Nov 30, 2009
గోవిందా గోవింద
నాకు వంట చేసుకుంటూ radio కార్యక్రమాలు వినటం బాగా అలవాటు.ఈ మధ్య ఒక FM ఛానల్ లో ad వస్తోంది ఏంటంటే అది " సోమవారం కు ఒక మూడ్,మంగళవారం కు ఒక మూడ్,అలా రోజుకు ఒక మూడ్ ఉన్నట్లు దానికి తగ్గట్టు మనం మారుతున్నాము కదా మరి మన ట్యూన్ ఎప్పుడు ఒకటే బోరింగ్ ఎందుకు మార్పు చేసుకోండి కొత్తది గా అని" అది వినగానే నాకు ఒక మెరుపు లాంటి ఆలోచన వచ్చింది ... ఎప్పుడూ ఒకటే పిక్చర్ ఎందుకు మన బ్లాగు లో కొత్త రకం గ పెడతాము అని... సరే అని నైట్ అంతా కూర్చొని వెతికి వేసారి మొత్తానికి ఒకటి నచ్చింది... సరే అని మార్చాను... కనీ అది సరిగా రాలేదు... అయ్యో నా బ్లాగు అనుకుంటూ వెతికి వెతికి మళ్లీ ట్రై చేసి మొత్తానికి మార్చాను... హా బాగుంది బాగుంది అనుకుని ఒక సారి మొత్తం బ్లాగుని పైన నుండి కిందదాకా చూసాను .........అయ్యో నా visitors counters గోవింద గోవిందా మల్లి 0 నుండి మొదలు అయ్యింది ఇంకా...ఇప్పటిదాకా నాకు ఆ visitors counters నే హార్లిక్స్ తాగినంత బలం ఇచ్చాయి.. అనవసరం గ మార్చనే అని అనిపించింది ..... ఏమి చేస్తాము మళ్లీ రెడ్డొచ్చె మొదలాడు.. దీన్ని బట్టి నాకు అర్ధం అయింది "ఒక ఐడియా మీ జీవితాన్నే కాదు మీ బ్లాగును కూడా మార్చేస్తుంది" అని.,,సో మళ్లీ మొదటినుండి ప్రారంభించాను..
Subscribe to:
Post Comments (Atom)
మళ్ళా ఆ పాత నెంబర్ నుండి మొదలెట్ట వచ్చు కొత్త కౌంటర్ లో
ReplyDeleteavunaa elago cheppandi plz...
ReplyDeleteమీరు ఎ కౌంటర్ వాడతారో నాకు తెలియదు.
ReplyDeleteనేను easycounter ని వాడతాను.
మొదటగా easycounter.com సైట్ లోకి వెళ్లి user name, email id, etc details ఇచ్చి మీకు కావాల్సిన కౌంటర్ ని సెలెక్ట్ చేసుకొని రిజిస్టర్అవ్వండి.
తరవాత లాగిన్ అవండి. పైన edit profile ని క్లిక్ చేయండి. అక్కడ unique counter, main counter లో మీకెంత కావాలో సెట్ చేసుకొని సేవ్ చేయండి.
అది సేవ్ చేసుకున్న తర్వాత counter code ని క్లిక్ చేసి అక్కడ ఉన్న html code ని కాపీ చేసుకొని మీ బ్లాగ్ లో వాడుకోండి.
అప్పుడు మీ కౌంటర్ మీరు సెట్ చేసిన నెంబర్ నుండి మొదలవుతుంది.
hope that helps.
ఇంకేమైనా అనుమానాలు ఉంటె ఈమెయిలు చేయండి.
థాంక్స్.