ఇదేదో అనుకోకుండా ఒక రోజు సినిమా టైటిల్ లాగా ఉంది కదా...ఒక రోజు మిస్ అయినట్లు ఇక్కడ దాదాపు 11 రోజులు మిస్ అయినాయి చూడండీ దీని కధ..
ఇక్కడ ఒక వింత కనిపిస్తోంది చూసారా ??? September లో 2nd నుండి 14th మధ్యలో 11 days miss అవుతున్నాయి.
అప్పుడే ఇంగ్లాండ్ రాజు ఇంగ్లాండ్ లో అప్పటిదాకా నడుస్తున్న Roman Julian క్యాలెండరు నుండి Greogrian క్యాలెండరు కు మార్చారు..
ఆ నెలలో పనిచేసిన వర్కేర్స్ అందరికి కుడా మొత్తం ౩౦ రోజుల జీతాన్ని ఇచ్చాడు ట .
అప్పటినుండే paid leave polocy స్టార్ట్ అయ్యింది...
గూగుల్ లో సెర్చ్ చెయ్యండి మీరు కూడా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. 1752 calender అని సెర్చ్ చేస్తే చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది,,
నాకు అర్ధం అయ్యింది ఇక్కడ పోస్ట్ చేశాను,,,
ఇలాగ మళ్లీ days miss అయ్యే month వస్తే బాగుండు కదా,,,,,
Jun 29, 2010
Jun 28, 2010
మనోభావాలు
కలల ఊహల పల్లకీ లో ఊరేగుతూ
క్షణక్షణం నీ తలపులలో బ్రతుకుతూ
నా వాలుకన్నులనే నీ కోటగా మలచి
నా ప్రేమతో నిన్నా కోటలో బంధించి
నా కంటే సాటి ఇంకెవరూ లేరని భావించే
నీ కంటే నాకింక ఎవరు సాటి..
ప్రేమ,ఆప్యాయతలు అన్న పదాలకు
అర్ధం తెలియని పిచ్చిదానను నేను,,
వాటి ఉనికిని అనుక్షణం వెదుకుచూ,
ఆ బంధాలలోని మాధుర్యాన్ని గ్రోలాలని
నిలువెల్లా తపించే వేర్రిదానను నేను,,
అలాంటి నాకు
ఆ ప్రేమను,ఆప్యాయతను నిండు మనసుతో
నువ్వు అందిస్తుంటే,,
నీ ప్రేమను ఎలా కాదనగలను....
పొగడకుండా ఎలా ఉండగలను......
Jun 26, 2010
Jun 25, 2010
soccer music
మొన్న మా వారు టీవీ లో football మ్యాచ్ చూస్తున్నారు,,,,అది కూడా కొద్దిగా సౌండ్ పెట్టుకుని చూస్తున్నారు,,,నాకేమో ఏదో దోమలు తిరుగుతున్నట్టు సన్నగా గుయ్యి అనే మోత వినిపోస్తోంది....నేను అన్నాను "అప్పుడే వర్షాలకు దోమలు వచేసినట్టున్నాయి ,,, సౌండ్ చూడండీ ఎట్లా వస్తోందో "అని ,,,,మా వారు ఒక వింత లుక్ ఇచ్చి సౌండ్ పెద్దది చేసి పెట్టారు టీవీ ది,,,విందును కదా అది టీవీ లో,,,,ఏదో వాయిద్యం వాయిస్తారు ట encouragement కోసం అని,,,,,ఏంటో వింత గా ఉంది ఆ సౌండ్,,,ఒక సారి చూద్దాం గూగుల్ లో అని సెర్చ్ చేశా కానీ నాకేమి దొరకలేదు దానిగురించి,,,మీకెవరికైనా దానిగురించి తెలిస్తే చెప్పండి నాకు కుడా,,,,
అన్నట్టు నేను వేసిన బొమ్మలు మీరు అందరు తెగ మెచ్చేసుకున్నారు కదా,,,అందుకనే ఒక బ్లాగ్ మొదలుపెట్టేసా...ఎట్లాగు కాలీనే కదా ఇంట్లో,, అని మళ్లీ పెన్సిల్ పట్టుకున్న,,,,
ఇదివరకు రచయితలను అనేవాళ్ళు కత్తితో నే కాదు కలం తో కూడా చంపేస్తారు అని..ఇప్పుడు ఇంక పెన్సిల్ తో కూడా చంపొచ్చు అని నేను నిరూపిస్తానేమో,,,,
ఈ బ్లాగును చూసి మీ కామెంట్స్ తెలియచేయండి,,,
ఈ బ్లాగ్ లో నే పైన చిత్రాలు అని లింక్ కనిపిస్తుంది అక్కడ క్లిక్ చేసినా సరే లేదా లింక్ ఇదిగోండి
http://manju-art.blogspot.com/
చూసి మీ అభిప్రాయలు చెప్పండి నేను ఇంకా ఇంప్రూవ్ చేసుకోటానికి వీలవుతుంది,,,,

Jun 19, 2010
లోగో లాజిక్ మీకు తెలుసా ...
ఇందులో A -Z అన్ని products దొరుకుతాయి అని మనకు చెప్పకనే చెపుతుంది ఆ yellow line
ఇందులో E అండ్ X కు connecting arrow (వైట్ కలర్ లో ఉంది) కనిపెట్టారా... అంటే స్పీడ్ అండ్ accuracy గా ఉంటుంది మా service అని అర్ధం...
ఇక్కడ గులాబీ రంగులో కనిపిస్తోంది చూసారా 31 నెంబర్ అంటే 31 రకాల icecreams ఉంటాయి మా దగ్గర అని..
