Jul 28, 2010

నా చేతి పాకం

మొన్న మా కజిన్ భోజనం  చేస్తూ నీ చేతి  వంట  భలే బాగుంది,పెళ్లి కి ముందే వంట బాగాచేసేదానివా అని అడిగింది,మా వారు కూడా మా ఆవిడ వంట బాగా చేస్తుంది అని ఈ మధ్య బాగా బిరుదులు ఇచ్చేస్తున్నారు,ఇంక అలా మాటల్లో టాపిక్ వచ్చి పెళ్లి అయినాక నువ్వు మొట్టమొదట గా చేసి పెట్టిన వంట ఏంటి అని అడిగింది.అడిగిన క్షణమే ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్  కు వెళ్ళిపోయా
ఒక్క క్షణం నా ఆలోచనలను వెనక్కు మళ్ళించా,
పెళ్లి అయినాక ఇల్లు వెత్తుక్కుని మేము చేరేటప్పటికి ఒక మూడు నెలలు గడిచింది.అప్పటిదాకా బంధువుల ఇంటిలో ఉండేటప్పటికి వంట చేయాల్సిన అవసరం రాలేదు.ఏముంది వంట అంటే ఇంతేనా అని  అనుకునేదాన్ని,ఈ మాత్రం చేయలేమా  అనిపించేది.అస్సలు బాధలు మనం వంట చేసే టప్పుడే ఉంటుంది అని తర్వాత తెలిసింది.
ఇంట్లో చేరిన ఒక రెండురోజులు బయట తిన్నాం భోజనం.అన్నీ సరుకులు తేవటానికి కాస్త టైం పట్టింది. పైగా కొంచెం కొత్త కదా ఎందుకులే ఇబ్బంది పెట్టటం అని మా వారు అలా ప్లాన్ చేసారు.ఇవ్వాళ నేను ఇంట్లోనే చేస్తాను మీకు ఏమి ఇష్టం చెప్పండి వండుతాను అన్నాను ఆయన తో ప్రేమగా,"నాకు అన్నీ ఇష్టమే,అన్నీ కూరలు తింటాను,నీకు ఏది ఇష్టం బాగా అని నన్నే అడిగారు" అబ్బో నాకే ఫస్ట్ preference ఇచ్చారు అని ఎంతో మురిసిపోయా.నాకు బాగా ఇష్టం అయింది అంటే వండటం కూడా  కాస్తో కూస్తో వచ్చి ఉంటుంది లే అని ఆయన అభిప్రాయం అని నాకు తర్వాత అర్ధం అయింది.నాకు బెండకాయ కూర ఇష్టం అది చేస్తాను అని చెప్పా.సరే బెండకాయ Fry చెయ్యి అన్నారు,ఎంతసేపులే అని వంట ఇంట్లోకి ఉత్సాహం గా ఉల్లాసం గా బయలుదేరా,
అలసట తెలియకుండా ఉంటుంది వంట చేసేటప్పుడు అని మా వారు ఎంతో ప్రేమగా radio కూడా పెట్టారు,
సరే ముందు శుచి గా శుభ్రం గా చేయాలి అని బెండకాయలు అన్నిటిని నీళ్ళల్లో వేసాను,మా వారు అడిగారు అప్పటికి అదేంటి నీళ్ళల్లో ఎందుకు, తుడువులే మురికి ఏమి ఉండదు కదా అని.నాకేం తెలుసు బాగా శుభ్రం అవుతుయిలెండి అని గిన్నెడు నీళ్ళల్లో  వేసా,సరే ఒక్కక్కోటి తీసి కట్  చేయటం మొదలు పెట్టా,చాకు కు అంటుకుని బంకలు సాగుతోంది జిగురు,సరే పోతుందిలే అనుకున్నాను.Fry చేద్దామనుకుని కూడా ఎందుకు హెల్త్ కు మంచిది కాదు చక్కగా కుర లా చేద్దాం అని తిరగమాత వేసి ముక్కలుపెట్టి ముత  పెట్టాను,కొంచెం సేపు అయ్యాక చుస్తే మొత్తం జిగురు జిగురు గా ఉంది,
కొంచెం టెన్షన్ వేసింది అరె ఇదేంటి ఇలాగ ఉంది అని,సరే కొంచెం పాలో,పెరుగో వేస్తారు కదా అని సందిగ్దం లో పడి పాలు పోసి కలియపెట్టి ముతా పెట్టా.
మా వారు ఫోన్ చేసి అందరికి చెప్పారు మా ఆవిడ వంట చేస్తోంది ఇవ్వాళ అని,ఎంతో eager గా వెయిట్ చేస్తున్నారు నా వంట కోసం.
చివరికి అయింది అనిపించాను కూర,పప్పు చేశాను,,,
భోజనాల సమయం లో కంచం లో వడ్డించాను పప్పు,కూర,అన్నం.అన్నం తిందురు రండి అని పిలిచాను కొంచెం భయం భయం గా.అస్సలే మా వారికి  వంట వచ్చు.వంట వచ్చిన మగవాళ్ళతో మహా ఇబ్బందే.వంకలు మహా బాగా పెడతారు.మా వారు మంచి ఆకలి తో వచ్చారు.కూర కలుపుదాం అని కూర లో చేయి పెట్టారు అంతే టీవీ లో అప్పుడే ad  వస్తోంది  జోరసే లాగో హైస జోరసే లాగో హైస,.ఏ బంధన్ టుటెగా నహి అని ఫెవికాల్ ad వస్తోంది,దాని కి తగ్గట్టే ఆయన చేతి నుండి ఆ బెండ కాయ జిగురు వదలటం లేదు.
ఏమి అనలేక పాపం కళ్ళుమూసుకుని తినేసారు,తర్వాత చెప్పారు ఎలా చేయాలో కూర,
దాదాపు వంటలు అన్నీ ఆయనే నేర్పారు,మనం పెరిగినప్పటి నుండి చదువులతో సమయం గడిచి పోతుంది. హాస్టల్ లో ఉండటం,సో వంట చేసే తీరిక ఏది,పైగా ఇంట్లో మడి వంటలు,మహా నైవేద్యాలు,ఇంక మనకు చేసే ఛాన్స్ ఏది,
ఎట్లాగో ఇప్పటికి కాస్త ది బెస్ట్ అనిపించుకో డానికి మూడేళ్ళు పట్టిందనుకోండి,
ఇప్పటికి బెండకాయ కుర అంటే మాకు ఆ కూర గుర్తువచ్చి నవ్వుకుంటాం, అన్నం తినేటప్పుడు  టీవీ అయితే అస్సలు పెట్టవద్దు అంటాను మళ్లీ ఆ ad   వస్తుందేమో అని భయం వేసి.

