Dec 2, 2009

చక్కర లేని టీ

నేను నిన్న బాబా పుస్తకం చదువుతూ చోల్కేర్ చక్కర లేని టీ అనే కధ  చదివాను.. అప్పుడు అనుకున్నాను చోల్కర్ గారు చక్కర లేని టీ తాగింది చక్కర ఖర్చు తగ్గించి ఆ డబ్బుతో షిరిడి ప్రయాణం కట్టొచ్చు అని అలా నిర్ణయం తీసుకుని ఉంటారు అని.. నా మట్టి  బుర్ర కు అంతే తట్టింది.. ఇవ్వాళ నేను కాఫీ తాగుదాము  అని కలుపుకున్నాను. కొంచం చక్కర తగ్గింది.. తీరా చుస్తే పక్కన ఉన్న చిన్న డబ్బాలో చక్కర నిండుకుంది..(ఐన పెద్ద డబ్బాలో లోపల నిల్వ ఉంటుంది లెండి).వెంటనే నాకు రాత్రి కధ గుర్తుకు వచ్చింది .ఇవ్వాళ గురువారం కదా మనం కూడా చక్కర లేకుండా తాగుదామా అనుకున్నాను..కానీ నా మనసు ఒప్పుకోలేదు అలమర లో పైన ఉన్న పెద్దడబ్బ లో నుండి చక్కర తీసుకుని మళ్ళి వేడి చేసుకుని చక్కగా కాఫీ తాగాను.తాగుతూ అనిపించింది అరె కొంచం చక్కర లేకపోతేనే నేను adjust కలేకపోయానే  ఆయన ఎలా తాగారా అని.. ఆలోచించగా నాకే అనిపించింది చక్కర లేకుండా టీ తాగి తే డబ్బు మిగులుతుంది అని కాదు. అది ఇంద్రియ నిగ్రహం కోసం అలా చేసి ఉంటారు అని అనిపించింది.. ముందు మన మీద మనకు నిగ్రహం వస్తే తర్వాత దేవుడి మీద ధ్యాస అదే నిలుస్తుంది అని....ఈ విధం గ తెలియచేప్పర బాబా నాకు అనిపించింది..
జై సాయి రాం  జై జై సాయి రాం

4 comments:

  1. ఆరోగ్యానికి మంచిది కానిదేదైనా మానడానికి ప్రయత్నించే మంచిదే. అట్లా కాక ఇంద్రియ నిగ్రహం అనే పేరుతో తిండి, బట్ట, సంతోషం, ఆనందం వీటిని కూడా పొదుపు చేస్తే ఆ దేవుడుకూడా క్షమించడు.

    ReplyDelete
  2. maree manalenidithe kashtam kanee konni konni maneste mana jeevitalaku vatchina nashtamemi ledu..

    ReplyDelete
  3. మీరు సరిగా అర్థం చేసుకోలేదు అండి ఆ బాబా గారికి ఇంద్రియనిగ్రహం లేదు అని చెక్కర మానేయ లేదు కచ్చితంగా షుగర్ వ్యాది ఉండుంటుంది..
    చెక్కెర మనవ ఇంద్రియ నిగ్రహత్వం మీద పనిచెయ్యదు కేవలం రోగాలను మాత్రమే పుట్టించ గలదు...

    నిజంగా ఇంద్రియ నిగ్రహం కావాలంటే టీ లేదా కాఫీ మానేయాలి అంతే కాని అందులో చెక్కెర కాదు...
    మొరోక్క విష్యం అసలు చెక్కెర లేకుండా కాఫీ తాగడంవల్ల కలిగే నష్టం , చెక్కెరతో తాగే దాని కన్నా బాగా ఎక్కువే...

    ReplyDelete
  4. This comment has been removed by the author.

    ReplyDelete