Aug 1, 2010

ఎట్లాగబ్బా


ఇవ్వాళ నాకు పిచ్చేక్కినంత పనయిందనుకోండి ఎందుకంటారా ఇవ్వాళ ఉదయం నుండి సాయంత్రం దాక నెట్ కనెక్షన్ పోయింది మాకు.నిన్ననే ఒక ఛానల్ లో న్యూస్ చూపించారు ఇంటర్నెట్ కు ఇంక 344 రోజులేటా ఎందకంటే ip అడ్రస్ ల లిమిట్ అయిపోవచ్చింది ట.400 కోట్ల నిడివి పెడ్తే అది దాదాపు అయిపోవచ్చింది ట.జీవితం ఆగిపోతుంది అని ఆ anchor వ్యాఖ్యానిస్తే మరీ అంతలా ఎందుకు అనిపిస్తుంది లే అని అనుకున్నాను,కానీ ఇవ్వాళ బాగా తెలిసింది.
బాగా అలవాటు పడిపోయాం ఈ ఇంటర్నెట్ కు,ఎవరెవరు బ్లాగులు రాసారా,న్యూస్ ఏంటా? ఎవరెవరు నా బ్లాగు ను చూసారా? ఏమి కామెంట్స్ ఇచ్చారా,మెయిల్స్ ఏమైనా వచ్చాయా ఇలాగ ఆలోచనలన్నీ నెట్ చుట్టుతా పరుగులు పెట్టాయి.కనీసం గంట లో ఒకసారైన మెయిల్ నో లేక బ్లాగుల update నో,ఫ్రెండ్స్ తో చాట్ నో,గ్రూప్ లలో మెసేజెస్ నో చూసే అలవాటు ఈ ప్రాణానికి.అలాంటిది అన్నీ బంద్ ఆంటే ఒక్కసారి ఉహించుకోటానికి కొంచెం కష్టం గానే అనిపిస్తుంది.మన సంగతి పక్కన పెట్టండి పెద్ద పెద్ద కంపెనీ లో అందునా మన software engineers పని అయితే అంతే ఇంక అస్సలే code గూగుల్ లో సెర్చ్ చేసి కాపీ పేస్టు లు చేస్తుంటారు ఇంక నెట్ లేకపోతె అందరి జాబులు గోవిందే,(అంటే జాబు చేసినప్పుడు నేను అంతే చేసేదాన్ని లెండి అందుకే అలా అన్నా,)బ్యాంకులు,రైళ్ళు అన్నీ సర్వీసెస్ ఆగిపోతా ఏమో ,అయినా దీనికి solution కనిపెడతారు లెండి మన వాళ్ళు..జస్ట్ ఒకసారి ఆలోచిస్తే భయం వేస్తుంది ఇంత అలవాటు ఇంత అవసరం పడిపోయాం నెట్ కు అని.

3 comments:

  1. ఇంటర్నెట్టు గురించి నాకెప్పుడూ ఓ కార్టూన్ గుర్తుకువస్తుంది. అది రాతి యుగం. ఇద్దరు ఆటవికులు తీరిగ్గా కూర్చొని మాట్లాడుకుంటూ వుంటారు. పెద్ద ఆటవికుడు చిన్న ఆటవికుడికి ఇలా చెబుతాడు "అలా అలా రోజులు నడుస్తుండగా ఒక రోజు ఏమయ్యిందంటే అకస్మాత్తుగా ఇంటర్నెట్టు పూర్తిగా పనిచెయ్యకుండా అగిపోయింది..."

    ReplyDelete
  2. మీ టపా బాగుంది.

    శరత్ వ్యాఖ్య బాగుంది.

    మరి ఇది కూడా చదవండి......

    http://osaamaa.blogspot.com/2010/07/blog-post_29.html

    ReplyDelete