May 22, 2010

దైవ సాన్నిధ్యం

వేణువై   వచ్చాను  భువనానికి ..
గాలినై పోతాను  గగనానికి
అన్నట్టు  పాటల వేణువై  వచ్చి  అందరి  నోట  ఆయన  పాట  వినిపించి
చిన్న  వారి  నుండి  పెద్ద  వారి  దాక  అందరికి  నచ్చే  అందరిని  మెచ్చే  పాటలు రాయటం ఆయనకే  చెల్లుతుంది ,,,
ఆయన మళ్ళి మళ్ళి పుట్టాలి అని కోరుకోవటం మన స్వార్ధమే అవుతుందేమో ,,,
అయినా  ఉన్నప్పుడు మనమేమి గొప్పగా ఏమి బిరుదులు ఇచ్చి ఆయనను encourage చేయలేదేమో అనిపిస్తుంది ,,
ఎంతోమంది  కు  పద్మశ్రీ  ఇచ్చాము ,,అలాంటిది  ఈయనకు  కూడా  ఇచ్చి  ఉంటే  బాగుండేదేమో ,,,ఆ పురస్కరానికే గౌరవం  దక్కేదేమో  అని  అనిపిస్తుంటుంది  నాకు .....
ఆయన  ఆత్మ శాంతించాలి  అని  మనస్పూర్తి  గా ఆ  దేవుడిని  కోరుకుందాం ,,,
మళ్ళి  అలాంటి  వేటురులు  పుట్టాలి  అని  కోరుకుందాం ...

Hyderabad అందాలు

ఈ ఫోటోలు చూస్తుంటే నాకు అరె మన హైదరాబాదేనా అని అనిపిస్తోంది,,,,
చూడండీ ఎంత అందం గా  ఉందొ మన సిటీ...
 
                                                                   హైటెక్ సిటీ..సైబర్ towers
                                                                     హై కోర్ట్..
                                                              Imax
                                          Salar Jung Museum 

       మన సిటీ లో మనం చూడాల్సిన ముఖ్యమిన places చాలా ఉన్నాయి..గోల్కొండ,చార్మినార్,musuem ,బిర్ల planetorium ఇలాంటివి చక్కగా పిల్లలకు బాగా ఉపయోగపడతాయి..ఎట్లాగు summer holidays నే,,పైగా కాస్త లోకం చల్లపడింది కాబట్టి ఒక ట్రిప్ వేయొచ్చు,,,,

May 21, 2010

తమాషా

ఎందుకు  అలా  ఏడుస్తున్నావ్  అంటారా  చుడండి  కింద  తమాషా 


 బాలు గారి పాటను ఎంత బాగా ఎంజాయ్ చేస్తోందో చూడండీ

చూడండీ దేవి శ్రీ మ్యూజిక్ కు ఎలా వంత పలుకుతోందో..
ఇంకా పాప్ మ్యూజిక్ పెడ్తే ఎలా పెట్రేగిపోతోందో....
మరి నేనేమి పాపం చేసానండి నా పాట వింటే చూడండీ ఏమి చేసిందో...

మరి నన్నేమి చేయమంటారండి......


నోట్లో మాట (అదేనండి Note అంటారు కదా అది):
 జస్ట్ సరదాగా ఉంది అని పోస్ట్ చేశాను,,చూసి ఎంజాయ్ చెయ్యండి,,if it is already seen just ignore ...

May 19, 2010

లైలా తుఫాను


                                                ఓ  లైలా  ఓహో  లైలా
                                                ఇంక ఆపవేలా?
                                                మాపై నీకు ఇంత కోపమేలా?
                                                ఇకనైనా విడిచి వెల్లవేలా?
                                                అందరిని భయపెట్టేలా
                                                ఏమి నీ లీలా
                                                ఇంక చాలు నీ వరదల గలగలా
                                                ఇంకనైన వెళ్ళిపో అలా అలా........

