Apr 29, 2010

కలి కాలం

కాస్త తీరిక దొరికింది కదా అని నెట్ లో అన్ని న్యూస్ పేపర్లు తిరగేద్దాం అని చూస్తున్నాను..
ఈ website లో షాకింగ్ న్యూస్ చదివి కాసేపటి వరకు తేరుకోలేదు,,,మీరూ చుడండి ఈ వింతా..కలికాలమో పోయే కాలమో!!!!

Apr 26, 2010

Birthday Candles

నిన్న  మా  బాబు  birthday   జరిగింది ,,చిన్న  పార్టీ  చేసుకున్నాము .అయితే కేకు మీద కొవ్వొత్తులు పెడతాము కదా వాటిని ఆపేస్తాము కదా,ఎవరం ఐన  దీపాలు వెలిగించాలి అనుకుంటాము కానీ ఇలాగ అపటాలు ఏంటి అని మన ప్రియ నేస్తం,,మన అందరి దొడ్డమ్మ ని అడిగాను...అదేనండి మన గూగుల్ అమ్మను...ఇదిగో ఈ కొత్త విషయాలు చెప్పింది..
మొదటి గా ఈ కేకు మీద candles గ్రీకు వాళ్ళు స్టార్ట్ చేసారు టా..అలా రౌండ్ గ candles పెడ్తే ఆ వెలుగు  చంద్రుడిని తలపిస్తుంది అని...
ఇదే నమ్మకాన్ని జర్మని వాళ్ళు కూడా పాటిస్తారు టా..అలా విశ్వం అంతా మొదలు పెట్టారు..
మన దేవతలు అందరు ఆకాశం లో ఉంటారు అని విస్వసిస్తము కదా..ఈ candle ను ఊదితె అవి silent గ దేవుడి కు మన కోరికను తీసుకువెళ్తాయి  ట..ఒకేసారి అన్ని candles ఉదగలిగే వారి కోరిక తొందరగా నెరవేరుతుంది అని నమ్మకం టా..
పోనిలెండి ఏదో పాతకాలం లాగ candles ఊదించి మన సంస్కృతీ ప్రకారం హారతి వెలిగించి ఇచ్చాము...
మన ప్రకారం దీపం ఆపిన పాపం,దీపం వెలిగించిన పుణ్యం చెల్లు కు చెల్లు అని సరిబెట్టుకున్నాను...

Apr 23, 2010

Cruality Shows

ఇవ్వాళ చాలా చానెళ్ళలో రియాలిటీ షో ల గురించి ఎక్కువగా వేస్తున్నాడు..ఎవరో pitishon వేసారు ట...పోనిలే ఇంత లేట్ గ అయిన కళ్ళు తెరిచారు...ముందు జరిగిన షో లలో కొంచం పర్వాలేదు  కానీ ఈ షో లో మరీ అతి గ ఉంది చిన్నపిల్లల డాన్సులు...దానికి తోడూ మెంటల్ ఎక్కించే మెంటర్స్ మాటలు...బుల్లి మెంటర్స్ ల లొల్లి,,..అయినా మన జనాలకు ఇలాంటివాటి పైనే మక్కువ ఎక్కువ .అందుకే ఆ షో ఇంతకాలం నిరాటంకంగా సాగింది...ఈ షో లో ని చిన్నారు ల చేత శాంపిల్ గ ముందు గానే ఒక గ్రాండ్ finale షో లో వేయించారు...అప్పుడే సగం అర్ధం అయింది జనాలకు...అప్పుడే కాస్త కటువుగా ఖండించి ఉంటే పరిస్థితి HRC సీరియస్ గా తీసుకునే దాక వచ్చేది కాదు..అయినా మన పిచ్చి కానీ ఇది కూడా TRP పెంచుకునే మంత్రమో తంత్రమో.....ఈ విధం గ negative stratagy వస్తే అన్ని channaels లో కొత్తగా చూడని వాళ్ళు కూడా చూస్తారు గా...ఏ మనసులో ఏ భావముందో...........ఆ పెరుమాళ్ళకె ఎరుక..

Apr 21, 2010

Police Cars

German police car ..Lamborgini gallardo max speed 320 km/hr
Japan police car... Lancer EVo  IX ...
France Police car Peageut  sports gt,,

Spain police car ..audi TT ..

England Police car Porsche

now!!!!!!!!
India Police Car...thats not car..its a jeep....ultimate vachicle...
సాంకేతికం గ మన దేశం అభివృద్ధి చెందుతున్నా.. ఇంకా ఈ పాత కాలం నాటి జీపులనే మన పోలీసులు వాడుతున్నారు.. అందుకే మనదేశం లో నేరాలు ఘోరాలు తగ్గట్లేదు...

Apr 18, 2010

అమావాస్య కధ

అమావాస్య కు ఆ పేరు ఎలా వచ్చింది అని నిన్ననే నేను ఒక పురాణ సంభందమైన  పుస్తకం లో చదివాను,,,
  "అమావసువు " అనే ఒక పితృదేవత ఉండేవాడు.అతనికి ఇంద్రియ నిగ్రహం చాలా ఎక్కువ."అచ్చోద" అనే ఆవిడ ఈ అమావసువు ను ప్రేమించి,ఇతనిని లోబరుచుకోవాలి అని ప్రయత్నిస్తే,అది వ్యర్ధం అయ్యింది.అమావసువు ఆమెను నిరాకరించి పంపించేసాడు.
ఈ సంగతి ఇతర పితృదేవతలకు తెలిసి,అతని నిగ్రహ శక్తి కు మెచ్చి ,అతడు అచ్చోద ను నిరాకరించిన రోజు తమకు సుదినము అని నిశ్చయించుకుని అమావసువు పేరు శాస్వతం గా ఉండాలి అని ఆ రోజు కు "అమావాస్య" అని నామకరణం చేసారు...
అందుకని అమావాస్య పితృదేవతలకు ఇష్టమైన రోజు అయ్యింది..అది అమావాస్య కధ..

