మేము ఈ హైదరాబాద్ కు వచ్చి దాదాపు 2 సంవత్సరాలు అయ్యింది.కిందటి సంవత్సరం మా ఊల్లొ ఉన్నాను ఈ సారి ఇక్కడ ఉన్నాను ఇక్కడ మా ఇంట్లో floor majaic floor సో ముగ్గు వేసిన అదేలెండి chalkpeice తో వేసినా కనపడదు.. లక్క(paint ) పెడదాం అని కూడా ట్రై చేశాను అస్సలు కనపడటం లేదు.. అదే మా ఉరిలో ఐతే రోజుకు ఒక varitey ముగ్గు పోటీల మీద వేసేవాళ్ళం వేసిన ముగ్గు వెయ్యకుండా రంగులు దిద్ది మరీ.. పొద్దున్నే కాలేజి కు వెళ్ళాలి అని రాత్రిపూటే వేసి పడుకునేవాళ్ళం.. సరే ఇంకా ఆ ఉత్సాహం పోక ఇక్కడ కుడా అలాగా చేద్దాం అనుకుంటే రంగు పడలేదు అదేలెండి ముగ్గు కనపడలేదు.. సరే కదా అని ఈ మధ్య ఒక sticker లాంటి పేపర్స్ వస్తున్నాయి కదా ముగ్గులు వేసినవి ఇంక అవి అతికించి రోజు వాటి మధ్యలో పసుపు,కుంకుమ వేస్తున్నాను..ఏదో ఆత్మసంతృప్తి.. ఇంకా గొబ్బెమ్మల సంగతి చెప్పేదేముంటుంది అస్సలు గొబ్బెమ్మలు పెడదామా మనం కూడా అంటేనే మా వారు వింతగా ఒక లుక్ ఇచ్చారు..ఎవరీ పల్లెటూరు పిల్ల అన్నట్టు...మా ఉరు టౌన్ నే అయిన మా ఇంటి ఎదురుగ గుడి ఉండేది అందుకని మాకు గొబ్బెమ్మ పెట్టటం,గొబ్బి తట్టటం అలాంటివి అన్ని చేసేవాళ్ళం... మరి ఇంకా భోగిపెరంటం..దీనికి రేగుపళ్ళు ఉంటాయో లేదా సీమరేగి పళ్ళు పోయలో..లేదా మరీ విడ్డురం గ అమెరికా వాళ్ళ లాగా cheryy పళ్ళు పోయాలో మరి..ఎట్లా అయినా మన ఊరిలొ ఉండే పండుగ వాతావరణం వేరు ఈ హడావుడి సిటిలలో ఉండే పండగ వాతావరణం వేరు
చూద్దాం ఈ సంక్రాంతి ఎలా జరుగుతుందో..
హైద్రాబాద్ లో సంక్రాంతి గురించి ఎందుకండి దిగులు.హాయిగా జరుపుకో వచ్చు. మేము ముగ్గులేసుకుంటాము. రంగురంగుల చాక్పీసులు దొరుకుతాయి. మొజైక్ మీద కూడా బాగుంటాయి. గొబ్బెమ్మలూ పెట్టుకుంటాము. నేనైతే ప్రతి సంక్రాంతికి బొమ్మలు కూడా పెడుతాను. చక్కగా అందరితో పేరంటం కూడా చేసుకుంటాను. పతంగులు ఎగిరేసుకోవచ్చు. ప్రతిఒక్క సంబరం ఇక్కడా జరుపుకో వచ్చు. మనం ఎక్కడుంటే అక్కడే వీలైనంత వరకు అన్ని సద్దేసుకోవాలి. హాయిగా ఇక్కడ కూడా ఎంజాయ్ చేయండి. నెక్లస్ రోడ్ లో చూసారా, రకరకాల పతంగులు ఎగిరేస్తారు. ముగ్గుల పోటీ కూడా ఉంటుంది. ఇక్కడ తోపుడు బండ్ల మీద రేగిపండ్లు, చెరకు ముక్కలు కూడా అమ్ముతారు. అన్నిరకాల పూలు దొరుకుతాయి. మనకు కావలసిన వన్నీ సమకూర్చుకొని మన ఇష్ట ప్రకారమే ఆనందించవచ్చు. మీకు సంక్రాంతి శుభాకాంక్షలు.
ReplyDeletegoogulamma chenta vunDagaa,
ReplyDeletechinta enduku? danDaga....)
Mix maida with water,dip a piece of cloth and proceed.colours kaavaalanTe mix little water with the colours available in the market and paint with a brush.
Manju gaaroo,I am not able to comment in telugu as your comment box doesn't allow me to copy paste.Please change the settings,so that readers are encouraged to comment without any trouble.