మగధీర

మా   బాబు  మొన్న  మగధీర  సినిమా  చూసాడు. అందులో  రాంచరణ్  గుర్రం  మీద  వెళ్తాడు  కదా  అది చూసి ఇంక  అప్పటినుండి  ఆ  పాట పెట్టించుకుని  ఇదిగో  ఇలాగ  రాంచరణ్  కంటే  మా  సాయి శరన్  ఏమి మించలేదు  అన్నేట్టు  గుఱ్ఱము పై స్వారీ మొదలెట్టాడు,,,

May 17, 2010

గురుభ్యోన్నమః


నిజం గా గురు శిష్యుల సంబంధం చూడాలి అంటే మా వారి గురువు గారు (పట్టభిరామాచార్యులు) గారినే చూడాలి..గురువు గారు లెక్కల లో doctorate చేసారు...NIT వరంగల్ లో చేసి 90 లలో అనుకుంటా రిటైర్ అయ్యారు..అప్పటినుండి ఎంతోమంది కు guide గా చేస్తున్నారు,,ఆయనకు దాదాపు డెబ్బై అయిదు ఉంటాయి వయస్సు,,ఈ వయస్సు లోను ఆయన చలాకీగా అన్ని సెమినార్లకు,maths olampyad లకు  క్లాస్సేస్ చెప్తుంటారు,,ఆయనకు విద్య మీద ఉన్న మక్కువ అలాంటిది,,,టెక్నాలజీ లో కూడా ముందు ఉన్నారు,,,గూగుల్ లో సెర్చ్ చేసి materials collect చేసి లేటెస్ట్ గా ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారు స్టూడెంట్స్ కు.
మొన్న ఇంటి ముందు ముగ్గు వేసాను,,దాన్ని చూసి గురువు గారు దాన్ని చుస్తే ఏమి గుర్తువస్తోంది అని అడిగారు,,,
మనకు ఆయనంత knowledge లేదు గా...ఏమి రావటం లేదండి అన్నా,,ఆయన చెప్పారు అది Hamelton 's therom కు బెస్ట్ example లాగా ఉన్నది,,అని మళ్ళి "నువ్వు చదివే ఉంటావు కదా చెప్పు ఎలాగో" అని ప్రశ్నించారు ,,,నాకు ఏదో ఎగ్జామ్స్ అప్పుడు ముక్కున పెట్టుకోవడం చీదేయటం అంతే ఇంత practical knowledge మనకెక్కడ,,,అదే చెప్పా ఏమో నండి గుర్తురావటంలేదు,,,అని అప్పుడు చెప్పారు ఆయన therom చెప్పి,,,ఎప్పుడైనా  చదువును రియల్ వరల్డ్ కు అప్లై చేసుకుంటూ చదివితే బాగా గుర్తువుంటుంది,,అది అస్సలు చదవాల్సిన పద్ధతి అని,,,, 
మొన్న ఆ మధ్య ఆయన మా ఇంటికి వచ్చారు లెండి,,అప్పుడు ఆయనను కలవటానికి బోలెడు మంది వచ్చారు,,,phd చేస్తున్నవాళ్లు,,,అందరు మంచి గా ఉద్యోగం చేస్తున్నవాల్లే,,,age లో కూడా పెద్దవాల్లె దాదాపు నలభైలు ఉంటాయి,,,అలాంటిది వాళ్ళు కూడా ఏంటో భయం గా,నిదానం గా అంటే సౌమ్యం గా మాట్లాడుతూ ఉంటే భలే అనిపించింది,,,ఆయన కూర్చొని ఉంటే వీళ్ళు కిందనే కూర్చున్నారు,,
గురువు గారు కు ఒక గురువు గారు(రఘునాధాచార్యులు) ఉన్నారు టా,,ఆయన శ్రీభాస్స్యం లో doctorate చేసారు టా..గురువు గారికంటే ఆయన వయస్సు దాదాపు నాలుగేళ్ళు ఎక్కువ అంతే...ఆయన దగ్గర ఈ రామాచార్యులు గారు ఎప్పడు ఎదురుగా కుర్చీలో కూర్చోలేదు ట..ఫొటోస్ కూడా చూపించారు,,,నిజం గా ఈ రోజుల లో కూడా ఇలాంటి గురువులు అందులోను ప్రత్యేకించి అలాంటి శిష్యులు ఉన్నారు అంటే నిజం గా విద్య కు విలువ ఎప్పుడు ఉన్నది అనిపిస్తుంది,,,,
మేము చదువుకునే రోజుల్లో మా మాష్టారు కనిపిస్తే సైకిల్ మీద నుండి దిగటమో లేక gudmorning అని చెప్పటమో చేసేవాళ్ళం,,,వాళ్ళ ఇళ్ళకు వెళ్ళాలి అంటేనే దడ పుట్టేది,,,,అలాంటిది నేను ఇంజనీరింగ్ చదువుకునేటప్పుడు మాస్టర్లను ఎలా అనేవారంటే  వీడా మనకు చెప్పేది అని అనేవాళ్ళు స్టూడెంట్స్,,,,
దీనికి తోడూ సినిమా లలో గురువుల మీద వేసే జోకులు అగ్ని కు ఆజ్యం పోసేట్టు ఉన్నాయి,,,అలా చేస్తే మనం కూడా హీరోలు అయిపోతాం అనుకుంటున్నారు పిచ్చి పిల్లలు,,,,,మళ్ళి మనం ఆ గురువు స్థానం కు వెళ్లి పాటాలు చెప్తే గాని తెలియదు ఆ position అంటే ఎంత గౌరవమో,,,,
గురువు ను గౌరవిన్చినప్పుడే మన విద్య మనకు కలిసివస్తుంది,,,,

Funny Wedding Card

May 16, 2010

ఉత్తమ ఇల్లాలు

అమెరికా లో software జాబు చేస్తున్న భర్త కు recent గా ఉద్యోగం పోయింది,,ఈ నెల జీతం రాలేదు..
ఆరునెలలే  కదా ఉండేది అని ఆయన తన ఫ్యామిలీ ను తీసుకువెళ్ళలేదు అమెరికా కు,,,,
అందుకని ఆయన తన భార్య కు ఈ విధం గ మెయిల్ ఇచ్చాడు...
 
Dear Sweetheart

I can't send my salary this month, so I am sending 100 kisses.
please manage this month anyway ...
 
You are my sweetheart

Your husband





సరే అస్సలే ఉత్తమ ఇల్లాలు కదా మన భారతీయ నారి అందుకని ఏదో గుట్టుగా తనకు తోచినట్టు సంసార సాగరం ఈదుతోంది,,,పైగా ఈ recission పుణ్యమా అని ఎదురు ఈత   ఈదుతోంది....
తను కూడా భర్త కు మెయిల్ ఇచ్చింది ఈ నెల బడ్జెట్ గురించి
ఏమి ఇచ్చిందో చుడండి...



Dearest sweetheart,
Thanks for your 100 kisses, I am sending the expenses details.

 
1.. The Milk man agreed on 2 kisses for one month's milk.
2.. The electricity man only agreed after 7 kisses.
3.. Your house owner is coming every day and taking two or three kisses instead of the rent.
4.. Supermarket owner did not accept kisses only, so I have given him some other items...........
5.. Other expenses 40 kisses

 
Please don't worry about me, I have a remaining balance of 35 kisses and I hope I can complete the month using this balance.
Shall I plan same way for next few months? Please Advise !!!
 
Your Sweet Heart

May 15, 2010

హాస్యబ్రహ్మ సమస్య


అరె  ప్రింటర్ పని చేయటం లేదే ,,అర్జెంటు గా ఆఫీసు కాగితాలు  ప్రింట్  తీయాలే  ఎలాగబ్బా ??

 ఏమి చేయాలి???? ఆలోచనా రావటం లేదే???

  హా అబ్బ బ్రహ్మనందానికే బ్రహ్మాండ మైన  ఐడియా  వచ్చింది,,customer care నెంబర్ ఉంది గా ఫోన్ చేస్తే పోలే!
Me: Hi, our printer is not working.
Customer Service: What is wrong with it?
Me: Mouse is jammed.
Customer Service: Mouse? And how it is related to printer?!!!
Me:How to explain it to u ?? Mmmm.. Wait, I will send a picture
....
......
.............
.................
............
.......
...
..
.
.

Customer Care: అబ్బా ఇదా వీడి సమస్యా...హ హ హాఆఆఆఆ

ఆ నవ్వు చూడు,,,వీడికే కనుక వచ్చు అన్నట్టు,,,మేము ఉద్దండ పండితులం అవుతాములే బాబు!!!కాస్త కుదుట పడని ఈ Software ఫీల్డ్

May 14, 2010

ఇవి మీకు తెలుసా

YAHOO పూర్తీ గా ఏమిటి??
Yet Another Hierarchy of Officious Oracle 
ADIDAS పూర్తిగా ఏమిటి?
All Day I Dream About Sports 
Star TV Network లో స్టార్ అంటే ఏమిటి?
  Satellite Television Asian Region 
ICICI పూర్తీ గా ఏమిటి?
Industrial credit and Investments Corporation of India
జాతీయ గీతాన్ని రెండు దేశాలకు రచించినది ఎవరు?
రబీంద్ర నాథ్ టాగోర్ (ఒకటి మన దేశానికి,ఒకటి బంగ్లాదేశ్ కు)
goodbye అనే పదము దేని ద్వారా వచ్చింది?
'god be with you'
Aug -15th మన దేశం తో పాటు ఏ దేశానికీ స్వాతంత్రం వచ్చింది?
 South Korea .
James Bond 007 లో 007 అర్ధం ఏమిటి?
ISD code for Russia 
ఏ ఆటను left handed గా ఆడనివ్వరు?
POLO








