Jan 14, 2010
భోగి భోగము
నిన్న భోగి సందర్భం గా మా బుజ్జిగాడికి కుడా భోగిపళ్లు పోసాము..ఎట్లాగు మన ఊరు వెళ్ళలేదు కదా అని ఉళ్లో ఉన్న బంధువులు అందరమూ మా ఇంటిలోనే కలుసుకున్నాము..దాదాపు 15-20 మందిమి కలిసాము...మొత్తం మీద అయిదుగురు పిల్లలకు పోసాము భోగిపళ్లు..ఇల్లంతా సందడి సందడి..మా ఉళ్లో అయితే అందరమూ కలిస్తే వంట ఆవిడ ను పిలిచి వంట చేయించుకునే వాళ్ళం..ఇక్కడ కొద్దిగా ధర కుడా ఎక్కువే వంటవారిది ,కేటరింగ్ కా చెప్పలేదు.. ఇంక అందరమూ తలా ఒక చేయి వేసి అన్ని పిండిపదార్ధాలు వండుకున్నాము..చక్కగా ఒకళ్ళు కూర తరిగితే ఒకళ్ళు వంట చేయటం అలా పంచుకున్నాము పనులు అన్ని..ఇది ఒక టైపు enjoyment లెండి.. అందరమూ కలిసాము కాని మా అక్క ఒక ఆవిడ రాలేదు ఏమిటి అయ్యా కారణము అంటే వాళ్ళ బాబు కు బడి ఉంది త ...అందరికి సెలవే కదా అంటే మొన్ననే బందు అని చాలా శెలవలు ఇచ్చారు కదా అందుకని ఒక్క పండగ రోజే సెలవు ఇచ్చారు అని మాకు పెద్ద ఉపోద్ఘాతం ఇచ్చింది. పోనీ సాయంత్రం రండి అంటే బడి అయ్యి వచ్చే టప్పటికె అయిదు గంటలు అవుతుంది ఇంకా ఏమి వస్తాము లే వాడు అలసిపోయి ఉంటాడు కదా మా apartment లో చేసుకుంటున్నాం అని చల్లగా కబురు చెప్పింది , పయిగా వాళ్ళు ఉండే ECIL నుండి మేము ఉండే kukatpalli కు రావాలి అంటే అబ్బ చాల దూరం అని అనేస్తారు.. పోనీ సెలవ పెట్టేయ్యి బడి కు అంటే అమ్మో అంత donations కట్టి బడి మానిపియ్యటమే అని ఒక దీర్ఘం తీసింది వాడేదో పదవతరగతి పబ్లిక్ ఎగ్జామ్స్ కు చదువుతున్నట్లు ,వాడు చదివే మూడవ తరగతి కు బడి మానటమా అని ఒక సందేం వెలిబుచ్చింది ..వాళ్లదేదో పెద్ద international స్కూల్ ట donations నే దాదాపు 50000 కట్టింది ట ,సరేలే అని ఇంక మేము మా పిల్లలు అందరికి భోగిపళ్లు పోసి పండగను బాగా ఎంజాయ్ చేసాము.. చిన్నపిల్లలను చక్కగా పండగ రోజు ఎంజాయ్ చెయ్యనివ్వకుండా ఏంటో ఈ బడులు బండలు మరి???????
Subscribe to:
Post Comments (Atom)
మంజు గారూ !
ReplyDeleteఈనాటి ఆనందమయ మకర సంక్రాంతి
అందించాలి అందరి జీవితాలకు నవ్య క్రాంతి
*** మీకు, మీ కుటుంబానికి, మీ మిత్రులు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ***
SRRao
శిరాకదంబం
http://sirakadambam.blogspot.com/2010/01/blog-post_13.html
మీకు, మీ కుటుంబానికి సంక్రాంతి శుభాకాంక్షలు.
ReplyDeleteమీకూ మీ కుటుంబానికీ సంక్రాంతి మరియు కనుమ పండుగ శుభాకాంక్షలు
ReplyDeleteమీ బోగి ముచ్చట్లు బాగున్నాయండి .
ReplyDeleteమీకు సంక్రాంతి శుభాకాంక్షలు .