Sep 12, 2009

పండగల విశేషాలు

వ్యాఖ్యలు నేను ఒక పుస్తకం లో చదివాను.మన పండగలు ఆచారాలూ లో ఉన్నా గొప్పతనం అందరికి తెలియాలి అనిఇక్కడ పొందుపరుస్తున్నాను.
వినాయక చవితి నాడు ఉండ్రాళ్ళు ఒంటికి బలానిచ్చి దేహ శాంతి ని కలిగిస్తాయి.పిత్త దోషం పోగొడుతుంది అని వైద్యశాస్త్రం.
మసూచి వసంత ఋతువులో వస్తుంది కాబట్టి అది రాకుండా ఉండటానికి వేపపువ్వు తింటారు (ఉగాది పచ్చడి )
ధనుర్మాసం లో రాత్రి ఎక్కువగా ఉండి పగలు తక్కువ ఉండడం వల్ల తగిన ఆహరం లేకపోతె రసాది ధాతువులునుఎండించి రోగాలు కలిగిస్తాయి .కనుక దద్దోజనం,చక్రపొంగలి మో!! నివేదన పెట్టి ఆరగిస్తారు
ఆషాడ మాసం నుండి జటరగ్ని మందం ఉంటుంది.కనుక చాతుర్మాస్య వ్రతాలూ చేసి ఆహరం లో అనేకనియమాలు పాటిస్తారు.
వర్ష ఋతువు లో భూమి యొక్క ఆవిరి చేత గాలి చెడి పోయి ఉంటుంది.కనుక అటువంటి గాలిని పీల్చడం వల్ల రోగాలుపుడతాయి కనుక లక్క,పసుపు,అతివాస మొదలైన విషాన్ని పోగొట్టే ద్రవ్యాలను నిప్పు మీద వేసి పుట్టిన పొగచేవాతావరణాన్ని శుభ్రం చేయాలి అన్నారు.దీపావళి లో బాణసంచా కూడా అందుకే.
ఉగాది లో మామిడి,నేరేడు,మేడి,జువ్వి వీటి ఆకులను నానిపి తలంటు స్నానం చేయాలి అని ఆయుర్వేద గ్రంధాలుఅంటున్నాయి.రధ సప్తమి నాడు జిల్లేడు ఆకులను తల ఫై పెట్టి స్నానం చేయడం వడదెబ్బ నుండి రక్షించడానికే.
మకర సంక్రాంతి లో నువ్వుల ఉండలు తినడం వల్ల వాతం హరిస్తుంది.హృదయ స్పందనకి నువ్వులు,బెల్లంఉపకరిస్తాయి.
రాత్రివేళల్లో భూగర్భ జల లలో శక్తిమంతము ఐన అయస్కాంత మండలం ఉంటుంది కనుక కార్తీక మసాల లోతెల్లవారు జామున స్నానాలు చేయాలి అన్నారు.
అట్లతద్ది నాడు గోరింట పెట్టుకోవడం వల్ల చేతులకు,కాళ్ళకు చర్మ రోగాలు రావు.
మామిడాకు తోరణాలు చెడు గాలిని హరిస్తుంది అందుకే పండగ నాడు మామిడి తోరణాలు గుమ్మానికి కడతాము.

ఇవి మన పండగల లో ఉన్న ముఖ్య ఉద్దేశం.పండగ అంటే ఏదో సెలవు దినం అనే కాకుండా కాస్త ఆచారం కూడా పాటిస్తేపండగ సార్ధకమవుతుంది.



1 comment: