటే ఇది న ఫస్ట్ బ్లాగ్.... ఎప్పటినుండో ఒకటి బ్లాగ్ ఓపెన్ చేయాలి అనుకున్నాను... ఇవాళ ఈ సంఘటనా తో ప్రారంభం అయింది....