Jul 1, 2010

మా బాదం చెట్టు-కధా జగత్ పోటి

 

 కధా జగత్తు  లో కధలు చదువుదాము సరదాగా అని ఓపెన్ చేశాను ఇవ్వాలే..చాలా కధలు ఉన్నాయి ఏది చదువుదాము అని జస్ట్ ఒక సారి అలా చూసాను అన్నిటిని ...పేరు బట్టి కొంచం ఇంట్రెస్ట్ వస్తుంది నాకు,సో అలా చూస్తుంటే సడన్ గా మా బాదాం చెట్టు అని మల్లాది వెంకట కృష్ణ మూర్తి గారి కధ కనిపించింది,అరె బాదాం చెట్టు ఇదేదో చెట్టు గురించి రాసిన కధేమో అనుకుని చూద్దాం అని కధ చదవటం స్టార్ట్ చేశాను.
        అస్సలు ముందు ఇంట్రెస్ట్ ఎందుకువచ్చింది అంటే మా ఇంట్లో కూడా బాదాం చెట్టు ఉంది,మా తాతగారు పుట్టిన కాలం నాటిది,చాలా పెద్ద చెట్టు.మల్లాది గారు రాసిన వైనం అంతా చదువుతుంటే ఇదేదో నా భావాలే.నాకు ఇలాగె అనిపిస్తోంది మా చెట్టు ను చూసినప్పుడల్లా,అని మా చెట్టు గురించి కూడా చెబుతాము అనిపించింది.
         మేము కూడా చిన్నప్పుడు బాదం కాయలు కోసి బాదం పప్పులు బాగా ఇష్టం గా తినేవాళ్ళం,ఇప్పుడు ఉన్న పిల్లలు ఛి ఆ కాయ లోని పప్పులా తినేది అని అంటున్నారు,వాళ్ళకేమి తెలుస్తుంది బాదం కాయ ను కొట్టి దానిలో ని పప్పు ని తింటే ఉండే రుచి..ఎప్పుడైనా చెట్టు నుండి వచ్చిన పప్పు రుచి వేరు మనకు ప్యాకెట్లలో దొరికే బాదం పప్పు రుచి వేరు..
       చెట్టు మీద ఎప్పుడూ కాకులు,రామచిలుకలు,ఉడుతలు ఉంటూ ఉండేవి,ఆ కాకి ను చూపిస్తూ మాకు అన్నం పెట్టేది ట మా అమ్మ,,ఇప్పుడు నేను మా ఊరు వెళ్ళినప్పుడు మా బాబు కు ఆ చెట్టు దాని మీద ఉన్న కాకులనే  చూపిస్తూ అన్నం తినిపిస్తాను.పక్షులకి చెట్లే కదండీ నివాసాలు పాపం ఆ చెట్లను మనం నరికేస్తే వాటికి నివాసం ఏముంటుంది,,అందుకే పక్షి జాతులు అంతరించి పోతున్నాయి. మనంతట మనమే వాటిని నాశనం చేస్తున్నాం..
 "వెధవ చెట్టు. కూరా, పళ్ళూ ఇవ్వదు. వెధవ చాకిరీ. రాలే బాదం ఆకులని ఏరలేక చస్తున్నాను." అలాగేలే. బొగ్గుల రాముడితో చెప్పి కొట్టిస్తాను" అనేవారు.
        same ఇలాగే అనేవాళ్ళు మా అమ్మ వాళ్ళు,కొట్టిచ్చేద్దాము ఎందుకు చిమ్మించటానికి నెలకు 25 రూపాయలు  అనవసరం గా ఖర్చు అని.మనం పెట్టె ఎన్నో అనవసర ఖర్చులతో పోలిస్తే ఒక 25 రూపాయలు కష్టం కాదు కదా,దానికోసం తాతల నాటి చెట్టు కొట్టిస్తామా.
"ఆయన విస్తళ్ళు కుట్టడం నాకు ఆనందంగా ఉండేది. చీపురుపుల్లని తీసుకుని దాన్ని మధ్యకి చీల్చేవారు. రెండు బాదం ఆకులని పక్కపక్కనే ఉంచి పూచిక పుల్లని వాటి అంచుల్లోకి చొప్పించి కుట్టి విరిచేవాడు. అలా రెండు పూచిక పుల్లలు పూర్తయ్యేసరికి ఓ గుండ్రటి బాదం విస్తరి తయారయ్యేది."
    మా ఇంట్లో కూడా  భోజనం,టిఫిన్స్  కు కూడా ఈ ఆకులనే విస్తరి లాగా కుట్టి వాడేవాళ్ళం ,పచ్చని ఆకులో తింటే ఆరోగ్యానికి మంచిది అని.
     మా అమ్మ వాళ్ళు కూడా ఇప్పుడు ఇల్లు పాతకాలం ది కదా మొత్తం పడేసి (చెట్టు తో) సహా ఇల్లు కడదాము అని అనుకుంటున్నారు,నాకు కూడా మల్లాది గారికి వచ్చినట్టే దిగులు వచ్చేసింది.ఇంట్లో ఉన్న ఇలాంటి పెద్ద పెద్ద చెట్లే అడ్డం వస్తాయి అందరికి.
     మనుషుల తో కంటే ఇలాంటి చెట్లు,పక్షులు,జంతువుల తో మనకు తెలియకుండా అనుబంధం ఏర్పడుతుంది.
మల్లాది గారు చాలా సులభ శైలిలో రాసిన విధానం బాగుంది.ఇంట్లోని చెట్టు మీద ఆయనకు ఉన్న ప్రేమను బాగా రాసారు.పెద్ద పెద్ద చెట్లు(మామిడి,బాదం ఇలాంటివి) ఉంటే చక్కగా నీడను ఇస్తాయి,,చల్లని గాలి వస్తాయి,,మనం కొత్తగా నాటక పోయిన ఉన్న చెట్లని నాశనం చేయకపోతే అదే చాలు అని మల్లాది గారు చెప్పకనేచెప్పారు.. .
 మల్లాది గారు రాసిన వాక్యాలు చదువుతుంటే నా చిన్నతనం నా కళ్ళముందు కడులాడుతూ ఉంది,,మేము కూడా ఇలాగె చేసేవాళ్ళం కదా అని అనిపించి కాసేపు నా చిన్నతనం లోకి నా మనస్సు పరుగులు తీసింది..

మల్లాది గారు రాసిన కధ లింక్ ఇక్కడ ఇస్తున్నాను మీరు కూడా చదవండి., 

1 comment:

  1. నిజమేనండి. చిన్నప్పట్లో పెంచుకున్న ఆ అనుభందాలకు సాటే లేదు. చాలా బాగా చెప్పేరండీ. బాదం కాయల తాజా పప్పు ఎంత బాగుంటుందో మళ్ళీ ఒక సారి గుర్తు చేసేరు. :-)

    ReplyDelete