 

May 8, 2010

అమ్మ ప్రేమ

                                         
                                           అత్యున్నత  గిరి  శిఖరం  ఆమె సహనం ,,,
                                           అతిలోతైన సముద్రం ఆమె మనసు,,,
                                           అవ్యక్తమైన ప్రేమ ఆమె గుండె లోతుల్లో 
                                           అందరికి సరిసమానం గ లభించే  ఏకైక ఆస్తి అమ్మ ప్రేమ,,,
                                           అందుకే అమ్మ ఎవరికైనా అమ్మే!!!!!!!!!!

                                          అమ్మ గుర్తు వచ్చేవేళ 
                                          శరీరమంతా మనసులోకి ఇంకిపోతుంది,,,
                                          మనస్సు దుఃఖ సముద్రం అవుతుంది,,,,

    ఇది నేను మాతృదినోత్సవం సందర్భం గా ఏదో నాకు తోచిన భావాలు రాసాను,,,,మనం ఏదో పెద్ద పెద్ద బహుమతులు,ఏవేవో చేయనక్కర్లేదు... ఆమె మనసు కష్టపెట్టకుండా ఉంటే చాలు...మన వలన ఆమె కంటి నుండి నీరు రాకుండా ఉండేట్టు మనం  చూసుకుంటే చాలు,,,
                            మాతామహులకు  నా  మాత్రుదినోత్సవ  శుభాకాంక్షలు  

May 7, 2010

బాబోయ్ బాబాలు

  ఇప్పుడే టీవీ లో మళ్ళి ఒక కొత్త బాబా చూపిస్తున్నాడు,,హోమానంద టా,,,ఇదివరకు కూలి పని చేసుకునేవాడు డబ్బులు చాలక స్వామి అవతారం ఎత్తి,,జనాలను మోసం చేస్తున్నాడు ట....
మనకు మూడు కోట్ల దేవతలు ఉన్నారు అంటారు,,,మూడు కోట్ల దేవతలేమో కానీ ముపై కోట్ల బాబాలు ఉన్నట్టున్నారు,,,,రోజుకు ఒక బాబా అవతరిస్తున్నాడు,,,,జనాలు కూడా ఎంత తేలికగా మోసపోతున్నారు,,,,
మొన్న కల్కి ఆశ్రమం లో జరిగే ఘోరాలు చూపించారు,,,,drugs ఇస్తున్నారు ట అక్కడ వాళ్ళకు,,,మెంటల్ గ తయారు అయ్యి సేవకులు చనిపోతుంటే హార్ట్ ఎటాక్ తో చనిపోయారు అని మెడికల్ certificates ఇస్తున్నారు టా...
అంతకు ముందు నిత్యానంద,,,,వీటి అన్నిటికంటే ముందు పుట్టపర్తి బాబా అని(ఇదివరకు indiatoday లో రాసారు లెండి నేను చదివాను)
వింత ఏమిటంటే వీళ్ళకు ఉన్నా శిషులు అందరు చదువుకున్నవాళ్ళే,,,పెద్దపెద్ద వాళ్ళే,,,foreigners ఉన్నారు,,,వాళ్ళే మోసపోతున్నారు,,,ఇంక పల్లెల్లో ఉండే బాబాల దగ్గర ఎంతమంది మోసపోతున్నారో,,,,
వాళ్ళ దగ్గరకు వెళ్ళగానే కష్టాలు తీరగానే గుడ్డిగా నమ్మేస్తున్నారు,,,చివరికి మోసపోతున్నారు,,,
ఎప్పటికి మారతారో ఈ గుడ్డి జనం!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!

