Nov 19, 2009
దినోత్సవాలు
నిన్న నేను న్యూస్ పేపర్ తిరగేస్తుంటే మొదటి పేజి లో ఉన్న advertisement బాగా ఆకట్టుకుంది ఏమిటంటే అది ఒక బాత్రూం cleaner అన్నమాట ఇవ్వాల toilet cleaning day ఈ రోజును ఈ cleaner ఉపయోగించి మీ బాత్రూం లు సుభ్రపరచుకోండి అని... toilet డే కుడా ఉందా అని నాకు నవ్వు వచ్చింది .. సరే మళ్లీ ఇవ్వాళా పేపర్ చూస్తుంటే అందులో ఉంది పురుషుల దినోత్సవం టా.. ఈ దినాలేమిటో అర్ధం కావటం లేదు... వాళ్ళు కొంతమంది సభ నిర్వహించారు ట కొందరు సభ్యులు మాట్లాడిన మాటలు ఏమంటే.."పురుషులు ATM లాంటి వారు కాదు..వాళ్ళు కూడాగృహహింస పడుతున్నవారు ఉన్నారు అని "... ఈ లెక్కన రోజుకొక దినం వస్తుందేమో మనకు అనిపించింది..... మన తల్లితండ్రుల పుట్టినరోజు కూడా కచ్చితం గ చాల మందికుతెలియదు ...ఆ రోజు మనం బహుమతి ఇవ్వకపోయినా వాళ్ళకు కనీసం శుభాకాంక్షలు కూడా చెప్పం... కానీ valentines డే కోసం డిసెంబర్ నుండే వేచి ఉంటాము.. friendship డే కోసం వందలు తగలేసి బాన్డ్స్,గ్రీటింగ్స్ కొంటాం... తప్పు అని నేను అనను కానీ ఇలాంటి అమ్మ పుట్టినరోజు,తమ్ముడు పుట్టినరోజు,తాతయ్య పుట్టినరోజు ఇలాంటివి కొన్ని గుర్తుపెట్టుకుని వాళ్ళకు అ రోజు విష్ చేస్తే వాళ్ళు ఎంత హ్యాపీ గ ఫీల్ అవుతారో కదా...అప్పుడు ప్రత్యేకం గ mothersday,fathers day,parents day ఇలాంటివి దినాలు జరుపుకోవలసిన అవసరం ఉండదు... ఏమంటారు మీరు????
Subscribe to:
Post Comments (Atom)
మంజు గారూ !
ReplyDeleteమన మీద మనకు నమ్మకం తగ్గినపుడు, అత్మీయతలను ఆర్థికాంశాలు అధగమించినపుడు, సహజ సంబంధ బాంధవ్యాలు గుర్తుచేసుకునే తీరిక లేనపుడు మాత్రమే ఈ ' దినాల ' అవసరం.శుభాకాంక్షలకు కూడా ఖరీదు కట్టవలసి వస్తోంది. నిజానికి ఇది మన మనస్తత్వాల్లో వచ్చిన మార్పేగానీ కాలం తెచ్చిన మార్పు కాదు.
టోయిలెట్ డే అని అంత తేలిగా తీసిపడేయకూడదు . అది బాగుంటేనే మన ఆరోగ్యం బాగుంటుండి . Feco-Oral disease లకు అదే మూలము . ఆ దినము రోజూ జరుపుకుంటే ఇంకా మంచిది . జై టోయిలెట్ డే !
ReplyDelete