ఇందులో vivo అని ఉంది కదా సోనీ కింద..అంటే మొదటి రెండు analogue సిగ్నల్ symbol ,,చివరి రెండు 1 ,0 డిజిటల్ సిగ్నల్ symbol ....
ఇది అమెరికన్ వాళ్ల broadcasting ఛానల్..దీనిలో మధ్యలో నెమలి గమనించే ఉంటారు...అది కుడి వైపుకు చూస్తూ ఉంటుంది,,అంటే మేము always looking forward అని,,,నో బ్యాక్ అని
ఇక్కడ F కు రెడ్ గీతల మధ్య 1 నెంబర్ దాగి ఉంది చూసారా...అంటే always no .1 position అని అర్ధం....

Jun 18, 2010
Jun 16, 2010
నా రాతలు-గీతలు
అబ్బా అప్పుడే సెలవులు అయిపోయినాయి..నాకు కూడా చిన్నపిల్లల లాగా ఇంకా కొన్ని రోజులు ఉంటే బాగుండేది సెలవులు అని పిస్తోంది..సెలవులకు మా అమ్మగారి ఇంటికి వెళ్ళాను,,,ఇల్లు అంతా సోదా చేసి చివరకు నా చిన్నప్పటి జ్ఞాపకాలు అన్నిటిని నా వెంట తెచ్చేసుకున్నాను,,,అదేనండి,,నా చిన్నప్పుడు నా ఫ్రెండ్స్ నాకు ఇచ్చిన గ్రీటింగ్స్,లెటర్స్(అబ్బో లెటర్స్ రాయటం అంటే మహా ఇష్టం లెండి),,నేను ఏదో కొద్దో గొప్పో బొమ్మలు కూడా వేసేదాన్ని,,,నాకేమో అవి MSHussain గారి paintings లా అనిపిస్తాయి...మా అమ్మ కేమో చిత్తు కాగితాలు లా అనిపిస్తాయి.,ఏదో ఒకరోజు అడ్డం అని పారేస్తుందేమో అని కూడా తెచ్చుకున్నాను,,,రేపు మా బాబు కు చూపించొద్దు నా ప్రతిభా పాటవాలు,,,చిన్నపుడు ఉన్న hobbies ఏమీ లేవు ఇప్పుడు,,,ఆ ఇంటరెస్ట్ కూడా లేదు ఏంటో,,,పెళ్లి అయితే అంతేనేమో,,,పనులలో పడి ఆ ధ్యాసే ఉండదేమో,,,నేను బొమ్మలు వేసేప్పుడు eraser use చెయ్యను,,,తప్పు వచ్చింది అనిపిస్తే ఇంక వేయాలి అన్న మూడ్ పోతుంది,,,almost అన్ని eraser సహాయం లేకుండానే వేసాను,,,,
నేను వేసిన బొమ్మలు ఇక్కడ పెడ్తున్నాను చూసి మీ కామెంట్స్ చెప్పండి....
చదువుల మధ్య సతమతమవుతున్న విద్యార్ధి....
రాజస్థానీ బ్యూటిఫుల్ లేడీ...
మేలి ముసుగులో సిద్దమైన పెళ్లి కూతురు,,
కళ్యాణ వైభోగమే...నా పెళ్లి శుభలేఖ...
నేను వేసిన బొమ్మలు ఇక్కడ పెడ్తున్నాను చూసి మీ కామెంట్స్ చెప్పండి....
చదువుల మధ్య సతమతమవుతున్న విద్యార్ధి....
I am proud to be an Indian
వస్తాడు నా రాజు Rajadoot పైన ....రాజస్థానీ బ్యూటిఫుల్ లేడీ...
ప్రియతమా
నీ గురించి ఆలోచిస్తూ అన్నీ మరిచిపోతాను,
నీవు వస్తావని,నిన్ను చూడాలని అనుకుంటాను,
ఒక్కటి మాత్రం నిజం
నీ తలపులు లేని నేను లేనే లేనని,,,
నిన్ను చూడకుండా నేను ఉండలేనని....మేలి ముసుగులో సిద్దమైన పెళ్లి కూతురు,,
కళ్యాణ వైభోగమే...నా పెళ్లి శుభలేఖ...
Jun 8, 2010
అక్షరాల బహుమతి
అయ్యో రామా
ఆంధ్రలేఖ వారినుండి రాంక్ వచ్చినా
ఇంతవరకు ఒక్క గిఫ్ట్ కూడా రాలేదు సుమండీ
ఈసారి అయినా వస్తుందేమో అని ఆకాశం లోకి చూస్తుంటే
ఉన్నట్టుండి మా కాలింగ్ బెల్ మోగింది
ఉపిరి ఆగిపోయినంత పని అయింది కోరిఅర్ అబ్బాయి చేతిలోని పెద్ద గిఫ్ట్ చూసి
ఎవరిదో అడ్రస్ తెలియక మా బెల్ కొట్టాడు ట
ఏమని చెప్పమంటారు నా పాట్లు
ఐన అదృష్టం కుడా ఉండాలి కదా
ఒక్కసారి అయినా నా బ్లాగును గొప్పగా పత్రికల్లో చూసుకోవాలి అనుకున్న
ఓహో అనక్కర్లేదు కానీ
ఔను పాపం అని నా బాధ గమనించి
అందరిని నా నుంచి రక్షించ డానికైనా నా ఏదో ఒక కానుక పంపిస్తే చాలు
అః ఇక మీ జోలికి రానే రాను....ఒట్టు...
Subscribe to:
Posts (Atom)