Apr 26, 2010

Birthday Candles

నిన్న  మా  బాబు  birthday   జరిగింది ,,చిన్న  పార్టీ  చేసుకున్నాము .అయితే కేకు మీద కొవ్వొత్తులు పెడతాము కదా వాటిని ఆపేస్తాము కదా,ఎవరం ఐన  దీపాలు వెలిగించాలి అనుకుంటాము కానీ ఇలాగ అపటాలు ఏంటి అని మన ప్రియ నేస్తం,,మన అందరి దొడ్డమ్మ ని అడిగాను...అదేనండి మన గూగుల్ అమ్మను...ఇదిగో ఈ కొత్త విషయాలు చెప్పింది..
మొదటి గా ఈ కేకు మీద candles గ్రీకు వాళ్ళు స్టార్ట్ చేసారు టా..అలా రౌండ్ గ candles పెడ్తే ఆ వెలుగు  చంద్రుడిని తలపిస్తుంది అని...
ఇదే నమ్మకాన్ని జర్మని వాళ్ళు కూడా పాటిస్తారు టా..అలా విశ్వం అంతా మొదలు పెట్టారు..
మన దేవతలు అందరు ఆకాశం లో ఉంటారు అని విస్వసిస్తము కదా..ఈ candle ను ఊదితె అవి silent గ దేవుడి కు మన కోరికను తీసుకువెళ్తాయి  ట..ఒకేసారి అన్ని candles ఉదగలిగే వారి కోరిక తొందరగా నెరవేరుతుంది అని నమ్మకం టా..
పోనిలెండి ఏదో పాతకాలం లాగ candles ఊదించి మన సంస్కృతీ ప్రకారం హారతి వెలిగించి ఇచ్చాము...
మన ప్రకారం దీపం ఆపిన పాపం,దీపం వెలిగించిన పుణ్యం చెల్లు కు చెల్లు అని సరిబెట్టుకున్నాను...

5 comments:

  1. Satamanam bhavati Satayuh purushas'satendriya Ayushyevendriye' pratitishthati.

    ReplyDelete
  2. Thanx అండి మధురవాని గారు,వ్యాస విరచితం గారు

    ReplyDelete
  3. మీ బాబు కు జన్మదిన శుభాకాంక్షలండి .

    ReplyDelete