ఎందుకో నాకు ఇవ్వాళ నా చిన్నప్పుడు వేసవి సెలవుల్లో ఆడుకునే ఆటలు గుర్తువచ్చాయి,,ఎక్కువగా మేము ఈ వైకున్టపాలి,,అదే పరమపద సోపాన పటము,,,గవ్వల తో పందాలు వేసి ఆడేవాళ్ళము,,దీనిలో ఆంతర్యం ఏమిటో తెలియదు గాని,,అప్పుడు అంత ఊహ కూడా లేదులెండి,,,సరే కదా అని ఊరికే సెర్చ్ చేశా నెట్ లో అస్సలు ఈ గేమ్ అనేది ఆడేవాళ్ళా లేదా ,,, అని,,కొద్దిగా ఇన్ఫర్మేషన్ దొరికింది,,,
ఈ పటము లో పాములు,ఏనుగులు కొన్ని కాళీ గదులు ఉంటాయి,,,ఈ పాములు పాతాళం అని,,ఏనుగులు అష్టదిగ్గజాలు అని ఈ ఏనుగులు భూమిని మోస్తుంటాయి అని హిందువులు నమ్మకముట...
మనం పందెం వేసి ఒక్కో గదికి వెళ్తూ ఉంటే..మధ్య లో పాము గది వస్తే కిందకు దిగటం,,,నిచ్చెన వస్తే పైకి వెళ్ళటం,,,అలా సాగుతుంది ఆట...
పునరపి జననం,,పునరపి మరణం అన్నది ఇందులో ఉన్న భావన,,మానవుల దృష్టి భక్తీ,ఏకాగ్రత,దైవచింతన వైపు తీసుకు వెళ్ళటమే ఈ ఆట ఉద్దేశం,,,
ఉద్దేశాలు ఎమైనా మంచి గ కాలక్షేపం అయ్యే ఆట...ఇప్పుడు ఈ ఆట కు కాస్త కొత్త హంగులు చేర్చి,, Snakes and ladders గా మారి మళ్ళి ఈ తరం పిల్లలకు వచ్చింది...
No comments:
Post a Comment