Apr 17, 2010

నా కపిత్వం

  ఏమి ఉబుసుపోక ఇవ్వాళ నేను నా కాలేజీ టైం నాటి డైరీ ఊరికే తిరగేసాను,, అందులో అప్పట్లో నేను చదివిన కవితలకు కొద్దిగా నా కపిత్వం జోడించి అంటే కొన్ని లైన్స్ మార్చి,కొన్ని లైన్స్ తీసేసి remix చేసి మళ్ళి రాసేదాన్ని,,,అదేనండి కాళిదాసు కవిత్వం కొంత నా పైత్యం కొంత అంటారే ఆ విధం గ కవిత్వం ను కాస్త కపిత్వం చేశా చుడండి మీరూ కూడా..

                       ఒకరికొకరం ఎవరో కుడా తెలియని స్థితి నుంచి
                       ఒకరికోసం ఒకరం అన్న పరిస్థితి కి తెచ్చే
                       అద్భుతమైన బంధం...స్నేహం
                       కళ్యానిరాగం అంత మధురమైనది 
                       రక్తసంబందానికి మించిన ఆత్మసంబంధం ...
                        .................మన ఈ స్నేహం... 

                       ప్రేమ గుడ్డిది అనుకుంటున్నారా ...కాదు
                       ప్రేమకు చూపు ఉంటుంది,
                       అ చూపే నాకు నిన్ను చూపింది
                       నా హృదయాన్ని నీ వైపు నడిపింది
                       నిన్ను నన్ను దగ్గర చేసింది
                       నా "మనసంతా నువ్వే" అనేలా చేసి
                      "నువ్వు లేక నేను లేను" అయ్యేటట్లు చేసి
                       తనను తానూ నిరూపించుకుంది...

                      నిన్నే నిత్యం తలుస్తూ 
                      నన్నే నిలువునా మరుస్తూ 
                      నా ఆణువణువూ లో నిండిన నీ తలపులను చూసి
                      నాలో నేనే మురుస్తూ 
                       నీకై నిలువెల్లా తపిస్తూ 
                       నీలో విలీనమయ్యే రోజు కోసం వేచి చూస్తూ,,, 
                       నిన్ను నా ప్రాణం కంటే మిన్న గా ప్రేమించే నీ......

                       నీ రాక కోసం 
                       వేచి చూస్తున్న నయనానికి ఎలా చెప్పాను... నిద్రపోమని 
                       నీ పిలుపు కోసం
                       పలవరిస్తున్న హృదయానికి ఎలా చెప్పాను... మానుకోమని 
                       ఎలా చెప్పినా,ఎంత చెప్పినా,,,
                       నా మాట వినదే....
                       తన మారం ఆపదే.....

                      గుండెలో ఆశను తెలుపలేదు నా మౌనం 
                      చూపులోని ఆశను చదవలేదు నీ స్నేహం
                      తలపులలో నీవు కొలువున్నా
                      కలుసుకోలేను ఎదురున్నా...
                      తెలిసి ఈ తప్పులు చేస్తున్నా,, 
                      అడగవే ఒక్కసారి అయినా  నేస్తమా 
                      నీ పరిచయం కలకరిగించేటి కన్నీటి వానేనా????????

summer లో సరదాగా

పిల్లలను ఎండ బారినుండి రక్షించి చల్ల గ ఉంచే మార్గం,,, బాగుంది కదూ సరదాగా..

Apr 10, 2010

అంకెల గారడీ


మన అంకెలకు పేరు ఎలా వచ్చిందో భలే గమ్మత్తు గ ఉంది కదా!!!!!

Apr 5, 2010

కవిత


నిగ్గ దీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని
అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్చవాన్ని

మారదు లోకం మారదు కాలం
దేవుడు దిగి రాని యెవ్వరు యేమై పోని

మారదు లోకం మారదు కాలం
గాలి వాటు గమనానికి కాలి బాట దేనికి

గొర్రెదాటు మందకి మీ జ్ణానబోధ దేనికి
యే చరిత్ర నేర్చుకుంది పచ్చని పాఠం

యే క్షణాన మార్చుకుంది జిత్తుల మార్గం
రామబాణమార్పిందా రావణ కాష్ఠం
క్రిష్ణ గీత ఆర్పిందా నిత్య కురుక్షేత్రం

పాత రాతి గుహలు పాల రాతి గౄహాలయినా
అడవి నీతి మారిందా ఎన్ని యుగాలయినా

వేట అదే వేటు అదే నాటి కధే అంతా
నట్టడవులు నడివీధికి నడిచొస్తే వింతా

బలవంతులె బ్రతకాలని సూక్తి మరవకుండా
శతాబ్దాలు చదవలేదా ఈ అరణ్యకాండ


దీన్ని రాసింది సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ట..చాలా బాగా రాసారు అనిపించింది..ప్రస్తుత భాగ్యనగర  పరిస్థితే గుర్తుకువచ్చింది ఈ కవిత చదువుతున్నంత సేపు,, 
మారరు ఈ జనం,మారదు ఈ రాజకీయం...