4 comments:

  1. చాలా బాగా రాసావు అక్క.. నేను అయితే నవ్వు ఆపుకోలేకపోయాను.. సూపర్ !!

    ReplyDelete
  2. చాలా బాగుంది.
    "వంట వచ్చిన మగవాళ్ళతో మహా ఇబ్బందే.వంకలు మహా బాగా పెడతారు." ... అంటె కొంచెం feedback ఇస్తారు అంతేనండి. వంట వచ్చిన మగవాళ్ళకి expectations ఎక్కువగా ఉంటాయి..మరి :)
    ఈ రోజుల్లో అమ్మాయలు దదాపుగా hostel లొ ఉండి చదువుకుంటారు, అబ్బాయలేమొ రూం తీసుకొని వండుకొని చేయి కాల్చుకుంటారు.
    పెళ్ళి అయిన తరువాత మొదట్లొ అమ్మాయలు చేసే "భంగాల భౌ భౌ , అరటి పండు లంబా లంబా " చూసి ఖిన్నులు అవుతారు తర్వాత తిని ఙ్నానులు అవుతారు. :); ఇక చెసేది లేక వంట Master అవుతారు.
    ఇలాంటివి కూడా మంచి ఙ్నాపకాలుగా మిగిలిపోతాయి (Fevicol వేసి బుర్రలో అతికించినట్ట్లె :) ). Enjoyed this post.

    సరదాగ ఆన్నాను serious గా తీసుకోకండి...

    ReplyDelete