రోజు లాగానే ఈ రోజు కుడా మా వారు వార్తా పత్రిక చదువుతూ అందులోని కబుర్లు చెప్తున్నారు.నేను నా వంటహడావుడి లో ఉన్నా.ఇవ్వాళా తెలుగు భాషా దినోత్సవం నువ్వు కనీసం ఇవ్వాళా అన్నా చక్కని తెలుగు మాట్లాడు అనితన దైన స్వరం లో చెప్పారు.ఇవ్వాళా అంతా నేను ఆంగ్లము లో మాట్లాడతాను అని ప్రగల్బాలు పలికాను.దాని కోసంనేను నా కార్యాలయానికి సెలవు పెట్టాలా అని సరే ఇప్పుడు సమయం 7.30 ఇనది కాబట్టి 8.00 దాక తెలుగు లో నేమాట్లాడాలి అస్సలు ఆంగ్లము వాడకూడదు అని పందెం వేసారు.పందెం లో మరి రసపట్టు ఉండాలి కదా ఒకవేళ నేనుఓడిపోతే రేపు ఎట్లాగు ఆదివారము సెలవు కాబట్టి రేపు వంట నేను చేస్తాను అని అన్నారు.ఇది ఏదో బాగుందే అని సైఅంటే సై అన్నాను.ఒక 10 నిముషాలు బాగానే మాట్లాడా తెలుగు లో ..అమ్మో బాగా మొండిగా ఉందే పిల్ల అని ఇంకఆయన రిమోట్ ఎక్కడ పెట్టావ్ టీవీ పెడతాం అంటే ఆ రిమోట్ అస్సలు కనిపించదు అని తన దైన స్వరం లో కొద్దిగాహెత్చు గ అరిచారు.. నేను పందెం గుర్తుపెట్టుకొని అక్కడే ఎక్కడో కుర్చీ లో ఉంటుంది వెతకండి నేను వంట హడావుడిలో ఉన్నాను అని అన్నాను...ఏది ఒకసారి వచ్చి వెతికి పెట్టు అన్నారు..ఇంక లాభం లేదు వెళ్లి ఆ రిమోట్ ఇవ్వకపోతేఇలాగె అరుస్తుంటారు అని హడావుడి గ వచ్చి చుస్తే అక్కడే ఉన్న కుర్చీ లో ఉంది..దాన్నిచూడగానే కోపం వచ్చి ఇక్కడేఎదురుగ ఉంది కదా రిమోట్ ..ఏది ఏది అని హడావుడి చేస్తారు..వెతుక్కోవచ్చు కదా 2 నిముషాలు అన్నా...వెంటనేఓడిపోయవు ఓడిపోయావ్ అని ఎగిరారు...నేను ఎందుకు ఓడిపోయాను అంటే రిమోట్ అనేది ఆంగ్లము కదా అనిఅన్నారు.... అయ్యో అని అనిపించింది....
కాబట్టి అస్సలు ఇంగ్లీష్ వాడకుండా అంటే కష్టమే కనీ ఏంటంటే ఇప్పుడు సిటీస్ లో ఎక్కడ చుసిన కేవలం ఇంగ్లీష్ లో నేమాట్లాడుతున్నారు అది ఒక స్టైల్ గా.. మన మాతృభాష ఉంది కదా చక్కగా తెలుగు లో మాట్లాడవచ్చు కదా.. తెలుగురానివాళ్ళ తో ఐతే పర్వాలేదు కానీ పుట్టి పెరిగిన మన ఆంధ్రావాళ్ళు కూడా కేవలం ఇంగ్లీష్ లో మాట్లాడితే అది కూడాఏదో గొప్ప కోసం చేస్తే కోపం నషాళానికి అంటుతుంది.....
manju garu,
ReplyDeletenijame miranatu avasaraniki anglamlo matladite tappuledugani mari goppulaku pote chirakugane untundi. aite kalamto patu manamu maraka tappdukada. mana pillalu english lo matoladite manaku saradakada. kadantara. aite okati eppatiki manam telugunu marachipomu adi manlone untundi.telugu bashapai mi dampatulaku inta abimanam unanduku abinandanalu. annatuga vruti ritya nenu asst.professor of english.untanandi.
ch.durgaprasad@hotmail.com