Sep 7, 2009

మీడియా అత్యుత్సాహం

మన మీడియా వాళ్ళు మరీ అతి ఉత్సాహం ప్రదర్శిస్తారు.Y.S.R హెలికాప్టర్ కనిపించనప్పటి నుండి అయన అంత్యక్రియలు వరకు లైవ్ దానికి తోడూ చర్చలు.క్లోజ్ అప్ లో ప్రజల భావాలను ప్రదర్శించడం. హెలికాప్టర్ కనపడలేదు అని ఒక 4 గంటలు హడావుడి చేసారు తర్వాత ఎక్కడో నల్ల మల అడవిలో ఉన్నది అని అదొక ప్రచారం ఇంతా కనిపెట్టే టప్పటికి తెల్లారిపోయింది.. ఈ లోగ చూసే జనానికి రాత్రి అంతా నిద్ర పట్టదు.టీవీ చూద్దాం అనుకున్నా టెన్షన్ నే చూడక పోయిన ఏమి అయిందో అని టెన్షన్.. ఈ లోగ చూస్తూ చూస్తూ కన్ను కునుకు పట్టేసరికి తెల్లారిపోయింది ఇంక 8 గంటలకు హెలికాప్టర్ ఆచూకి దొరికింది ఇంక అక్కడకు చేరాలి అంటే ఒక గంట సమయం పడ్తుంది.అక్కడి వాళ్ళు ఎలా ఉన్నారో తెలియదు..అని అదొక సస్పెన్షన్.. ఈలోగా మనం టెన్షన్ తో ప్రార్ధనలు..ఇన ఏమి లాభం పాపం వై.స.ర బృందం పాపం పోయారు..ఈ వార్త తెలిసే లోగ ఒక 50 మంది పోయారు మన రాష్ట్రం లో..ఏమి చేస్తారు గుండె నిబ్బరం లేని వాళ్ళు అంత సేపు టీవీ లో చుస్తే ..ఇంక అక్కడ నుండి అంత్యక్రియలు దాక లైవ్. దాదాపు ఒక రోజు అంతా పట్టింది ఈ లోగ మన అభిమానుల మృతి సెంచరీ దాటేసింది.. ఇంక ఇప్పుడు జగన్ ముఖ్యమంత్రి అవుతాడా లేదా అని అదొక చర్చ..అవకపోతే ఆత్మహత్యా చేసుకుంటాం అని బెదిరింపులు ..
ఇది అంతా మీడియా ముందు హడావుడి చేయటం కోసమే అభిమానుల ఆరాటం అని అనిపిస్తుంది. ఈ చానల్స్ వాళ్ళు కూడా వల్ల ratings పెంచుకోవటం కోసం లైవ్ టెలికాస్ట్ లు వీపరీతం గ చేస్తున్నారు..
ఎప్పటికి మారతారో ఈ జనాలు

5 comments:

  1. "ఇది అంతా మీడియా ముందు హడావుడి చేయటం కోసమే అభిమానుల ఆరాటం అని అనిపిస్తుంది. ఈ చానల్స్ వాళ్ళు కూడా వల్ల ratings పెంచుకోవటం కోసం లైవ్ టెలికాస్ట్ లు వీపరీతం గ చేస్తున్నారు..
    ఎప్పటికి మారతారో ఈ జనాలు"

    అక్షర సత్యం

    ReplyDelete
  2. మీరు చెప్పినట్టుగా మీడియావాళ్ళకు గల ఉత్సాహం విపరీత ప్రచారం ఈ ఆత్మహత్యల రూపంలో జరిగే అనర్థాలని మూడింతలు పెరిగేలా చేస్తున్నాయే తప్ప సమాజానికి కలుగఁజేసే మేలేంటో అర్థం కావటం లేదు.
    ఏ నాటికైనా అర్థం చేసుకోకపోతారా అని మనం ఆశిస్తూ ఎదురు చూడ్డం తప్ప చేయ గలిగిందేముంది.

    ReplyDelete
  3. ముఖ్యమంత్రిగా తనకెవరు పోటీ ఉండకూడదనేగా ఆయన క్యాబినెట్ అంతా డమ్మీలను ఏర్పాటుచేసాడు. ఇప్పుడింకెవరో పదవి తన్నుకుపోతారనే భయం ఎందుకో! ఎవర్నీ ప్రకటించముందే జగన్ కోసం ఇంతగొడవ చేస్తున్నారంటే ..hmmm

    ReplyDelete
  4. నిజమే అక్క.. దీనివల్ల నష్టమేకానీ లాభం ఏ కోశానా కనిపించటం లేదు.

    ReplyDelete