May 6, 2010

బ్లాగు రిపోర్ట్

చిన్నప్పుడు  క్లాస్సులో  మార్కులు ,చదువులు,ప్రొగ్రెస్స్ కార్డు ను చూసి  మా  అన్నయ్య  ఎలా  అనేవాడో  దాన్ని  బ్లాగు  కు  వర్తించి  సరదాగా  రాస్తున్న  టపా,,,,
ఫోన్ లో అన్నయ్య,నేను సంభాషణలు 
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
నేను: హలో అన్నయ్య,,,ఎలా ఉన్నావు ఏంటి సంగతులు
అన్నయ్య:  హలో,,నేను బానే ఉన్నాను,,నీకే ఏమయ్యిందో అర్ధం కాక ఫోన్ చేశాను
నేను: ఏమయింది అన్నయ్య బానే ఉన్ననే నేను,,,
అన్నయ్య:ఇప్పుడే నీ బ్లాగు చూసాను,,ఏంటది అస్సలు ఏంటి ఆ రాంకులు
         (అదేలెండి webtelugu ,indiblog రాంకులు ఉన్నాయి గా అవి )
నేను: ఏముంది అన్నయ్య బానే ఉంది గా ర్యాంకు,,,అంటే మొన్న ఆ మధ్య ఊరు వెళ్ళాను కదా సో రాయలేక పోయాను కదా అందుకని తక్కువ వచ్చినట్టుంది,,,ఈ సరి బాగా తెచ్చుకుంటాను అన్నయ్య,,,
(అదేదో ఎంసెట్ రాంక్ అన్నంత బిల్డ్ అప్)
అన్నయ్య: ఇది వరకు మొదటి ర్యాంకు లో ఉండేది ఇప్పుడ ౩ లోకి వచ్చేశావు,,,ఇట్లగు అయితే లాభం లేదు,,,నీ తోటి వాళ్ళు చూడు ఎలా మంచి రాంకులు తెచ్చుకుంటున్నారో,,,,నాన్నగారి తో మాట్లాడి నిన్ను ఏదైనా  మంచి tution లో చేర్పించమని చెప్తాను,,,

నేను: అన్నయ్య ఈ సారి కి వదిలేయి అన్నయ్య ,,,నాన్నగారికి చెప్పొద్దూ,,,,ఈ సారి కాపీ కొట్టి ఆయినా  మంచి రాంక్ తెచ్చుకుంటా అన్నయ్య,,,
అన్నయ్యా:సరే ఊరు వెళ్ళావు,, కనీసం రాసిన వాటికి అయినా ఫుల్ మార్కులు రావాలి గా,,,
నేను:అంటే అన్నయ్యా నేను కరెక్ట్ గ నే రాసాను కానీ వాళ్ళు  మంచి గ మార్కులు ఇవ్వలేదు అన్నయ్యా,,,
(నేను answers రాసాను గాని పంతులుకే ఏమి రాదు అన్నట్టు)
అన్నయ్య: సరే ఇదే నీకు చివరి అవకాసం,,,తెచ్చుకుంటే మంచి రాంక్ వచ్చేట్టు రాయి లేదా ఈ బ్లాగు లు అవి చాలు ఇంక మానేసి హాయ్ గ కూర్చో ఇంట్లో....
నేను: అన్నయ్యా అన్నయ్యా..ప్లీజ్ అన్నయ్యా దయచేసి బ్లాగు మాత్రం మానేయమని చెప్పొద్దూ అన్నయ్యా,,,నేను బాగా రాస్తాను అన్నయ్యా ,,ఈ బ్లాగు లోకానికే ఫస్ట్ వస్తాను అన్నయ్యా,,,నీ పేరు,నాన్న గారి పేరు నిలబెడతాను అన్నయ్యా,,నిజం అన్నయ్యా,,,
(చదువు మానేసి పెళ్లి చేస్తాం అన్నంత ఫీలింగ్ వచ్చింది కదా,,అస్సలే బ్లాగులు రాయటం అలవాటు అయిన ప్రాణం రాయకుండా ఉండగలదా )
అన్నయ్యా: సరే ఈ సారికి పోనిలే అనుకుంటాను ,,next time ఇలాగ జరగకూడదు,,,
నేను: సరే అన్నయ్యా thanx ,,thank you అన్నయ్యా,,,
(ఈ సారి ఆ రాంకుల display తీసేస్తే పోలా.. అన్నయ్యా తో గొడవే ఉండదు...progress రిపోర్ట్ లు దాచేసినట్టు )
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

