Jul 7, 2010

నా బ్లాగు కధ

"బ్లాగు అంటే " ఏమిటి అస్సలు.అందరూ బ్లాగులు రాసేస్తున్నారు అని అనుకున్నాను.నీకు కూడా "మంచి కాలక్షేపం" అవుతుంది "ఆలోచించండి" అని "మా వరలక్ష్మి" నా "పుట్టిన రోజు " నాడు మంచి "Idea " ఇచ్చింది. "అనుకోకుండా కొన్ని రోజులు" తర్వాత "గురుభ్య్యోన్నమః " అని మనసులో నే మా గురువు గారిని నమస్కరించుకొని "నా అందమైన ప్రపంచం" అనే నా బ్లాగు కు శ్రీకారం చుట్టాను.
మన సంస్కృతి గురించి  తెలియచెప్పే "పండగల విశేషాలు",నేను తీసిన "అందమైన ఫోటోలు",నేను రాసిన "కవిత"లు,"ఉత్తమ ఇల్లాలు" కు ఉండవలసిన లక్షణాలు ఇలా అన్ని రకాలు గా కొన్ని "తమాషా" గా,కొన్ని ఉపయోగకరమైనవి గా,కొన్ని "మనోభావాలు" పంచుకునేవి గా ఇలాగ రాద్దాం అని నిర్ణయించుకున్నాను.
మొదట్లో కొంత "మానసిక సంఘర్షణ" పడ్డాను.ఎంతో మంది "Great People " రాసే బ్లాగులు ఆదరిస్తారు కానీ నాది ఎవరు చదువుతారు అని..కానీ ఈ "కలికాలం" లో కూడా అలాంటి "అడ్డుగోడలు" ఏమీ లేవని మన బ్లాగు members ఈ బ్లాగు లోకం లోకి నాకు "తియ్యని ఆహ్వానం"  పలికారు.
ఇంతలో ఒక నెల గడిచింది."నెల బ్లాగు" కు "కొత్త హంగులు" చేద్దాం అని మెయిన్ ఫోటో ఉంది కదా దానికి "ఫోటో సవరణ" చేసాను.నా "బ్లాగు రిపోర్ట్" బాగుంది అని మన  నేస్తాలు "అక్షారాల బహుమతి" కానుక గ ఇచ్చారు..
అలా కొంత కాలం గడిచింది.
ఇంతలో "దసరాసెలవలోచ్చ్".."బస్స్ కస్సుబుస్సు" ఎక్కి "మా ఊరు" వెళ్ళాను,,బ్లాగు రాయటం మొదలు పెట్టాక "నా రాతలు-గీతలు" బాగా మెరుగుపడ్డాయి.."అమ్మ ప్రేమ" కు బహుమానం గా అమ్మ మీద నేను రాసిన "నా కపిత్వం"  ను "అమ్మ కు పుట్టినరోజు శుభాకాంక్షలు" గా వినిపించాను,,,
మేము అక్కడ ఉన్నప్పుడే  "లైలా తుఫాను" ట తుఫాను వచ్చింది,,,వాన వస్తే ముందు గానే మనకు రోగాలు పొంచి ఉంటాయి గదా,అందుకని ఈ "Flue affect" కు భయపడి మా "మగధీర" ను తీసుకుని అదేనండి మా బాబు ను తీసుకుని "పండగ హడావుడి" ముగియకుండానే బస్సేక్కేసాను..
కాలం ఇంకా వేగం గా పరుగులుపెట్టింది...
"summer లో సరదాగా"  గడపవచ్చని మా చుట్టాలందరూ బిల బిల మంటూ మా ఇంటికి "వచ్చేశారు...వచ్చేశారు",,సరే అందరమూ ఉన్నాం కదా అని "హైదరాబాద్ అందాలు" అన్నీ చూసాము..ఎన్నాళ్టికి కుదిరిందో.
,,, కాలం ఇంకా ముందుకు పోతోంది,,,
సడన్ గా నాకు ఒక thought వచ్చింది,అదీ ఈ మధ్యనే.బ్లాగులో ఎక్కువ posts రాసి "Guiness రికార్డ్స్ లో మన తెలుగు వారు" ఎవరైనా ఉన్నారా అని వెతికాను ,,తెలుగు వారు కాదు కదా అస్సలు ఎవరు లేరు,,,"నిన్న లేదు నేడు లేదు",,సో ఇక ముందు మనం ట్రై చేయొచ్చు కదా అని అనిపించింది,,వాళ్ళు కనక వోటింగ్ పెడ్తే నాకే మీ "vote plz ",,
ఇది నా "విజ్ఞప్తి" మీ అందరికి.,,అలా జరిగితే కనుక ఈ నా "జీవితం" ధన్యమవుతుంది.
ఇదండీ నా బ్లాగు మొదటి సంవత్సర "తీపి గుర్తులు"
      "రాబోయే సంవత్సరానికి స్వాగతం" పలుకుతూ .నా బ్లాగు ఇంకా ఇంకా ఎదగాలని దానికి మీ ఆశిస్సులు కోరుకుంటున్నాను.
.....................................................................................................................................
ఇది అంతా చదివి ఏంటి ఈ సోది అనుకున్నారా?? ఇక్కడ colors లో రాసిన పదాలు బ్లాగులో నేను రాసిన పోస్ట్  యొక్క టైటిల్స్.సో నా బ్లాగ్ బర్త్ డే కు ఇలా నేను రాసిన posts టైటిల్ తో వెరైటీ గ ఏమైనా చేద్దాం అనిపించింది,సో ఇలాగ చేసాను,మా బాబు ఫస్ట్ బర్త్ డే కు కూడా ఇలాగె ఒక్కొక్క month లో తీసిన ఫోటో పెట్టి 12 months వి ఒక ఫోటో లో వచ్చేట్టు గా పెట్టి frame కట్టించాము అదే ఐడియా ను ఫాలో అయ్యాను ఇక్కడ కూడా,
మీ అందరికి నచ్చింది నా కొత్త ప్రయోగం అని అనుకుంటున్నాను.
రెండవ సంవత్సరం లోకి శరవేగం తో దూసుకు వెళ్ళబోతున్న నా బ్లాగును ఆశిర్వదించాలి అని కోరుతున్నాను.

8 comments:

  1. mee blaaguku puTTina roeju Subhaakaankshalu!

    ReplyDelete
  2. మీ బ్లాగుకి జన్మదిన శుభాకాంక్షలు మంజు గారు :-)...మీరు మరెన్నో మంచి టపాలతో అలరించాలని కోరుకుంటున్న :-)

    ReplyDelete
  3. :) :) Happy Birthday to your blog! :) :)

    ReplyDelete
  4. మీ బ్లాగుకి జన్మదిన శుభాకాంక్షలు.

    ReplyDelete
  5. Thanx అండి సునీత గారు,రామ క్రిష్న గారు,మధురవాణి గారు,సిరిసిరి మువ్వ గారు..

    ReplyDelete
  6. కొణిజేటొరబ్బాయికేకాదు బ్లాగులక్కూడా పుట్టినరోజులు జరిపిస్తారన్నమాట!

    బాగుంది. కేకు మధురవాణిగారు తెస్తారో, కొవ్వొత్తులు జ్యోతిగారు తెస్తారో!

    మీ బ్లాగు వర్ధిల్లుగాక!

    ReplyDelete
  7. మీరింకా మరెన్నో ఇలాగే ఉల్లాసంగా ఉత్షాహం గా రాయాలని కోరుకుంటూ ,
    మీ బ్లాగ్ కు జన్మదిన శుభాకాంక్షలు .

    ReplyDelete