Apr 18, 2010

అమావాస్య కధ

అమావాస్య కు ఆ పేరు ఎలా వచ్చింది అని నిన్ననే నేను ఒక పురాణ సంభందమైన  పుస్తకం లో చదివాను,,,
  "అమావసువు " అనే ఒక పితృదేవత ఉండేవాడు.అతనికి ఇంద్రియ నిగ్రహం చాలా ఎక్కువ."అచ్చోద" అనే ఆవిడ ఈ అమావసువు ను ప్రేమించి,ఇతనిని లోబరుచుకోవాలి అని ప్రయత్నిస్తే,అది వ్యర్ధం అయ్యింది.అమావసువు ఆమెను నిరాకరించి పంపించేసాడు.
ఈ సంగతి ఇతర పితృదేవతలకు తెలిసి,అతని నిగ్రహ శక్తి కు మెచ్చి ,అతడు అచ్చోద ను నిరాకరించిన రోజు తమకు సుదినము అని నిశ్చయించుకుని అమావసువు పేరు శాస్వతం గా ఉండాలి అని ఆ రోజు కు "అమావాస్య" అని నామకరణం చేసారు...
అందుకని అమావాస్య పితృదేవతలకు ఇష్టమైన రోజు అయ్యింది..అది అమావాస్య కధ..

4 comments:

  1. మరి చంద్రుడెందుకు మసకబారుతాడూ????????????

    ReplyDelete
  2. చంద్రునికి ఈ కథకు సంబంధం ఎముంది? ఈ ఇతివ్రుత్తం జరిగినప్పుదు చంద్రుడు మసకబారి ఉండిఉంటాడు.
    ఆదే పూర్ణమి రొజు జరిగి ఉంటే పూర్ణమి ని ఆమావాస్యని మరియు ఇప్పుడు ఆమావాస్య అని పిలవబడుతున్న రొజుని శూన్యమి అని పిలిచెవారమెమో ??

    ReplyDelete
  3. chandruni story ee story different. adi athani family story. chandruni andanni choosi oka raju thana 8 mandi kuthurlu istabaddarani thelisi andarini icchi pelli chesthadu. aithe aa chandrudu andarini equal ga chudadu so dhantho mama saapam icchi kusti rogila maara mante athanu velli thana maama ki sorry cheppi morapettukunte athanu anugrahinchatam tho chandrudu 15 day's purnima naatiki andamga thayaravuthaadu. alaage amavasya naatiki kusti kaaranama sunyam avuthadu. idi naaku thelisindi...

    ReplyDelete
  4. chandruni story ee story different. adi athani family story. chandruni andanni choosi oka raju thana 8 mandi kuthurlu istabaddarani thelisi andarini icchi pelli chesthadu. aithe aa chandrudu andarini equal ga chudadu so dhantho mama saapam icchi kusti rogila maara mante athanu velli thana maama ki sorry cheppi morapettukunte athanu anugrahinchatam tho chandrudu 15 day's purnima naatiki andamga thayaravuthaadu. alaage amavasya naatiki kusti kaaranama sunyam avuthadu. idi naaku thelisindi...

    ReplyDelete