May 4, 2010

వచ్చేసారు వచ్చేసారు

అమ్మో వచ్చేసారు ట ఉగ్రవాదులు,,,నిన్నటి నుండి తెగ చుపిచ్చేస్తున్నారు టీవీ లలో...వాళ్ళకేమి చక్కగా దర్జాగా వచ్చేసుంటారు,,,పుట్టింటికి వచ్చినట్టు మహా ఉత్సాహం గ వచ్చేసుంటారు,,,ఇక్కడేమో మనం అమీర్పేట్ నుండి కోటి వెళ్ళాలి అంటేనే మధ్యలో దాదాపు పది చెకింగులు జరిగితే గాని వెళ్ళలేము,,,ఇన్ని జాగ్రతలు తీసుకుంటున్న వాళ్ళను కనిపెట్టలేక పోతున్నాము,,కారు లో బాంబు ఉంది అని newyork వాళ్ళు భలే నిముషాల్లో కనిపెట్టేసారు...మనకు ఎప్పుడొస్తుందో అంత భద్రతా సిబ్బంది,,,ఆ పరికరాలు,,అసలే వచ్చారు ఉగ్రవాదులు అని మనకు చచ్చే భయం వేస్తుంది,,,ఇంట్లో ఉన్నా కానీ బయటకు వెళ్ళిన వాళ్ళు ఎలా వస్తారో,,అని తిరిగి ఇంటికి వచ్చేదాకా మన అరికాళ్ళల్లో అదురు పుట్టాల్సిందే,,,కాసేపు టైం పాస్ కోసం టీవీ చూద్దాం అంటే దానిలో scorllings ,,,20 మంది వచ్చారు ౩౦ మంది వచ్చారు,,,ఎక్కడైనా  పెట్టచ్చు బాంబు...షాపింగ్ మాల్ల్స్,గుడులు,,,కార్లలో,,schootar లలో,,,అని ,,,,మీరు కనక సెంటర్ ల లో ఇళ్ళ వాళ్ళు ఐతే మీ ఇంట్లో కూడా పెట్టొచ్చు అని స్క్రోల్ ఇచ్చేట్టున్నారు ఈ టీవీ వాళ్ళు,,,
వచ్చారు మన శత్రువులు,,,సరే ఎవరైనా  అనుమానం గ ఉంటే ఈ నెంబర్ కు ఫోన్ చెయ్యండి,,,ఏదైనా  కొత్త వస్తువు కనిపిస్తే ఫోన్ చెయ్యండి ఇలాంటి ధైర్యవచనాలు చెప్పకుండా...అదురుపుట్టిస్తున్నారు,,,రోజు గడిస్తే అమ్మయ్య ఏమి కాలేదు,,,అని ఉపిరి పీల్చుకోవలసిన పరిస్థితి వచ్చింది,,,

May 3, 2010

ఆటల ఆంతర్యం

  ఎందుకో నాకు ఇవ్వాళ నా చిన్నప్పుడు వేసవి సెలవుల్లో ఆడుకునే ఆటలు గుర్తువచ్చాయి,,ఎక్కువగా మేము ఈ వైకున్టపాలి,,అదే పరమపద సోపాన పటము,,,గవ్వల తో పందాలు వేసి ఆడేవాళ్ళము,,దీనిలో ఆంతర్యం ఏమిటో తెలియదు గాని,,అప్పుడు అంత ఊహ కూడా లేదులెండి,,,సరే కదా అని ఊరికే సెర్చ్ చేశా నెట్ లో అస్సలు ఈ గేమ్ అనేది ఆడేవాళ్ళా లేదా   ,,, అని,,కొద్దిగా ఇన్ఫర్మేషన్ దొరికింది,,,
ఈ పటము లో పాములు,ఏనుగులు కొన్ని కాళీ గదులు ఉంటాయి,,,ఈ పాములు పాతాళం అని,,ఏనుగులు అష్టదిగ్గజాలు అని ఈ ఏనుగులు భూమిని మోస్తుంటాయి అని హిందువులు నమ్మకముట...
మనం పందెం వేసి ఒక్కో గదికి వెళ్తూ ఉంటే..మధ్య లో పాము గది వస్తే కిందకు దిగటం,,,నిచ్చెన వస్తే పైకి వెళ్ళటం,,,అలా సాగుతుంది ఆట...
పునరపి జననం,,పునరపి  మరణం అన్నది ఇందులో ఉన్న భావన,,మానవుల దృష్టి భక్తీ,ఏకాగ్రత,దైవచింతన వైపు తీసుకు వెళ్ళటమే ఈ ఆట  ఉద్దేశం,,,
ఉద్దేశాలు ఎమైనా మంచి గ కాలక్షేపం అయ్యే ఆట...ఇప్పుడు ఈ ఆట కు కాస్త కొత్త హంగులు చేర్చి,, Snakes and ladders గా మారి మళ్ళి ఈ తరం పిల్లలకు  వచ్చింది...